10, జూన్ 2023, శనివారం

సమస్య - 4444

11-6-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నాల్గు నాల్గులు పదునాలుగగును”
(లేదా...)
“నాలుగు నాల్గులన్నఁ బదునాల్గనె లెక్కల పంతు లంతటన్”

30 కామెంట్‌లు:

  1. ఆలుబిడ్డలనగనారాటపడుచును
    వేలకొఱకుదిరుగువెఱ్ఱియగుచు
    తెగులుబట్టిమేథతెలివినిదప్పగ
    నాల్గునాల్గులుపదునాలుగగును

    రిప్లయితొలగించండి
  2. ఆటవెలది
    తగిన గురువులు నవధానము నేర్పుచు
    శిష్యునకు సమస్యఁ జెప్పినంత
    విప్పి పూరణమ్ము సెప్పె! రెండు దొలఁగ
    నాల్గు నాల్గులు పదునాలుగగును

    ఉత్పలమాల
    చాలగ పద్యవిద్య మనసారగ వృత్తిని మీరి నేర్పునన్
    దాళగ నేర్చి చేయ నవధానము, సద్గణితంపు నొజ్జయే
    మేలని యీ సమస్య నిడ మిన్నగ జెప్పెను, రెండు దొల్గగన్
    నాలుగు నాల్గులన్నఁ బదునాల్గనె లెక్కల పంతు లంతటన్

    రిప్లయితొలగించండి
  3. ప్రశ్న వేసె నొకడు బాలుని గన్గొ ని
    పదు నాల్గదెట్లు పలుకు మని న
    దెలివి తోడ నిట్లు దెలిపె రెండు న్న ర
    నాల్గు నాల్గులు పదు నాలు గగును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది అభినందనలు
      రెండవ పాదంలో గణభంగం. సవరించండి

      తొలగించండి
    2. పదియు నాలుగెట్లు ప ల్కు మని న అని సవరణ చేయడమైనది

      తొలగించండి
  4. పంతులయ్య నల్లబల్లపై కూడిక
    వ్రాసి చూపె పిల్లవాండ్రకిటుల
    రెండు రెండు మరియు రెండుకు కలుపుగ
    నాల్గు నాల్గులు పదునాలుగగును

    రిప్లయితొలగించండి

  5. మూడు మార్లు నాల్గు ముచ్చటగ గుణించి
    లబ్ధమునిక సంకలనము చేసి
    తిరిగి మరొక నాల్గు మరువక కలిపిన
    నాల్గు నాల్గులు పదునాలుగగును.


    బాలుడు కోరినంత నొక పండితుడే వచియించె నాల్గుతో
    నాలుగు హెచ్చవేయ పదునారగు దీని గుణించుచున్ మరో
    నాలుగుచేత లబ్ధఘటనమ్మును జేయుచు నాల్గు కల్పగా
    నాలుగు నాల్గులన్నఁ బదునాల్గనె లెక్కల పంతు లంతటన్.

    రిప్లయితొలగించండి
  6. గొప్ప పండితుడని కోరి కోరి బిలువ
    నిన్నటి దినమందు నేర్పి నట్టి
    యతని గణిత శాస్త్రమందున లెక్కింప
    నాల్గు నాల్గులు పదునాలుగగును

    రిప్లయితొలగించండి
  7. బాలుర చేరబిల్చియొక పంతులు లెక్కల నేర్పె నివ్విధిన్
    బాలకులార కూడికను వ్రాసితి గాంచుడు నల్లబల్లపై
    నాలుగు రెండుకున్ గలిపి నంతట నారగు, గల్పదానికిన్
    నాలుగు, నాల్గులన్నఁ బదునాల్గనె లెక్కల పంతు లంతటన్

    రిప్లయితొలగించండి
  8. ప్రభుత చెప్పు చదువు ప్రామాణికతచూడ
    వెల్లడాయె విషయ మెల్లరకును
    దొరకునెట్టి చదువు దొరవారి బడిలోన?
    'నాల్గు నాల్గులు పదునాలుగగును'

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి అభినందనలు
      పాఠశాలలన్+ఏలినవారు... యడాగమం రాదు

      తొలగించండి
    3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    4. సవరణతో...

      వేలము వెర్రిగా జనులు విద్యకు నెంచిన పాఠశాలనే
      పోలిక పెట్టి చూచిరి ప్రభుత్వము పెట్టిన పాఠశాలతో
      నేలినవారు చెప్పు చదువీవిధి కన్గొని విస్తు పోయిరే
      నాలుగు నాల్గులన్నఁ బదునాల్గనె లెక్కల పంతు లంతటన్

      తొలగించండి
  9. స్టార్లుబాగులేక స్టాకులోకిదిగకు
    లక్కుదిక్కుమార్చి వెక్కిరించు
    పట్టుదలకుపోతె ఫట్టున లాసౌను
    నాల్గునాల్గులుపదునాల్గులగును

    రిప్లయితొలగించండి
  10. ఆ॥ యంత్ర మహిమ విరియ నందరు మరచిరి
    గణనఁ జేయు విధము కనఁగ నేఁడు
    లెక్కఁ జేయు శక్తి లేని వానినడుగ
    నాల్గు నాల్గులు పదునాలుగనును

    ఉ॥ మేలగు యంత్రలాభములు మీర గుణింతము మానిరెల్లరున్
    బాలలు పెద్దలున్ గణన వద్దని యంత్రము చాలు చాలనన్
    గూలెను బ్రాఁత పద్ధతులు కూడిక రాక గుణింతమెట్టులన్
    నాలుగు నాల్గులన్నఁ బదు నాల్గనె లెక్కల పంతులంతటన్

    (క్యాలుకులేటర్ల కంప్యూటర్ల వాడకము ఈప్రమాదము తెచ్చే పరిస్థితి ఉందండి)

    రిప్లయితొలగించండి

  11. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    ఫలిత మెంచి చూడ పదునారె యగు గద
    నాల్గు నాల్గులు; పదునాలు గగును
    వెలువరించినట్టి ఫలితమ్ము నందుండి
    సరిగ తీసివేయ సంఖ్య రెండు.

    రిప్లయితొలగించండి
  12. నాల్గు నాలుగులను నయముగాగుణియించ
    వచ్చునుపదహారువాసిగాను
    తొలగచేయరెండుతుదకటలెక్కింప
    నాల్గు నాల్గులుపదు నాలుగగును

    రిప్లయితొలగించండి
  13. శకరాభరణం సమస్య: పూరణ--
    వేద సంఖ్య యెంత వేయుమా చెవిలోన
    నాల్గు కేది ద్వివచనమది యేమొ?
    భువన ములవి యెన్ని భూవరా దెలుపుమా
    నాల్గు, నాల్గులు, పదునాలుగగును.
    కడయింటి కృష్ణమూర్తి..గోవా (నెల్లూరు---11-6-23

    రిప్లయితొలగించండి