28, జూన్ 2023, బుధవారం

సమస్య - 4461

29-6-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శకునిగ రాఘవుని మునులు శ్లాఘింతు రహో”
(లేదా...)
“శకునిగ వీరరాఘవుని సన్నుతి చేసెద రెల్ల సాధువుల్”

35 కామెంట్‌లు:

  1. కందం
    అకలంకుండుగ కౌశికు
    నకుఁ దోడుండి క్రతువుఁదగ నర్మిలి గాచన్
    నికరంపు దుష్ట జన నా
    శకునిగ రాఘవుని మునులు శ్లాఘింతు రహో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంపకమాల
      ముకులిత హస్తసంగతిని మ్రొక్కుచు కౌశికు యాగరక్షకై
      వికసిత వక్త్రుఁడై గదలి విల్లుధరించియు నుగ్రుడౌచుఁ దా
      టక రుధిరమ్ము గ్రక్కుచుఁ బడన్క్రతువెల్లను గాచ దుష్ట నా
      శకునిగ వీరరాఘవుని సన్నుతి చేసెద రెల్ల సాధువుల్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. వికలపు రక్క స యూధ ము
    లక లంకపు చేష్ట లన్ని యణ చ గ బూనన్ ప్రకటించి రయ్యె డ న్నా
    శకుని గ. రాఘవుని మునులు శ్లా ఘి o తు రహో!

    రిప్లయితొలగించండి
  3. సకలగుణాభిరామునిగమ్మతినందుచులోకమందుతా
    నొకటిగబాణమున్విడచినుగ్గునుజేసెగరావణాదులన్
    ముకుళితహస్తులైముదముమోమునవెల్గగలోకదుష్టనా
    శకునిగవీరరాఘవునిసన్నుతిజేసెదరెల్లసాధువుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      "రామునిగ సమ్మతి... జేసెను రావణాదులన్"

      తొలగించండి
  4. మకుటము దాల్చెను రాముడు
    యిక ధర్మము నిల్పు జగతి నితడు సరిగదా
    సకల జనులకు దిశా ద
    ర్శకునిగ రాఘవుని మునులు శ్లాఘింతు రహో”

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రాముడు + ఇక' అన్నపుడు యడాగమం రాదు. "రాముం డిక" అనండి.

      తొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  6. నికరపు యజ్ఞ యాగములు నిత్యము
    ధ్వంసము సేయు తాటకన్
    సకల గుణోన్నతుండు గడు సంయమ
    శీలుడు గుర్వుయాజ్ఞచే
    చకచక వేసి బాణములు సంపియు
    యాగముగాచె ధూర్త నా
    శకునిగ వీరరాఘవును సన్నతి
    జేసెద రెల్ల సాధువుల్.

    రిప్లయితొలగించండి
  7. వికచాబ్జ పత్ర నేత్రుడు
    సకల జనారాధ్యుడతడు సద్గుణ శీలుం
    డకలంకుడు శత్రువినా
    శకునిగ రాఘవుని మునులు శ్లాఘింతు రహో.


    సకల జనాభి వంద్యుడగు జానకి మానస చోరుడాతడే
    ముకుళిత హస్తుడై వినయమున్ గురిపించు వినమ్రుడై సదా
    వికసిత మందహాసమును వీడని విజ్ఞుడె యైన దుష్ట నా
    శకునిగ వీరరాఘవుని సన్నుతి చేసెద రెల్ల సాధువుల్.

    రిప్లయితొలగించండి
  8. చకచక శరములు విడువన్
    సుకుమారుడు కాదు మిగుల సునిశిత శరుడే
    వికృత భటులపై నావే
    శకునిగ రాఘవుని మునులు శ్లాఘింతు రహో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చకచక బాణముల్ విడిచి శక్తిని చూపుచు రామచంద్రుడే
      వికృత నిశావిహారులను వెన్నడి చంపగ యాగరక్ష కా
      రకుడగు శూరునిన్ సకల రాక్షస దుర్మద వర్తనావినా
      శకునిగ వీరరాఘవుని సన్నుతి చేసెద రెల్ల సాధువుల్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  9. శకుని కురువంశ క్షయమును,
    కికురించి రఘుపతి కపిని గిట్టిం చుటయున్
    సకటుల శిక్షిం చుటయే
    శకునిగ రాఘవుని మునులు శ్లాఘింతు రహో

    రిప్లయితొలగించండి
  10. సకి తాటకిని వధించెను
    కికురించి రఘుపతి కపిని గిట్టిం చెనుగా!
    సకటుల నిలపయి న వినా
    శకునిగ రాఘవుని మునులు శ్లాఘింతు రహో

    రిప్లయితొలగించండి
  11. సకల గుణాభిరామునిగ సాధుజనావళి రక్షకుండుగా
    వికచ సరోజనేత్రునిగ వీరవరేణ్యునిగా దురంబునన్
    వికలమొనర్చి రక్కసుల  వేసటనొందగ జేయు శత్రునా
    శకునిగ వీరరాఘవుని సన్నుతి చేసెద రెల్ల సాధువుల్

    రిప్లయితొలగించండి
  12. సకలసుగుణములరాశిగ
    నకలంకునిగా సుజనులకాత్మీయునిగా
    వికలమొనర్చు యసుర నా
    శకునిగ రాఘవుని మునులు శ్లాఘింతు రహో

    రిప్లయితొలగించండి
  13. చం.

    సకల మనుష్య గోచరము చక్కని రాముని ధర్మ మార్గమున్
    బ్రకటన వ్యాస వాల్మికి సబామగు గ్రంథములే నిమిత్తముల్
    మకుటముగా దలంచి, మది మందిరమందు వికుంఠవాసి, యం
    *శకునిగ వీరరాఘవుని సన్నుతి చేసెద రెల్ల సాధువుల్.*

    రిప్లయితొలగించండి
  14. సుకమునొసంగుచున్ బ్రజల శోకము బాపగఁ బుట్టెమర్త్యుడై
    సకలజగమ్ములన్ నిలుపు చక్రధరుండిల రామభద్రుడై
    మకిల మనస్కులై భువినమానుషులైచను దైత్యవంశనా
    శకునిగ వీరరాఘవుని సన్నుతి చేసిరి సాధుపుంగవుల్
    అసనారె

    రిప్లయితొలగించండి
  15. కం॥ అకళంక ధర్మ నిరతుఁడు
    సకల సుగుణ భూషితుండు శౌరి ధరణిలో
    సకల నిశాచర గణనా
    శకునిగ రాఘవుని మునులు శ్లాఘించిరహో

    చం॥ వికలము కాదు మానసము వేడిన వారలఁ బ్రోచి కావఁగన్
    సకలము ధర్మ రక్షణకు శౌర్యము నిల్పుచుఁ జేయు నెప్పుడున్
    సకల నిశాచరాధముల సంహరణమ్మును జేయు దైత్యనా
    శకునిగ వీర రాఘవుని సన్నుతి చేసెద రెల్ల సాధువుల్

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    అకళంక చరితు డాతడు
    సకలజనుల రక్ష సేయు స్వామియెయనుచున్
    నికముగ దానవ కుల నా
    శకునిగ రాఘవుని మునులు శ్లాఘింతురహో!

    రిప్లయితొలగించండి
  17. అకళంకచరితుడనుచును
    సకలజనాళినిల బ్రోచు స్వామియటంచున్
    ప్రకటిత దురితాళివినా
    శకునిగరాఘవునిమునులు శ్లాఘింతురహో


    రిప్లయితొలగించండి