23, జూన్ 2023, శుక్రవారం

సమస్య - 4457

24-6-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పువ్వులోన రెండు పువ్వు లమరె”
(లేదా...)
“ఒక పుష్పంబున రెండు పూవు లమరెన్ యోషామణీ కంటివే”

22 కామెంట్‌లు:

  1. దేహమందుగలడుతేజమౌపరముడు
    అతనివెంటనుండెయాత్మయొకటి
    భౌతికంబునిమిడెపూతాత్మజీవాత్మ
    పువ్వులోనరెండుపువ్వులమరె

    రిప్లయితొలగించండి
  2. పద్మముఖివదనము పద్మమున్ దలపించు
    కళ్ళు చూడ నల్ల కలువ పూలు
    వలజ చెలువముగని వర్ణించె నొక్కడు
    పువ్వులోన రెండు పువ్వు లమరె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుకుమారీ నినుమెచ్చు కొందురుగదా సోలించు పూబోడిగా
      మకుటంబే నినుకోరి వచ్చెనుగదా మార్మోగగాదిక్కులే
      వికచాబ్జానన రెండు నల్ల కలువల్ విప్పారె నీకన్నులై
      'ఒక పుష్పంబున రెండు పూవు లమరెన్ యోషామణీ కంటివే'

      తొలగించండి
  3. ఆటవెలది
    కలికి సొగసుఁజూచి కవివరుఁడిట్లనె
    వదన పద్మమందు బాగుగాను
    కలువ కనులు రెండు కాంతులీనుచునుండె
    వువ్వులోన రెండు పువ్వులమరె.

    రిప్లయితొలగించండి
  4. పూవు వంటి వనిత పోల్చి యు వర్ణించె
    కవన మందు నొక్క కవి వరుండు
    కురుల యందు మెరిసె కోమలి జడ లోన
    పువ్వు లోన రెండు పువ్వు లమరె

    రిప్లయితొలగించండి
  5. చిత్తమున్ జెడు దలచెను మత్తుగ త్రాగ
    వృత్తి జెప్పు బుద్ధి వృద్ధి కొరకు
    చిత్తమనెది చెప్ప చెడ్డ కోతియె గదా
    పువ్వులోన రెండు పువ్వులమరె

    రిప్లయితొలగించండి
  6. అకలంకంబగునాత్ంగూడెనటతాహారంబులోతేజమై
    సకలంబౌనిలజీవులందునతడున్శాంతంబుగానుండులే
    ముకురంబాయదిమానసంబుగనుమామోహంబుతోగూడకన్
    ఒకపుష్పంబునరెండుపూవులమరెన్యోషామణీగంటివే

    రిప్లయితొలగించండి
  7. రిప్లయిలు
    1. ఆటవెలది
      చూడ వదనమొక ప్రసూనమటులఁదోచు
      కన్నులగు పడంగ కలువలట్లు
      ముచ్చటైన లలన ముద్దుమోమనియెడు
      పువ్వులోన రెండు పువ్వు లమరె!

      మత్తేభవిక్రీడితము
      అకలంకంబగు మోము సూడ నలరున్ హ్లాదంబుగన్ బోలెడున్
      శకలంబై గగనంబు జారు మెరుపై సౌందర్య మొప్పారుచున్
      మకరాంకున్ విలుజారు తూపులనగన్ మైమర్పు కంజాక్షముల్!
      యొక పుష్పంబున రెండు పూవు లమరెన్ యోషామణీ కంటివే!

      తొలగించండి

  8. పడతి మోము జూడ పద్మమై విరియగా
    కన్నులేమొ రెండు కలువలాయె
    ననుచు కవియె తెలిపె నద్భుతముగనిట్లు
    పువ్వులోన రెండు పువ్వు లమరె.

    రిప్లయితొలగించండి
  9. ఒక కావ్యంబున సత్కవీశ్వరుడె తానుత్సాహియై వ్రాసెనే
    వికచాబ్జానన సుందరాంగి గనుచున్ బ్రేయాంశుడే చెప్పెనం
    చు కువేలమ్ములె నీదు కన్నులగుచున్ జోద్యంబదే గాంచగా
    నొక పుష్పంబున రెండు పూవు లమరెన్ యోషామణీ కంటివే.

    రిప్లయితొలగించండి
  10. మ.

    నికరంబా సుమమాలలో గలదు సాన్నిధ్యమ్ము దేవాంగనల్
    చకితంబౌ ఘనకార్యమై తునియ సంజాతమ్ము తాయెత్తుగన్
    వికలంబైన వడంబు మూడు పువులై విప్పార భ్రాంతమ్ముగా
    *నొక పుష్పంబున రెండు పూవు లమరెన్ యోషామణీ కంటివే!*

    రిప్లయితొలగించండి

  11. ఆ.వె:
    ముచ్చటైన పూలు మూడు దెచ్చెనుబాల
    ముగ్గులోనజేర్చ మురిపె మయ్యె
    మోజు పడుచు తానె ముడిచెను శిగ నొక్క
    పువ్వు; లోన రెండు పువ్వులమర.

    రిప్లయితొలగించండి
  12. చేతిలో పద్మములు ధరించి, పద్మా
    సీనయైన లక్ష్మీదేవిని....
    మ.
    సకలాలంకృతదేహయైన సిరికిన్‌ సాక్షాన్మహాలక్ష్మికిన్
    నికరంబైన కరంబులందున లసన్నీరేజముల్బట్టి తా
    నొక పద్మంబున కూరుచుండెనహహా నూహింపగా చిత్రమే
    “ఒక పుష్పంబున రెండు పూవు లమరెన్ యోషామణీ కంటివే”

    రిప్లయితొలగించండి
  13. పూజ గదిని నుంచ పుత్తడిపూవును
    వెలకు దీయగ నది పెద్ద దయ్యె
    ముద్ద బంతి తోడ పూజించ బంగరు
    పువ్వులోన రెండు పువ్వు లమరె

    రిప్లయితొలగించండి
  14. జీవులందునుండు జీవాత్మ పరమాత్మ
    దేహమాశ్రయించి తిరముగాను
    రెండుకలిసియొక్క రీతి 'జీవేశుఁ' గా
    పువ్వులోన రెండు పువ్వు లమరె

    (జీవ=జీవాత్మ; ఈశ=పరమాత్మ)

    రిప్లయితొలగించండి
  15. ఒక జీవేశుఁడు రెండు రూపములుగా నుల్లంబునం దుండుతా
    నకలంకుండెపుఁడెట్టి శోధనములాయాత్మన్ పిసాళించకన్
    సకలంబున్ సరిచేయుచుండు నతడే శర్వుండు యోచింపగన్
    ఒక పుష్పంబున రెండు పూవు లమరెన్ యోషామణీ కంటివే

    రిప్లయితొలగించండి
  16. ఆ॥ పువ్వు ముడిచిన సతి ముద్దు మోమును గని
    భ్రమరము సుమమనెడి భ్రమను దిరుగ
    గుండ్ర ముగ మరిమరి గురి లేక ననిపించె
    పువ్వులోన రెండు పువ్వు లమరె

    మ॥ చకితుండైతిని మొగ్గ యొక్కటె కనన్ జక్కంగ విప్పారుచున్
    సుకుమారంబగు జంట పుష్పములుగా శోభిల్లుచున్ బూచెనే
    యొక పుష్పంబున రెండు పూవులమరెన్ యోషామణీ కంటివే!
    సకలమ్మీశుని మాయయే జగమునా సర్వేశుఁ డాడించుగా!

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    పద్మమువలె నున్న వదనమ్ము నందున
    కమలములను బోలు కనులు రెండు
    కలిగిన చెలి గాంచి కవులు వర్ణించిరి
    పువ్వులోన రెండు పువ్వు లమరె.

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    పద్మమువలె నున్న వదనమ్ము నందున
    కలువల వలె రెండు కనులు గలిగి
    నట్టి సుదతిఁ గాంచిన కవులిట్టు లనిరి
    పువ్వులోన రెండు పువ్వు లమరె.

    రిప్లయితొలగించండి