20, జూన్ 2023, మంగళవారం

దత్తపది - 197

21-6-2023 (బుధవారం)
"గోడ - కప్పు - వాసము - గూన"
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ భారతార్థంలో
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.

12 కామెంట్‌లు:

  1. గో లగోడంచువినరుగా గుంపుకూడి
    పెద్దకనుకప్పుచూడడుభేషజముగ
    ధర్మమావాసమునువీడెద్రౌపదేను
    సభనుమరుగూనచెప్పుడీశాంతికలుగు
    ద్రౌపది వస్త్రాపహరణం సభలో పలికిన మాటలు
    గోల

    రిప్లయితొలగించండి
  2. పాండు రాజుకున్ గోడలిన్ నిండు సభను
    కప్పుడుల్ నొలిపించుట తప్పుగాదె
    యధిభువా! సముచితము కాదందు, నీదు
    సుతుల దొసగూనమని తలచితిరి నాడు.

    (దొసగు+ ఊనము= పాపము చిన్నదని)

    (ధృతరాష్ట్రునితో కృష్ణుని మాటలుగా)

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    మగువ గోడన్నదే కన మరచి సభను
    కప్పుకొన్న వల్వలనూడ్చి కలత పెట్ట
    ద్వారకా పుర వాసమున్ బరుగున విడి
    భీతి వడెడు గూనను హరి ప్రీతిఁగాచె

    రిప్లయితొలగించండి
  4. కృష్ణుడు పార్థునితో —-

    కనును బా’వా ! సము’ చితము గాదు కలికి,
    బవరము సలుప పం ‘గూన’గ , పాడి యగునె,
    వినబడె నది’గో డ’ప్పులు వేగ లెమ్ము
    తెగువ జూప నీ ‘కప్పు’డె తెలిపితిగద

    కలి = శూరుడు
    పంగూను = పంగు + ఊను = భయము వహించు

    రిప్లయితొలగించండి
  5. గోడగించెడు యోచన గుండెలోన
    కప్పుదేఱగ వర్తిల్లు కౌరవపతి
    పాండవాజ్ఞాతవాసము పరిసమాప్తి
    పిదప రాజ్యమున్ గూనల కొదవననెను

    రిప్లయితొలగించండి
  6. కృష్ణుడు విజయునితో ---
    అదిగో డ స్సె ను సేనలు
    కదలుము విజయా! పలుకుల కప్పుడు వార ల్
    మది సావా సము నెంచియు
    కదన ము నన్ గూ న లౌ చు గాంతురు జయ మున్

    రిప్లయితొలగించండి
  7. శ్రీకృష్ణుని కౌరవులకడకు రాయబారిగా పంపునపుడు ద్రౌపది నిండు సభలో తనకు జరిగిన అవమానం గుర్తుచేయు సందర్భంలో:

    కుంతికింగోడలిని జాలి సుంత లేక
    క్రూరకర్ములు ధృతరాష్ట్రు గూనలపుడు
    మేనిపైకప్పుదొలగింప బూనుకొనగ
    మాధవా సముచితమౌనె మౌనమూన

    రిప్లయితొలగించండి
  8. అమ్మ వనవాసముననీకు నంతులేని
    గోడవస్యము కలుగును కోటి వెతలు
    నిజము నీకప్పుడక్కడ నిశ్చయముగ
    గూనలున్న నీతోడుగ గోడు గలుగు
    అమ్మ రావద్దు మాతోడ యడవికీవు

    రిప్లయితొలగించండి
  9. ధృతరాష్ట్రునికి విదురుని నీతిబోధ
    తే॥కప్పు బట్టల నొలిపించఁ దప్పు గాద
    ద్రౌపదియు నీదు గోడలే యే పగిదిగఁ
    బరిగణించ న్యాయము సహవాసమునను
    నీదు గూనలు ధృతరాష్ట్ర నీచులైరి

    రిప్లయితొలగించండి