8, జూన్ 2023, గురువారం

సమస్య - 4442

9-6-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జ్ఞాతివైరమ్ము కంటె శ్రేష్ఠమ్ము గలదె”
(లేదా...)
“జ్ఞాతివైరమె శ్రేష్ఠమందురు జ్ఞానులెల్లరు రూఢిగన్”

23 కామెంట్‌లు:

  1. కంటనెప్పుడునీర్ష్యయగానవచ్చు
    వెంటనుండియుగనిపెట్టువేల్పుగాగ
    తప్పుదెలుపుచుతానుగాజడుపునిచ్చు
    జ్ఞాతివైరమ్ముకంటెశ్రేష్ఠమ్ముగలదె

    రిప్లయితొలగించండి
  2. భోగ భాగ్యము కన్నను పుడమిలోన
    చెరిగి పోనిది యశమని యెఱగి నీవు
    బంధువులను ప్రేమ విడక వదలినట్టి
    జ్ఞాతివైరమ్ము కంటె, శ్రేష్ఠమ్ము గలదె,


    నీతిగల్గిన వారలెల్లరు నెయ్యమందు చరించినన్
    జాతి శ్రేయము వృద్ధినందెడు సాధనమ్మది యొక్కటే
    ప్రీతిభావము మామసమ్మున పెంచుకొంచును మానినన్
    జ్ఞాతివైరమె, శ్రేష్ఠమందురు జ్ఞానులెల్లరు రూఢిగన్,

    రిప్లయితొలగించండి
  3. నాతినిల్పిరికౌరవాదులునాథులందరిముందటన్
    నీతిదప్పిరిపంతమాడిరినేర్పుజూపగనంతలో
    లాతియైరిగధర్మమందునలావునిచ్చిరివైరికిన్
    జ్ఞాతివైరమెశ్రేష్ఠమందురుజ్ఞానులెల్లరురూఢిగన్

    రిప్లయితొలగించండి
  4. అన్న దమ్ములు బంధువు లాప్తు లనుచు
    సమత మమతల నెరిగియు సౌమ్యులగుచు
    విజ్ఞత ను గల్గి మసలుచు విడువవలెను
    జ్ఞాతి వైరమ్ము కంటె శ్రేష్ఠ మ్ము గలదె?

    రిప్లయితొలగించండి
  5. జ్ఞాతివైరమ్ము కంటె శ్రేష్ఠమ్ము గలదె
    యనెడి భావన ఈతర మందు దగ్గి
    యొకరికొకరు కలుపుకొని యుండ సాగె
    సాయపడకుండ జీవించ
    శక్య మగునె !

    రిప్లయితొలగించండి
  6. జ్ఞాతివైరము ముప్పని జ్ఞానమొసగు
    చరిత కోసమన్వేషణ సల్ప నేల
    సోదరా భారతమ్మున చూపబడిన
    జ్ఞాతివైరమ్ము కంటె శ్రేష్ఠమ్ము గలదె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నీతిమంతులు పాండు పుత్రులు నిశ్చయమ్ముగ గెల్చినన్
      జ్ఞాతివైరము నాశ మేనను జ్ఞానబోధను చేయగా
      భ్రాత పుత్రుల సంప్రహారము భారతమ్మున దృశ్యమౌ
      జ్ఞాతివైరమె శ్రేష్ఠమందురు జ్ఞానులెల్లరు రూఢిగన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  7. భాతిగా నొక గ్రామమందున భాగ్యవంతులు దాయలే
    ఖ్యాతిగాంచిరి దానధర్మములందు రెండు కుటుంబముల్
    రీతిఁ జూడఁగ వైరమేదియు లేదు, దానగుణమ్మునన్
    జ్ఞాతివైరమె శ్రేష్ఠమందురు జ్ఞానులెల్లరు రూఢిగన్

    రిప్లయితొలగించండి
  8. దాయలిర్వురు శ్రేష్ఠులు దానమందు
    వైరమన్నది కానదు వారియందు
    దానధర్మములందు తథ్యమ్ముగాను
    జ్ఞాతివైరమ్ము కంటె శ్రేష్ఠమ్ము గలదె

    రిప్లయితొలగించండి
  9. తల్లి దండ్రులకిలతీర దసలుదిగులు
    బాల్య స్నేహము దల్చుచు బాధలు వడు
    ఉన్నత కుటుంబ విలువను మన్నుగూల్చ
    జ్ఞాతి వైరమ్ము కంటె శ్రేష్ఠమ్ము గలదె

    రిప్లయితొలగించండి

  10. తే॥ కనఁగఁ బ్రక్క గృహమునందు జ్ఞాతి యున్న
    పోటి తత్వము విరియద సాటి వారి
    కన్న ధరణిని బ్రతుకఁగ మిన్న గాను
    జ్ఞాతి వైరము కంటె శ్రేష్ఠమ్ము గలదె

    (క కు జ్ఞ తో యతి చెల్లుతుందని చదివినానండి)

    మత్త॥నీతి బాహ్యులు కాని వారలు నెమ్మదస్తులు నైనచో
    ప్రీతియున్నను స్ఫర్ద తోడను వృద్ధి చెందఁగ మిన్నగన్
    రీతిఁ దప్పక పోట్ల గిత్తల రీతిఁ బోరుచు నున్నచో
    జ్ఞాతి వైరమె శ్రేష్ఠమందురు జ్ఞానులెల్లరు రూఢిగన్

    (ఇది సర్వ సాధరణమే నండి)

    రిప్లయితొలగించండి
  11. నీతి వీడుచు మంచి కార్యము నిల్వరించ సగోత్రులే
    ఖ్యాతి పెంచగ స్వీయ వంశము కాంక్ష హెచ్చ మనస్సులో
    భాతి గూర్చగ గ్రామమందున పావనమ్మగు రీతిగా
    జ్ఞాతివైరమె శ్రేష్ఠమందురు జ్ఞానులెల్లరు రూఢిగన్

    రిప్లయితొలగించండి
  12. తేటగీతి
    తమ్ముఁడైన విభీషణున్ దాటినంత
    రావణుండని గూలెను, రాముఁడణచఁ
    ప్రక్క సౌమిత్రియుండగ, వర్జితమగు
    జ్ఞాతివైరమ్ము కంటె శ్రేష్ఠమ్ము గలదె

    మత్తకోకిల
    భ్రాత శ్రేయము గూర్చ నెంచిన రావణుండది మీరుచున్
    వ్రాత దప్పక నేలగూలెను రామలక్ష్మణ సఖ్యమై
    వాతఁ బెట్టుచు నాశమెంచఁగ వర్జితమ్మన వీడఁగన్
    జ్ఞాతివైరమె శ్రేష్ఠమందురు జ్ఞానులెల్లరు రూఢిగన్

    రిప్లయితొలగించండి
  13. నీతి వీడియుపాండవేయుల
    నీచ కౌరవ బృందమున్
    పాతి పెట్టియు ప్రేమబంధము
    పంపిరప్పుడు గానకున్
    నీతిమంతులు గడ్పికాలము
    నిక్కమౌ తమ పాలునున్
    దూతనంపియు భాగమడ్గిన
    ధూర్తులున్ విననప్పుడున్
    జ్ఞాతివైరమె శ్రేష్ఠ మందురు
    జ్ఞాను లెల్లరు రూఢిగన్

    రిప్లయితొలగించండి
  14. అన్నదమ్ముల మధ్యన నగ్గిపెట్టు
    జ్ఞాతివైరమ్ము,కంటె శ్రేష్టమ్ము కలదె
    జ్ఞాతులనడుమకూర్చుచు చక్కనైన
    చెలిమిపొందుచానందముజీవితమున

    రిప్లయితొలగించండి