13, జూన్ 2023, మంగళవారం

సమస్య - 4448

14-6-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అగ్నిశిఖాచయము మీఁద నాడెన్ శిశువే”
(లేదా...)
“అగ్నిశిఖాచయంబు పయి నాడెఁ గదా శిశువౌర నవ్వుచున్”

29 కామెంట్‌లు:

  1. కందం
    మగ్నమునై యాందోళన
    భగ్నము గౌరవమునకని భాస్కర వరము
    ద్విగ్న పృథ కాంచ, మాడుచు
    అగ్నిశిఖాచయము మీఁద, నాడెన్ శిశువే!


    ఉత్పలమాల
    మగ్నమునౌచు భీతిని నమాయక దృక్కుల దిక్కుతోచకే
    భగ్నమునయ్యె గారమని భాస్కరుఁ డిచ్చిన సూను గాంచ, ను
    ద్విగ్నము నందునన్ మదిని వేదన నిండఁగ మాడినట్లుగా
    నగ్నిశిఖాచయంబు పయి, నాడెఁ గదా శిశువౌర నవ్వుచున్!

    రిప్లయితొలగించండి
  2. భగ్నముజేయగకాళిని
    లగ్నముకుదిరెనుహరికినిలావునుగూల్చన్
    మగ్నమునాయెగనటనను
    అగ్నిశిఖాచయముమీదనాడెనుశిశువే

    రిప్లయితొలగించండి
  3. అగ్నిజ మందున చూపుల
    నగ్నికణమ్ములను రాల్చు హార్యపు మదమున్
    భగ్నమొనర్చగ వెన్నుడు
    అగ్నిశిఖాచయము మీఁద నాడెన్ శిశువే.

    అగ్నికణమ్మువోలె కనులందున క్రోధము రాల్చు సర్పమే
    యగ్నిజమందుదాగి యది యావుల మ్రింగుచునుండు దానినిన్
    భగ్నమొనర్చగా దలచి పయ్యర మేపరితానడంచగా
    అగ్నిశిఖాచయంబు పయి నాడెఁ గదా శిశువౌర నవ్వుచున్.

    రిప్లయితొలగించండి

  4. భగ్నము జేయగలేని ని
    మగ్నతతో జగతిగాచు మర్కుని రుచి సం
    లగ్నాలంబితమగు కా
    లాగ్నిశిఖాచయము మీఁద నాడెన్ శిశువే!

    రిప్లయితొలగించండి
  5. లగ్నముచేసి దృక్కులనరాతి సమూహముపైన బాలుడే
    భగ్నమొనర్చి తేరులను పంకజ మొగ్గరమందు జొచ్చె ను
    ద్విగ్నత పెచ్చరిల్ల నరివీరభయంకరుడై దురంబునం
    దగ్నిశిఖాచయంబు పయి నాడెఁ గదా శిశువౌర నవ్వుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'పంకజ మొగ్గరము' దుష్టసమాసం.

      తొలగించండి
  6. భగ్నపు జానకి దూకెను
    నగ్ని శిఖా చయము మీద :: నాడెను శిశువే
    మగ్నత గా తల్లి యొడిని
    లగ్నపు టానంద మొప్ప లాలితు డగు చున్

    రిప్లయితొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అగ్నిని చిందునట్టివగు నంబకముల్ ప్రసరించి బాలుడౌ
    నగ్నిజునంశ కృష్ణునట నంతముజేయ దలంచి కంసుడే
    మగ్నుడుగాగ వానిని ప్రమాథమొనర్చి విలాసమెంచి తా
    నగ్నిశిఖాచయంబుపయి నాడె గదా శిశువౌర నవ్వుచున్.

    రిప్లయితొలగించండి
  8. లగ్నమొనర్చెను దృక్కుల
    భగ్నము చేయంగ వైరి పద్మవ్యూహం
    బగ్నులెగయు శరములతో
    నగ్నిశిఖాచయము మీఁద నాడెన్ శిశువే

    రిప్లయితొలగించండి
  9. సాగ్నికునియింటనొక శుభ
    లగ్నంబునఁ బుట్టెశిశువు రమణీయముగా
    అగ్నిజమేనని మురియగ
    అగ్నిశిఖాచయము మీఁద నాడెన్ శిశువే

    రిప్లయితొలగించండి
  10. అగ్నికణములుగ దీపిలె
    నగ్నిశిఖలు దీపకాంతులందు మెరయుచున్
    భగ్నము కాకుండ బసగ
    నగ్నిశిఖాచయము మీఁద నాడెన్ శిశువే

    అగ్నిశిఖ = కుంకుమపువ్వు

    రిప్లయితొలగించండి
  11. కం॥ అగ్నికి యాహుతి చేసెను
    లగ్నము నెంచి సుతుని ప్రహలాదుని పితయే!
    నగ్నముగా నందరుఁ గన
    నగ్ని శిఖాశయము మీఁద నాడెన్ శిశువే!

    ఉ॥ భగ్నము గాఁగ తండ్రి మది బాలుఁడటంచును దల్పఁడేలనో
    అగ్నిశిఖాచయంబునకు నాహుతిఁ జేయఁగ నెంచెఁ దండ్రియే
    లగ్నముఁ జూచి త్రోయఁగను లాంఛన నెంచకఁ బుత్రునగ్నిపై
    అగ్నిశిఖాచయంబు పయి నాడెఁ గదా శిశువౌర నవ్వుచున్

    లాంఛన. అపకీర్తి (నిఘంటువు సహాయమండి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'అగ్నికి నాహుతి..' అనండి. ప్రహ్లాదుని ప్రహలాదుడు అనరాదు.

      తొలగించండి
    2. ధన్యవాదములండి తప్పులు తెలుసుకుంటే దిద్దుకోవడం సరళమౌతుంది

      తొలగించండి
  12. లగ్నము కాగా ప్రజ సం
    లగ్నాంబిత మనసు గలిగి లాలన తోడన్
    భగ్నము సేయుచు మంటల
    నగ్నిశిఖాచయము మీఁద నాడెన్ శిశువే

    రిప్లయితొలగించండి
  13. మగ్నులు సేయుచున్జనుల మంటల నార్పుచు, భీకరంబుగా
    నగ్నిశిఖాచయంబు పయి నాడెఁ గదా శిశువౌర నవ్వుచున్
    లగ్న మనస్కులైన ప్రజ లాలన తోడను ముద్దులీయగా
    భగ్నముసేసి మంటలను భర్గుని వేడుచు దూకెఁదానుగా

    రిప్లయితొలగించండి
  14. లగ్నముచేసి దృక్కులనరాతి సమూహముపైన బాలుడే
    భగ్నమొనర్చి తేరులనుపద్మఁపు వ్యూహమునందు జొచ్చె ను
    ద్విగ్నత పెచ్చరిల్ల నరివీరభయంకరుడై దురంబునం
    దగ్నిశిఖాచయంబు పయినాడెఁ గదా శిశువౌర నవ్వుచున్

    రిప్లయితొలగించండి