29, జూన్ 2023, గురువారం

సమస్య - 4462

30-6-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఏడ్పు కాపురమ్మునఁ గలిగించు ముదము”
(లేదా...)
“ఏడ్పులు సంతసంబు కలిగించును కమ్మని కాపురంబునన్”

22 కామెంట్‌లు:

  1. ప్రియము గూర్చి మాటలలోనప్రేమజూపి
    అలతి మాటలు బలికిన నతివ మురియు
    గిల్లి కజ్జాలతో నలిగి నపుడట్టి
    ఏడ్పు కాపురమ్మునఁ గలిగించు ముదము”

    రిప్లయితొలగించండి
  2. చేడ్పడిజూచెసత్యయునుచేరగపుష్పమురుక్మిణీసతిన్
    తోడ్పడెకృష్ణుడయ్యెడనుదొంగతనంబునదిట్టయౌగదా
    గాడ్పునువీచెగాయెదనుగాసిలియేడ్వగప్రేమపొందెనే
    ఏడ్పులుసంతసంబుగలిగించునుకమ్మనికాపురంబునన్

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    కడుపు పండక కుందెడు కలికియింట
    భక్తి భావాన షణ్ముఖవ్రతము సేయ
    కలిగె పండంటి బిడ్డడు, వెలయ వాని
    యేడ్పు కాపురమ్మునఁ గలిగించు ముదము


    ఉత్పలమాల
    కడ్పున కాయకాయదని కందుచు నేళ్లుగ నింట దంపతుల్
    చాడ్పుగ షణ్ముఖవ్రతము సంతసమొప్పఁగఁ జేసినంత కై
    మోడ్పుల, జన్మధన్యమన ముద్దులబిడ్డడు గల్గె! వానివౌ
    యేడ్పులు సంతసంబు కలిగించును కమ్మని కాపురంబునన్

    రిప్లయితొలగించండి
  4. కడ్పది పండలేదనుచు కాంత, శ్రియఃపతికంజలించి కై
    మోడ్పులొనర్చి ధర్మజసముండగు పుత్రుని గోరి, భర్తయున్
    తోడ్పడి చేయునా వ్రతము, తుష్టిని గూర్పగ బాలకాళి చే
    ఏడ్పులు సంతసంబు కలిగించును కమ్మని కాపురంబునన్

    ఏడ్పులు = పుట్టిన పిల్లల ఏడుపులు

    రిప్లయితొలగించండి
  5. రాగమొలికించుభార్యయైరమణియపుడు
    ప్రణయకలహంబునందునబాధతోడ
    ధవునియెదుటనునేడ్చియాదరముబొందె
    ఏడ్పుకాపురమ్మునగలిగించుముదము

    రిప్లయితొలగించండి
  6. సరసమెంతయున్న నొక సంసారమందు
    కొరత తప్పదు పాప లేకున్న నిజము;
    ఇంట వేడుకగును వినిపించ పాప
    ఏడ్పు, కాపురమ్మునఁ గలిగించు ముదము.

    రిప్లయితొలగించండి
  7. ఆలు మగలుల దాంపత్యమాద ర మున
    సాగు సమయాన ఫలి యించి సంత స మిడ
    శిశువు జనియించి వారికి చెలు వ మై న
    నేడ్పు కాపు రమ్ము న గలిగించు ముదము

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆలుమగల నమన్వయ మతిశయింప
      వృద్ధినొందు కుటుంబము వేగిరమున
      చిట్టి పాపడు వారింటఁ బుట్ట వాని
      యేడ్పు కాపురమ్మునఁ గలిగించు ముదము

      తొలగించండి
    2. ఏర్పడునాలుబిడ్డలిట నెవ్వరికైన వివాహమైనచో
      తోడ్పడుభార్యచొప్పడినఁ తూకొను సౌఖ్యమునెల్లవేళలన్
      చేడ్పడుజంటకే తొలగు చింతలు బిడ్డలు పుట్టిపెట్టగా
      నేడ్పులు సంతసంబు కలిగించును కమ్మని కాపురంబునన్

      తొలగించండి

  9. బందకివని జనులు బాధ పెట్టిరటంచు
    శరవణభవుడేను శరణమంచు
    మ్రొక్కినంత గలిగె పుత్రుడా పసివాని
    ఏడ్పు కాపురమ్మునఁ గలిగించు ముదము.



    ముడ్పును గట్టి షణ్ముఖుని మ్రొక్కుచు దివ్య వ్రతమ్ము జేయగా
    కడ్పున కాయగాసెనని స్కందుడటంచును పిల్చిరెల్లరున్
    కడ్పున పుట్టినట్టి పసి కందుని ముద్దగు కేరుకేరు మం
    చేడ్పులు సంతసంబు కలిగించును కమ్మని కాపురంబునన్.

    రిప్లయితొలగించండి
  10. ఉ.

    గాడ్పులు వీచుచుండ పురి గంధము ముక్కుల దూరుచుండెడిన్
    గోడ్పడ దంపతుల్ విధిని కూనల తాపము హెచ్చుచుండగా
    *నేడ్పులు, సంతసంబు కలిగించును కమ్మని కాపురంబునన్*
    మోడ్పుగ బెండ్లి వేడుకను ముచ్చటలాడగ వన్నె పక్వమున్.

    రిప్లయితొలగించండి
  11. కడ్పు లతాంగికిన్నధిక కాలము
    వండక చింతి జెంది తా
    ముడ్పులు గట్టుచున్ మరియు
    పూజలు జేయుచు నెల్లవేళ కై
    మోడ్పులు సేయ దైవముకు
    పుట్టెను బాలుడు పుట్టునప్పుడా
    యేడ్పులు సంతసంబు కలిగించును
    కమ్మని కాపురంబునన్ 30/6/23

    రిప్లయితొలగించండి
  12. వివహము జరుగ బిడ్డ
    కైవేచి యుండ
    నిన్ని నాళ్ళకు నెరవేరు నీప్సితమిక
    జాయ ప్రసవించ పుట్టెడు చంటి పాప
    యేడ్పు కాపురమ్మునఁ గలిగించు ముదము

    రిప్లయితొలగించండి
  13. గాడ్పులవోలె వాదనలు కాపురమందున సంభవించగన్
    చేడ్పడకన్ సతీపతులు చింతన సల్పి యథోచితంబుగా
    తోడ్పడ నొండొరుల్ దొలఁగు దూరము, చేరువయైన గల్గునా
    యేడ్పులు సంతసంబు కలిగించును కమ్మని కాపురంబునన్

    రిప్లయితొలగించండి
  14. తే॥ క్రొత్తగా పెండ్లి యాడిన కుర్ర జంట
    తగిన తీరుగ బ్రదుకున తనిచి మురియఁ
    బడిసిరొక చంటి పాపను వారు పాప
    యేడ్పు కాపురమ్మునఁ గలిగించు ముదము

    ఉ॥ కడ్పటి యాసగా జహువుఁ గాంచఁగఁ జేసిరి తీర్థయాత్రలన్
    ముడ్పులఁ గట్టిరంట యొక ముద్దుల బాలునిఁ బొంద దంపతుల్
    దోడ్పడ దైవమున్ గొడుకు దుఃఖముఁ దీర్చఁగఁ గల్గె వాని యా
    యేడ్పులు సంతసంబుఁ గలిగించును గమ్మని కాపురంబునన్

    జహువు సంతానము (నిఘంటువు సహాయమండి)

    రిప్లయితొలగించండి
  15. పిల్ల పాపలు గల యింట వెల్లివిరియు
    సుఖము సౌఖ్యము సంపదల్ శోభనములు
    చిట్టిపాపలు దోగాడు నట్టియింట
    యేడ్పు కాపురమ్మునఁ గలిగించు ముదము

    రిప్లయితొలగించండి
  16. తోడ్పడ వెజ్జు, బిడ్డఁ గని తోషముతో చనుదెంచ భార్య తాన్
    గాడ్పుల నుండి కావ చలిగాలి నొసంగెడి యంత్ర ముంచగా
    కడ్పున బుట్టినట్టి చిరు కన్నడు తల్లిని గాంచ చేయు నా
    యేడ్పులు సంతసంబు కలిగించును కమ్మని కాపురంబునన్
    అసనారె

    రిప్లయితొలగించండి
  17. కీడుఁగలిగించు నిరతము కీరవాణి!
    యేడ్పు కాపురమ్మునఁ ,గలిగించు ముదము
    చేతి నిండుగ పనియుండి చేయు వాని
    మనసునకు చెప్పగ రానట్టి మరువ లేని

    రిప్లయితొలగించండి
  18. ఏడ్పులు సంతసంబు కలిగించును కమ్మని కాపురంబునన్
    గాడ్పులు సల్లగా నిమురు కాయము హాయను నట్లు గాభువిన్
    గడ్పులు పండు తప్పకను గాంతలు గాంతుని గూడుచో గదా!
    యేడ్పులు గాడ్పులాదియును నీశ్వరు నాఙ్ఞను బట్టియేసుమా.

    రిప్లయితొలగించండి

  19. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    పెండ్లి జరిగి వత్సరముల పిదప కూడ
    సంతు లేదను వేదన సలుపుచుండి
    వగచు చుండగ నూత్న దంపతులు మిగుల
    గర్భమున్ దాల్చి భార్య సకాలమునకు
    పుట్టుక నిడగ నిసువుకు,పురిటి బిడ్డ
    యేడ్పు కాపురంబున కలిగించు ముదము.

    రిప్లయితొలగించండి
  20. ముడ్పులు కట్టిదంపతులు ముందుగ వేడిరి వేంకటే శునిన్
    కడ్పునకాయకాచిననుగమ్మునవత్తుము బిడ్డపుట్టగన్
    తడ్పుచుబట్టలన్సతముదాటెడివేళలనింటిగడ్పలన్
    యేడ్పలు సంతసం బుకలి గించును కమ్మని కాపురం బునన్

    రిప్లయితొలగించండి