1, డిసెంబర్ 2022, గురువారం

సమస్య - 4266

2-12-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాముఁడు కోరినవి యెల్ల రావణుఁ డిచ్చెన్”
(లేదా...)
“రాముని కోర్కె లన్నియును రావణుఁ డొప్పుగఁ దీర్చెఁ బ్రీతితోన్”

35 కామెంట్‌లు:

  1. కందము
    భామామణి సీతకొసఁగె
    రాముఁడు కోరినవియెల్ల;రావణుఁడిచ్చెన్
    ప్రేమగ మండోదరికిని
    హేమాభరణాలు,రత్న హీర సరమ్ముల్.

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. రోమాంచితకార్యమ్ముల
      నేమాత్రము విడువకుండ నిరతము సల్పెన్
      కామాతురుడయి నాత్మా
      రాముఁడు కోరినవి యెల్ల రావణుఁ డిచ్చెన్

      తొలగించండి
    2. 'కామాతురుడయి యాత్మారాముఁడు...' అనండి.

      తొలగించండి
    3. సవరణతో...

      రోమాంచితకార్యమ్ముల
      నేమాత్రము విడువకుండ నిరతము సల్పెన్
      కామాతురుడయి యాత్మా
      రాముఁడు కోరినవి యెల్ల రావణుఁ డిచ్చెన్

      తొలగించండి
  3. కందం
    శ్రీమంతుఁ జేరఁగ జయుఁడు
    దామసమున జన్మనందె దశకంఠునిగన్
    వేమరు వైరిగ హరియౌ
    రాముఁడు కోరినవి యెల్ల రావణుఁ డిచ్చెన్

    ఉత్పలమాల
    ఆ ముని వర్యులున్ మిగులనక్కసు తీరఁగ శాపమీయగన్
    దామస వృత్తితో జయుడు నందకిఁ జేరఁగ పంక్తికంఠుఁడై
    భామ కుజన్ గొనెన్ రయమె వైరిగ దోషములెంచ విష్ణువౌ
    రాముని కోర్కె లన్నియును రావణుఁ డొప్పుగఁ దీర్చెఁ బ్రీతితోన్

    రిప్లయితొలగించండి
  4. ఉత్పలమాల
    రాముఁడు తాటకందునిమి లక్ష్మణుఁగూడియు వేడ్క తీర్చె నౌ
    *రా,మునికోర్కెలన్నియును;రావణుఁడొప్పుగఁదీర్చెఁబ్రీతితోన్ *
    కామినులెల్ల కోరిన సుఖాసన హేమవిభూషణాదులన్
    సామజ,వాజి,వాహన,లసత్ సుమసౌరభ పుష్పవాటికల్.

    రిప్లయితొలగించండి

  5. రామాశ్రితుడు విభీషణు
    డా మాలిని గాంచె స్వప్న మందున సీతన్
    క్షేమముగా విడుచుచునా
    రాముఁడు కోరినవి యెల్ల రావణుఁ డిచ్చెన్.

    రిప్లయితొలగించండి
  6. భామా మణి కొసగెను గద
    రాముడు గోరినవి,:, రావణు డి చ్చె న్
    ప్రేమగదా మండో దరి
    కామిత మును దీర్చ గాను కమ్మని రీతిన్

    రిప్లయితొలగించండి

  7. యామిని స్వప్నమందు గనె యాతువె యైన విభీషణుండిటుల్
    క్షేమము కాదునీకనుచు చెప్పిన మాటల నాల కించుచున్
    భామను గౌరవించి పొరపాటు గ్రహించి వినమ్రుడౌచు నా
    రాముని కోర్కె లన్నియును రావణుఁ డొప్పుగఁ దీర్చెఁ బ్రీతితోన్.

    రిప్లయితొలగించండి
  8. భూమిజను హృదిన నిల్పెను
    రాముఁడు ; కోరినవి యెల్ల రావణుఁ డిచ్చెన్
    నా మండోదరిపై దన
    ప్రేమము నామెకు విధముగ వెల్లడి జేయన్

    రిప్లయితొలగించండి
  9. కందం:
    బాముల బెట్టెడు నసురుల
    నామమడచనవతరించె నారాయణుడే
    రామునిగా, సీతనుగొని
    రాముఁడు కోరినవి యెల్ల రావణుఁ డిచ్చెన్

    రిప్లయితొలగించండి
  10. ఉత్పలమాల:
    బాములపెట్టి సాధుజనపాళికి హింసయొనర్చు దైత్యులన్
    నామమడంచి యెల్లరకు నందముగూర్చగ రామభద్రుడై
    భూమమునన్ జనించెహరి; భూమిజనుం గొనిపోయి లంకకున్
    రాముని కోర్కె లన్నియును రావణుఁ డొప్పుగఁ దీర్చెఁ బ్రీతితోన్

    రిప్లయితొలగించండి
  11. ఆ మాయావిని సాయము
    నా మనుజాశనుఁడు గోరి యసురేంద్రుఁడు ము
    న్నా మారీచుఁ, డెవనిఁ గనె
    రాముఁడు, కోరినవి యెల్ల రావణుఁ డిచ్చెన్

    ధీ మతి రావణుండు సుర దేవుని శంకరు భక్తుఁ డెన్నఁడున్
    క్షేమము నెల్లఁ దా నడిగి కేళులు మోడ్చి నమస్కరించి త
    త్కామ నిహంత భూత గణ కాంతుని శంభుని చెంత నుండి వే
    రా ముని కోర్కె లన్నియును రావణుఁ డొప్పుగఁ దీర్చెఁ బ్రీతితోన్

    రిప్లయితొలగించండి
  12. తామునివెంట నడచెనా
    *“రాముఁడు ,కోరినవి యెల్ల రావణుఁ డిచ్చెన్”*
    ప్రేమగ మండోదరికిన్
    సేమముగానుండుమనుచు స్మేరము తోడన్

    రిప్లయితొలగించండి
  13. భూమి జనించె రాక్షస సమూహముఁ జంపగ శౌరి రాముడై,
    ఆముని కోర్కె తీర్చ జని యంతము జేసెను తాటకిన్, బరం
    ధాముని లోకమేగెడి విధానము నెంచి మనస్సు నందు శ్రీ
    రాముని కోర్కె లన్నియును రావణుఁ డొప్పుగఁ దీర్చెఁ బ్రీతితోన్

    రిప్లయితొలగించండి
  14. కందం
    సౌమేధిక గణ హితవరి
    రాముడు, కోరినవి యెల్ల రావణు డిచ్చెన్
    తామస గుణప్రకోపిత
    కామాతుర రాక్షస గణ గర్విష్టులకున్.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  15. మరొక పూరణ
    డా బల్లూరి ఉమాదేవి


    భూమిజ యవ్వనిన్ సతము భూరిగ తీర్చుచునుండె నాపకన్
    నేమముతోడపూజలను నిత్యముచేయుచుతీర్చుచుండెతా
    *“రాముని కోర్కె లన్నియును, రావణుఁ డొప్పుగఁ దీర్చెఁ బ్రీతితోన్”*
    కామహరున్మదిన్ కొలిచికైకసికోర్కెలనెల్లదీక్షతో

    రిప్లయితొలగించండి
  16. ఏమని జెప్పుదు సామీ!
    మేమొక సభలో ననుండ మీరుచు హద్దుల్
    రామాబాయి యిటులనెను
    రాముఁడు కోరినవి యెల్ల రావణుఁ డిచ్చెన్

    రిప్లయితొలగించండి
  17. రాముని కోర్కె లన్నియును రావణుఁ డొప్పుగఁ దీర్చెఁ బ్రీతితోన్
    రాముని కోర్కెలన్నిటిని రాక్షస రావణుఁదీర్చె నావహా
    భామను మాయచేసియును బల్మిని దీసుకు పోయె గాదె దా
    రామునిబాధ వెట్టెనుగ రావణుఁ డాదిగ రాక్ష సాధముల్

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.

    క్షేమంబరసి ప్రజల కిడె
    రాముడు కోరినవి యెల్ల; రావణుడిచ్చెన్
    శ్రీమతి మండోదరికిన్
    గోముగ తన ప్రేమనంత కూరిమి యెసగన్.

    రిప్లయితొలగించండి