ఆ॥ చిక్కని నిశిరాత్రి చీకటి నొంటరి తనము తోడ నిద్ర దక్కదాయె నిదుర రాని యట్టి నిశ్శబ్ద వేళలో కమ్మగా వినఁబడెఁ గప్ప గొంతు
ఉ॥ చప్పుడు లేని వేళలను సాధన మానక నొంటి వాఁడిటుల్ ముప్పున నిద్ర రాక ఘన పోరును సల్పుచు నుండ శయ్యపై చప్పుడు లేని వాన జడి చక్కగ మంద్రము గాను గుర్వఁగన్ గప్పలు సేయఁగా బెకబెకల్ వినిపించెను గర్ణపేయమై
గ్రీష్మఋతువునందుగీఁబెట్టప్రాణము
రిప్లయితొలగించండితొలకరమ్మవచ్చితొంగిఁజూచె
వానరాకదెలుపబావురుమనగను
కమ్మగావినబడెఁగప్పగొంతు
ఎండలు కడుమండి ఏరులు ఎండగ
రిప్లయితొలగించండినిండిన సరసులును నీరు లేక
పైరు పంట నీటి పదునుకై చూడగ
కమ్మగా వినబడె గప్ప గొంతు
తిప్పలుబెట్టెగానినుఁడుదేహముచిట్లగవేసెబాణముల్
రిప్లయితొలగించండినిప్పులవర్షమేగురియనివ్వెఱబోయెనుజీవజాతులున్
మెప్పునుబొందమేఘమునుమిన్నునగానగసంబరమ్మునన్
కప్పలుసేయగాబెకబెకల్వినిపించెనుకర్ణపేయమై
ఆటవెలది
రిప్లయితొలగించండికరువు కోరలఁబడి కలగుచుండగ ప్రజ
నాలుగేళ్లపిదప శూలి దయను
చినుకు రాల మబ్బు చెర్వులెల్లను నిండ
కమ్మగా వినఁబడెఁ గప్ప గొంతు!
ఉత్పలమాల
తిప్పలు వెట్టగన్ గరువు తీరని వేదన నాలుగేళ్లుగా
నప్పులఁ జిక్కి కర్షకులు నార్తిని వేచగ నింగి మబ్బులై
గొప్పగ వానలున్ గురియ గోపతి దీవెన నిండ చెర్వులున్
గప్పలు సేయఁగా బెకబెకల్ వినిపించెను కర్ణపేయమై!
ముప్పులు తీర గ్రామమున మోదము తోడ జనాళి మొత్తమున్
రిప్లయితొలగించండికప్పల పెండ్లివేడుకను కన్నుల పండువురీతి సల్పిగన్
గొప్పగ వర్షధారలవి ఘోషలు బెట్టగ వాటికి తోడు నీ
కప్పలు సేయఁగా బెకబెకల్ వినిపించెను కర్ణపేయమై
వర్ష ఋతువు వచ్చి వానలు కురియంగ
రిప్లయితొలగించండిచె రువు లన్ని నిండి కరవు తొలగె
ననుచు హర్ష మొదవు హాలి కులకపుడు
కమ్మగా వినబడె గప్ప గొంతు
కప్పలు దిన మరిగె నొకఫణి చెరువున
రిప్లయితొలగించండికరువు కాలమందు కప్పలు కరు
వయ్యె దిగులు పడుచున్న పాముకు చెవిని
కమ్మగా వినపడె కప్ప గొంతు.
తిప్పల జెందినారు ప్రజ తీరని
రిప్లయితొలగించండివేసవి యెండ బాధచే
నెప్పుడు వచ్చునా యనుచు
నెల్లరు కోరెడు వాన జోరుగా
న్నప్పుడె వచ్చినింప జలమన్ని
తటాకములందు నెమ్మితో
కప్పలు సేయగా బెకబెకల్
వినిపించెను కర్ణపేయమై.
ఉ.
రిప్లయితొలగించండికొప్పు విదిల్చి ముంగురుల ఘోరపుటాకృతి భీతి గొల్పగా
చిప్పల జేత బట్టి యొక చేడియ వాద్యము లాటపాటలన్
దప్పులు గార్దభాసురుని తత్త్వము ధోరణి గానవిద్యయై
*కప్పలు సేయఁగా బెకబెకల్ వినిపించెను కర్ణపేయమై.*
శ్రుతియు లయయు తప్పి సోముడనెడువాని
రిప్లయితొలగించండిపాట వినుచు ననిరి ప్రజలె యిట్లు
వాని పాటకన్న వసుధలో గాంచగా
కమ్మగా వినఁబడెఁ గప్ప గొంతు.
అప్పురమందు గాయకుని యద్భుత గానకచేరి యంచు మా
యప్పయె చెప్ప, పట్టపగలా సభకేగితి పాటగాడు వెం
కప్పయె పాడుచుండెనట కర్ణకఠోరము గాను గాంచగా
కప్పలు సేయఁగా బెకబెకల్ వినిపించెను కర్ణపేయమై.
గొప్పగ దానధర్మములు కొల్ల లొనర్చిన దంపతుల్సదా
రిప్లయితొలగించండిచెప్పగ లేనిబాధలవి చిందులు వేసెడి బిడ్డలింట లే
కొప్పదు సంఘమంచు; దుద కోరిక తీరగ చిన్ని పాపలౌ
కప్పలు సేయఁగా బెకబెకల్ వినిపించెను కర్ణపేయమై.
అప్పటి గానమాధురు లనాదర మయ్యెను, నేటిసంతతిన్
తొలగించండిమెప్పులు వొందె, ఖర్మమది మేష గళోద్భవ శబ్దరాజముల్,
చెప్పగ నా తరంబె, కడు చేవలు జచ్చిన యిజ్జగంబులో
కప్పలు సేయఁగా బెకబెకల్ వినిపించెను కర్ణపేయమై.
చిన్నదాని పాట చెవులకు మిక్కిలి
రిప్లయితొలగించండికమ్మగా వినఁబడెఁ ; గప్ప గొంతు
విప్పె బెకబెకమని వినరోయు రీతిగ
శ్రావ్ మైన రవళి జన్య నొసగు
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండితిండికోసమంచు దిర్గు నగమునకు
చెట్టుదరికి నుండు చెఱువుచెంత
బెకబెకమనుచుండి వేగించు రొదయంత
కమ్మగా వినబడె గప్పగొంతు.
తుప్పలనుండి పామొకటి దూరమునందలి వాగునుండియున్
గొప్పగ పైకివచ్చి కడు గోలనుజేసెడి కప్పపిల్లలన్
చప్పునజూసి నంజుటకు సాగెడి వేళను సందడించు నా
కప్పలు సేయగా బెకబెకల్ వినిపించెను కర్ణపేయమై.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచెప్పగలేని బాధలట సేద్యము చేసెడి క్షేత్రజీవికిన్
తొలగించండిదప్పికగొన్న రైతులకు తప్పవు తిప్పలు వానలేమితో
ముప్పిరిగొన్నశోకమున పొన్పడు రైతుకు నక్కజమ్ముగా
కప్పలు సేయఁగా బెకబెకల్ వినిపించెను కర్ణపేయమై
వర్షఋతువురాక వానలేకురియక
తొలగించండినాత్రపడుచునుండె క్షేత్రజీవి
చల్లగాలివీచి నల్లమబ్బులుపట్టి
కమ్మగా వినఁబడెఁ గప్ప గొంతు
ఉమ్మ చెలఁగి దిశల నుమ్మలికమ్మతో
రిప్లయితొలగించండినెల్లవారు భువిని తల్లడిల్ల
చల్లగాలి వీచి జల్లులు కురిసెను
కమ్మగా వినఁబడెఁ గప్ప గొంతు
గొప్పగ వాన వచ్చినది గుంటలు నిండెను గ్రామమంతటన్
రిప్లయితొలగించండిచప్పున రైతులెల్లరునుసాగుకు బోయిరి సిద్ధమైయటన్
చప్పుడు జేయగన్వివిధ జాతుల పక్షులు చుట్టు ప్రక్కలన్
కప్పలు సేయఁగా బెకబెకల్ వినిపించెను కర్ణపేయమై”
డా.బల్లూరి ఉమాదేవి
రిప్లయితొలగించండివానజాడలేక వగచుచుండగ ప్రజ
సలుపపూజలెల్లచక్కగాను
వదుణుడుకరుణింపవానలుకురియంగ
కమ్మగా వినబడె గప్ప గొంతు
చెప్పగరానిఎండలకుజీవులుతాపమునొందునుండగా
రిప్లయితొలగించండికప్పగమేఘరాశియునుకర్షకులెల్లరుమోదమందగన్
చప్పున పెద్దలెల్లరును సంబరమొందుచు చేయ పూజలన్
“కప్పలు సేయఁగా బెకబెకల్ వినిపించెను కర్ణపేయమై
నిప్పులఁగక్కి నిర్దయగ నింగిని నేలను నింపి తాపమున్
రిప్లయితొలగించండితిప్పలు వెట్టె భానుడతి తీక్ష్ణమయూఖ విజృంభణమ్ముతో
చప్పున వర్షముల్గురియ చయ్యన నిండెను దొర్వులన్నియున్
కప్పలు సేయఁగా బెకబెకల్ వినిపించెను కర్ణపేయమై
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివానగజ్జెకట్టి భరతనాట్యముజేయ
రిప్లయితొలగించండిపరవశించిలేచె పచ్చదనము
చినుకుచినుకుచేరి చెరువులు నిండగ
కమ్మగా వినఁబడెఁ గప్ప గొంతు
ఎండె చెరువులెల్ల నెండతాకిడితోన
జీవరాశులెల్ల చెదిరిపోయె
చేరివర్షఋతువు చెరువులు నింపగ
కమ్మగా వినఁబడెఁ గప్ప గొంతు
గాడ్పు లధిక మగుచు గరగర లాడంగ
రిప్లయితొలగించండికుండ పోత వాన కురియ గానె
బెకబెకమను రవము పిక్కటి ల్లుచుండ
కమ్మగా వినఁబడెఁ గప్ప గొంతు.
నిప్పులు రాలెనా యనఁగ నింగిని సూర్యుఁడు ప్రజ్వరిల్లగా
రిప్లయితొలగించండినప్పుడ యొక్కసారిగను నాకస మంతయుఁగారు చీకటై
చప్పుడు తోడ వానపడ సంతస మొందుచు నొక్క సారిగా
కప్పలు సేయఁగా బెకబెకల్ వినిపించెను కర్ణపేయమై.
ఆ॥ చిక్కని నిశిరాత్రి చీకటి నొంటరి
రిప్లయితొలగించండితనము తోడ నిద్ర దక్కదాయె
నిదుర రాని యట్టి నిశ్శబ్ద వేళలో
కమ్మగా వినఁబడెఁ గప్ప గొంతు
ఉ॥ చప్పుడు లేని వేళలను సాధన మానక నొంటి వాఁడిటుల్
ముప్పున నిద్ర రాక ఘన పోరును సల్పుచు నుండ శయ్యపై
చప్పుడు లేని వాన జడి చక్కగ మంద్రము గాను గుర్వఁగన్
గప్పలు సేయఁగా బెకబెకల్ వినిపించెను గర్ణపేయమై
(దీనికి విరుగుడు మిత భోజనము తగు వ్యాయామండి)
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
కఱవు కాటకములు కలవర పరచెను
వరుణదేవు డిపుడు కరుణ జూపి
జల్లు కురియజేయ చల్లని గాలితో
కమ్మగా వినబడెఁ గప్ప గొంతు.