14, జూన్ 2023, బుధవారం

సమస్య - 4449

15-6-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆపన్నుల బంధు వయ్యె నా రావణుడున్”
(లేదా...)
“ఆపద్బాంధవుఁ డన్న రావణుఁడె కాదా యెవ్విధిన్ గాంచినన్”

33 కామెంట్‌లు:

  1. ఆపగదౌష్ట్యమురాముఁడు
    నాపన్నులబంధువయ్యె, నారావణుడున్
    చూపెనుదోర్బలమంతట
    మోపెనుభూమినిబరువును మోదముచెదరన్

    రిప్లయితొలగించండి
  2. గోపాలుడు గిరినెత్తగ
    నాపన్నుల బంధు వయ్యె ; నా రావణుడున్
    నాపద గలిగించెనుగద
    నా పుత్తడిబొమ్మ సీత నపహరణజేయన్

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. అశోక వనములో సీతామాతతో రాక్షస స్త్రీలు:

      కందం
      నీ పతి రాముండడవుల
      కాపాడగలేని వాడు కంజదళాక్షీ!
      చేపడ నొప్పెడు వాడన
      నాపన్నుల బంధు వయ్యె నా రావణుడున్!

      శార్దూలవిక్రీడితము
      నీ పుణ్యాలయుఁడైన రాఘవుడు నెందేన్ గొప్ప? కోదండియై
      కాపాడన్ దగెనే? యరణ్యములఁ దా కారుణ్య హీనుండునై
      చేపట్టన్ దశకంఠు డొప్పు వినుమా! సీతా! మహాసాధ్విరో!
      యాపద్బాంధవుఁ డన్న రావణుఁడె కాదా యెవ్విధిన్ గాంచినన్!

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  4. శాపాంతర్గతబాధతోడుతనునాసాధకుండచ్చటన్
    సోపానంబగుసాధుమార్గమదిశోధింపగానొల్లమిన్
    చూపెన్వైరిగచేరమోక్షమునుశోకంబుకల్పించుచున్
    ఆపద్బాంధవుడన్నరావణుడెకాడాయెవ్విధిన్గాంచినన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడు పాదాలలోను గణభంగం. సవరించండి.

      తొలగించండి

  5. ( రావణుని ఆజ్ఞానుసారము రాక్షస స్త్రీ సీతతో దశకంఠుని గొప్పదనాన్ని చెబుతున్నట్లుగా నూహించి)


    ఆ పరమేశ్వర భక్తుం
    డాపేక్షగనిన్ను తెచ్చె యసురుండైనన్
    హే పడతీ విను మంటిని
    యాన్నుల బంధు వయ్యె నా రావణుడున్



    ద్రాపున్ మేటిగ గొల్చువాడతడు శాస్త్రాలెన్నొ తా నేర్చెనే
    నీపై మక్కువ గల్గి గాదె పడతీ నిన్ దెచ్చె తా మోహమున్
    కోపంబేలనె యాలకించుమిదియే క్రూరాత్ముడాతండుగా
    దాపద్బాంధవుఁ డన్న రావణుఁడె కాదా యెవ్విధిన్ గాంచినన్.

    రిప్లయితొలగించండి
  6. ప్రాపు గ నుండి యు దన నున్
    దాపు న రక్షింప నెంచు దన వారికి దా
    కాపాడ బూని సతతము
    నా పన్ను ల బంధు వ య్యె నా రావణు డున్

    రిప్లయితొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పాపాలన్ క్షతిజేసి భక్తులకు కాపౌ విష్ణువే చెప్పగా
    ఆపద్భాంధవుడన్న, రావణుడె కాదా యెవ్విధిన్ గాంచినన్
    పాపాత్ముండయి మోహభావమున జువ్వరించి భూపుత్రినిన్
    కాపట్యమ్మున దొంగిలించి హరిచే ఖండించగా చేడ్పడెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పాపాలన్ క్షతిజేసి భక్తులకు కాపౌ విష్ణువే చెప్పగా
      ఆపద్భాంధవుడన్న, రావణుడె కాదా యెవ్విధిన్ గాంచినన్
      పాపాత్ముండయి మోహభావమున తా పైకొంచు భూపుత్రినిన్
      కాపట్యమ్మున దొంగిలించి హరిచే ఖండించగా చేడ్పడెన్.

      తొలగించండి
    2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  8. సీతాదేవికి అశోకవాటికయందు రాక్షసస్త్రీల ఉద్బోధ:

    కోపంబేలను చూపెదో సుదతి నీకొప్పైన తోడై నినున్
    కాపాడందగువాడు రావణుఁడు సంకాశంబు కారెవ్వరున్
    నీపట్లన్ వశుఁడై నినున్ మనమునన్ నిల్పెన్ మహారాజ్ఞిగా
    ఆపద్బాంధవుఁ డన్న రావణుఁడె కాదా యెవ్విధిన్ గాంచినన్

    రిప్లయితొలగించండి
  9. ఆపాపాత్ముడు రాక్షసు
    డాపన్నుల బంధు వయ్యెనా? రావణుడున్
    జూపించునా కనికరము
    ఆపదపాల్జేయు దుష్టుడాపద్బంధా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కోపావేశము లోన ముక్కుచెవులన్ గోసెన్ గదా నాతికే
      పాపాత్ముండగు లక్ష్మణుండు ఖలుడై పాషాణ చిత్తంబుతో
      చూపెన్ ప్రేమను రావణుండు వెతతో శోకించు సైదోడుపై
      ఆపద్బాంధవుఁ డన్న రావణుఁడె కాదా యెవ్విధిన్ గాంచినన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  10. నీపాలిదైవమాతఁడు
    నీపై మరులనుగొనె ధరణీసుత నిన్నున్
    గాపాడ రాడు రాముం
    డాపన్నుల బంధు వయ్యె నా రావణుడున్

    రిప్లయితొలగించండి
  11. చూపుచు కరుణను రాముం
    *“డాపన్నుల బంధు వయ్యె, నా రావణుడున్”*
    పాపములొనరించితుదకు
    కోపాగ్నికి బలిగనయ్యెకువలయమందున్

    రిప్లయితొలగించండి
  12. కం॥ బాపురె యెటులఁ బలుకదగు
    నాపన్నుల బంధు వయ్యె నా రావణుఁడున్
    బాపి పర వనితలను మా
    యోపాయమునఁ గొని తెచ్చు యోగు కనంగా!

    శా॥ పాపాత్ముండు కనంగఁ దాపసులనే బాధించె నీధాత్రిలో
    ఆపేక్షా పరస్త్రీలపైఁ బలుకగా హాస్యాస్పదంబౌ కదా
    “ఆపద్బాంధవుఁ డన్న రావణుఁడే కాదా యెవ్విధిన్ గాంచినన్”
    ఏ పాపాత్ముఁడు పల్కు నిట్టులను నేనేరీతి నూఁకొట్టెదన్

    రిప్లయితొలగించండి
  13. ఆపాపాత్ముఁ డు, వల్గరి
    యాపన్నుల బంధువయ్యెనా? రావణుఁడున్
    బాపాత్ముఁడె,కాముకుఁడై
    యాపావని నపహరించె నదయను నరుఁడా!

    రిప్లయితొలగించండి
  14. పాపాత్ముండయి రావణుండిల కసిన్ భామామణిన్ సీతనున్
    రూపందాల్చుచు మాయ తాపసిగ గాలోచితంబొప్పయా
    పాపాత్ముండుస రాగబద్ధుఁడగుచున్ బాపంబుఁజేబూనుటన్
    ఆపద్బాంధవుఁ డన్న రావణుఁడె కాదే యెవ్విధిన్ గాంచినన్?

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    కాపాడి రాము డార్తుల
    నాపన్నుల బంధువయ్యె; నా రావణుడున్
    పాపపు కార్యమ్ము జరుప
    గా పరమపదించినాడు కదనమునందున్.

    రిప్లయితొలగించండి