23, నవంబర్ 2022, బుధవారం

సమస్య - 4258

24-11-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పద్మమొకటి కోటలోనఁ బ్రభవమ్మొందెన్”
(లేదా...)
“పద్మము కోటలోనఁ బ్రభవమ్మును పొందె నదేమి చిత్రమో”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధాన సమస్య)

28 కామెంట్‌లు:

  1. కందం
    సద్మమను వికుంఠము విడి
    పద్మజ యాకాశరాజు పట్టిగ వెలయన్
    పద్మగ నామకరణమై
    పద్మమొకటి కోటలోనఁ బ్రభవమ్మొందెన్

    ఉత్పలమాల
    సద్మమునౌ వికుంఠము ప్రశాంతత గోరుచు వీడి స్వామికై
    పద్మజ జన్మమున్ గొనఁగఁ బాలకుఁడాకస రాజ పట్టిగన్
    బద్మగ నామకర్మమున పల్వురు పెద్దలు వల్కిరిట్టులన్
    "బద్మము కోటలోనఁ బ్రభవమ్మును బొందె నదేమి చిత్రమో!"

    రిప్లయితొలగించండి
  2. పద్మ ముల చిత్ర లే ఖ క
    పద్మాకరు డొ క్కరుండు ప్రతిభను జూ పన్
    పద్మాక్షి గృహము నందున
    పద్మ మొకటి కోట లోన ప్రభ వ మ్మొ o దెన్

    రిప్లయితొలగించండి

  3. సద్మము విడి వకుళాత్మజు
    బద్మాక్షియె పెండ్లియాడ వాసరమందున్
    పద్మిని పుట్ట జనులనిరి
    పద్మమొకటి కోటలోనఁ బ్రభవమ్మొందెన్.


    పద్మిని జాతియింతి హరి పాదము లొత్తెడు సింధు కన్యయే
    సద్మము వీడి యాకస ప్రశాస్తకుమారితగా జనించె నా
    పద్మిని శ్రీనివాసుని వివాహమునాడనటంచు పల్కిరే
    పద్మము కోటలోనఁ బ్రభవమ్మును పొందె నదేమి చిత్రమో.

    రిప్లయితొలగించండి
  4. కందము
    పద్మాక్షి!శిల్పి చెక్కెను
    పద్మాసన విగ్రహంబు బాగుగఁగంటే
    పద్మజ సద్మమగు శిలా
    పద్మమొకటి కోటలోనఁబ్రభవమ్మొందెన్.

    రిప్లయితొలగించండి
  5. ఉత్పలమాల
    పద్మదళాయతాక్షి!హరి భామిని పుట్టిన యిల్లగున్ మహా
    పద్మము;కోటలోనఁబ్రభవమ్మును పొందెనదేమి చిత్రమో
    పద్మపదాఖ్యతో నిధులు,వాజిగజంబులు సర్వసైన్యముల్
    సద్మమె రాజధానియగు సాహసలక్ష్మికి రాజ్యలక్ష్మికిన్.

    రిప్లయితొలగించండి
  6. ( రావణుని కొలనులో సీత)

    పద్మాక్షుని సహధర్మిణి
    పద్మినియౌ వేదవతి శపథమును దీర్చన్
    బద్మము నందున వెలయగ
    పద్మమొకటి కోటలోనఁ
    బ్రభవమ్మొందెన్

    రిప్లయితొలగించండి
  7. రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పద్మాకర దాపు' దుష్టసమాసం. "పద్మాకర సన్నిధి గల" అనండి.

      తొలగించండి
    2. సవరణతో....

      పద్మాకర సన్నిధి గల
      పద్మాలయ విభునిరూపు పద్మపురూపున్
      పద్మజనేత్రుడుమలచగ
      పద్మమొకటి కోటలోనఁ బ్రభవమ్మొందెన్

      తొలగించండి
  8. పద్మం బొక్కటి సరసినిఁ
    బద్మ సతీ రత్న మొకటి పాథోనిధినిం
    బద్మావతి యిలను మహా
    పద్మమొకటి కోటలోనఁ బ్రభవమ్మొందెన్

    పద్మదళాక్ష మిత్ర సఖు వైశ్రవణున్ దశవక్త్రుఁ డుద్ధతిన్
    ఛద్మ మనస్కుఁ డాసురుఁడు సంగర మందు జయింప బల్మినిన్
    సద్మము నిండ వెల్గులను సన్నిధి రత్నమహో లసన్మహా
    పద్మము కోటలోనఁ బ్రభవమ్మును బొందె నదేమి చిత్రమో

    [సత్ + నిధి రత్నము = సన్నిధి శ్రేష్టము]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇక్కడ పద్మ, సతీరత్నము వ్యస్త పదములు. పద్మ కు విశేషణము సతీరత్నము.

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. మీ పూరణలను వాట్సప్ సమూహంలో కూడా ప్రకటించండి. అక్కడ ఔత్సాహిక కవులు ఎక్కువ. మీ పూరణ పద్యాలు వారికి మార్గదర్శకాలు అవుతాయి.

      తొలగించండి
    4. శంకరాభరణంలో సమస్యను భిన్నకోణంలో దర్శించి వైవిధ్యంగా పూరించే ముగ్గురిలో మీరు మొదటివారు. రెండవ వారు మైలవరపు మురళీకృష్ణ గారు. మూడవ వారు జంధ్యాల సుబ్బలక్ష్మి గారు.

      తొలగించండి
    5. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
      రామాయణ రచనలో నిమగ్నుఁడనై యుండుట వలన బ్లాగులో మాత్రమే యుంచు చున్నానండి. ఇప్పుడు యుద్ధకాండము 31 వ సర్గములో నున్నాను.

      తొలగించండి
  9. కం:పద్మను చేగొన నేను ప్ర
    సాద్ మామయ పెండ్లి చూచి చనువున ననె నీ
    రద్ మామయు నిది మెచ్చెను
    పద్మ మొకటి కోట లోన బ్రభవ మ్మొందెన్
    (పద్మని నేను పెళ్లి చేసుకున్నప్పుడు ప్రసాద్ మామయ్య వచ్చి ఈ పెండ్లి నీరద్ మామయ్యకి కూడా నచ్చింది.మన కోట లో పద్మం వికసించింది అన్నాడు.)

    రిప్లయితొలగించండి
  10. ఉ:పద్మను కోట సత్తి తన భార్యగ జేకొని నంత మెచ్చి యె
    ర్షాద్ మథురంపు తెల్గుననె చక్కని పద్యము జెప్పె నిట్టులన్
    "పద్మము కోట లోన ప్రభవమ్మును బొందె నదేమి చిత్రమో!
    పద్మము తా సరస్సున నివాసము మానుట వింత కాదొకో!"
    (పద్మని కోట సత్తి పెళ్లి చేసుకున్నాడు.కోట అనేది వాడి ఇంటి పేరు.ఎర్షాద్ అనే ముస్లిం వచ్చి తెలుగు భాషలో పద్యం చెప్పాడు.పద్మం సరస్సు వదిలి కోట లోకి వచ్చిందని.)

    రిప్లయితొలగించండి
  11. సద్మమునందున ప్రభువట
    పద్మాక్షి నిగనినయంత బాలామణికిన్
    పద్మాయని గొంపోయెను
    పద్మమొకటికోటలోన ప్రభవమ్మొందెన్

    మరొక పూరణ

    పద్మాక్షాయణి పుట్టెను
    పద్మావతిగాను తాను వసుమతి యందున్
    సద్మము నందగుపించిన
    పద్మమొకటి కోటలోన ప్రభవమ్మొందెన్

    రిప్లయితొలగించండి
  12. కందం
    పద్మ ముఖ భామినిన్ గని
    సద్మమునకు తోడ్కొనేగి సంతోషమునన్
    పద్మను గూడి దలంచెన్
    పద్మ మొకటి కోటలోన బ్రభవమ్మొందెన్.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి