18, జూన్ 2023, ఆదివారం

సమస్య - 4453

19-6-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కన్నులు లేనట్టివాఁడు గన్గీఁటె నహో”
(లేదా...)
“కన్నులు లేనివాఁ డొకఁడు గాంతను గన్గొని కన్ను గీఁటెరా”

33 కామెంట్‌లు:

  1. మిన్నునవెల్గెడి చంద్రుడు
    మున్నుగఁజూచెనుకలువలమురిపముతోడన్
    సన్నగనవ్విరిభామలు
    కన్నులులేనట్టివాడుకన్గీటెనహో

    రిప్లయితొలగించండి

  2. చెన్నగు పరువమ్ములు గల
    యన్నువయే కేకరాక్షి యామెను గని మా
    యన్నయొకడు మాఘుడు గిల
    కన్నులు లేనట్టివాఁడు గన్గీఁటె నహో.

    రిప్లయితొలగించండి
  3. మిన్నకతండ్రిమాటగొనిమెచ్చుచుపెండిలియాడెగ్రుడ్డినిన్
    చెన్నుగగంతగట్టెనటచింతనులేకనుభర్తతోడుతన్
    అన్నులమిన్నసౌబలునియన్నగబొందినరాజపుత్రియున్
    కన్నులులేనివాడొకడుకాంతనుగన్గొనికన్నుగీటెరా

    రిప్లయితొలగించండి
  4. కందం
    తిన్నఁగ నశ్లీలములన్
    మన్నన విడి చూప మాధ్యమాలు పరస్త్రీ
    నెన్నుచు సంస్కారముగల
    కన్నులు లేనట్టివాఁడు గన్గీఁటె నహో!


    ఉత్పలమాల
    మన్నన లేని రీతిగను మాధ్యమముల్ బ్రసరింప సంఘమం
    దెన్నడులేని భంగి విషమింప నసభ్యము నింపి పంచఁగన్
    బున్నె విహీనుడై స్వపర బుద్ధిగ లోకము గాంచు దృష్టిమై
    గన్నులు లేని వాఁడొకఁడు గాంతను గన్గొని కన్ను గీఁటెరా!

    రిప్లయితొలగించండి
  5. ము న్నొ క యంధుడు గాంచెను
    జెన్నగు గల యందు నొక్క చెలియను దానా
    కన్నెను వల చియు నయ్యె డ
    గన్నులు లేనట్టి వాడు గ న్గీ టె నహో!

    రిప్లయితొలగించండి
  6. ఎన్నడు జెడ్డ పనులపయి
    కన్నులు లేనట్టివాఁడు గన్గీఁటె నహో
    మిన్నక నుండుటెటుల , మరి
    నన్నేలుకొనమని యడుగ నాయమె గాదా

    కన్ను = చూపు

    రిప్లయితొలగించండి
  7. మిన్నతపమ్మొనర్చెనని మేనక పుత్రిక యంచెఱంగుచున్
    గన్నియ పార్వతిన్ గనగ కల్మష కంఠుడు మారువేషమం
    దన్నువ చెంతకేగి పరిహాసము లాడుచు స్మాయమందు ము
    క్కన్నులు లేనివాఁ డొకఁడు గాంతను గన్గొని కన్ను గీఁటెరా.

    రిప్లయితొలగించండి
  8. ఉన్నత భాగ్యవంతుడు కడున్నత
    విద్య వివేకవంతుడున్
    చెన్నగు దేహసౌష్ఠవము చేవయు
    గల్గిన సద్గుణాఢ్యుడున్
    క్రన్నన రాకపోకలను గాంచుచు
    నిత్యము కాంతివంతమౌ
    కన్నులు లేని వాడొకడు కాంతను
    గాంచియు కన్నుగీటెరా .

    రిప్లయితొలగించండి
  9. అన్నులమిన్నగుకన్నియ
    వన్నెలచిన్నెల మెలతుక వచ్చెను వధువై
    ఎన్నడు పరకాంతలపై
    కన్నులు లేనట్టివాఁడు గన్గీఁటె నహో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిన్నది కోరివచ్చెనని చెంగున గంతి విశాలమైనవౌ
      కన్నులు లేనివాఁ డొకఁడు గాంతను గన్గొని కన్ను గీఁటెరా
      ఎన్నడునన్య కాంతలను నేమరిపాటున గాంచకుండినన్
      సున్నితమైనదౌ వనిత సుందర రూపును చూచినంతటన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  10. అన్నుల మిన్నయె చూచెను
    కన్నులు లేనట్టివాఁడు! గన్గీఁటె నహో
    చిన్నది నిజమో కాదో
    తిన్నగ తెలుసుకొనగా మతింపు సరియె పో!

    రిప్లయితొలగించండి
  11. వెన్నెల సోనలు గురిసెడి
    కన్నుల పర్వేందుముఖిని గాంచిన తోడన్
    పన్నుగ గవాక్షములు గల
    కన్నులు లేనట్టివాఁడు గన్గీఁటె నహో

    రిప్లయితొలగించండి
  12. కన్నుల చంద్రికల్ గురియు కాంచనసన్నిభ దేహకాంతి సం
    పన్నతతో తటిల్లతకు బాటిగ శోభిలు పంకజాక్షినిన్
    బన్నుగ గాంచినంతట గవాక్షములల్లన నార్చు చొక్కపుం
    గన్నులు లేనివాఁ డొకఁడు గాంతను గన్గొని కన్ను గీఁటెరా

    రిప్లయితొలగించండి
  13. తిన్నగ దేనిని గాంచడు
    కన్నులు లేనట్టి వాడు,కన్గీటెనహో
    వన్నెల దొరసానినిగని
    చిన్నగనవ్వుచునటవలచిన ప్రియసఖుడే


    రిప్లయితొలగించండి
  14. కం॥ సన్నని గానము నాటఁగ
    మిన్నగఁ బ్రీతిని మనమున మెచ్చుచు ముదితన్
    దిన్నఁగ పరకాంతలపై
    కన్నులు లేనట్టి వాఁడు గన్గీటె నహో

    ఉ॥ సన్నని కంఠమాధురిని శ్రావ్యముగా నొక యింతి కీర్తనల్
    మిన్నగఁ బాడు చుండఁగను మిక్కిలి ప్రీతిని సంతసించి యీ
    యన్నుల మిన్న నాకు తగునన్యల గోరనటంచు స్త్రీలపై
    కన్నులు లేని వాఁడొకఁడు గాంతను గన్గొని కన్ను గీఁటెరా

    రిప్లయితొలగించండి
  15. కన్నులు లేనట్టివాఁడు గన్గీఁటె నహో
    యెన్నఁడు జరుగదు జగమున నెవ్వరి కైనన్
    కన్నులు గల ప్రతి యొక్కరు
    కన్నులతోఁ జూడవలయు గరుణను బ్రజలన్

    రిప్లయితొలగించండి
  16. అన్నరొ! యేమి?ద్రాగితివ? యర్ధము పర్ధము లేని మాట,యే
    కన్నులు లేనివాఁ డొకఁడు గాంతను గన్గొని కన్ను గీఁటెరా
    మిన్నక యుండుమా యిఁక ను మేదిని నట్లుగ జర్గదెక్కడన్
    కన్నులు లేనివారలకు కన్నులు దానముఁజేయ పుణ్యమౌ

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    ఎన్నగ కనలేడు జగతి
    కన్నులు లేనట్టి వాడు; కన్గీటె నహో
    కన్నియను గాంచి యొక్కడు
    కన్నులు తనకున్నగాని జ్ఞాన రహితుడై.

    రిప్లయితొలగించండి
  18. శంకరాభరణం సమస్య: పూరణ:
    ఎన్నడు నింతులన్ గనక నేకత నుండెడు బాలుడంతలో
    చెన్నుగ నిందిరా తనయు జెల్వగు పువ్వలుగొక్కడేయుచోఁ
    నెన్నడు పూజసేయకయె యేర్పడ దేవుని గన్నయట్టులై
    కన్నులు లేనివాఁ డొకఁడు గాంతను గన్గొని కన్ను గీఁటెరా
    కడయింటి కృష్ణమూర్తి..గోవా (నెల్లూరు)---19-6-23

    రిప్లయితొలగించండి