5, జూన్ 2023, సోమవారం

సమస్య - 4440

6-6-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అడిగినది లేదనెడివాఁడె యగును దాత”
(లేదా...)
“అడిగిన దేది లేదనుచు నవ్వలఁ ద్రోసెడివాఁడె దాతయౌ”

19 కామెంట్‌లు:

  1. కార్యసాఫల్యమెంచుచుకాసులడుగ
    నీతిదప్పకతానుగానేర్పుతోడ
    నిబ్బరంబుగపౌరుడునిలువజగతి
    అడిగినదిలేదనెడివాడెయగునుదాత

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    బ్రతుకునందున కలతలు పట్టు దప్పి
    ఆత్మహత్యకు నెంచిన నార్తుఁడొకఁడు
    మందులంగడినిన్ విషమంద నడుగ
    నడిగినది లేదనెడివాఁడె యగును దాత

    చంపకమాల
    తడబడు జీవితాన కడు దారుణముల్ బొడజూపి చింతలున్
    విడవడ వన్న పోకడను వేదన నింపగ నోర్వలేననన్
    వడివడి మందులంగడిని బ్రాణము దీయు విషమ్ము గోరగా
    నడిగిన దేది లేదనుచు నవ్వలఁ ద్రోసెడివాఁడె దాతయౌ

    (దాత : ప్రాణదాత యను భావము)

    రిప్లయితొలగించండి
  3. తడబడిలంచమీయడుగతాల్మినిదాల్చునుకష్టమందునన్
    విడివడడెప్పుడున్ఘనుడువిజ్ఞతతోడుతనిల్పుధర్మమున్
    కడిగినముత్యమట్టులనుకల్మషమంటకగాచులోకమున్
    అడిగినదేదిలేదనుచునవ్వలద్రోసెడివాడెదాతయౌ

    రిప్లయితొలగించండి
  4. ధనమె ముఖ్యమని తలచు మను జు డిలను
    తాను గుడువడొ సంగడు త్యాగమునను
    లోభి యగు వా డె టు లగును లోక మందు
    నడిగినది లేదనె డి వాడు యగును దాత?

    రిప్లయితొలగించండి
  5. ఆటవెలది
    అగును లోభి"యడిగినది లేదనెడి వాఁడె;
    యగును దాత"యేది యడిగిన నది
    లేదు లేదనకయె మోదముతోఁగడు
    మెచ్చుకొనుచు నర్థికిచ్చు వాఁడె.

    రిప్లయితొలగించండి

  6. దానవారాతి వాడంచు దానమిడుట
    మాను మనిచెప్పుట తగదు మాన్యులకును
    దాన మొసగుటె యుక్తంబు దాతకంటి
    అడిగినది లేదనెడివాఁడె యగును దాత?



    వడుగడు కాదువామనుడు బభ్రువు కూడదు దానమంచు శు
    క్రుడనగ మందహాసమున కోరిన దెవ్వడటంచు గాక నా
    తడడిగి నట్టిదిచ్చుటదె ధర్మము దాతకటంచు నందురే !
    యడిగిన దేది లేదనుచు నవ్వలఁ ద్రోసెడివాఁడె దాతయౌ?

    రిప్లయితొలగించండి
  7. దాత పాత్రత జూడక దానమిడిన
    వ్యర్థమేగాక దానమనర్థమగును
    వ్యసనపరుడుదానముఁగోరి వచ్చినపుడు
    అడిగినది లేదనెడివాఁడె యగును దాత

    రిప్లయితొలగించండి
  8. సఖుడనియవసరార్థముసాయమడుగ
    నడిగినది లేదనెడి వాడె:నగును:దాత
    నడుగకున్ననునవసరమరయుచుమది
    ప్రతిఫలమ్మునాశింపనివాడెసుమ్మి



    రిప్లయితొలగించండి
  9. శరణు గోరు పావురమును సడల మనుచు
    టెక్కు జూపుచు రాజును డేగ కోర ,
    నడిగినది లేదనెడివాఁడె యగును దాత
    శిబి ; యతనికి సాటి కలడె స్థిర పయిన ?

    రిప్లయితొలగించండి
  10. నిండు పుటల ప్రకటనలు నేతలిడగ
    నివ్వెరపడరా పౌరులు నిశ్చయముగ
    ప్రాకటంబుగ కనుగొన వచ్చునిచట
    నడిగినది లేదనెడివాఁడె యగును దాత

    చిడిముడి లేకపల్కుదురు చెల్లని మాటలు మిక్కుటంబుగా
    విడిచిన సిగ్గుతో నలరి వెల్లడి సేతురసత్యమెంతయో
    నడుకొన నిత్తురే ప్రకటనల్ తమ పత్రికలందుసర్వదా
    యడిగిన దేది లేదనుచు నవ్వలఁ ద్రోసెడివాఁడె దాతయౌ

    రిప్లయితొలగించండి
  11. అడిగినవారికెల్లరకు నర్హతఁ జూడక దానమిచ్చుచున్
    వడివడి యాస్తులమ్ముకొని బాధలనొందఁగనేమి లగ్గు? యే
    చిడిముడిపాటులేక పరిశీలనజేసి యపాత్రమైనచో
    నడిగిన దేది లేదనుచు నవ్వలఁ ద్రోసెడివాఁడె దాతయౌ

    రిప్లయితొలగించండి
  12. తే॥ ప్రభుత యుచితముల నొసఁగఁ బనులు మాని
    దురలవాట్లకు బానిసై తుదకు బ్రదుకు
    గతిని దప్పఁగ నప్పుల నతిగ కోర
    నడిగినది లేదనెడి వాఁడె యగును దాత

    చం॥ అడగకనున్న నందరికి యంపక మిచ్చుచు నేఁడు పాలకుల్
    నడవడి మార్చి యిట్టులను నాఁటగ సోమరి తత్వమున్ గనన్
    జెడలవడంగ నెక్కువగ చేసిన యప్పులఁ దీర్చఁ గోరినా
    యడిగిన దేది లేదనుచు నవ్వలఁ ద్రోసెడివాఁడె దాతయౌ

    రిప్లయితొలగించండి
  13. చిన్న చిన్న తప్పులు దిద్దాల్సి వచ్చింది మన్నించాలి

    రిప్లయితొలగించండి
  14. బిడియము లేని నాయకుడు పెంపొన
    రించ ధనంబు మిక్కిలిన్
    జడియక లంచముల్ గొనెడు సత్య
    విదూరుకు నీతి భాహ్యుకున్
    దడబడకుండ వానిగని తప్పక ధైర్యము
    తోడ నెప్పుడున్
    అడిగిన దేది లేదనుచు నవ్వల ద్రోచెడు
    వాడు దాతయౌ

    రిప్లయితొలగించండి
  15. చెడుమదిలోన నెప్పుడును చేరగ నీయక చిత్తశుద్ధితో
    వడివడి సేవలన్ సలుపి బాధ్యత తోడుత పేదవారికిన్
    వెడగు మనమ్ముతో నడచు వెంబర విత్తులు వెక్కిరింతగా
    నడిగిన దేది లేదనుచు, నవ్వలఁ ద్రోసెడివాఁడె దాతయౌ

    రిప్లయితొలగించండి

  16. సాయమడుగ బంధువులవసరము వచ్చి
    యర్హత తనకున్నను గాని, యగును లోభి
    యడిగినది లేదనెడి వాడె; యగును దాత
    యడుగకయె సాయమందించి యాదుకొనెడు
    సద్గుణమ్ములు కల్గిన సజ్జనుండు.
    పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    రిప్లయితొలగించండి
  17. శంకించకపుచ్చులనుచు
    వంకాయలుతెచ్చికడిగి వడిగాతీయన్
    పంకెనగలచాకు తగిలి
    వంకాయనుకోసినంతవచ్చె రుధిరమే

    రిప్లయితొలగించండి