17-6-2023 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“నా యాలి నంపుచుంటి నేలుకొనుము”(లేదా...)“నా యాలినిఁ బంపుచుంటి నిఁక హాయిగ నేలుకొనంగ మెచ్చెదన్”(ఛందోగోపనము)
హరిశ్చంద్రుడు తన భార్యయైన చంద్రమతిని బ్రాహ్మణులకు అప్పజెప్పుసందర్భముమేలునుగోరుచుండుమదిమెచ్చినసద్గుణశోభితాంగియైపాలనునీరువోలెఘనభావనసేయగశోభితాంగియైపాలనసేయసత్యమునుపంపుచునుంటినిదీనురాలునాయాలినిబంపుచుంటినిఁకహాయిగనేలుకొనంగమెచ్చెదన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములండిగురువుగారు
పాలనునీరువోలెఘనభావనసేయగగేహమందునన్
అలిగి వెడలె ననుచు నాగ్రహింపగనేలతప్పు జేయనేమి తనకు నీవెదిక్కటంచు తెలిపి తిరిగి నీ సుతులనాయాలి నంపుచుంటి నేలుకొనుము.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చేలము గోరినన్ గొనక చిందులు త్రొక్కితి వంచు కొడ్కుతో బేలయె చేరె నిచ్చటకు వేదన చెందుచు నోయి యల్లుడా చాలిక పంతమంచును ప్రసత్వరి చెప్పుచు నందనుండనా యాలినిఁ బంపుచుంటి నిఁక హాయిగ నేలుకొనంగ మెచ్చెదన్. నందనుండను+ ఆ = నందనుండనా
ఆటవెలదిమంచినెంచ పతికి మండోదరి కలలోరాముఁ బ్రణుతిఁ జేసి రావణుఁడనె"మతిచెడి కుజఁగొంటి మన్నింపఁగ తగనా?యాలి నంపు చుంటి నేలుకొనుము"ఉత్పలమాలఆలకిగా మనన్ మయ సుతాంగనకిష్టము లేక భర్తతోకూలక యుండ జాతి కుజఁ గూర్చుము రాముని కం"చనెన్, గలన్మేలుగ రావణుండనియె మీరక "రామ! క్షమింప నొప్పనా!యాలినిఁ బంపుచుంటి నిఁక హాయిగ నేలుకొనంగ మెచ్చెదన్"
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
పూలవనాంతరంబునను మోదముతో నడయాడు నాసతిన్జాలిసుమంతలేక మది సత్యముబాలనజేయ నమ్మితిన్లాలితమైన కోమలి సులక్షణసద్గుణ సన్నుతాంగి నాయాలిని బంపుచుంటి నిక హాయిగనేలుకొనంగ మెచ్చెదన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. 'జాలి + ఇసుమంత' అన్నపుడు సంధి లేదు. "జాలియె సుంత లేక" అనండి.
పేరు మోసి నట్టి. పెను వంశ మందునబుట్టి నాడ వీవు పుణ్య శీలియల్లుడవయి మిగుల నమిత య శో ధ నా!యాలి నంపు చుంటి నే లు కొనుము
ఒక యువరాణి వేరొక రాకుమారునితో పల్కిన మాటలు...నాకునచ్చినచెలి నాశించి మనువాడమోజుపడితివోయి మోహనాంగతనను సంప్రదించి తానొప్పుకొనగ నా యాలి నంపుచుంటి నేలుకొనుముమేలిమి వన్నెఛాయగల మెల్తుక గోచరమైనవేళ నామేలిసఖిన్ హుటాహుటిన మెచ్చిన వాడవు సిశ్చయమ్ముగాబాలికయైననాచెలిని భార్యగ చేకొన నెంచినావు నా యాలినిఁ బంపుచుంటి నిఁక హాయిగ నేలుకొనంగ మెచ్చెదన్[ఆలి - చెలికత్తె]
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. వృత్తంలో "హుటాహుటిని" అనండి. 'నిశ్చయమ్ముగా' టైపాటు.
మేలిమి వన్నెఛాయగల మెల్తుక గోచరమైనవేళ నామేలిసఖిన్ హుటాహుటిని మెచ్చిన వాడవు నిశ్చయమ్ముగాబాలికయైననాచెలిని భార్యగ చేకొన నెంచినావు నా యాలినిఁ బంపుచుంటి నిఁక హాయిగ నేలుకొనంగ మెచ్చెదన్
కాపురమ్మునందు కలతలు సాజముసర్దుకొనఁగ నన్ని చక్కబడునుగతము తవ్వుకొనిన గాయమ్ము మానునాయాలి నంపుచుంటి నేలుకొనుము
ఎవ్వడైన గాని యెదవడుచుండి “నా యాలి నంపుచుంటి నేలుకొనుము”ననుచు పలుకుట గన నతిగ బాధ బడుచు వాని పాటు బోవ వలచు చుంటి
జాలియొకింత బూనక నసత్యపు మాటలు నమ్మి యిట్లునీయాలిని పుట్టినింటి కడకంపుట దమ్మమె స్వచ్ఛమైన యిల్లాలిని నాదు పుత్రినిటు లారడి పెట్టగనేల నాయనాయాలినిఁ బంపుచుంటి నిఁక హాయిగ నేలుకొనంగ మెచ్చెదన్
ఆ॥ భార్య చనఁగ రోసి భర్త రీతి పడకఁబుట్టినింటి వారు బుద్ధిఁ గరపియామెను మరలించి యనె మామ నాయనాయాలు నంపుచుంటి నేలుకొనుముఉ॥ ఆలముఁ జేసి భార్యచన హాయి యటంచును బుట్టినింటికిన్మేలగు నీతి సూత్రముల మిక్కిలి బాధగ నేర్పెఁ దల్లియున్వీలును జూచి పంపుచును బ్రేమగ నల్లుని వేడె నాయనాయాలిని పంపుచుంటి నిఁక హాయిగ నేలుకొనంగ మెచ్చెదన్
త్రాగు బోతు తప్ప త్రాగి,యనెనిటునా యాలి నంపు చుంటి నేలుకొనుము మైక ముండు వరకు మాటలా డచునుండు పిచ్చ పిచ్చ గాను భీతి లేక
ఫాలసుఁడాడె మిత్రునికి భారము గాగను గల్గు చుంట నా యాలినిఁ బంపుచుంటి నిఁక హాయిగ నేలుకొనంగ మెచ్చెదన్ మేలపు మాటగాఁదలఁచి 'మీరుదు వేమిర సత్యమియ్య దే కాలము మారె నందురిల కాలము కాదుర, మారె భూజనుల్
ఆ: ఆలుమగల వాదమమితమై పోయెనునచ్చజెప్ప గలిగి నాను తనకుకలిసి మెలిసి మీరిక బ్రదుక వలయునాయాలి నంపుచుంటి నేలుకొనుము
కోరి వలచి పిదప కూర్మితోడవివాహమాడి మరలి వత్తుననుచు సాగితీవు వెదికి కొనుచు నిచటికేతెంచి నాయాలి నంపు చుంటి నేలుకొనము
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. (మామ అల్లుడికి పంపిన సందేశం..)తాను చిన్నపిల్ల తప్పు చేసినదేమొ యింత పెద్ద శిక్ష యేలనయ్య?సఖ్యత కలిగించ సహచరి తోడ నాయాలి నంపుచుంటి నేలుమయ్య.
హరిశ్చంద్రుడు తన భార్యయైన చంద్రమతిని బ్రాహ్మణులకు అప్పజెప్పుసందర్భము
రిప్లయితొలగించండిమేలునుగోరుచుండుమదిమెచ్చినసద్గుణశోభితాంగియై
పాలనునీరువోలెఘనభావనసేయగశోభితాంగియై
పాలనసేయసత్యమునుపంపుచునుంటినిదీనురాలునా
యాలినిబంపుచుంటినిఁకహాయిగనేలుకొనంగమెచ్చెదన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములండిగురువుగారు
తొలగించండిపాలనునీరువోలెఘనభావనసేయగగేహమందునన్
రిప్లయితొలగించండిఅలిగి వెడలె ననుచు నాగ్రహింపగనేల
రిప్లయితొలగించండితప్పు జేయనేమి తనకు నీవె
దిక్కటంచు తెలిపి తిరిగి నీ సుతులనా
యాలి నంపుచుంటి నేలుకొనుము.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచేలము గోరినన్ గొనక చిందులు త్రొక్కితి వంచు కొడ్కుతో
రిప్లయితొలగించండిబేలయె చేరె నిచ్చటకు వేదన చెందుచు నోయి యల్లుడా
చాలిక పంతమంచును ప్రసత్వరి చెప్పుచు నందనుండనా
యాలినిఁ బంపుచుంటి నిఁక హాయిగ నేలుకొనంగ మెచ్చెదన్.
నందనుండను+ ఆ = నందనుండనా
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండిమంచినెంచ పతికి మండోదరి కలలో
రాముఁ బ్రణుతిఁ జేసి రావణుఁడనె
"మతిచెడి కుజఁగొంటి మన్నింపఁగ తగనా?
యాలి నంపు చుంటి నేలుకొనుము"
ఉత్పలమాల
ఆలకిగా మనన్ మయ సుతాంగనకిష్టము లేక భర్తతో
కూలక యుండ జాతి కుజఁ గూర్చుము రాముని కం"చనెన్, గలన్
మేలుగ రావణుండనియె మీరక "రామ! క్షమింప నొప్పనా!
యాలినిఁ బంపుచుంటి నిఁక హాయిగ నేలుకొనంగ మెచ్చెదన్"
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిపూలవనాంతరంబునను మోద
రిప్లయితొలగించండిముతో నడయాడు నాసతిన్
జాలిసుమంతలేక మది సత్యము
బాలనజేయ నమ్మితిన్
లాలితమైన కోమలి సులక్షణ
సద్గుణ సన్నుతాంగి నా
యాలిని బంపుచుంటి నిక హాయిగ
నేలుకొనంగ మెచ్చెదన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'జాలి + ఇసుమంత' అన్నపుడు సంధి లేదు. "జాలియె సుంత లేక" అనండి.
పేరు మోసి నట్టి. పెను వంశ మందున
రిప్లయితొలగించండిబుట్టి నాడ వీవు పుణ్య శీలి
యల్లుడవయి మిగుల నమిత య శో ధ నా!
యాలి నంపు చుంటి నే లు కొనుము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఒక యువరాణి వేరొక రాకుమారునితో పల్కిన మాటలు...
రిప్లయితొలగించండినాకునచ్చినచెలి నాశించి మనువాడ
మోజుపడితివోయి మోహనాంగ
తనను సంప్రదించి తానొప్పుకొనగ నా
యాలి నంపుచుంటి నేలుకొనుము
మేలిమి వన్నెఛాయగల మెల్తుక గోచరమైనవేళ నా
మేలిసఖిన్ హుటాహుటిన మెచ్చిన వాడవు సిశ్చయమ్ముగా
బాలికయైననాచెలిని భార్యగ చేకొన నెంచినావు నా
యాలినిఁ బంపుచుంటి నిఁక హాయిగ నేలుకొనంగ మెచ్చెదన్
[ఆలి - చెలికత్తె]
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండివృత్తంలో "హుటాహుటిని" అనండి. 'నిశ్చయమ్ముగా' టైపాటు.
మేలిమి వన్నెఛాయగల మెల్తుక గోచరమైనవేళ నా
తొలగించండిమేలిసఖిన్ హుటాహుటిని మెచ్చిన వాడవు నిశ్చయమ్ముగా
బాలికయైననాచెలిని భార్యగ చేకొన నెంచినావు నా
యాలినిఁ బంపుచుంటి నిఁక హాయిగ నేలుకొనంగ మెచ్చెదన్
కాపురమ్మునందు కలతలు సాజము
రిప్లయితొలగించండిసర్దుకొనఁగ నన్ని చక్కబడును
గతము తవ్వుకొనిన గాయమ్ము మానునా
యాలి నంపుచుంటి నేలుకొనుము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఎవ్వడైన గాని యెదవడుచుండి “నా
రిప్లయితొలగించండియాలి నంపుచుంటి నేలుకొనుము”
ననుచు పలుకుట గన నతిగ బాధ బడుచు
వాని పాటు బోవ వలచు చుంటి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిజాలియొకింత బూనక నసత్యపు మాటలు నమ్మి యిట్లునీ
రిప్లయితొలగించండియాలిని పుట్టినింటి కడకంపుట దమ్మమె స్వచ్ఛమైన యి
ల్లాలిని నాదు పుత్రినిటు లారడి పెట్టగనేల నాయనా
యాలినిఁ బంపుచుంటి నిఁక హాయిగ నేలుకొనంగ మెచ్చెదన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఆ॥ భార్య చనఁగ రోసి భర్త రీతి పడకఁ
రిప్లయితొలగించండిబుట్టినింటి వారు బుద్ధిఁ గరపి
యామెను మరలించి యనె మామ నాయనా
యాలు నంపుచుంటి నేలుకొనుము
ఉ॥ ఆలముఁ జేసి భార్యచన హాయి యటంచును బుట్టినింటికిన్
మేలగు నీతి సూత్రముల మిక్కిలి బాధగ నేర్పెఁ దల్లియున్
వీలును జూచి పంపుచును బ్రేమగ నల్లుని వేడె నాయనా
యాలిని పంపుచుంటి నిఁక హాయిగ నేలుకొనంగ మెచ్చెదన్
త్రాగు బోతు తప్ప త్రాగి,యనెనిటునా
రిప్లయితొలగించండియాలి నంపు చుంటి నేలుకొనుము
మైక ముండు వరకు మాటలా డచునుండు
పిచ్చ పిచ్చ గాను భీతి లేక
ఫాలసుఁడాడె మిత్రునికి భారము గాగను గల్గు చుంట నా
రిప్లయితొలగించండియాలినిఁ బంపుచుంటి నిఁక హాయిగ నేలుకొనంగ మెచ్చెదన్
మేలపు మాటగాఁదలఁచి 'మీరుదు వేమిర సత్యమియ్య దే
కాలము మారె నందురిల కాలము కాదుర, మారె భూజనుల్
ఆ:
రిప్లయితొలగించండిఆలుమగల వాదమమితమై పోయెను
నచ్చజెప్ప గలిగి నాను తనకు
కలిసి మెలిసి మీరిక బ్రదుక వలయునా
యాలి నంపుచుంటి నేలుకొనుము
కోరి వలచి పిదప కూర్మితోడవివాహ
రిప్లయితొలగించండిమాడి మరలి వత్తుననుచు సాగి
తీవు వెదికి కొనుచు నిచటికేతెంచి నా
యాలి నంపు చుంటి నేలుకొనము
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
(మామ అల్లుడికి పంపిన సందేశం..)
తాను చిన్నపిల్ల తప్పు చేసినదేమొ
యింత పెద్ద శిక్ష యేలనయ్య?
సఖ్యత కలిగించ సహచరి తోడ నా
యాలి నంపుచుంటి నేలుమయ్య.