27, జూన్ 2023, మంగళవారం

న్యస్తాక్షరి - 81

28-6-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
పాదాద్యక్షరాలుగా 'కా-కీ-కూ-కే' లను న్యస్తం చేస్తూ
సకాలంలో వర్షాలు పడక బాధపడే రైతులను గురించి
ఉత్పలమాల లేదా కందం వ్రాయండి

21 కామెంట్‌లు:



  1. కాలిననేలవిత్తులనుకైకొనదెప్పుడునీరులేకయున్
    కీలకమయ్యెవర్షమునుకించితుజాలినిచూపుదేవరా
    కూలదునాదుజీవితముగుప్పెడుధాన్యముచేతికందినన్
    కేలునుమోడ్చిమ్రొక్కెదనుకేకనుబెట్టుమమేఘమావడిన్

    రిప్లయితొలగించండి
  2. కాలము తప్పిన వానలు
    కీలక దశలో కురియగ కృషికుల వెతలన్
    కూలఁబడునేతలెరిగిన
    కేలుమొగియు నెపుడుగాని కేండ్రించరుగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కారకులైరి రైతులిట క్షామనివారణ యోగమందునన్
      కీరితినొందిరే సతము కీలక మైన కృషీవలుల్ భళా
      కూరిమితోడ పంటలను కోరికమేరకు పెంచబోవగా
      కేరడ మైనదే కడకు కేవల వర్షపు జూదమందునన్

      తొలగించండి
  3. కందం
    కాడుపడి కృషీవలులే,
    కీడును కలిగింప కరువు గిలగిలఁ గడకా
    కూడైన దక్కదన మా
    కేడుపె దిక్కని కుమిలిరి ఋణ పీడితులై

    ఉత్పలమాల
    కాడుపడన్ కృషీవలులు క్షామము నందున నాలుగేళ్లు నా
    కీడును దాటకే ఋణపుకిస్తులు కట్టగ భారమైననే
    కూడుకు సైతమున్ వగచి క్రుంగచు వేదన జిక్కి యింక మా
    కేడుపె దిక్కనన్ గుముల నెంతకు రాలవు కళ్లనీళ్లహో!

    రిప్లయితొలగించండి
  4. కాలము దుర్భ ర మయ్యెను
    కీలక సమయాన వాన కీడొ న రించె న్
    కూ లెను జీవితమను చున్
    కేలులు మోడ్చియును వేడె కీ డు ను బాపన్

    రిప్లయితొలగించండి
  5. ఉ.

    కాటక కష్టముల్ పెనగ కైవశమౌ జనులందు దుఃఖమే
    కీటక బాధ సస్యమున గీడు సకాలపు వర్షణమ్ముగా
    కూటువు రైతుజాతి సరి కోరిక సేద్యము పైరువృధ్ధికై
    కేటము రోగబంధములు కేకలు కాపులు మోయు భారముల్.

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. కాలాతీతము జరిగెను
    కీలకమీ సమయమింక కీడగు, కొంపల్
    గూలునిక వాన గురియక,
    కేలెత్తి యడిగెద వాన గురిపించు ప్రభూ.

    రిప్లయితొలగించండి
  8. కానల నరికేరు చలా
    కీ నేతలు వాన లేక కేలాడదుగా
    కూనకు కూడు ఫలము లే
    కే నా రైతు పలు వెతలకే దీర్చు శివా

    రిప్లయితొలగించండి


  9. *ఉత్పలమాల*

    కాలము జారె నిందుభపు కార్తె ముగించుచునుండనేమిరా
    కీలకమైన వర్షమది కిక్కురు పెట్టుచు మొండికేయగా
    కూళుల మైతిమే యిపుడు కొండ్రను నాగలి సాగుటెట్టులో?
    కేలుల మోడ్చి మ్రొక్కెదము కేశుడ రమ్ము ధరిత్రికిన్ వడిన్.

    *కందం*

    కాలాతీతంబయ్యెను
    కీలకమౌవర్షమదియె క్షేత్రము తడుపన్
    కూలెను మా యాశలవియె
    కేలుల మోడ్చుచు పిలిచితి కేశుడ రారా!

    రిప్లయితొలగించండి
  10. కాలము వచ్చెను కృషికయి
    కీలకమగు జలము చేను కెడ లేదుగదా
    కూలెనిక యాశ లన్నియు
    కేలొసగి కమతము విడెద క్లేశము తోడన్

    రిప్లయితొలగించండి
  11. కాలము కాటువేసినది కర్షకలోకము క్షామ పాథపుం
    కీలలయందు జిక్కుకొని క్లేశములంబడి కూటికోసమై
    కూలికి బోవుదుస్థితికి క్రుంగిరి నేటికి దైవమా నినున్
    కేలును మోడ్చి మ్రొక్కెదము క్షేమముఁగూర్చుము కుంభవృష్టితో

    రిప్లయితొలగించండి
  12. కం॥ కర్షకులు సకాలములో
    వర్షములు కొరవడి కీడుఁ బడసిరి యకటా
    కర్షక బాధలు కూడెను
    వర్షముఁ గురిపించు కేశవా కృపఁ గనుమా

    ఉ॥ కాలము మారె వానలు సకాలములో పడ వాయె హాలికుల్
    రాలిరి కేశవా కనుము రంపపు కోతను బెట్టు కీడుతో
    చాలని కూడుగుడ్డ కని చాకిరిఁ జేసిరి కూలివారుగా
    నేలను నమ్ము హాలికుల నేస్తము నాప్తుఁడుఁ గమ్ము కేశవా

    రిప్లయితొలగించండి
  13. కాలము గాక పోయెను సకాలము
    లోపల కర్షకాలియున్
    కీలక వృత్తి సాగకను ఖిన్నత
    జెందియు పొట్టకోసమై
    కూలికి పోవుచుండ్రిగద గోడును
    జూసియు వానదేవుడా
    కేలును దోయిలించెదము
    క్లిష్ట పరిస్థితినుండి బ్రోచుమా!

    రిప్లయితొలగించండి
  14. కాలము మారిపోయినది కర్షక కోటికి హెచ్చె కష్టముల్
    కీలకమైన వర్షములు కీడ్పడ విత్తెడు కాలమందునన్
    కూలుచు నుండ కర్షకుల కోరిక లన్ని కమమ్ముతప్పుచున్
    కేళిక లాడగా ప్రకృతి గిట్టుచు నుండిరి రైతుబాంధవుల్

    రిప్లయితొలగించండి
  15. కాలము గడ్డుగ మారెను
    గీలకమగు సమయమందు కీడొనరించెన్
    గూలికి వచ్చిన వారలు
    గేల్జాపిన బలుక వలయు కిరికిరి మాటల్

    రిప్లయితొలగించండి
  16. కాలము మారెగడ్డుగను గానగ చేలను నెండి పోయెనే
    గీలక మౌజలంబులును గీడునుజేసెను వానలేమిచే
    కూలికి వచ్చువారలకు కూలినినీయగ గష్షమాయెనే
    కేలను జాచగా నిడక కిర్కిరి మాటలు పల్క నొప్పునే?

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    కాలమున కురియు వర్షము
    కీలక సమయమున లేక కీడును కలిగెన్
    కూలియు దొరకదిపుడు మా
    కేలనొ కష్టమని రైతు ఖేదమునొందెన్.

    రిప్లయితొలగించండి