2, జూన్ 2023, శుక్రవారం

సమస్య - 4437

3-6-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శ్రీరస్తని దీవెన నిడఁ జీకొట్టఁ దగున్”
(లేదా...)
“శ్రీరస్తంచును బల్కి దీవెన లిడన్ జీకొట్టఁగా నొప్పగున్”

18 కామెంట్‌లు:

  1. నేరములెన్నియొ సల్పుచు
    తీరుబడిగ సాధులకడ దీవెనఁ గోరన్
    నేరచరితుడని దెలిసియు
    శ్రీరస్తని దీవెన నిడఁ జీకొట్టఁ దగున్

    రిప్లయితొలగించండి
  2. తీరుగశుభములుకలుగును
    *“శ్రీరస్తని దీవెన నిడఁ, జీకొట్టఁ దగున్”*
    తేరగనింటనుతినుచును
    కూరిమినటియించుచున్నకూళులనెపుడున్

    రిప్లయితొలగించండి

  3. నేరస్థుండత డైనను
    బారూపము తాననుచును పలువిధముల బం
    డారము గుంజదలంచుచు
    శ్రీరస్తని దీవెన నిడఁ జీకొట్టఁ దగున్.



    నేరస్థుండతగాడు సంపదలకై నిర్ముక్త వేషంబుతో
    బారూపమ్మును నేను మీరిటకు కైవల్యమ్మునే గోరినన్
    చేరన్ రండని డంభముల్ పలికెడిన్ స్తేనుండు వంచించుచున్
    శ్రీరస్తంచును బల్కి దీవెన లిడన్ జీకొట్టఁగా నొప్పగున్.

    రిప్లయితొలగించండి
  4. తోరపు మాయల జూపుచు
    కోరిక లను దీ ర్తు ననుచు గొప్ప కపటియా
    క్రూరుడు బాబా నేనని
    శ్రీరస్త ని దీ వెన నిడ జీ కొట్ట దగున్

    రిప్లయితొలగించండి
  5. శ్రీరంగాయని పల్కుచు
    ఘోరంబౌ కృత్యములకు కొనకొను యోగుల్
    డేరాబాబా పూనిక
    శ్రీరస్తని దీవెన నిడఁ జీకొట్టఁ దగున్


    శ్రీరంగా యనునోటివెంట వినరే చిత్రంబుగా కోర్కెలన్
    ఘోరంబౌ తమలీలలన్ మగువలన్ గోదాటిలోముంచగా
    డేరాలో కొలువున్న కామరసికుండేకాంతమున్ భామినీ
    శ్రీరస్తంచును బల్కి దీవెన లిడన్ జీకొట్టఁగా నొప్పగున్

    రిప్లయితొలగించండి
  6. తీరుందెన్నునులేని మూర్ఖుడగునో దేభ్యున్ దయాహీనునిన్
    నేరంబుల్ సతతంబొనర్చు తులువన్ నిర్హేతుకంబౌ కృపన్
    చేరంజీరి కటాక్ష వీక్షణములన్ క్షేమంబుఁ గల్పించుచున్
    శ్రీరస్తంచును బల్కి దీవెన లిడన్ జీకొట్టఁగా నొప్పగున్

    రిప్లయితొలగించండి
  7. కందం
    తేరున్దీరిచి త్రిప్పఁగ
    మీరలు దగుదురని కీడు మీకెంచు ఖలుల్
    వారే గోముఖఁపు పులుల్!
    శ్రీరస్తని దీవెన నిడఁ జీకొట్టఁ దగున్


    శార్దూలవిక్రీడితము
    ఏరీతిన్ భువినమ్మరాదుగద నిన్నేమార్చు వారిన్ సదా
    తేరున్దీరిచి త్రిప్పనొప్పఁ దగెడున్ దేవుండవన్ కీర్తనల్
    నోరారాడుచుఁ గీడొనర్పఁ గను హీనుల్ గోముఖవ్యాఘ్రముల్
    శ్రీరస్తంచును బల్కి దీవెన లిడన్ జీకొట్టఁగా నొప్పగున్

    రిప్లయితొలగించండి
  8. కం॥ శ్రీరంగ నీతులఁ బలికి
    నేరములను జేయు నరులు నేఁడధికులయా!
    వారల గుర్తించి జనులు
    శ్రీరస్తని దీవెన నిడఁ జీకొట్టఁ దగున్

    శా॥ ప్రారంభించి దినమ్ము చక్కఁగఁ గనన్ బ్రార్థించుచున్ దైవమున్
    సారించంగను జేతురే ఘనులు నీచమ్మైన దుష్కర్మలే
    సారాంశంబును దెల్ప నట్టి జనులన్ సారించుచున్ క్షుద్రులన్
    శ్రీరస్తంచును బల్కి దీవెన లిడన్ జీకొట్టఁగా నొప్పగున్

    రిప్లయితొలగించండి
  9. మారవుమాసినబ్రతుకులు
    చేరరుపేదలుసుఖములతీరమునెపుడున్
    వేరొకదిక్కునులేదుగ
    శ్రీరస్తనిదీవెననిడఁజీకొట్టదగున్

    రిప్లయితొలగించండి
  10. పేరున్బొందిన మిత్రు డొకడున్ బేర్మిన్
    సుతున్ బెండ్లికిన్
    రారమ్మంచును వేడగా వెడలితిన్
    రాగంబుచే వెంటనే
    శ్రీరస్తంచును దీవెన లిడన్, చీకొట్టగా
    నొప్పగున్
    క్రూరాత్ముండు వరుండు కట్నమునకై
    కొండాడుటన్ గాంచినన్.

    రిప్లయితొలగించండి
  11. చేరన్ పండితుడంచు మానసములో చింతించుచున్ భక్తిమై
    చీరల్ తాల్చిన కోమలాంగులటకున్ సేవింప, వీక్షించుచున్
    క్రూరమ్మైన తలంపుతోడ నెదలో కోర్కెల్ పిసాళింపగా
    శ్రీరస్తంచును బల్కి దీవెన లిడన్ జీకొట్టఁగా నొప్పగున్


    రిప్లయితొలగించండి