21, జూన్ 2023, బుధవారం

సమస్య - 4455

22-6-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కారము లేనట్టి కూర గాంతుడు మెచ్చెన్”
(లేదా...)
“కారము లేని కూరఁ దిని కాంతుఁడు మెచ్చెను భార్యనత్తఱిన్”

36 కామెంట్‌లు:

  1. ఆరంగాగినకోపము
    నూరగపళ్లనువనితయునోరిమికొఱకై
    కోరెనుమౌనిగశమమును
    కారములేనట్టికూరకాంతుడుమెచ్చెన్

    రిప్లయితొలగించండి
  2. ఉ.

    భారము జీవనంబగును వర్ధిలు రక్తపు పోటు చేటగున్
    నీరము హెచ్చుగా కుడిచి నిద్రను తృప్తిగ జేయు సూచనల్
    క్షారము న్యూనమౌ కుడుపు క్షాంతము వైద్యుడు చెప్పె సాధ్వికిన్
    *కారము లేని కూరఁ దిని కాంతుఁడు మెచ్చెను భార్యనత్తఱిన్.*

    రిప్లయితొలగించండి
  3. కోరుచుహోటలందుఁదినగొప్పగబిల్లునుగట్టిఁజూచెగా
    చేరెనుపళ్ళెమందునహచెప్పనిపేరులశాకపాకముల్
    ఊరదుజిహ్వయందుజలమూహకునందదునింటితిండియున్
    కారములేనికూరదిని, కాంతుడుమెచ్చెనుభార్యనత్తఱిన్

    రిప్లయితొలగించండి

  4. ధారాళమ్ముగ వంటలు
    దారయె చేయంగలేదు తడబడుచును తా
    నారాటమ్మున జేయ, వి
    కారము లేనట్టి కూర గాంతుడు మెచ్చెన్.

    రిప్లయితొలగించండి
  5. కారము దిన రా దనుచును
    బేరొంది న వైద్యుడొకడు వివరించంగా
    నారీ తిభార్య వండగ
    కారము లేనట్టి కూర గాంతుడు మె చ్చె న్

    రిప్లయితొలగించండి
  6. కందం
    శ్రీరాముఁడు బాలుండై
    మారాములు మాని తినఁగ మాతయె పెట్టన్
    దా రుచిఁ గని మితిమీరిన
    కారము లేనట్టి కూరఁ గాంతుఁడు మెచ్చెన్

    ఉత్పలమాల
    వారిజ నేత్రముల్ విరియ పట్టెడు నన్నము బాలరాముఁడున్
    మీరక తృప్తిగన్ గుడిచి మేలుగ నాడఁగ మాత పెట్టగన్
    దా రుచిఁ చూడ నంజుడును దాకుచు వ్రేలిని నాల్కకద్ది పెన్
    గారము లేని కూరఁ దిని కాంతుఁడు మెచ్చెను భార్యనత్తఱిన్

    రిప్లయితొలగించండి
  7. కారము లవణము తోమమ
    కారము పొంకించి వండె కాంతారునికై
    సారిక! భళీయని తృణీ
    కారము లేనట్టి కూర గాంతుడు మెచ్చెన్

    రిప్లయితొలగించండి

  8. బీరయు, బెండకాయలును వీడి టమాటయొ వంగకాయయో
    కోరెదనోయి శీఘ్రముగ కోరిన దానిని జేయమన్న నా
    దార టమాటలేదనుచు ధామమునందున, చేసినట్టి సం
    స్కారము లేని కూరఁ దిని కాంతుఁడు మెచ్చెను భార్యనత్తఱిన్.

    ( సంస్కారము సంకల్పము )

    రిప్లయితొలగించండి
  9. కారము తినితన కడుపు వి
    కారము జెందగ, కొలదిగ గలిపెనపుడా
    నారి, రుచి జూచి సరియని
    కారము లేనట్టికూర కాంతుడు మెచ్చెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదం చివర గణభంగం. "కొలదిగ గలిపిన నపుడా..." అందామా?

      తొలగించండి
    2. పేపర్లో కలిపిన దపుడా అని వ్రాసుకున్నది తప్పుగా టైప్ చేశాను.

      తొలగించండి
  10. నేరుగ నంగడికి వెడలి
    యేరకమగు కాయ కూర నెంచుట నందున్
    వేరుపడి యామె కంగీ
    కారము లేనట్టి కూర గాంతుడు మెచ్చెన్

    రిప్లయితొలగించండి
  11. తీరుగ భుజించ నెంచుచు
    కోరగ పతి బీరకాయ కూరను వడిగా
    దారయు తాచేయనతిగ
    కారములేనట్టికూరకాంతుడుమెచ్చెన్

    రిప్లయితొలగించండి
  12. -

    హా! రక్తపుపోటాయే!
    ఔరౌరౌర మధుమేహమాయెన్ ! చూడం
    గా రీతిగ నుప్పు మరియు
    కారము లేనట్టి కూర కాంతుడు మెచ్చెన్

    రిప్లయితొలగించండి
  13. భారమ్మనితలపక మమ
    కారమ్మును ప్రోదిచేసి కమనీయముగా
    కోరఁగ వండిన నతిగా
    కారము లేనట్టి కూర గాంతుడు మెచ్చెన్

    రిప్లయితొలగించండి
  14. కోరిక దీర్చ నాధునకు కొబ్బరికోరు మసాలకారమున్
    కూరిన వంగకాయలను కూరిమి తైలమునందు వేఁపి యిం
    పారగనుప్పు జేర్చిసతి వండెను కమ్మగ కూర నంతగా
    కారము లేని కూరఁ దిని కాంతుఁడు మెచ్చెను భార్యనత్తఱిన్

    రిప్లయితొలగించండి
  15. కారపు కూరయే మిగుల కారణ
    మంచును భర్త బీపికిన్
    దార యెరంగి కారమును దక్కువ
    వేసియు చేసె శాకమున్
    వారము రోజులున్ దినగ భర్తకు
    తగ్గెను బీపి యించుకన్
    కారములేని కూర తిన కాంతుడు
    మెచ్చను భార్య నత్తరిన్

    రిప్లయితొలగించండి
  16. కం॥ భారమ్ము గాఁగ తినుటయుఁ
    గారము పతినోటిపూఁత కఠినము చేయన్
    మారుచు సతి వడ్డించఁగఁ
    గారము లేనట్టి కూరఁ గాంతుఁడు మెచ్చెన్

    ఉ॥ కారము నోటిపూఁతలను ఘాటుగ మార భుజించలేకనే
    కోరెను భార్యనిట్టులను గోమలి కారము మాని వండవో
    కోరిన రీతి భార్యయును గోరికఁ దీర్చఁగ వండెనట్టులన్
    గారము లేని కూర దిని కాంతుఁడు మెచ్చెను భార్యనిత్తరిన్

    ఇది గత 45 సం॥ గా నాస్వంత బాధ ప్రయోగశాలలో అపఘాతం తరువాత

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    నోరంతయు పొక్కినదని
    కారము తగ్గించమనుచు కాంతకు చెప్పన్
    దారయు సరి యని వండగ
    కారము లేనట్టి కూర, గాంతుడు మెచ్చెన్.

    రిప్లయితొలగించండి