23-6-2023 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కలుము లెడఁబాసి నప్పుడె కలుగు సుఖము”(లేదా...)“కలుములు వాసినప్పుడె సుఖం బొనఁగూడును వాస్తవమ్మిదే”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
పురము పెద్దదైనదనుచు మురియ నేల,నేత మనవాడెకద యని నిక్క నేల,వీధులందున వదలిన బీరు విడుచుకలుము లెడఁబాసి నప్పుడె కలుగు సుఖము
బంధనమ్ములువీడుచుభవునిదలపముక్తికాంతయువరియించుమోదమందచిరమునౌగాకపరమముజేతయగుటకలుములెడబాసినప్పుజెకలుగుసుఖము
క్షణిక మైనట్టి సుఖముపై కాంక్ష పెరిగిపరుల వంచించి పొందు సంపదలు జూడశాంతి నొసగ నేరవు పాప సంచయితపుకలుము లెడఁబాసి నప్పుడె కలుగు సుఖము.నెలగను పొందుటొక్కటదె నేమమటంచును నమ్ము వారినేస్ఖలిత మొనర్చి భూరిగను సంపద లెన్నియొ కూడబెట్టినన్ మెలపది పొందబోడెవడు మేదిని బాపపు సంచయంబులౌ కలుములు వాసినప్పుడె సుఖం బొనఁగూడును వాస్తవమ్మిదే.
పులిమినమాయలొంగకనుపోఁజనిలౌకికమందురాగమున్తలకొనిరాముపాదములదాస్యముజేసెనుపోతనార్యుడున్ఫలముగశాశ్వతంబునగుపారమునంటెగకీర్తిసంపదన్కలుములువాసినప్పుడెసుఖంబొనగూడునువాస్తవంబిదే
తే.గీ:తే.గీ:పొలము దున్నినపుడె యిల పుట్టు తిండికులములను వీడిననె గలుగు నభివృద్ధితలుపు తెరచిన వీచు శీతల పవనముకలుము లెడ(బాసి నప్పుడె కలుగు సుఖము.
మానవాళికి ధర్మమే మార్గమౌనుధర్మ రక్షణే లక్ష్యమై తాను మెలగి ధనము కూడబెట్టుట పైన ధ్యాస వీడికలుము లెడఁబాసి నప్పుడె కలుగు సుఖము
తలపులలోప్రలంభనము దారుణ జీవనశైలి తోడుతన్కలుషితమార్గమెంచుకొని కాసులవేటకు సిద్ధమైతివావిలువలు వీడకుండుటయె విజ్ఞత మానవ లోకమందునన్కలుములు వాసినప్పుడె సుఖం బొనఁగూడును వాస్తవమ్మిదే
ఇడుము లెదు రౌ న నందురీ యిలను సతముకలు ము లెడ బాసి నప్పుడె :: కలుగు సుఖముకలిమి బలములు పెరిగిన గాల మందుకలుగ వేనాడు కష్టాలు కల్ల గాదు
తేటగీతిమోహమందున పార్థుని యూహచిక్కకల్మషంబెంచి కృష్ణయ్య జ్ఞానమెసఁగమహిత విజయమ్ము గాంచెను, మానసమునఁగలుము లెడఁబాసి నప్పుడె కలుగు సుఖముచంపకమాలబలమును గల్గియున్ మిగుల పార్థుఁడు సిక్కుచు మోహమందునన్బలుచన గాగ యుద్ధమును బాసెద నంచనఁ గృష్ణమూర్తి తానిలిపియు గీతబోధనను నేర్పఁగ గెల్చెను, మానసంబునన్గలుములు వాసినప్పుడె సుఖం బొనఁగూడును వాస్తవమ్మిదేకలుము : కలుషగంధము (శబ్దరత్నాకరము) ✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*
పలు విధ మైన కార్యములు ప్రాజ్యము సేసియు నెల్లవేళలన్నిలుకడ వీడి మానవుడు నిక్కముసంపద బెంచె మిక్కిలీకలిమియె శాంతి నిద్రలను గ్రన్ననతోషము సేయు దూరమున్కలుములు వాసినప్పుడె సుఖంబొన గూడును వాస్తవంబిదే.
కరమునందునహెచ్చుగకాసులున్నగర్వము విపరీతమ్ముగ కలుగచేసికానని యటుల చేయును కన్ను మిన్ను*“కలుము లెడఁబాసి నప్పుడె కలుగు సుఖము”*
చం.తలచుచు పుత్రులన్ వెడలె దావమునన్ దృతరాష్ట్రుడీవితోచెలువము దానధర్మముల జేయగ భార్గవ రాముడీగితోసొలసిరి యజ్ఞముల్ సలిపి సొమ్ముల రాజులు ధారపోయగా *కలుములు వాసినప్పుడె సుఖం బొనఁగూడును వాస్తవమ్మిదే.*
ఐహికములను వలలందు నాత్రపడకనభవు దలచిన సతతము శుభములొదవుబ్రతుకు బలిగొనెడు నరిషడ్వర్గములనుకలుము లెడఁబాసి నప్పుడె కలుగు సుఖము
తలపులలోననున్నతి యుదారత దీనజనావనంబునన్కులముల హెచ్చుతగ్గులను గోడల గూల్చెడు శక్తి యుక్తులున్గలిగినవాడె ధీయుతుఁడు కారణజన్ముఁడు, మానసమ్మునన్కలుములు వాసినప్పుడె సుఖం బొనఁగూడును వాస్తవమ్మిదే
తే॥ ఇలను ధనయాతురత తోడ నిడుములఁ బడికపట రీతుల నొందఁగఁ గలుగదయ్యఅరయఁ బాప చింతన వీడ నమరునయ్యకలుము లెడఁబాసి నప్పుడె కలుగు సుఖముచం॥ కలిమినిఁ గోరి యాడుచును గల్లలు మోసము నెంచి ధాత్రిలోవిలువలు మాని సంపదలు వేలకు వేలుగ హెచ్చ వేయఁగానలసట తప్ప జీవమున కందదు సౌఖ్యము మానవా కనన్కలుములు వాసినప్పుడె సుఖం బొనఁగూడును వాస్తవమ్మిదేజీవము ఆత్మ
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. పెక్కు సంపద గల్గిన పెరుగు నహముదొంగ భయము వలన నిద్ర దూరమగునుచెరువునందు కప్పల రీతి చేరు బంధువులును,మనసుకు శాంతియు నుండబోదుకలుము లెడబాసి నప్పుడె కలుగు సుఖము.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపురము పెద్దదైనదనుచు మురియ నేల,
రిప్లయితొలగించండినేత మనవాడెకద యని నిక్క నేల,
వీధులందున వదలిన బీరు విడుచు
కలుము లెడఁబాసి నప్పుడె కలుగు సుఖము
బంధనమ్ములువీడుచుభవునిదలప
రిప్లయితొలగించండిముక్తికాంతయువరియించుమోదమంద
చిరమునౌగాకపరమముజేతయగుట
కలుములెడబాసినప్పుజెకలుగుసుఖము
రిప్లయితొలగించండిక్షణిక మైనట్టి సుఖముపై కాంక్ష పెరిగి
పరుల వంచించి పొందు సంపదలు జూడ
శాంతి నొసగ నేరవు పాప సంచయితపు
కలుము లెడఁబాసి నప్పుడె కలుగు సుఖము.
నెలగను పొందుటొక్కటదె నేమమటంచును నమ్ము వారినే
స్ఖలిత మొనర్చి భూరిగను సంపద లెన్నియొ కూడబెట్టినన్
మెలపది పొందబోడెవడు మేదిని బాపపు సంచయంబులౌ
కలుములు వాసినప్పుడె సుఖం బొనఁగూడును వాస్తవమ్మిదే.
పులిమినమాయలొంగకనుపోఁజనిలౌకికమందురాగమున్
రిప్లయితొలగించండితలకొనిరాముపాదములదాస్యముజేసెనుపోతనార్యుడున్
ఫలముగశాశ్వతంబునగుపారమునంటెగకీర్తిసంపదన్
కలుములువాసినప్పుడెసుఖంబొనగూడునువాస్తవంబిదే
రిప్లయితొలగించండితే.గీ:
తే.గీ:
పొలము దున్నినపుడె యిల పుట్టు తిండి
కులములను వీడిననె గలుగు నభివృద్ధి
తలుపు తెరచిన వీచు శీతల పవనము
కలుము లెడ(బాసి నప్పుడె కలుగు సుఖము.
మానవాళికి ధర్మమే మార్గమౌను
రిప్లయితొలగించండిధర్మ రక్షణే లక్ష్యమై తాను మెలగి
ధనము కూడబెట్టుట పైన ధ్యాస వీడి
కలుము లెడఁబాసి నప్పుడె కలుగు సుఖము
తలపులలోప్రలంభనము దారుణ జీవనశైలి తోడుతన్
తొలగించండికలుషితమార్గమెంచుకొని కాసులవేటకు సిద్ధమైతివా
విలువలు వీడకుండుటయె విజ్ఞత మానవ లోకమందునన్
కలుములు వాసినప్పుడె సుఖం బొనఁగూడును వాస్తవమ్మిదే
ఇడుము లెదు రౌ న నందురీ యిలను సతము
రిప్లయితొలగించండికలు ము లెడ బాసి నప్పుడె :: కలుగు సుఖము
కలిమి బలములు పెరిగిన గాల మందు
కలుగ వేనాడు కష్టాలు కల్ల గాదు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి
తొలగించండిమోహమందున పార్థుని యూహచిక్క
కల్మషంబెంచి కృష్ణయ్య జ్ఞానమెసఁగ
మహిత విజయమ్ము గాంచెను, మానసమునఁ
గలుము లెడఁబాసి నప్పుడె కలుగు సుఖము
చంపకమాల
బలమును గల్గియున్ మిగుల పార్థుఁడు సిక్కుచు మోహమందునన్
బలుచన గాగ యుద్ధమును బాసెద నంచనఁ గృష్ణమూర్తి తా
నిలిపియు గీతబోధనను నేర్పఁగ గెల్చెను, మానసంబునన్
గలుములు వాసినప్పుడె సుఖం బొనఁగూడును వాస్తవమ్మిదే
కలుము : కలుషగంధము (శబ్దరత్నాకరము)
✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*
పలు విధ మైన కార్యములు
రిప్లయితొలగించండిప్రాజ్యము సేసియు నెల్లవేళలన్
నిలుకడ వీడి మానవుడు నిక్కము
సంపద బెంచె మిక్కిలీ
కలిమియె శాంతి నిద్రలను గ్రన్నన
తోషము సేయు దూరమున్
కలుములు వాసినప్పుడె సుఖంబొన
గూడును వాస్తవంబిదే.
కరమునందునహెచ్చుగకాసులున్న
రిప్లయితొలగించండిగర్వము విపరీతమ్ముగ కలుగచేసి
కానని యటుల చేయును కన్ను మిన్ను
*“కలుము లెడఁబాసి నప్పుడె కలుగు సుఖము”*
చం.
రిప్లయితొలగించండితలచుచు పుత్రులన్ వెడలె దావమునన్ దృతరాష్ట్రుడీవితో
చెలువము దానధర్మముల జేయగ భార్గవ రాముడీగితో
సొలసిరి యజ్ఞముల్ సలిపి సొమ్ముల రాజులు ధారపోయగా
*కలుములు వాసినప్పుడె సుఖం బొనఁగూడును వాస్తవమ్మిదే.*
ఐహికములను వలలందు నాత్రపడక
రిప్లయితొలగించండినభవు దలచిన సతతము శుభములొదవు
బ్రతుకు బలిగొనెడు నరిషడ్వర్గములను
కలుము లెడఁబాసి నప్పుడె కలుగు సుఖము
తలపులలోననున్నతి యుదారత దీనజనావనంబునన్
రిప్లయితొలగించండికులముల హెచ్చుతగ్గులను గోడల గూల్చెడు శక్తి యుక్తులున్
గలిగినవాడె ధీయుతుఁడు కారణజన్ముఁడు, మానసమ్మునన్
కలుములు వాసినప్పుడె సుఖం బొనఁగూడును వాస్తవమ్మిదే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితే॥ ఇలను ధనయాతురత తోడ నిడుములఁ బడి
రిప్లయితొలగించండికపట రీతుల నొందఁగఁ గలుగదయ్య
అరయఁ బాప చింతన వీడ నమరునయ్య
కలుము లెడఁబాసి నప్పుడె కలుగు సుఖము
చం॥ కలిమినిఁ గోరి యాడుచును గల్లలు మోసము నెంచి ధాత్రిలో
విలువలు మాని సంపదలు వేలకు వేలుగ హెచ్చ వేయఁగా
నలసట తప్ప జీవమున కందదు సౌఖ్యము మానవా కనన్
కలుములు వాసినప్పుడె సుఖం బొనఁగూడును వాస్తవమ్మిదే
జీవము ఆత్మ
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
పెక్కు సంపద గల్గిన పెరుగు నహము
దొంగ భయము వలన నిద్ర దూరమగును
చెరువునందు కప్పల రీతి చేరు బంధు
వులును,మనసుకు శాంతియు నుండబోదు
కలుము లెడబాసి నప్పుడె కలుగు సుఖము.