30, జూన్ 2023, శుక్రవారం

సమస్య - 4463

1-7-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వ్యాధిగ్రస్తుఁడన భాగ్యవంతుఁడె సుమ్మీ”
(లేదా...)
“వ్యాధిగ్రస్తులు భాగ్యవంతులు సుమీ భావింప లోకంబునన్”

29, జూన్ 2023, గురువారం

సమస్య - 4462

30-6-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఏడ్పు కాపురమ్మునఁ గలిగించు ముదము”
(లేదా...)
“ఏడ్పులు సంతసంబు కలిగించును కమ్మని కాపురంబునన్”

28, జూన్ 2023, బుధవారం

సమస్య - 4461

29-6-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శకునిగ రాఘవుని మునులు శ్లాఘింతు రహో”
(లేదా...)
“శకునిగ వీరరాఘవుని సన్నుతి చేసెద రెల్ల సాధువుల్”

27, జూన్ 2023, మంగళవారం

న్యస్తాక్షరి - 81

28-6-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
పాదాద్యక్షరాలుగా 'కా-కీ-కూ-కే' లను న్యస్తం చేస్తూ
సకాలంలో వర్షాలు పడక బాధపడే రైతులను గురించి
ఉత్పలమాల లేదా కందం వ్రాయండి

26, జూన్ 2023, సోమవారం

సమస్య - 4460

27-6-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కమ్మగా వినఁబడెఁ గప్ప గొంతు”
(లేదా...)
“కప్పలు సేయఁగా బెకబెకల్ వినిపించెను కర్ణపేయమై”
(న.చ. చక్రవర్తి గారికి ధన్యవాదాలతో...)

25, జూన్ 2023, ఆదివారం

సమస్య - 4459

26-6-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తాన నననాన నననాన తాన నాన”
(లేదా...)
“తానన నాననా ననన తానన నానన నాననా ననా”

24, జూన్ 2023, శనివారం

సమస్య - 4458

25-6-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వానలు సాగరముపైనఁ బడిన హితంబౌ”
(లేదా...)
“వానలు పెక్కు సాగరముపైఁ గురియన్ ఫలియించు సస్యముల్”

23, జూన్ 2023, శుక్రవారం

సమస్య - 4457

24-6-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పువ్వులోన రెండు పువ్వు లమరె”
(లేదా...)
“ఒక పుష్పంబున రెండు పూవు లమరెన్ యోషామణీ కంటివే”

22, జూన్ 2023, గురువారం

సమస్య - 4456

23-6-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కలుము లెడఁబాసి నప్పుడె కలుగు సుఖము”
(లేదా...)
“కలుములు వాసినప్పుడె సుఖం బొనఁగూడును వాస్తవమ్మిదే”

21, జూన్ 2023, బుధవారం

సమస్య - 4455

22-6-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కారము లేనట్టి కూర గాంతుడు మెచ్చెన్”
(లేదా...)
“కారము లేని కూరఁ దిని కాంతుఁడు మెచ్చెను భార్యనత్తఱిన్”

20, జూన్ 2023, మంగళవారం

దత్తపది - 197

21-6-2023 (బుధవారం)
"గోడ - కప్పు - వాసము - గూన"
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ భారతార్థంలో
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.

19, జూన్ 2023, సోమవారం

సమస్య - 4454

20-6-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కప్పకు సుందరికి పెండ్లి ఘనముగ జరిగెన్”
(లేదా...)
“కప్పకు సుందరాంగికి నయంబుగఁ బెండిలి యయ్యెఁ జూడఁగన్”

18, జూన్ 2023, ఆదివారం

సమస్య - 4453

19-6-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కన్నులు లేనట్టివాఁడు గన్గీఁటె నహో”
(లేదా...)
“కన్నులు లేనివాఁ డొకఁడు గాంతను గన్గొని కన్ను గీఁటెరా”

17, జూన్ 2023, శనివారం

సమస్య - 4452

18-6-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఇద్దఱు సతులున్న వాఁడె యిల ధన్యుఁ డగున్”
(లేదా...)
“ఇద్దఱు భార్యలున్న పతియే స్థిరమౌ సుఖశాంతులం గనున్”

16, జూన్ 2023, శుక్రవారం

సమస్య - 4451

17-6-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నా యాలి నంపుచుంటి నేలుకొనుము”
(లేదా...)
“నా యాలినిఁ బంపుచుంటి నిఁక హాయిగ నేలుకొనంగ మెచ్చెదన్”
(ఛందోగోపనము)

15, జూన్ 2023, గురువారం

సమస్య - 4450

16-6-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హాలాహల మిడఁగఁ జేయు నాయుర్వృద్ధిన్”
(లేదా...)
“ఆయుర్వృద్ధినిఁ గోరుకొన్న నిడుమా హాలాహలంబుం దగన్”

14, జూన్ 2023, బుధవారం

సమస్య - 4449

15-6-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆపన్నుల బంధు వయ్యె నా రావణుడున్”
(లేదా...)
“ఆపద్బాంధవుఁ డన్న రావణుఁడె కాదా యెవ్విధిన్ గాంచినన్”

13, జూన్ 2023, మంగళవారం

సమస్య - 4448

14-6-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అగ్నిశిఖాచయము మీఁద నాడెన్ శిశువే”
(లేదా...)
“అగ్నిశిఖాచయంబు పయి నాడెఁ గదా శిశువౌర నవ్వుచున్”

12, జూన్ 2023, సోమవారం

సమస్య - 4447

13-6-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సాగరనీరమ్ము నిండెఁ జక్కగఁ గుండన్”
(లేదా...)
“సాగరనీర మంతయును చక్కగ నిండెను మట్టికుండలో”

11, జూన్ 2023, ఆదివారం

సమస్య - 4446

12-6-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దుఃఖముఁ గల్గించు జనుల దుష్టులనకుమా”
(లేదా...)
“దుఃఖముఁ గూర్చువారిఁ గని దుష్టులటంచును దూరఁబోకుమా”

10, జూన్ 2023, శనివారం

సమస్య - 4444

11-6-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నాల్గు నాల్గులు పదునాలుగగును”
(లేదా...)
“నాలుగు నాల్గులన్నఁ బదునాల్గనె లెక్కల పంతు లంతటన్”

9, జూన్ 2023, శుక్రవారం

సమస్య - 4443

10-6-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విశ్రాంతినిఁ గోరువాఁడె వీరుండు గదా”
(లేదా...)
“విశ్రాంతిన్ మనసారఁ గోరు నరుఁడే వీరుండు ధీరుండునౌ”

8, జూన్ 2023, గురువారం

సమస్య - 4442

9-6-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జ్ఞాతివైరమ్ము కంటె శ్రేష్ఠమ్ము గలదె”
(లేదా...)
“జ్ఞాతివైరమె శ్రేష్ఠమందురు జ్ఞానులెల్లరు రూఢిగన్”

7, జూన్ 2023, బుధవారం

నిషిద్ధాక్షరి - 55

8-6-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఇ-ఈ లు, వాటితో కూడిన హల్లులను ప్రయోగించకుండా
రోహిణి కార్తెకు వీడ్కోలు పలుకుతూ
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

6, జూన్ 2023, మంగళవారం

సమస్య - 4441

7-6-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వంకాయనుఁ గోసినంత వచ్చె రుధిరమే”
(లేదా...)
“వంకాయన్ దెగఁ గోసినంత వెడలెన్ వామాక్షిరో రక్తమే”

5, జూన్ 2023, సోమవారం

సమస్య - 4440

6-6-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అడిగినది లేదనెడివాఁడె యగును దాత”
(లేదా...)
“అడిగిన దేది లేదనుచు నవ్వలఁ ద్రోసెడివాఁడె దాతయౌ”

4, జూన్ 2023, ఆదివారం

సమస్య - 4439

5-6-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జరిగెఁ బెండ్లిఁ గన శ్మశానమందు”
(లేదా...)
“జరిగెను పెండ్లి వేడుక శ్మశానమునన్ హితులెల్లఁ గాంచఁగన్”

3, జూన్ 2023, శనివారం

సమస్య - 4438

4-6-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పుట్టింటిని రోయునట్టి పొలఁతికి మేలౌ”
(లేదా...)
“పుట్టింటిన్ దెగనాడి రోయు సతియే పొందున్ హితంబున్ సదా”

2, జూన్ 2023, శుక్రవారం

సమస్య - 4437

3-6-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శ్రీరస్తని దీవెన నిడఁ జీకొట్టఁ దగున్”
(లేదా...)
“శ్రీరస్తంచును బల్కి దీవెన లిడన్ జీకొట్టఁగా నొప్పగున్”

1, జూన్ 2023, గురువారం

సమస్య - 4436

2-6-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సర్వము నశ్వరమనుట యసత్యమ్మె కదా”
(లేదా...)
“సర్వము నశ్వరమ్మనెడి సద్గురుబోధ యసత్యమే కదా”