4, జూన్ 2023, ఆదివారం

సమస్య - 4439

5-6-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జరిగెఁ బెండ్లిఁ గన శ్మశానమందు”
(లేదా...)
“జరిగెను పెండ్లి వేడుక శ్మశానమునన్ హితులెల్లఁ గాంచఁగన్”

16 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    రాచ నగరగు నమరావతి దూషించి
    పోల్చి యక్కసు మరుభూమి యనియు
    వేడ్క స్థలములనిడ పేదలకిళ్లకు
    జరిగెఁ బెండ్లిఁ గన శ్మశానమందు

    చంపకమాల
    సరి నమరావతిన్ మునుపు సైచక నెంచిరి వల్లకాడుగన్
    వరలిన బుద్ధితో బడుగు వారలకెంచి స్థలాలొసంగగన్
    మురిసిన పేదలున్ కడకు పొందుగ నిండ్లను గట్టినంతటన్
    జరిగెను పెండ్లి వేడుక శ్మశానమునన్ హితులెల్లఁ గాంచఁగన్

    రిప్లయితొలగించండి
  2. గిరిజశంభునంతకీర్తించెమనసార
    సరిగజీవువలెనుసాధనమున
    పరమశివుడుతానుపరవసింపనచట
    జరిగెపెండ్లిఁగన శ్మశానమందు

    రిప్లయితొలగించండి
  3. తరగనినూత్నపోకడలదారినిఁజూడగమేటియంచునున్
    మురియుచుక్రొత్తప్రేమికులుమోమువెలుంగగవింతఁజూపగన్
    గిరిజయునీశుసన్నిథినికేలునుమోడ్చిశుభంబుకోరగా
    జరిగెనుపెండ్లివేడుకశ్మశానమునన్హితులెల్లగాంచగన్

    రిప్లయితొలగించండి

  4. ప్రేతవనము దాటి విస్తరించె పురము
    వెలిసె భవనము లట విరివి గాను
    పితృగృహమున నుండె పెండ్లిమంటపమందు
    జరిగెఁ బెండ్లిఁగన, శ్మశానమందు.


    అరయగ పట్టణమ్మదియె హద్దులు దాటుచు విస్తరింపగా
    విరివిగ కట్టడమ్ములట ప్రేతవనమ్మున నిల్చె నందునన్
    పరిణయ మండపమ్మొకటి పారుడు గాంచి వచించె నిట్టులన్
    జరిగెను పెండ్లి వేడుక శ్మశానమునన్ హితులెల్లఁ గాంచఁగన్.

    రిప్లయితొలగించండి
  5. ఇంటిపెద్ద పోయి యొంటరి తానాయె
    రేపు మీద యాశ రూపుమాసె
    నాదుకొనఁగరాగ నభయహస్తమొకటి
    జరిగెఁ బెండ్లిఁ గన శ్మశానమందు

    రిప్లయితొలగించండి
  6. కలను గాంచి యొకడు కామాక్షి తో బల్కె
    కన్య వలచి వాడు కాంక్ష దీర
    తల్లి దండ్రుల కును తనవార్కి తెలుపక
    జరిగె పెండ్లి గన శ్మ శాన మందు

    రిప్లయితొలగించండి
  7. ధర నిరు పేద వారలకు దానము
    సేసిన పాడు నేలలో
    నరయగ గట్టుకొన్న గృహమందున
    మంగళ కార్యమాదిగన్
    జరిగెను పెండ్లి వేడుక, స్మశానమున్,
    జనులెల్ల మెచ్చగా
    మురియుచు నేలకో గొనిరి మూఢుల
    టంచనరీర్ష్య జీవులున్

    రిప్లయితొలగించండి
  8. మారుచున్నకాల మాహాత్మ్య మనునట్లు
    పురము పెరుగ సాగె స్థిరము గాను
    ప్రేతవాసమాయె పెండ్లిమంటపముగ
    జరిగెఁ బెండ్లిఁ గన శ్మశానమందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరివిడి విస్తరించినది వేగముగాపురి హద్దు మీరుచున్
      మరిమరి మార్పులన్ గనిన మ్రాన్పడి పోదురు నిశ్చయంబుగా
      జరిగిన కాలమందున శ్మశానము మారెను మంటపంబుగా
      జరిగెను పెండ్లి వేడుక శ్మశానమునన్ హితులెల్లఁ గాంచఁగన్

      తొలగించండి
  9. పరువఁపు ప్రాయమందు తనభర్త గతించఁగ దిక్కులేనియా
    తరుణమునందు నొంటరిగ తల్లడమొందు యనాధ కష్టమున్
    కరుణనుగాంచి యభ్యుదయకారి యొకండపు డిచ్చగించగన్
    జరిగెను పెండ్లి వేడుక శ్మశానమునన్ హితులెల్లఁ గాంచఁగన్

    రిప్లయితొలగించండి
  10. లక్ష ణముగ నచట రాజమహలునందు
    జరిగెఁ బెండ్లిఁ ; గన శ్మశానమందు
    నంత్య క్రియలు కుదురె నతివైభవముగను
    స్వస్తి మడియులు గొనసాగె నెరిగ

    రిప్లయితొలగించండి
  11. పురములలో స్థలమ్ములను బొందుట దుర్లభమై యొసంగ భం
    జరులగు భూములన్ ప్రభుత సద్మములన్ సృజియింప నెంచుచున్
    సరగున ప్రేతభూమి నివసమ్ముగ మారగ నట్టి చావడిన్
    జరిగెను పెండ్లి వేడుక శ్మశానమునన్ హితులెల్లఁ గాంచఁగన్

    రిప్లయితొలగించండి
  12. ఆ॥ వెఱ్ఱి విరిసె నేఁడు పెండ్లికి మొఱకులు
    నవ్యత నరయుచును భవ్యమైన
    పితృ వనమును బోలు వేదికఁ గట్టఁగ
    జరిగెఁ బెండ్లిఁ గన శ్మశానమందు

    చం॥ విరియఁగ వెఱ్ఱి మూర్ఖతను వేదిక నెంచిరి నవ్యతన్ గనన్
    సరసమటంచు శుంఠలు శ్మశానముఁ బోలు వితర్ది పెండ్లికై
    కరములఁ జేర్చి యందరును గట్టిరి యట్లగుపించు వేదికన్
    జరిగెను బెండ్లి వేడుక శ్మశానమునన్ హితులెల్లఁ గాంచఁగన్

    శుంఠలు ను శుఠలు అని వ్రాసినందున మార్చానండి

    రిప్లయితొలగించండి