4-6-2023 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పుట్టింటిని రోయునట్టి పొలఁతికి మేలౌ”(లేదా...)“పుట్టింటిన్ దెగనాడి రోయు సతియే పొందున్ హితంబున్ సదా”
మెట్టింటమగనికాదనిగట్టిగయవమానముననుకలతన్సతియేపుట్టెడుదుఃఖముపొందెనుపుట్టింటినిరోయునట్టిపొలతికిమేలౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు."గట్టిగ నవమానమునను..." అనండి.
తప్పుసవరించుకుంటాను, క్షమించగలరు
కందంకట్టుకొనిన దాదిగ రాబట్టిన సంపదల మఱచి స్వార్థము మీరన్మెట్టింటి వారు తిట్టగపుట్టింటిని, రోయునట్టి పొలఁతికి మేలౌశార్దూలవిక్రీడితముపట్టాదారునటంచు భర్త మిగులన్పంతంబునన్ గల్మి రాబట్టెన్, జాలక యత్తమామలికనున్ బాధింపగన్స్వార్థమైమెట్టింటన్ ప్రతి నిత్యమున్ సణగి జృంభింపంగ దూషించుచున్పుట్టింటిన్, దెగనాడి రోయు సతియే పొందున్ హితంబున్ సదా
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
బొట్టి విధర్భజ యీబరిగొట్టు వలదటంచు దలచి గోపాలుని చే పట్టెను ఖలుడన్నైననుపుట్టింటిని రోయునట్టి పొలఁతికి మేలౌ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మెట్టింటన్గలలోటులన్నిటినితామేలంచుభావించుచున్గుట్టున్మూయుచుమేలమాడకనుమూగున్బాధతోషంబుగాపట్టున్వీడనిపార్వతీసతియుసర్వంబున్శివుండేయనన్పుట్టింటిన్దెగనాడిరోయుసతియేపొందున్హితంబున్సదా
బొట్టిన్ బ్రోవు మటంచు విప్రనుడులామోదించు చున్ జక్రి చేపట్టన్ జేరి విదర్భకున్ వడిని యా పద్మాక్షినే గ్రోలగన్ చుట్టంబొక్కడు పల్కె కేశటుడు దుష్టుండైనచో ధాత్రిలో పుట్టింటిన్ దెగనాడి రోయు సతియే పొందున్ హితంబున్ సదా.
పుట్టినదాదిగ నెన్నఁడుపుట్టింటినివీడనట్టిబోటికి కాగామెట్టిన ధామము స్వర్గముపుట్టింటిని రోయునట్టి పొలఁతికి మేలౌ
పుట్టింటి పరాభవమునుతట్టుకొనగలేని గౌరి తనువును విడిచెన్బెట్టిదమున్ గను వారనుపుట్టింటిని రోయునట్టి పొలఁతికి మేలౌ
మెట్టిల్లే తనదంచు తల్చినపుడే మేలౌను పూబోడికిన్పుట్టింట్లో నవమానమొంద సతికే పోయెన్ గదాప్రాణమేపుట్టింటన్ దగు గౌరవంబు కరవై పోరాడువారందురేపుట్టింటిన్ దెగనాడి రోయు సతియే పొందున్ హితంబున్ సదా
పుట్టింట నేర్పు బొందియుమెట్టింట ప్రతి ష్ట పెంచు మేలిమి పనులన్బట్టు దల గ జేయుచు దాపుట్టింటిని రోయు నట్టి పొలతికి మేలౌ
మెట్టింటన్ తన పుట్టినింటి విభవంబెంతేని వర్ణించుచున్నట్టింటన్ తన మెట్టినింటి నెపుడన్యాయంబుగా దూరుచున్తట్టంబుల్ తల రాతలంచు సతమత్తారింట వాపోవకన్పుట్టింటిన్ దెగనాడి రోయు సతియే పొందున్ హితంబున్ సదా
మట్టు పరచు మధుమేహముబెట్టుగ దేహము సకలము , భీకర రీతిన్పుట్టిన తెగులన్నిటికాపుట్టింటిని రోయునట్టి పొలఁతికి మేలౌ
పట్టున్ బట్టి పరాయి వంశజుని చేపట్టంగ ప్రేమమ్ముతోదట్టమ్మౌ కసి తల్లి దండ్రులు కడున్ దౌర్జన్యమున్ జేయగామెట్టింటిన్ విడ నాడకుండ ధృతితో మేలెంచుచున్ భర్తకున్పుట్టింటిన్ దెగనాడి రోయు సతియే పొందున్ హితంబున్ సదా
కం॥ మెట్టిన చోటను బొగడఁగఁబుట్టింటి ఘనత నిరతము పొందరు సుఖమున్మెట్టిన గృహమే మేలనిపుట్టింటిని రోయునట్టి పొలతికి మేలౌశా॥ పుట్టింటన్ ఘనవైభవమ్ము నచటన్ మోహించు వారున్ననేమట్టంబౌఁగద తల్లిదండ్రులు చనన్ మర్యాద నానాఁటికిన్చుట్టంబై తన పుట్టి నింటికి చనన్ జూపించరే ప్రేమలన్పుట్టింటిన్ దెగనాడి రోయు సతియే పొందున్ హితంబున్ సదా
మెట్టింటివారు తిట్టగ*“పుట్టింటిని, రోయునట్టి పొలఁతికి మేలౌ”*పట్టుగ వాదించుచుతానట్టికుజనులసహవాస మాశించనిచో
మెట్టింటమగనికాదని
రిప్లయితొలగించండిగట్టిగయవమానముననుకలతన్సతియే
పుట్టెడుదుఃఖముపొందెను
పుట్టింటినిరోయునట్టిపొలతికిమేలౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"గట్టిగ నవమానమునను..." అనండి.
తప్పుసవరించుకుంటాను, క్షమించగలరు
తొలగించండికందం
రిప్లయితొలగించండికట్టుకొనిన దాదిగ రా
బట్టిన సంపదల మఱచి స్వార్థము మీరన్
మెట్టింటి వారు తిట్టగ
పుట్టింటిని, రోయునట్టి పొలఁతికి మేలౌ
శార్దూలవిక్రీడితము
పట్టాదారునటంచు భర్త మిగులన్పంతంబునన్ గల్మి రా
బట్టెన్, జాలక యత్తమామలికనున్ బాధింపగన్స్వార్థమై
మెట్టింటన్ ప్రతి నిత్యమున్ సణగి జృంభింపంగ దూషించుచున్
పుట్టింటిన్, దెగనాడి రోయు సతియే పొందున్ హితంబున్ సదా
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిబొట్టి విధర్భజ యీబరి
గొట్టు వలదటంచు దలచి గోపాలుని చే
పట్టెను ఖలుడన్నైనను
పుట్టింటిని రోయునట్టి పొలఁతికి మేలౌ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమెట్టింటన్గలలోటులన్నిటినితామేలంచుభావించుచున్
రిప్లయితొలగించండిగుట్టున్మూయుచుమేలమాడకనుమూగున్బాధతోషంబుగా
పట్టున్వీడనిపార్వతీసతియుసర్వంబున్శివుండేయనన్
పుట్టింటిన్దెగనాడిరోయుసతియేపొందున్హితంబున్సదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిబొట్టిన్ బ్రోవు మటంచు విప్రనుడులామోదించు చున్ జక్రి చే
పట్టన్ జేరి విదర్భకున్ వడిని యా పద్మాక్షినే గ్రోలగన్
చుట్టంబొక్కడు పల్కె కేశటుడు దుష్టుండైనచో ధాత్రిలో
పుట్టింటిన్ దెగనాడి రోయు సతియే పొందున్ హితంబున్ సదా.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపుట్టినదాదిగ నెన్నఁడు
రిప్లయితొలగించండిపుట్టింటినివీడనట్టిబోటికి కాగా
మెట్టిన ధామము స్వర్గము
పుట్టింటిని రోయునట్టి పొలఁతికి మేలౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపుట్టింటి పరాభవమును
రిప్లయితొలగించండితట్టుకొనగలేని గౌరి తనువును విడిచెన్
బెట్టిదమున్ గను వారను
పుట్టింటిని రోయునట్టి పొలఁతికి మేలౌ
మెట్టిల్లే తనదంచు తల్చినపుడే మేలౌను పూబోడికిన్
తొలగించండిపుట్టింట్లో నవమానమొంద సతికే పోయెన్ గదాప్రాణమే
పుట్టింటన్ దగు గౌరవంబు కరవై పోరాడువారందురే
పుట్టింటిన్ దెగనాడి రోయు సతియే పొందున్ హితంబున్ సదా
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిపుట్టింట నేర్పు బొందియు
రిప్లయితొలగించండిమెట్టింట ప్రతి ష్ట పెంచు మేలిమి పనులన్
బట్టు దల గ జేయుచు దా
పుట్టింటిని రోయు నట్టి పొలతికి మేలౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమెట్టింటన్ తన పుట్టినింటి విభవంబెంతేని వర్ణించుచున్
రిప్లయితొలగించండినట్టింటన్ తన మెట్టినింటి నెపుడన్యాయంబుగా దూరుచున్
తట్టంబుల్ తల రాతలంచు సతమత్తారింట వాపోవకన్
పుట్టింటిన్ దెగనాడి రోయు సతియే పొందున్ హితంబున్ సదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమట్టు పరచు మధుమేహము
రిప్లయితొలగించండిబెట్టుగ దేహము సకలము , భీకర రీతిన్
పుట్టిన తెగులన్నిటికా
పుట్టింటిని రోయునట్టి పొలఁతికి మేలౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపట్టున్ బట్టి పరాయి వంశజుని చేపట్టంగ ప్రేమమ్ముతో
రిప్లయితొలగించండిదట్టమ్మౌ కసి తల్లి దండ్రులు కడున్ దౌర్జన్యమున్ జేయగా
మెట్టింటిన్ విడ నాడకుండ ధృతితో మేలెంచుచున్ భర్తకున్
పుట్టింటిన్ దెగనాడి రోయు సతియే పొందున్ హితంబున్ సదా
కం॥ మెట్టిన చోటను బొగడఁగఁ
రిప్లయితొలగించండిబుట్టింటి ఘనత నిరతము పొందరు సుఖమున్
మెట్టిన గృహమే మేలని
పుట్టింటిని రోయునట్టి పొలతికి మేలౌ
శా॥ పుట్టింటన్ ఘనవైభవమ్ము నచటన్ మోహించు వారున్ననే
మట్టంబౌఁగద తల్లిదండ్రులు చనన్ మర్యాద నానాఁటికిన్
చుట్టంబై తన పుట్టి నింటికి చనన్ జూపించరే ప్రేమలన్
పుట్టింటిన్ దెగనాడి రోయు సతియే పొందున్ హితంబున్ సదా
మెట్టింటివారు తిట్టగ
రిప్లయితొలగించండి*“పుట్టింటిని, రోయునట్టి పొలఁతికి మేలౌ”*
పట్టుగ వాదించుచుతా
నట్టికుజనులసహవాస మాశించనిచో