24, జూన్ 2023, శనివారం

సమస్య - 4458

25-6-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వానలు సాగరముపైనఁ బడిన హితంబౌ”
(లేదా...)
“వానలు పెక్కు సాగరముపైఁ గురియన్ ఫలియించు సస్యముల్”

15 కామెంట్‌లు:

  1. చేనుకుచేటదిచూడగ
    వానలుసాగరముపైనబడిన, హితంబౌ
    బానలుకాల్వలునిండిన
    కానగవచ్చునుఫలితముఘనముగరైతున్

    రిప్లయితొలగించండి
  2. కందం
    మానక సిరులను గురిసిన
    దీనులఁ గావంగ నొప్పు దేవుఁడు, నెండన్
    బూనిక పొలాల, దాటుచు
    వానలు సాగరము, పైనఁ బడిన హితంబౌ!

    ఉత్పలమాల
    మానక సంపదల్ గురియ మంచిని గూర్చుట సత్యమైనటుల్
    దీనుల గావగన్ మిగుల తృప్తిగ మాధవసేవయేయగున్
    బూనిక నెండు పంటలకు పోయగ ప్రాణము సాగి దాటుచున్
    వానలు పెక్కు సాగరముపైఁ, గురియన్ ఫలియించు సస్యముల్

    రిప్లయితొలగించండి
  3. ఈ నేల రాలిన చినుకు
    జ్యానిగ ప్రవహించుచు వ్యవసాయికి ఫలసా
    యానికి తోడ్పడు మరి యా
    వానలు సాగరముపైనఁ బడిన హితంబౌ?


    జ్యానిగ మారి పారి వ్యవసాయికి సేద్యము నందు భూరి యు
    ద్యానము నిచ్చుగాదె జలధారగ మారుచు సేద్యమందునన్
    క్షోణిని రాలినట్టి చినుకుల్ మరి యెట్టి ప్రయోజనమ్మవే
    వానలు పెక్కు సాగరముపైఁ గురియన్, ఫలియించు సస్యముల్?

    రిప్లయితొలగించండి
  4. కానము సుంతయు లాభము
    వానలు సాగరముపైనఁ బడిన ; హితంబౌ
    సోనలు నేలపయి గురియ,
    జేనులు బదునొంది పంట
    జిమ్మగబండున్

    రిప్లయితొలగించండి
  5. ఏ నాడు ను లాభ మగునె
    వానలు సాగరము పైన గురియ :: హితంబౌ
    చేనుల మీదను గురిసిన
    వానలు హర్షము నొసగును వసుధను సతమున్

    రిప్లయితొలగించండి
  6. రైతు పొలము నిండ పసుపు
    కోతకు రాగనె మనసున కోరిన పంటన్
    చేతికి వచ్చే వేళలొ
    వానలు సాగరము పైన బడిన హితంబౌ

    రిప్లయితొలగించండి
  7. ఉ.

    దీనుడు ద్రౌణి, యీశ్వరుడు దేవుడు, భూతముగా దృశించగా
    న్యూనత యెద్ధియో? శిలులు నోటిని మ్రింగగ భ్రాంతినొందెనే
    పూనిక వీడగా శరణు పొందెను ఖడ్గము వైరశుద్ధికై
    *వానలు పెక్కు సాగరముపైఁ గురియన్ ఫలియించు సస్యముల్.*

    రిప్లయితొలగించండి
  8. వానాకాలముమొదలై
    వానలునగరానకురియ వచ్చుఁ వరదలే
    వానలతిప్పలుతొలగగ
    వానలు సాగరముపైనఁ బడిన హితంబౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వానలు జల్లులైకురిసి వాగులు వంకలు చేరకుండునా
      కానలు వృద్ధినొందుగద కాలము తప్పక వానలొచ్చినన్
      వానలు పెక్కు సాగరముపైఁ గురియన్ ఫలియించు సస్యముల్
      చేనుకు ప్రాప్తమౌనుగద సేద్యముకైతగునీరు మెండుగా

      [సాగరము = సంవత్సరము పొడుగున నీరుండు పెద్ద చెరువు]

      తొలగించండి
  9. వానలు కురిసిన దండిగ
    చేను పులకరించి రైతు సిరులను పెంచున్
    చేనును తడపక నేవిధి
    వానలు సాగరముపైనఁ బడిన హితంబౌ?

    రిప్లయితొలగించండి
  10. చేనుకు నీటిపారుదల చేకురు వానలు వెల్లువైనచో
    పూనికతోడరైతు తన భూమిని సల్పెడు సేద్యమందునన్
    వానలె జీవధారలవి వావిరి సత్ఫలమిచ్చు నెవ్విధిన్
    వానలు పెక్కు సాగరముపైఁ గురియన్ ఫలియించు సస్యముల్?

    రిప్లయితొలగించండి
  11. వానలు రాక కర్షకుల వ్రాతము
    పంటల గూర్చి చింతిలెన్
    వానలు లేక ప్రాణులతి బాధలు
    జెందిరి యెండవేడిచే
    వానలు చాల జాప్యముగ వచ్చెను
    మిక్కలి గాని యెట్టు లా
    వానలు పెక్కు సాగరముపై గురవన్
    ఫలియించు సస్యముల్ ?

    రిప్లయితొలగించండి
  12. కానము చినుకుల వేగము
    వానలు సాగరముపైనఁ బడిన, హితంబౌ”
    మానము రక్షణ కొఱకుగ
    మానినులొక్కరగుచునిల మమతను మెలగన్

    రిప్లయితొలగించండి
  13. కూనపు రెడ్డిచారులత! కుర్యుట వానలు సాగ రంబు పై
    కానన మందు వెన్నెలయు గాచిన వ్యర్ధమ యౌను గాదె , యా
    వానలు కుర్వ బాగుగను బంటలు పండును జక్కగానిలన్
    వానలు పెక్కు సాగరముపైఁ గురియన్ ఫలియించు సస్యముల్?

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    భానుడు గొని యుధది జలము
    పూని కురియజేయు మేఘములతో వానల్
    కానలకు పంటచేలకు;
    వానలు సాగరముపైనఁ బడిన హితంబౌ.

    రిప్లయితొలగించండి