6, జూన్ 2023, మంగళవారం

సమస్య - 4441

7-6-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వంకాయనుఁ గోసినంత వచ్చె రుధిరమే”
(లేదా...)
“వంకాయన్ దెగఁ గోసినంత వెడలెన్ వామాక్షిరో రక్తమే”

30 కామెంట్‌లు:

  1. బింకముతోడుతగృహిణియు
    శంకనులేకనుతరుగగశాంతముజచ్చెన్
    సంకటమాయెనుపురుగుతొ
    వంకాయనుగోసినంతవచ్చెరుథిరమే

    రిప్లయితొలగించండి
  2. కందము
    టెంకాయఁగొట్టి పచ్చడి
    పొంకముగాఁజేసి తీపి పులుసును బెట్టెన్
    పంకజముఖి వ్రేలు తెగెను
    వంకాయను కోసినంత ,వచ్చె రుధిరమే.

    రిప్లయితొలగించండి
  3. పంకజముఖి సీతమ్మకు
    వంకాయల శాకమన్న బాతి, తరుగుచున్
    సంకటపడెఁ దెగి యంగుళి
    వంకాయనుఁ గోసినంత, వచ్చె రుధిరమే

    రిప్లయితొలగించండి
  4. పొంకపు గారడి. వాడొక
    వంకాయ ను జూపి యందు వచ్చునటంచున్
    గొంకక నటు నిటు ద్రిప్పుచు
    వంకాయను గోసి నంత వచ్చె రుధిర మే!

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. కందం
      వెంకడను మాంత్రికుండట
      సంకటమొనరించు పీడ సాక్షిగ దెలుపన్
      శంకన్ బాపగ కత్తిని
      వంకాయను గోసినంత వచ్చె రుధిరమే!

      శార్దూలవిక్రీడితము
      సంకోచాల్ వలదంచు పీడ జొరె నిస్సందేహమన్ నమ్మికన్
      వెంకండన్ దెలివైన మాంత్రికుఁడటన్ విజ్ఞానమున్ జూపుచున్
      శంకల్లేలన నింటివారు జడియన్ సాక్ష్యమ్మనన్ మాయతో
      వంకాయన్ దెగఁ గోసినంత వెడలెన్ వామాక్షిరో! రక్తమే!


      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. 🙏ధన్యోస్మి గురుదేవా!🙏 మూడవ పాదంలో టైపాటు.

      'శంకల్లేవన' అని చదువుకొన మనవి.

      తొలగించండి
  6. శంకించకపుచ్చులనుచు
    వంకాయలుతెచ్చికడిగి వడిగాతీయన్
    పంకెనగలచాకు తగిలి
    వంకాయనుకోసినంతవచ్చె రుధిరమే

    రిప్లయితొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎంకికి నంగుళి తెగినన్
      శంకించకతరుగనెంచె శాకంబులనే
      బింకము సడలని భామిని
      వంకాయనుఁ గోసినంత వచ్చె రుధిరమే

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    3. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "తా నొయ్యారమౌ తీరుగన్... విడనాడకే.." అనండి. 'చకచకా' అనడం వ్యావహారికం.

      తొలగించండి
    4. సూచించిన సవరణలతో...

      ఓంకారేశుని భార్య గాయపడె తానొయ్యార మౌతీరుగన్
      వంకాయల్ నుఱుమాడ నెంచి నపుడే వాస్తవ్యమున్ దెల్పగన్
      బింకంబున్ విడనాడకే చకచకా వేగంబు హెచ్చించుచున్
      వంకాయన్ దెగఁ గోసినంత వెడలెన్ వామాక్షిరో రక్తమే

      తొలగించండి
  8. వెంకాయమ్మ యనుంగు పుత్రునకు నిర్భేదించి లేలేతవౌ
    వంకాయల్ తగ కూరఁ జేయ రుచిరంబౌనంచు తానెంచుచున్
    వంకాయన్ దెగఁ గోసినంత వెడలెన్ వామాక్షిరో రక్తమే
    సంకాశమ్ముగ వ్రేలుగూడ తెగఁగా వంకాయతోబాటుగన్

    రిప్లయితొలగించండి
  9. వంకర బుద్ధి మగనిదని
    యంకిలితో తరుగు వేళ యంగుష్ఠ మదే
    వంకర కత్తికి తెగుచును
    వంకాయనుఁ గోసినంత వచ్చె రుధిరమే.


    అంకంబందున చేరి పసూనుడటనాహ్లాదమ్ము గా కాయలన్
    వెంకాయమ్మకు నిచ్చుచుండె నట నావృంతాకులన్ పేర్మితో
    శంకేమాత్రము తల్లి కోయగను హస్తాగ్రమ్ముకే గాయమై
    వంకాయన్ దెగఁ గోసినంత వెడలెన్ వామాక్షిరో రక్తమే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      వాట్సప్ గ్రూపులో నా స్పందన చూడండి.

      తొలగించండి
  10. శా.

    అంకాపొంకములన్ గటుత్రయముతో నద్దించి కారమ్ముగా
    లంకావాసులు కోనసీమ రుచులన్ లక్ష్మీసుతుల్ భోగులే
    రంకెల్ వేయు విధిన్ గటారి గతిలో రమ్యమ్ము లోపించగా
    *వంకాయన్ దెగఁ గోసినంత వెడలెన్ వామాక్షిరో రక్తమే.*

    రిప్లయితొలగించండి
  11. వంకలు బెట్టెడు భయమువ
    వంకాయనుఁ గోసినంత , వచ్చె రుధిరమే
    సంకోచమేల పడెదవు !
    జంకెడు హస్తములలోన చాకు ది
    గెనుగా

    రిప్లయితొలగించండి
  12. కం॥ వంకలఁ బెట్టును మగఁడను
    శంకను భయపడి పడతికి సడలఁగ దిటవే
    సంకట మొందుచు వంటకు
    వంకాయను గోసినంత వచ్చె రుధిరమే!

    శా॥ శంకించంగను జేయ కార్యములిలన్ సాధ్యంబుఁ గాదయ్యరో!
    బింకమ్మున్ విడకుండఁ జేయఁ దగునే! భీతిల్లు టేలయ్యరో!
    వెంకాయమ్మకు శంక యెక్కువ కనన్ భీతిల్లి యానారియే
    వంకాయన్ దెగఁ గోసినంత వెడలెన్ వామాక్షిరో రక్తమే!

    రిప్లయితొలగించండి
  13. సంకోచంబును వీడి రుచిగా సంప్రీతి
    తో నేడు నా
    వంకన్ జూడక కూర వండు మనగా వె
    న్వెంటనే తెచ్చి నే
    బింకంబొప్పగ గోయుచుండువడిగా
    వ్రేలున్ దెగెన్ నాదయో!
    వంకాయన్ దెగ కోసినంత వెడలన్
    వామాక్షిరో రక్తమున్.

    రిప్లయితొలగించండి