12, జూన్ 2023, సోమవారం

సమస్య - 4447

13-6-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సాగరనీరమ్ము నిండెఁ జక్కగఁ గుండన్”
(లేదా...)
“సాగరనీర మంతయును చక్కగ నిండెను మట్టికుండలో”

31 కామెంట్‌లు:

  1. త్రాగుటకుపయోగపడదు
    సాగరనీరమ్ము; నిండెఁ జక్కగఁ గుండన్
    వాగున పారెడు జలమే
    త్రాగుటకొరకై వనితలు తరలింపంగా

    రిప్లయితొలగించండి
  2. కుచేలుని సతి కృష్ణమూర్తిని తలచుకుంటూ...

    కందం
    సాగుచునుండెను బ్రతుకది
    వీగక కష్టాలు జలము వెలసిన ఘటమై
    సాగగ నీ దరి కరుణా
    సాగర! నీరమ్ము నిండెఁ జక్కగఁ గుండన్

    ఉత్పలమాల
    సాగుచు నుండె మా బ్రతుకు జాలముఁ జిక్కిన చేప పోలికన్
    వీగక కష్టముల్ జలము వీడిన కుండగ భాగ్యహీనమై
    సాగగ నీ దరిన్ వరద! సాంతము సంపదలందియున్కృపా
    సాగర! నీర మంతయును చక్కగ నిండెను మట్టికుండలో

    రిప్లయితొలగించండి
  3. సాగర తీరమున గలదు
    సాగరనీరమ్ము ; నిండెఁ జక్కగఁ గుండన్
    త్రాగుటకువీలగు జలము
    జాగొనరించకనె దెమ్ము చక్కగగుడువన్

    రిప్లయితొలగించండి
  4. జాగొనరించితిన్ హరియె సర్వమ
    టంచుమదిన్ దలంపకన్
    వీగియు నేనె గొప్పయని వేదన
    పాలయిపోయి యిప్పుడున్
    వేగిరపాటుతో దలప ప్రేమ వ
    హించగా మహా కృపా
    సాగర నీరమంతయును జక్కగ
    నిండెను మట్టి కుండలో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తలంపక' అన్నది కళ, ద్రుతాంతం కాదు. 'తలంపకే' అనవచ్చు. మూడవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  5. త్రాగగ రుచి కర మగునా
    సాగర నీరమ్ము? నిండె జక్కగ గుండన్
    త్రాగగ యోగ్యం బగు చున్
    వాగున ప్రవహించు నీరు వలసిన రీతిన్

    రిప్లయితొలగించండి
  6. ఆఘాటమ్ములెరుంగని
    యా గానకళావతంసు నభిజాత్యమ్మున్
    శ్లాఘము చేయఁగ వశమా
    సాగరనీరమ్ము నిండెఁ జక్కగఁ గుండన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. స్వవర్గజ ప్రాస కేవలం తవర్గకే పరిమితం. కవర్గానికి చెల్లదు. సవరించండి.

      తొలగించండి
    2. సవరించి మరల పోస్ట్ చేశాను గురువుగా 🙏

      తొలగించండి

  7. త్రాగెడి నీరిమ్మిక హే
    నాగాభరణా వినవలె నామొఱలనగా
    వేగమె దయజూపె కృపా
    సాగర, నీరమ్ము నిండెఁ జక్కగఁ గుండన్.


    త్రాగెడి నీటికోసమని దవ్వని యెంచక సాగు చుండెడిన్
    బాగరికాంతలన్ గనుచు బాధల తీర్చుమటంచు మందిర
    మ్మేగి జపాదులన్ సలుప నింపగు వర్షమె వచ్చె సత్కృపా
    సాగర, నీర మంతయును చక్కగ నిండెను, మట్టికుండలో.

    రిప్లయితొలగించండి
  8. భోగము భాగ్యమౌ మనకు భూతల మందున తాళవృక్షమే
    బాగుగ నిచ్చుచున్నదిగ పాయక మద్యము సర్వకాలమున్
    త్రాగుట మానివైచి మధు పాత్రను వేగముఁ నింప ముందుకే
    సాగర! నీరమంతయును చక్కగ నిండెను మట్టికుండలో

    రిప్లయితొలగించండి
  9. సాగర స్నానము హాయిని
    తాగొల్పగనాటగాను తడిసెను రవియే
    ఓగంట, తానుతెచ్చిన
    సాగరనీరమ్ము నిండెఁ జక్కగఁ గుండన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సాగర స్నానము' అన్నపుడు 'ర' గురువై గణభంగం. 'ఒక'ను 'ఓ' అనరాదు. సవరించండి.

      తొలగించండి
  10. కం॥ త్రాగిన వాఁడొకఁడు తెలిపె
    వాగుచు పిచ్చిగ నిటులను వార్ధిని నించన్
    సాగ నగస్త్యుఁడు పాత్రను
    సాగర నీరమ్ము నిండెఁ జక్కఁగఁ గుండన్

    ఉ॥ త్రాగిన వాఁడొకండు ఘన తత్వము లెన్నియొ పల్కుచుండఁగన్
    మూగిరి యెందరో వినుచు మూర్ఖుని మాటలు హాస్యమొందఁగన్
    వాగుచుఁ దెల్పె నీపగిది వార్ధి నగస్త్యుఁడు నించ పాత్రలో
    సాగరనీర మంతయును జక్కఁగ నిండెను మట్టికుండలో

    రిప్లయితొలగించండి
  11. వేగిరముఁ జెందకి ప్పుడు
    బాగుగనే నూరుచుండె బావిని జలముల్
    దీగను గట్టుచు దింపఁగ
    సాగర! నీరమ్ము నిండెఁ జక్కగఁ గుండన్”

    రిప్లయితొలగించండి
  12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  13. త్రాగుటకు పనికిరానివి
    సాగరనీరమ్ము ,నిండె జక్కగకుండన్
    వేగిరమేనొక్కడచట
    బాగుగతోడగనుచెలమవారిధిచెంతన్

    రిప్లయితొలగించండి
  14. త్రాగిన యుప్పగునోటికి
    సాగర నీరమ్ము నిండె జక్కగ కుండన్
    వాగును ప్రవహించు జలము
    బాగుగ వడకట్టి త్రాగ బహురుచికరమౌ

    రిప్లయితొలగించండి
  15. త్రాగఁగ నీరము దొరకని
    యాగపు దినములు తటస్థమయ్యెను జనులా
    వాగుకునేతెంచ కృపా
    సాగర! నీరమ్ము నిండెఁజక్కగఁ గుండన్

    త్రాగఁగ నీటి చుక్కయిన దాపున కానగరాదు నీటికై
    వాగుకుబోవ నచ్చటను వారికి చుక్కెదురయ్యె నింతలో
    బాగుగ మంచి నీరుగొని వాహనమొక్కటి వచ్చెనో దయా
    సాగర! నీర మంతయునుచక్కగ నిండెను మట్టికుండలో

    రిప్లయితొలగించండి
  16. వేగిరపాటుఁజెందకుము బీరము లాడక నాదు మాట లన్
    బాగుగ శ్రద్కూధతో డవిను బావిని నీరము పుష్కలంబుగా
    ద్రాగను వీలుగా గలదు రమ్మిక కుండను చూడుమారతిన్
    సాగర! నీర మంతయును చక్కగ నిండెను మట్టికుండలో”

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    త్రాగుట కుపయోగ పడవు
    సాగర నీరమ్ము; నిండెఁ జక్కగఁ గుండన్
    వాగున పాఱెడు జలమది
    బాగుగ మరిగించి త్రాగ బహు మేలొసగున్.

    రిప్లయితొలగించండి