8, ఫిబ్రవరి 2024, గురువారం

సమస్య - 4670

9-2-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చింకిబొంతలే జాతిసంస్కృతినిఁ జాటు”
(లేదా...)
“మానవజాతి సంస్కృతికి మాన్యతఁ గూర్చును చింకిబొంతలే”

37 కామెంట్‌లు:

BMahalakshmi చెప్పారు...

హలముబట్టెను రైతుగా హంగు లేక
అతనిపత్నియుగౌరియైయందగించు
మట్టియందలిబిడ్డడు మాణికంబు
చింకిబొంతలే జాతిసంస్క్రుతినిచాటు

విరించి చెప్పారు...


నలుగురు గని మెచ్చువిధము నడుచు కొనుట
మేలు సోదరా నామాచ లాలకించి
వాసి వలువ గట్టుచు నిక వదలమనుచు
చింకి బొంతలే, జాతి సంస్కృతిఁ జాటు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
పనికిరావన్న బట్టలన్ పటిమతోడ
తీర్చి దిద్దగ రూపమ్ము మార్చి వాడ
సేదతీర్చె వృధానాపి చెల్లి శయ్య!
చింకిబొంతలే జాతిసంస్కృతినిఁ జాటు!


ఉత్పలమాల
ప్రాణికి నొప్పకే పనికి రావను చీలికలైన బట్టలన్
పూని వృధా నొనర్పక సమూలముగా తమ రూపు మార్చగన్
మేనికి హాయినిచ్చునొక మేలగు ప్రక్కయె సిద్ధమౌచు నీ
మానవజాతి సంస్కృతికి మాన్యతఁ గూర్చును చింకిబొంతలే!

Sitharamayya Solasa చెప్పారు...

సీతు నాపగ కంబళి చిక్కనియెడ
నొనరి యుండిన దానితో నొకరి కొకరి
ప్రక్క కొడగూడి చక్కగ పంచు కొనెడి
చింకిబొంతలే జాతిసంస్కృతినిఁ జాటు

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

జాతి కన్నము బెట్టెడు జాణ యగుచు
నిరత మును శ్రమి యించు చు నీరశించి
కట్టు కొనుటకు సరియైన బట్ట లేక
చింకి బొంతలే జాతి సంస్కృతి ని జాటు

రామోక్తం చెప్పారు...

పెంకి పాశ్చాత్య పోకడల్ వెల్లువెత్తి
గ్రుంకి యాచార వ్యవహార మంకెగొనగ
బంక మట్టితో చేసిన ప్రతిమలున్ను
చింకిబొంతలే జాతిసంస్కృతినిఁ జాటు

విరించి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విరించి చెప్పారు...

వాననకుండ నెండనక బాధలె సౌఖ్యమటంచు నెంచుచున్
చేనుల జేరి సేద్యమున స్వేదపు ధారల రాల్చు రైతులే
మేనును దాల్చు వస్త్రములు మేటివి కావని చెప్పనేలరా
మానవజాతి సంస్కృతికి మాన్యతఁ గూర్చును చింకిబొంతలే.

M.B.G.TILAK చెప్పారు...

నాటి జీవన శైలియే నాటి చరిత
నాటి వల్వలే చాటును నాగరికత
సంబరములఁ సూచించు చీనాంబరములు
చింకిబొంతలే జాతిసంస్కృతినిఁ జాటు

మానవ జాతి సంస్కృతికి మాన్యతఁ గూర్చును వస్త్ర ధారణే
కానిట గానవచ్చుగద కంతలు కల్గిన వల్వలెన్నియో
మేనికి శోభగూర్చునని మెత్తురు గంతకు తగ్గ బొంతలై
'మా నవజాతి సంస్కృతికి మాన్యతఁ గూర్చును చింకిబొంతలే'

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

వ్యర్థపరుపక చివికిన వస్త్రములను
కోరి బొంతలుగా నాడు గూర్చువారు
ధనముకన్నను మిన్న వాత్సల్యమనఁగ
చింకిబొంతలే జాతిసంస్కృతినిఁ జాటు

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

పూనికఁ బ్రాఁతలన్ గలిపి బొంతలుగా సమకూర్చి రల్మిలిన్
మేనికి సౌఖ్యమీయగను మేలొనగూర్చ నివేశనమ్ములన్
మానవజాతి సంస్కృతికి మాన్యతఁ గూర్చును చింకిబొంతలే
కానము నేడు బొంతలను కాలముదెచ్చెను స్పాంజి పాన్పులన్

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

తే॥ కప్పుకొనుటకు బట్టలు కరవు కాఁగ
పేద వాండ్రను గాంచఁగఁ బెన్నిధిగను
నాగరికత ముసుగు క్రమ్మ నవయువతకుఁ
జింకి బొంతలే జాతిసంస్కృతినిఁ జాటు

ఉ॥ మేనినిఁ గప్పుకొందమని మేదిని పేదల వస్త్రధారణా
మేనుకు నేఁడు చూడఁగను మేలని సంపదఁ గల్గు వారలన్
గానఁగఁ జింకి వస్త్రములె కామితమై చన వింతయే సుమా
మానవ జాతి సంస్కృతికి మాన్యతఁ గూర్చును చింకిబొంతలే

నిస్సహాయతతో కొందరికి నాగరికతా విశృంఖలతతో మరికొందరికి

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

మరొక పూరణ బొంతను కేవలము పాన్పువలె వస్త్రములతో పోల్చకుండా

తే॥చింకి బొంతలే జాతి సంస్కృతినిఁ జాటు
ననఁగఁ దప్పు గాద యిపుడు కనఁగ లేమె
ప్రాఁత కాలముఁ దలుపఁగఁ బాన్పు లేని
పేద వారలు వాడిరి ప్రియము గాను

ఉ॥ పేనిరి ప్రాఁత కాలమునఁ బేదలు పాన్పుగ చింకి బొంతలే
యానక పాన్పులంద జనులందరు బొంతలు మానిరయ్యరో!
“మానవజాతి సంస్కృతికి మాన్యతఁ గూర్చును చింకిబొంతలే”
యానదు నేఁడిటుల్ పలుక హాస్యమటంచును ద్రోసిపుచ్చరే!

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"మానికంబు" అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

🙏ధన్యోస్మి గురుదేవా!🙏

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నీరసించి' అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.

Dhanikonda Ravi Prasad చెప్పారు...

చింకి బొంతలు అన్నా,చింకి బట్టలు అన్నా ఒకటేనా?చింకి బట్టలు అంటే ఇంకా బాగుండేదేమో!

BMahalakshmi చెప్పారు...

సవరిస్తానండి

M.B.G.TILAK చెప్పారు...

ధన్యవాదాలు గురూజీ 🙏

Dhanikonda Ravi Prasad చెప్పారు...

తే.గీ:రాజసంస్కృతిన్ బుట్టి దర్పమ్ము తోడ
హంసతూలికన్ బవళించినట్టి నేను
చిరుగు బొంత పై నడుము వాల్చితిని నేడు
చిరుగు బొంత లే జాతి సంస్కృతిని దెలుపు?

BMahalakshmi చెప్పారు...

హీనుడుగాడుమాలయును హెచ్చుగకన్పడె శంకరార్యుకున్
కానగమాలదాసరియుకాంచెనువిష్ణుని నామకీర్తనన్
తానికరామునావనిడిచాటెనుభక్తిగుహుండుచూడగా
మానవజాతి సంస్కృతికిమాన్యతగూర్చును చింకిబొంతలే

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఉ:మానవజన్మ నెత్తియును మర్త్యసుఖమ్ము లసత్య మంచు భో
గాన వసించు కోర్కె విడి,కాయము గప్పుట కింత గోచియున్,
మేనిని వాల్చ బొంతయిన మేలనుచున్ రమణాదు లుండరే?
మానవజాతిసంస్కృతికి మాన్యత గూర్చును చింకి బొంతలే
(రమణమహర్షి మొదలైన వారి జీవితసంస్కృతి.)



కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

మెత్తఁ దనమున మించెడు నుత్తమంపుఁ
గొత్త పఱపు సందేహింపకుమ నెడంద
నింపుగఁ గొనుమ వీడుమ కంపు గొట్టు
చింకిబొంత లే జాతి సంస్కృతినిఁ జాటు


నే నిటఁ బల్కు చుంటి నయ నిక్కము నాధుని కోత్తమంపు టీ
మానవ జాతి సంస్కృతికి మాన్యతఁ గూర్చును దల్ప రాజముల్
మేనున కీయ సౌఖ్యమును మేలుగఁ బండఁ బురాతనంపు టా
మానవ జాతి సంస్కృతికి మాన్యతఁ గూర్చును జింకిబొంతలే

[సంస్కృతి = మంచి కృతి]

Subbarao Pochiraju చెప్పారు...

పట్టెడన్నము లేనట్టి బడుగు యువతి
వట్టి చాకిరిఁజేయుచుఁబట్టుదలను
బెద్ద చదువులు సదివిగద్దెనెక్కి
బడుగు వర్గాల వృద్ఢికి పాటుబడెను
చింకిబొంతలే జాతిసంస్కృతినిఁ జాటు

Subbarao Pochiraju చెప్పారు...

మానుష రూపమందలరిమానవు వోలెను జింకి బట్టలన్
మేనున గప్పిదానెపుఁడు దైవముకాదని సాయి చెప్పుచున్
బావన మైన సూక్తులన బావన జాతిగఁదీర్చి దిద్దుటన్
మానవజాతి సంస్కృతికి మాన్యతఁ గూర్చును చింకిబొంతలే

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

హానిని గల్గ చేయుచును నడ్డపు దారుల పట్టు రీతిగా
మానము వీడినేడిలను మారెన లోకమటంచు గుడ్డిగా
*“మానవజాతి సంస్కృతికి మాన్యతఁ గూర్చును చింకిబొంతలే”*
మా'నవజాతిభూషలివి' మారుడ టంచును పల్కపాడియే

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

కట్టుకొన చిరగనిమంచి గుడ్డ లేక
బడుగులానాడు చినిగిన వలువ కట్ట
*చింకిబొంతలే జాతిసంస్కృతినిఁ జాటు*
ననుట నానవాయితియయ్యె నవని నేడు

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.

"చింకి బొంతలే జాతి సంస్కృతినిఁ జాటు"
ననుచు చినుగులు గల ప్యాంటులను ధరించి
గొప్ప సంస్కృతి యిదె యని చెప్పుకొనెడు
వారి యజ్ఞత కది రుజువగును గాదె!