11, జూన్ 2023, ఆదివారం

సమస్య - 4446

12-6-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దుఃఖముఁ గల్గించు జనుల దుష్టులనకుమా”
(లేదా...)
“దుఃఖముఁ గూర్చువారిఁ గని దుష్టులటంచును దూరఁబోకుమా”

15 కామెంట్‌లు:

  1. దుఃఖము జీవికి సహజము
    దుఃఖము సాంత్వన నొసగుట దుశ్శకమౌనా
    దుఃఖము మానస జనితము
    దుఃఖముఁ గల్గించు జనుల దుష్టులనకుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దుఃఖము సర్వజీవులను తొప్పఱలాడగ జేయు గాంచినన్
      దుఃఖము సాంత్వనంబిడుట దుశ్శకమా పసరించి చూచినన్
      దుఃఖము జన్మమొందుగద దుఃఖిత జీవికిఁ మానసంబునన్
      దుఃఖముఁ గూర్చువారిఁ గని దుష్టులంచును దూరఁబోకుమా

      తొలగించండి
  2. దుఃఖితులకు పీడితులకు
    దుఃఖమునణచెడు వెరవును దోఁపింప మహా
    దుఃఖశమనమునకై చిరు
    దుఃఖముఁ గల్గించు జనుల దుష్టులనకుమా

    రిప్లయితొలగించండి

  3. దుఃఖము కలిగించెడి యం
    తఃకరణమ్మదియె లేని త్రాష్టుల నెతుడున్
    దుఃఖము నణచుకొనుచు నా
    దుఃఖముఁ గల్గించు జనుల దుష్టులనకుమా.


    దుఃఖము కల్గజేయు కడు దుష్టులు వారలు భూమియందు నం
    తఃకరణమ్ములేని యకృతాత్ములు ప్రాణము తీయు వారలే
    దుఃఖితులార కూడదిది దొమ్మియె, మౌనమె మేలు గావునన్
    దుఃఖముఁ గూర్చువారిఁ గని దుష్టులటంచును దూరఁబోకుమా.

    రిప్లయితొలగించండి
  4. దు:ఖము పేదవారలని దుర్జను
    లంచును జూడదెప్పుడున్
    దు:ఖము గల్గు భాగ్యములతో
    తులతూగెడు సజ్జనాళికిన్
    దు:ఖము లేని మానవుడు దొర్కడు
    భూతలమందు నెక్కడన్
    దు:ఖము గూర్చువారలను ధూర్తు
    లటంచును దూరబోకుమా

    రిప్లయితొలగించండి
  5. దుఃఖి o చు వారి గాంచుచు
    దుఃఖ ము. నెడబాప నెంచి దోహద పరులై
    దుఃఖ పు కార కు ల కిలను
    దుఃఖ ము గల్గించు జనుల దుష్టు లన కు మా!

    రిప్లయితొలగించండి
  6. ఆఖరుకు భామల యొడలి
    మేఖలలను దొంగిలించ మేకొను చుండన్
    నా ఖలుని యెదిరి వానికి
    దుఃఖముఁ గల్గించు జనుల దుష్టులనకుమా

    రిప్లయితొలగించండి
  7. దుఃఖము తథ్యమీ జగతిఁ దుష్టుల సంగతమందు నిచ్చలున్
    దుఃఖితులైన వారియెడ దోషములెంచక సానుభూతితో
    దుఃఖమడంచగానెలమి దుస్సహమౌ వెతఁబాప స్వల్పమౌ
    దుఃఖముఁ గూర్చువారిఁ గని దుష్టులటంచును దూరఁబోకుమా

    రిప్లయితొలగించండి
  8. కందం
    దుఃఖమసూయా జనితము
    దుఃఖముఁ మానవ సహజము దుఃఖముఁ మాయౌ
    దుఃఖాంతము జ్ఞానంబే
    దుఃఖముఁ గల్గించు జనుల దుష్టులనకుమా

    రిప్లయితొలగించండి
  9. కం॥ దుఃఖము మనో వికారము
    దఃఖము కలుగును గురువులు దోషములెంచన్
    దుఃఖమగు భార్య యలిగిన
    దుఃఖముఁ గల్గించు జనుల దుష్టులనుకుమా!

    ఉ॥ దుఃఖము కల్గుఁ బిల్లలును దుంటరి చేష్టల మొండిఁ జేసినన్
    దుఃఖము కల్గుఁ దప్పులను దోషములన్ గని శ్రేష్ఠ నొచ్చినన్
    దుఃఖము కల్గుఁ బత్ని నిను దూరము పెట్టఁగ నల్కఁబూనుచున్
    దుఃఖముఁ గూర్చువారిఁ గని దుష్టులటంచును దూరఁబోకుమా

    రిప్లయితొలగించండి
  10. దుఃఖము మనిషికి సహజము
    దుఃఖమువేదనలనెల్లదూరముచేయున్
    దుఃఖపువార్తలతెలుపుచు
    దుఃఖముకల్గించుజనులదుష్టులనకుమా

    రిప్లయితొలగించండి
  11. కందం
    దుఃఖములందునఁ గ్రుంగఁగ
    దుఃఖము దీర్ప నగధరుఁడు తోడుగ, పృథయే
    దుఃఖము గోరె హరి నరసి
    దుఃఖముఁ గల్గించు జనుల దుష్టులనకుమా

    ఉత్పలమాల
    దుఃఖములందునన్ దమరె తోడుగ నుండియు చింత దీర్ప నా
    దుఃఖము గాదె కృష్ణ! మిముఁ దొల్లిట దగ్గర జేసెనంచు నా
    దుఃఖమె కోరె కుంతి మును, తోయజనేత్రుని నండనుంచెడున్
    దుఃఖముఁ గూర్చువారిఁ గని దుష్టులటంచును దూరఁబోకుమా

    రిప్లయితొలగించండి

  12. తే:
    చనుచు దుఃఖముఁ గల్గించు జనుల దుష్టు
    లనకుమా, దాపురించ కాలమెవరైన
    జనవలసి వచ్చు పరలోకమునకు, తర్ప
    ణమిడి వారిని తలచుకొనవలె నెపుడు.

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    దుఃఖము బ్రతుకున సహజము
    దుఃఖమ్మెదలోని వెతను దూరము చేయున్
    దుఃఖము కర్మానుగతము
    దుఃఖముఁ గల్గించు జనుల దుష్టు లనకుమా!

    రిప్లయితొలగించండి