17, జూన్ 2023, శనివారం

సమస్య - 4452

18-6-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఇద్దఱు సతులున్న వాఁడె యిల ధన్యుఁ డగున్”
(లేదా...)
“ఇద్దఱు భార్యలున్న పతియే స్థిరమౌ సుఖశాంతులం గనున్”

40 కామెంట్‌లు:

  1. వద్దనవత్తురు భక్తులు
    పెద్దగవానినితలతురుభేదములేకన్
    అద్దిర! వేంకనయాతఁడు
    ఇద్దరుసతులున్నవాడెయిలధన్యుడగున్

    రిప్లయితొలగించండి

  2. దుద్దుర దేహార్థమ్మున
    ముద్దుగ తలపైనగంగ ప్రోయాలులుగా
    నొద్దికగను గలిగి శివుం
    డిద్దఱు సతులున్న వాఁడె, యిల ధన్యుఁ డగున్.

    రిప్లయితొలగించండి
  3. ముద్దుగ వైరాగ్యంబును
    అద్దిన జ్ఞానంబు తోడ అలరిన జనుడై
    ఇద్దరు సతులన్ననివి యె
    ఇద్దఱు సతులున్న వాఁడె యిల ధన్యుఁ డగున్”

    రిప్లయితొలగించండి
  4. ముద్దుగశ్రీనివాసునికిమోమునవెల్గుగపద్మయుండెగా
    గద్దెనుజేసివక్షమునుకామనలక్ష్మియుజేరినిల్చెనే
    వద్దనరానిమోహమునవల్లభుడయ్యెగయేడుకొండలన్
    ఇద్దరు భార్యలు
    న్నపతియేస్థిరమౌ ుఖశాంతులన్గనున్

    రిప్లయితొలగించండి
  5. కందం
    పద్దతి మీరని భక్తుడు,
    నిద్దురనైన జపియింప నీరజనేత్రున్
    రద్దగు పాపము గావఁగ
    నిద్దఱు సతులున్నవాడె, యిల ధన్యుఁడగున్

    ఉత్పలమాల
    పద్దతి మీరకుండగ సభక్తిని తిర్మల మేంకటేశ్వరున్
    నిద్దురనైన నామములనేకము దల్చుచు మ్రొక్క దీనుడున్
    రద్దగు పాప సంచయము, రాజిల జేయగ జీవితమ్ము నా
    ఇద్దఱు భార్యలున్న పతియే, స్థిరమౌ సుఖశాంతులం గనున్

    రిప్లయితొలగించండి
  6. తద్దయు భక్తి ప్ర పత్తి గ
    కుద్దుగ వేంక ట రమణు ని గొలుతురు గదరా
    యద్దిర! యోచిo పంగా
    నిద్దఱు స తు లు న్న వాడె యిలధన్యుడగున్

    రిప్లయితొలగించండి
  7. నిద్దుర శాంతి సౌఖ్యములు నిక్కము
    చెంతకు రావు మూర్ఖులౌ
    యిద్దరు భార్యలున్న, పతియే స్థిరమౌ
    సుఖశాంతులన్ గనున్
    ఒద్దిక కల్గినట్టి సతి యొక్కతె
    యున్నను జీవితాంతమున్
    ముద్దుగ నడ్చు గాపురము మోదము
    గల్గును సజ్జనాత్ముడౌ

    రిప్లయితొలగించండి
  8. ఉ.

    ముద్దుగ వంట సేయు సతి ముఖ్యము రోగ నివారణంబగున్
    విద్దెను నేర్వ రంభ రతి విద్యను సౌఖ్యము నిచ్చు రీతిలో
    మద్దతు నిచ్చు భార్యలను మక్కువ గొల్పెడి భాగ్యమే కదా
    *ఇద్దఱు భార్యలున్న పతియే స్థిరమౌ సుఖశాంతులం గనున్.*

    రిప్లయితొలగించండి
  9. ఋద్ధుఁడు లక్ష్మియు భూమియు
    నిద్దఱు సతులున్నవాఁడె! యిల ధన్యుఁడగున్
    శ్రద్ధగ నా విష్ణుని తన
    బుద్ధిని నిల్పికొని కొలుచు పూరుషుఁడు సదా!

    రిప్లయితొలగించండి

  10. ఒద్దికగా శిరమ్ము పయి నొక్కతె స్వర్ధుని దాచి పేరిమిన్
    దుద్దుర కిచ్చె శూలి యగు ధూర్జటి దేహపు నర్ధభాగమం
    చిధ్ధరణిన్ వచింత్రుగద యెందరొ పెద్దలు గాంచ భర్గుడే
    యిద్దఱు భార్యలున్న పతియే, స్థిరమౌ సుఖశాంతులం గనున్.

    రిప్లయితొలగించండి
  11. హద్దుల లోబడి యుండును
    నిద్దఱు సతులున్న వాఁడె ; యిల ధన్యుఁ డగున్
    కొద్దిగ సహనము జూపగ
    ముద్దుగ సంసారముండి పొచ్చెము లేకన్

    రిప్లయితొలగించండి
  12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పెద్దలుచెప్పుమాటవిని విజ్ఞత తోడ మెలంగు వాడు సం
      సిద్ధత తోడ ధీమసము ఛిద్రత నొందని జాగరూకుడై
      ముద్దుల భార్యలిద్దరికి మోదము కూర్చెడి భాగ్యమున్నచో
      ఇద్దఱు భార్యలున్న పతియే స్థిరమౌ సుఖశాంతులం గనున్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      "నడుమను" అనండి.

      తొలగించండి
    3. ఇద్దరు భార్యల నడుమను
      సద్దుకొను మెలకువగలిగి సంసారములో
      గ్రుద్దులు తప్పించు కొనిన
      నిద్దఱు సతులున్న వాఁడె యిల ధన్యుఁ డగున్

      తొలగించండి
  13. ముద్దుగ పెక్కురు సతులతొ
    నొద్దికకాపురము సేయనొప్పు సురలకున్
    వద్దుర మానవ యేవిధి
    నిద్దఱు సతులున్న వాఁడె యిల ధన్యుఁ డగున్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సతులతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు.

      తొలగించండి
    2. పెక్కు సతులతో అని మారుస్తాను గురువుగారూ 🙏🏿

      తొలగించండి
  14. ఇద్దఱు భార్యలున్నశివుడేమి సుఖంబులనొందె? కేశవుం
    డిద్దరు భార్యలంబడసియేవిధి సౌఖ్యమునొందె ద్వాపరన్?
    ముద్దుగ నొక్కభార్యయినమోదము జేకురు చాలు చాలునిం
    కిద్దఱు భార్యలున్నపతి యే స్థిరమౌ సుఖశాంతులం గనున్?

    రిప్లయితొలగించండి


  15. (1)కం:ప్రొద్దుటనే రణముల బడు
    నిద్దరు సతు లున్న వాడె, యిల ధన్యు డగున్
    ముద్దు లొలుకు నొక సతితో
    నొద్దిక తో చిలిపి తగవు లోర్చెడు నరుడే.
    (ఒకే భార్య ఉంటే తగవులు రావని కాదు.ఇద్దరు భార్యలతో వచ్చే తగవుల కన్నా ఒక్క భార్య తో వచ్చే చిన్న తగవులు నయం అని.)

    (2)ఉ:ముద్దుగ నుండె నీదు సతి,మోహము జెంది పరిగ్రహించుటే
    వద్దు మరొక్క కాంతను,శుభమ్ముల బాపుచు వైర మౌను మీ
    యిద్దరి కిద్దరే సుతుల నింపుగ బొందక నల్గు రేల రా?
    *ఇద్దఱు భార్యలున్న పతి యే స్థిరమౌ సుఖశాంతులం గనున్?
    (ఏ స్థిరమౌ సుఖశాంతులన్    గనున్ 
    ?అని ప్రశ్న)





    రిప్లయితొలగించండి
  16. కం॥ యద్ధముఁ జూచును గృహమున
    నిద్దరు సతులున్న వాఁడె, యిలధన్యుడగున్
    ముద్దుగ సర్దుకొను పడతి
    యొద్దికఁ గలిగి మను భార్య యొక్కరె యున్నన్

    ఉ॥ హద్దులు లేని యాశలను యుద్ధముఁ జేయఁగ నేఁడు భార్యయే
    నిద్దుర దూరమాయెఁ గద నెచ్చెలు లిద్దరు గాఁగ శూన్యమౌ
    నిద్దరు భార్యలున్న పతికే, స్థిరమౌ సుఖశాంతులం గనున్
    ముద్దుల భార్యకుండగను బొందిక సర్దుకు పోవు నేర్పుయున్

    రిప్లయితొలగించండి
  17. సిద్ధియు! బుద్ధియు! గణపతి
    "యిద్దఱు సతులున్న వాఁడె! యిల ధన్యుఁడగున్"
    ఒద్దిక నా విఘ్నేశుని
    శ్రద్ధగ మది నిల్పి కొలుచు సజ్జనుఁడు సదా!

    రిప్లయితొలగించండి
  18. తద్దయు బాధకు గురియగు
    నిద్దఱు సతులున్న వాఁడె, యిల ధన్యుఁ డగున్
    ముద్దుగ నింపుగఁగనబడి
    హద్దులనే దాటకుండు నాలియె గలచో

    రిప్లయితొలగించండి
  19. వద్దను కున్న చేతురిక వంతుల వారిగ సేవలెన్నియో
    ముద్దుల తోడ ముంచియును మోములు మోముల చుంబనంబులన్
    దద్దిన మంత యున్ గలిసి తద్దయు హాయిని బొందు చుండుగా
    యిద్దఱు భార్యలున్న పతియే స్థిరమౌ సుఖశాంతులం గనున్”

    రిప్లయితొలగించండి
  20. ముద్దుగసిరిధరలనియెడు
    ఇద్దరుసతులున్నవాడుయిలధన్యుడగున్
    సద్దునుచేయకసేవల
    నొద్దికగాచేయహరియునొసగునువరముల్



    రిప్లయితొలగించండి

  21. కం:
    ఒద్దిక తోడనె మెలగుచు
    బుద్ధిగ కాపురము జేయు పుణ్యవతులు తా
    మిద్దరొకటైనయడ నా
    యిద్దఱు సతులున్న వాఁడె యిల ధన్యుఁ డగున్”

    రిప్లయితొలగించండి