12, జనవరి 2023, గురువారం

సమస్య - 4307

13-1-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కామాసక్తునకె దక్కుఁ గైవల్యమహో”
(లేదా...)
“కామాసక్తుఁడె యర్హుఁడయ్యెడుఁ గదా కైవల్యముం బొందఁగన్”

(ఉప్పలధడియం భరత్ శర్మ శతావధానంలో కన్నేపల్లి వరలక్ష్మి గారి సమస్య)

21 కామెంట్‌లు:

  1. శ్రీకైవల్యపథమ్ము చేరుటకునై అని శ్రీమదాంధ్రమహాభాగవతమునకు శ్రీకారమును జుట్టిన శ్రీపోతనార్యులను స్మరిస్తూ....

    కందం
    రాముండెంచినఁ బోతన
    శ్రీమద్భాగవతమునకు శ్రీకారమునన్
    గామించన పథమన స
    త్కామాసక్తునకె దక్కుఁ గైవల్యమహో!

    శార్దూలవిక్రీడితము
    రాముండెంచినఁ బోతనార్యుడిలలో రంజిల్లి సద్భక్తితో
    శ్రీమద్భాగవతమ్మునున్ మలచఁ దా శ్రీకారమున్ జుట్టుచున్
    గామించెన్గద మేటి సత్పథమదే! కావ్యంపు సత్కర్త స
    త్కామాసక్తుఁడె యర్హుఁడయ్యెడుఁ గదా కైవల్యముం బొందఁగన్!

    రిప్లయితొలగించండి
  2. శా.
    భామాలోలులు, జూదరుల్,జడులు, పాపారణ్య సంచారలున్
    క్షేమంబౌనొకొ?ముక్తి మార్గ పదముల్ జేరంగని వ్వారికిన్
    కామ క్రోధమదాది శత్రువులపై గర్జించు యోగీశు "ని
    ష్కామాసక్తుఁడె యర్హుఁడయ్యెడుఁ గదా కైవల్యముం బొందఁగన్

    రిప్లయితొలగించండి
  3. ధీమంతు o డగు వాడై
    సామాన్యుల బాగు కొఱకు సత్క్తృత్యంబు ల్
    ప్రేమగయొ న రిం చెడి స
    త్కా మా సక్తు న కె దక్కు కైవల్య మహో!

    రిప్లయితొలగించండి
  4. ఏమియు సందేహింపక
    కామక్రోధములు వీడి కలలోనైనన్
    నీమమ్ముల విడువని ని
    ష్కామాసక్తునకె దక్కుఁ గైవల్యమహో

    రిప్లయితొలగించండి
  5. కామక్రోధాదులెపుఁడు
    పాములవలెకాటువేసి బాములపెట్టున్
    ధీమతుఁడై బరఁగెడు ని
    ష్కామాసక్తునకె దక్కుఁ గైవల్యమహో

    రిప్లయితొలగించండి
  6. ఏమందును నీదినముల
    ప్రేమను జూపించు యాలుబిడ్డల యందున్
    కామముతో జియ్యపయి ని
    ష్కామాసక్తునకె దక్కుఁ గైవల్యమహో

    రిప్లయితొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సామి కొలుపున తరించుచు
    కామ మదమహములనెల్ల కడజేయుచు తా
    నీమముతో మెలిగెడు స
    త్కామాసక్తునకె దక్కు కైవల్యమహో!

    రిప్లయితొలగించండి
  8. జేమనములేని పేదకు
    బ్రేమగ నన్నమిడి వారి విక్షోభమునే
    నేమముగా తీర్చెడు స
    త్కామాసక్తునకె దక్కుఁ గైవల్యమహో.


    సామాన్యుండ్రకు పేదవారికి సదా సాయమ్ము నందించుచున్
    బ్రేమన్ వీడక సాటివారికిలలో విక్షోభమున్ దీర్చుచున్
    కామక్రోధము వీడి సంతతము సత్కార్యమ్ము లే సల్పు స
    త్కామాసక్తుఁడె యర్హుఁడయ్యెడుఁ గదా కైవల్యముం బొందఁగన్.

    రిప్లయితొలగించండి
  9. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కామక్రోధమదమ్ములన్ని క్షయమున్ గానిచ్చి శౌరిన్ సదా
    ప్రమోదమ్మున గొల్చుచున్ పరమునే వాంఛించుచున్ బంధముల్
    తా మళ్ళించి తదేకమౌ నిలుకడన్ ధ్యానంబు నందుండు స
    త్కామాసక్తుడె యర్హుడయ్యెడుగదా కైవల్యముం బొందగన్.

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  12. కామంబుల్ సతతంబు శాంతినిడువంగన్ ౙాలవంౘ్చున్ మతిన్
    మీమాంసంబు వడన్ నెఱుంగువడగన్ మెౘ్చంగ వైరాగ్యమున్
    రామాయంౘు శరీరమున్ విడుౘు బైరాగుండు మోక్షంబునన్
    కామాసక్తుఁడె యర్హుఁడయ్యెడుఁ గదా కైవల్యముంబొందఁగన్

    చివుకుల అచ్యుత దేవరాయలు, అమెరికా

    రిప్లయితొలగించండి
  13. కామక్రోధమదాది షట్కముల చక్రంబందునన్ దారుచున్
    నీమంబుల్విడనాడి యైహికములే నిత్యంబులం చెంచగన్
    క్షేమంబౌనొకొ? సర్వసంగముల విచ్ఛేదంబు గావించు ని
    ష్కామాసక్తుఁడె యర్హుఁడయ్యెడుఁ గదా కైవల్యముం బొందఁగన్

    రిప్లయితొలగించండి
  14. రామాగ్ర హానల శిఖా
    భీ మాతప సదృశ విశిఖ వేగ విఘాతుం
    డై మోక్ష మందె నసురుఁడు
    కామాసక్తునకె దక్కుఁ గైవల్య మహో

    ధామస్థుం డయి తాను బొంది వరుసన్ ధర్మార్థ కామమ్ములన్
    శ్రీమంతుండు దరిద్రుఁడుం బుడమి నిర్వేదంబు వర్ధిల్లినన్
    వే మోక్షార్థమ నిత్య మచ్యుతుని సేవింపంగ సన్యాస స
    త్కామాసక్తుఁడె యర్హుఁ డయ్యెడుఁ గదా కైవల్యముం బొందఁగన్

    రిప్లయితొలగించండి
  15. కందం.
    కామోపభోగము లవియు
    నీముము తో ననుభవించి నిండుగ మనుచున్
    క్షేమము దర్మార్థము గల
    కామాసక్తునకె దక్కుఁ గైవల్యమహో
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు

    రిప్లయితొలగించండి
  16. కం. ఏమా గుణనిధి వైభవ
    మేమో యా నిగమశర్మ దేమో యయ్యా
    జామీళుని గన నాహా!
    కామాసక్తునకె దక్కుఁ గైవల్యమహో
    కడయింటి కృష్ణమూర్తి..గోవా. 13-1-23

    రిప్లయితొలగించండి
  17. కామాసక్తుఁడు రాముని
    నామమునే నెల్లపుఁడు నమలుట వలనే
    యేవిధ ముగనై న నరయ
    కామాసక్తునకె దక్కుఁ గైవల్యమహో

    రిప్లయితొలగించండి
  18. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  19. కామాసక్తుఁడె యర్హుఁడయ్యెడుఁ గదా కైవల్యముం బొందఁగన్
    భామా! యేమనిఁబల్కు చుంటివి?యిటన్ భావ్యమ్ము గాఁదోచెనే?
    నీమాటల్వినసొంపుగాఁదు,పలుకుల్ నీచంబు,ఁబల్కంగనౌ
    నేమా యల్దరిచేరె నిన్ను చెపుమా యేణాంకబింబాననా!

    రిప్లయితొలగించండి
  20. కామాసక్తుని కెవ్విధిన్ గలుగునా కైవల్య మూహింపగా
    కామంబే గద మూలకారణము దుష్కర్మాపదేశంబునౌ
    నీమంబూని నిరంతరం బజితునా నీలాంగు నర్చించు ని
    ష్కామాసక్తుఁడె యర్హుఁడయ్యెడుఁ గదా కైవల్యముం బొందఁగన్

    రిప్లయితొలగించండి