9, జూన్ 2023, శుక్రవారం

సమస్య - 4443

10-6-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విశ్రాంతినిఁ గోరువాఁడె వీరుండు గదా”
(లేదా...)
“విశ్రాంతిన్ మనసారఁ గోరు నరుఁడే వీరుండు ధీరుండునౌ”

26 కామెంట్‌లు:

  1. కందం
    మిశ్రా! కునుకున్ దీయుచు
    విశ్రాంతిని గోరనెంచ బీతిని కలలై
    యశ్రాంతము వైరుల మది
    విశ్రాంతినిఁ గోరువాఁడె వీరుండు గదా!

    శార్దూలవిక్రీడితము
    మిశ్రా! వైరులు కళ్లుమూసి తెరువన్ మిర్మిట్ల గన్పించుచున్
    విశ్రాంతిన్ శయనంబునందుగొన జృంభింపంగ స్వప్నమ్మునం
    దశ్రాంతంబును గీడు సేయ భయమందల్లాడ గుండెల్లఁ దా
    విశ్రాంతిన్ మనసారఁ గోరు నరుడే వీరుండు ధీరుండునౌ

    రిప్లయితొలగించండి
  2. మిశ్రముగాకనుతలపులు
    సశ్రేణిగవాడిపోోవుసాధనతోడన్
    ఆశ్రమమందుననున్నచొ
    విశ్రాంతినిగోరువాడెవీరుండుగదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఉన్నచొ' అని హ్రస్వాంతంగా వ్రాయరాదు. 'ఉండియు' అనవచ్చు.

      తొలగించండి
  3. ఏ శ్రమ జేయని సోమరి
    విశ్రాంతిని గోరు వాడె:: వీరుండు గదా
    యాశ్రాంత ము సరి హద్దున
    విశ్రాంతిని యెరు గ కుండ విధుల నొనర్చు న్

    రిప్లయితొలగించండి

  4. ఆశ్రిత రక్షకుడగుచు ని
    రాశ్రయు లగు వృద్ధజనుల నాదుకొనుటకై
    తా శ్రమియించుచు వారికి
    విశ్రాంతినిఁ గోరువాఁడె వీరుండు గదా.



    (విదురుడు దృతరాష్ట్రునితో పలికిన మాటలుగా)

    ఆ శ్రీకృష్ణుడు శాంతి సౌఖ్యముల తానాశించుచున్ గాదె వి
    శ్వశ్రేయమ్మును గోరువాడయిన గోపాలుండు నిచ్చోటకున్
    విశ్రాంతమ్మది మేలుగూర్చు ననితో విధ్వంస మౌ చివ్వకున్
    విశ్రాంతిన్ మనసారఁ గోరు నరుండే వీరుండు ధీరుండునౌ.

    రిప్లయితొలగించండి
  5. మిశ్రంబంటనిభావజాలమునతామేకంబునౌధ్యాసతో
    సుశ్రాంతుల్మదిచంచలంబుగనకేసౌజన్యభావంబుతో
    సశ్రేయంబగుసన్నిధానముననేశాంతిన్గనన్జూడగా
    విశ్రాంతిన్మనసారగోరునరుడేవీరుండుధీరుండునౌ

    రిప్లయితొలగించండి
  6. అశ్రాంతంబును బొట్ట కోసమయి తా
    నత్యంత కష్టించుచున్
    విశ్రాంతిన్ గొనుచుండుటే యుచతమౌ
    పెంచన్ సదా స్వాస్థతన్
    విశ్రాంతిన్ మనసార గోరునరుడే
    వీరుండు ధీరుండగున్
    సశ్రేయంబుగునుండు నెప్పుడు సుమీ
    సత్యంబిదే నమ్ముమీ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...యుచితమౌ' టైపాటు. స్వాస్థ్యమున్ అనండి.

      తొలగించండి
  7. అశ్రాంతమ్ముగ దురమున
    విశ్రామములేక శత్రు విధ్వంసమ్మున్
    శ్వశ్రేయసముగ సలిపియె
    విశ్రాంతినిఁ గోరువాఁడె వీరుండు గదా

    రిప్లయితొలగించండి
  8. విశ్రాంతిని విడనాడుచు
    నాశ్రమవాసుల శరణము నరయుచు నాపై
    ప్రశ్రయమున దేశస్థుల
    విశ్రాంతినిఁ గోరువాఁడె వీరుండు గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విశ్రాంతమ్మున సేదతీరు మునులన్ పీడించు రాకాసులన్
      దాశ్రీరాముని వోలె చెండు విభుడై దాక్షిణ్య ముప్పొంగగా
      నశ్రాంతంబు సమాదరమ్మున ప్రజానందమ్ము కాంక్షించుచున్
      విశ్రాంతిన్ మనసారఁ గోరు నరుఁడే వీరుండు ధీరుండునౌ

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  9. శుశ్రూషకుడు హీనుడయిన
    విశ్రాంతినిఁ గోరువాఁడె ; వీరుండు గదా
    యా శ్రమనంతను దాళుచు
    నాశ్రితులకు సేవజేయ నానందించన్

    రిప్లయితొలగించండి
  10. అశ్రాంతమ్ముగ శత్రుసైన్యములతో నాజిన్ పెనంగంగ తా
    విశ్రామంబును గోరనట్టి ఘనుడౌ వీరుండె మాన్యుండగున్
    శ్వశ్రేయస్సును నమ్మి మానసమునన్ శస్తంబుగా జేతయై
    విశ్రాంతిన్ మనసారఁ గోరు నరుఁడే వీరుండు ధీరుండునౌ

    రిప్లయితొలగించండి
  11. ఏశ్రీలిక తూగగలవు?
    ఈశ్రద్దను బూనినాక ఈశుని కృపతో
    ఆ శ్రీమాహేశుని కడ
    విశ్రాంతినిఁ గోరువాఁడె వీరుండు గదా

    రిప్లయితొలగించండి
  12. కం॥ అశ్రాంత శ్రమఁ బడి ఘనము
    గా శ్రేయముఁ గూర్చి సంతు గరిమఁ బడయ తా
    నాశ్రమ వాసమునకు చని
    విశ్రాంతినిఁ గోరు వాఁడె వీరుండు గదా!

    శా॥ సుశ్రేయమ్మును గూర్చి సంతుకు శ్రమన్ శోభిల్లి యోగ్యుండుగన్
    విశ్రాంతిన్ గనకిట్లు బాధ్యతలతో వేసారి వృద్ధుండునై
    తాశ్రాంతుండుగ మారి కోరె విరతిన్ తానై జగమ్మందిటుల్
    విశ్రాంతిన్ మనసారఁ గోరు నరుఁడే వీరుండు ధీరుండునౌ

    రిప్లయితొలగించండి