22, మార్చి 2023, బుధవారం

సమస్య - 4374

23-3-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
 “పతి చచ్చుట మంగళంబు భామామణికిన్”
(లేదా...)
“పతి మరణింప మంగళము భామకు గల్గెను సుస్థిరంబుగన్”
(ఆముదాల మురళి గారి శతావధానంలో డా॥ పురంధేశ్వరి గారి సమస్య)

27 కామెంట్‌లు:

  1. గతితప్పినవర్తనుడై
    మితిమీరినకావరమున మిన్నక ధరణీ
    సుతనే దోచిన లంకా
    పతి చచ్చుట మంగళంబు భామామణికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సతతము ధర్మరక్షణము సల్పెడు రామునిపైన కక్షతో
      నతులిత సుందరాంగియగు నాధరణీసుతపైన కాంక్షతో
      తతిగొని చూచి భూమిజను తక్కలిగొన్న వెడంగు లంక క్ష్మా
      పతి మరణింప మంగళము భామకు గల్గెను సుస్థిరంబుగన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. కందం
    గతిఁదప్పిన లంకేయుల
    హతమార్తుననఁ గుజ హనుమ నాపె, నయోధ్యా
    పతి బాణమ్మున లంకా
    పతి చచ్చుట మంగళంబు భామామణికిన్

    చంపకమాల
    అతులితశౌర్య దర్పమున నాగడమెంచిన రావణాళివౌ
    కుతుకల గిల్లివైతునని కోరిన మారుతి నాపె సీతయే
    పతి రఘురాముడే తగిన వాడనె, వారలచేత దీవికిన్
    పతి మరణింప మంగళము భామకు గల్గెను సుస్థిరంబుగన్

    రిప్లయితొలగించండి
  3. అతివకునైదవతనమును
    పతికడబొందగశుభమదిభావ్యమునగుగా
    పతనముగాగనునదియును
    పతిజచ్చుటమంగళంబుభార్యామణికిన్

    రిప్లయితొలగించండి
  4. పతులేవురి సన్నిధిఁ కుల
    సతి చీరలనూడ్చి నిండు సభలో దుర్మా
    ర్గతఁ జూపిన హస్తిన పుర
    పతి చచ్చుట మంగళంబు భామామణికిన్

    రిప్లయితొలగించండి

  5. సతిజాడ హనుమ తెలుపగ
    పతి రా ముడు చేసినట్టి భండనమున దు
    ర్మతియౌ యా మండోదరి
    పతి చచ్చుట మంగళంబు భామామణికిన్.


    అతివను బంధిసేసెనని యాగ్రహమందున వార్ధి దాటి దు
    ర్మతి పరకాంతఁ గోరెడు ప్రమత్తుని ద్రుంచగ నెంచి మైథిలీ
    పతి భరతాగ్రజుండచట భండన మందున రేగ లంక స్వ
    ర్పతి మరణింప, మంగళము భామకు గల్గెను సుస్థిరంబుగన్

    రిప్లయితొలగించండి
  6. అతివకు కడుకష్టములిడు
     పతి చచ్చుట ; మంగళంబు భామామణికిన్
    బతుకంతయు మనువాడిన
    యతని పరాయణము నందె నంతము నొందన్

    రిప్లయితొలగించండి
  7. అతులిత గర్వాంధుండై
    గతి తప్పిన వర్తనమున కామాతురు డై
    మితి మీరిన నా లంకా
    పతి చచ్చు ట మంగళంబు భామా మణి కిన్

    రిప్లయితొలగించండి
  8. పతులసమాన ధీమతులు పాండు కుమారు లవక్ర విక్రముల్
    మతకపు ద్యూతమందు నవమానమొనర్చిననాటి యానలన్
    పతులొనగూర్చుచుండఁనురు భండనమందున కౌరవేయ క్ష్మా
    పతి మరణింప మంగళము భామకు గల్గెను సుస్థిరంబుగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      'కౌరవేయ క్ష్మా..' అన్నపుడు 'య' గురువై గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువుగారూ! క్ష్మా పతి బదులు భూపతి అని సవరించుకుంటాను. _/|\_

      తొలగించండి
  9. మతిచెడి రావణాసురుడు మానిని
    సీతను దస్కరించగా
    నతి బలశాలి వానిని సమంచితరాముడు
    యుద్ధమందునన్
    హతమొనరించ సీతవిని హర్షము సెందెను
    లంక దీవికిన్
    పతి మరణింప మంగళము భామకు
    కల్గెను సుస్థిరంబుగాన్

    రిప్లయితొలగించండి
  10. చం.

    పతియగు సుందుడంతమున బాగరి తాటకకై యగస్త్యుడే
    పతనము నిచ్చె, రూపములు పైకొని రక్కసిగా తనూజులున్
    *పతి మరణింప మంగళము భామకు గల్గెను సుస్థిరంబుగన్*
    రతనము వంటి చావు గొనె రాముని చేతిని ముక్తిగల్గెడిన్.

    రిప్లయితొలగించండి
  11. అతిహేయంబుగ సభలో
    సతికోకను లాగ కనలి సమరమునందున్
    ప్రతిగా పతిచంపగ కురు
    పతి చచ్చుటమంగళంబు భామామణికిన్

    రిప్లయితొలగించండి
  12. సతతం బిద్ధర ధర్మ
    చ్యుతి కారణ మైన యట్టి జూదము నందున్
    రతియే, దేనికి లొంగెనొ
    పతి, చచ్చుట మంగళంబు భామా మణికిన్

    సతి చెఱ వోయె భర్త మది శాంతము నందెను నంద నానుకూ
    లత లభియించె హర్షదము రా మృగ రాజవరేణ్య లోచ నా
    గత మద కుంజ రాభ మయి కన్నని చెంతకుఁ గంసుఁ డా ధరా
    పతి మరణింప మంగళము భామకు గల్గెను సుస్థిరంబుగన్

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.

    సతి సీతను బలవంతము
    న తస్కరించి గొన రావణాసురుడు, యనిన్
    పతి రామునిచే లంకా
    పతి చచ్చుటె మంగళంబు భామామణికిన్.

    రిప్లయితొలగించండి