7, జూన్ 2023, బుధవారం

నిషిద్ధాక్షరి - 55

8-6-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఇ-ఈ లు, వాటితో కూడిన హల్లులను ప్రయోగించకుండా
రోహిణి కార్తెకు వీడ్కోలు పలుకుతూ
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

15 కామెంట్‌లు:

  1. నిషిద్ధాక్షరి
    హాహాయనగనుమేఘము
    నోహోయనగనుమనుజుడునుల్లమునందున్
    కాహళమ్రోయగజగమున
    ఆహాచంద్రుడుతడబడనరుగుముమాతా

    రిప్లయితొలగించండి
  2. బాధ పడెను గార్తె తో బహుళ ముగను
    వెడలు చున్నట్లు దె లియ గా పెద్ద గాను
    హర్ష మొదవెను జనత యనంత ముగను
    పలు రకాలు గ బొందె ను పరమ సుఖము

    రిప్లయితొలగించండి

  3. భగభగ యెండలతోడను
    జగద్వహను బాధపెట్టు శకటమ నేడే
    బగళమగు వేళ జేరగ
    వగచుచు పొమ్మంచు తెలుప బాధయె హెచ్ఛెన్.

    రిప్లయితొలగించండి
  4. తే. గీ.

    చంద్రునకు స్నేహ పూర్ణపు జన్య భార్య,
    పేరుతో కార్తె యంతము పెంపు గాదు
    గడువు నందు మానవులకు గడ్డు హదను
    చల్లబడుటకై నుతులను జనులు సేయ.

    రిప్లయితొలగించండి
  5. జ్యేష్ట మాసాన జనులెల్ల చేష్టలుడుగ
    కాళ్ళు కాలును కనుగొన రోళ్ళు పగులు
    మండుటెండలకార్తెకు మంగళమ్ము
    పలుక మానసముప్పొంగె పరవశాన

    రిప్లయితొలగించండి
  6. కందం
    ఆలుగ చంద్రయ్య కమర
    చాలగ సుఖమొసఁగు కార్తె సమకూర్చుననన్
    తాలక యుండెడు నెండల
    ప్రేలగ జేయంగ, నీవు వెల్లగ దలుతున్

    రిప్లయితొలగించండి
  7. ఎండకాల మందున కాక యెక్కువయ్యె
    రాళ్ళు కూడ బగులు గత్తెర మొద లయ్యె ,
    దనువు దాపమునకు డస్సె , దాళజాల
    వేడుకొందు నుష్ణము వేగ వెడలునటుల

    రిప్లయితొలగించండి
  8. శకటాహ్వ కార్తె జేసెను
    సకలజనులు వసుధయందు సతమతమొందన్
    శుక కలఘోషము లలసెను
    శకటమ గోరెద సెలవును చాలు మరలుమా

    రిప్లయితొలగించండి
  9. కం.
    వచ్చెను ఋతుపవనమ్ములు,
    తెచ్చుచు జల్లుల వరములు దేశమునందున్!
    నచ్చెడు చోటుకు మరలవె
    మచ్చుకు వదలక గురుతులు, మండెడు కార్తే!

    రిప్లయితొలగించండి
  10. రోళ్ళనుఁ బగుల గొట్టెడు త్రుళ్ళుపోతు
    వదలు చుండ, కరము సౌఖ్య మొదవ ప్రజకు
    వచ్చు చుండె రయమ్మున వర్ష ఋతువు
    కర్షకుల హృదయమ్ముల హర్ష మడర

    రిప్లయితొలగించండి
  11. తే॥ కణకణమను యెండలు మండు కార్తె వెడలు
    మమ్మ భూమాత తాపము నణఁగు నమ్మ
    వర్ష మేఘములు వెలయ కర్షకులకు
    కార్యములును బ్రారంభము కాఁగ వెడలు

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    భగభగ మనుచు నెండలు సెగలు గ్రక్క
    భయపడుచునుండె మనుజులున్ బయటకేగ
    తాళలేకున్న జనులపై దయను జూపు
    మమ్మ నాల్గవ నక్షత్రమా! వెడలుచు
    వర్ష ఋతువును పంపుము హర్షమొదవ.

    రిప్లయితొలగించండి
  13. ఎండలుహెచ్చెనుగనుమా
    బండలుకూడా ఫటఫట పగులుచునుండెన్
    మెండగుఎండలుకాయగ
    గుండెలయందునగుబులునుగుబగుబలాడెన్

    రిప్లయితొలగించండి