18, ఫిబ్రవరి 2024, ఆదివారం

సమస్య - 4680

19-2-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దేహ మున్నంత వఱకు సందేహముండు”
(లేదా...)
“దేహం బుండెడిదాక నుండు గద సందేహంబు లీ దేహికిన్”
(విట్టుబాబుకు ధన్యవాదాలతో...)

40 కామెంట్‌లు:

BMahalakshmi చెప్పారు...

మాయగప్పినజీవికిమరులుగలుగు
వలనుజిక్కినచేపయైవరలుచుండు
మర్మమేరీతిదెలియునోమగతయందు
దేహమున్నంతవఱకుసందేహముండు

BMahalakshmi చెప్పారు...

మోహంబందుచుసృష్టిలోజనుఁడు తామున్గున్గదాసౌఖ్యమున్
ఆహాయంచునునాలిబిడ్డగని నయ్యాకాలసౌఖ్యంబుతో
గ్రాహంబైజను కానడీబ్రదుకువేగాలంగకాలాగ్నిలో
దేహంబుండెడిదాకనుండుగద సందేహంబులీదేహికిన్

BMahalakshmi చెప్పారు...

నయ్యాకాలమైశ్వర్యమే

Sitharamayya Solasa చెప్పారు...

పుట్టినప్పటి నుండియు పుణ్యలోక
ప్రాప్తినొందగ దగునని పలుకుచుండ
మరణమొంద నేమగునని మానవులకు
దేహ మున్నంత వఱకు సందేహముండు

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

జనన మరణాలు సహజమై చను న టంచు
మనుజ జీవిత మొక రీతి మాయ యనుచు
దేహ మున్నంత వ ఱ కు సందేహ ముండు తీరు మార్గము నెవ్వరు దెలుప గలరు?

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

చావు పుట్టుక సత్యము జగతిలోన
ఉన్నదా పునర్జన్మమీ యుర్విలోన?
నౌన కాదను వారుల గనిన యపుడు
దేహమున్నంత వరకు సందేహముండు

విరించి చెప్పారు...


పలువురు కలడనుచు చెప్పు ప్రాణయోని
పిలిచిన పలుకడయ్యెను వేదనలను
మనవి జేయుటెట్టులయని మనుజులకిల
దేహ మున్నంత వఱకు సందేహముండు,



ఆహార్యమ్మును బట్టి యుండవిలలో వ్యక్తిత్వ మంచార్యులే
సౌహార్ద్యమ్మున హెచ్చరించి రెపుడో సన్మిత్రులన్ నాడిలన్
స్నేహార్థుండ్రమటంచు చేరు జనులన్ నేనింక నమ్మేదెటుల్
దేహం బుండెడిదాక నుండు గద సందేహంబు లీ దేహికిన్.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
ద్రోణగురునంది విద్యల రోసి మిగుల
కృష్ణమూర్తి సత్సాంగత్య దృష్టి మెదలి
క్రీడి మోహమొందెను! బాపు గీతలేక
దేహ మున్నంత వఱకు సందేహముండు

శార్దూలవిక్రీడితము
వ్యూహమ్ముల్ వివరించి విద్యలఁదగన్ బొందింప ద్రోణుండు, దా
సోహమ్మౌచును శౌరికిన్ విజయుఁడే శోభించి రాణించినన్
మోహమ్మొందె రణాన, గీత గెలువన్ బోధించె! లేకున్నచో
దేహం బుండెడిదాక నుండు గద సందేహంబు లీ దేహికిన్

Subbarao Ayyalasomayajula చెప్పారు...

శా.

రాహిత్యమ్మె మదిన్ దురాశ, జనులన్ రక్షింప సన్మార్గమున్?
దాహంబుం దనివిన్ విలాసిని మెయిన్ దక్కించునా జాయగా?
మోహంబున్ భజనావృతంబు గుడులే ముక్తంబు గావించునా?
*దేహం బుండెడిదాక నుండు గద సందేహంబు లీ దేహికిన్!*

M.B.G.TILAK చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
M.B.G.TILAK చెప్పారు...

దేహమొప్పుఁ జీవాత్మకు గేహమనగ
దాహమనివార్యమేకద దేహమునకు
దేహమున్నంత వఱకు వ్యామోహముండు
దేహ మున్నంత వఱకు సందేహముండు

దేహంబొప్పును గేహమై కనుగొనన్ దీపించు జీవాత్మకున్
దాహంబే నిరతంబు దేహికెపుడున్ దక్కించగా ప్రాణమున్
మోహంబుండును గాదె మానవునికిన్ మోక్షంబునేకోరినన్
దేహం బుండెడిదాక నుండు గద సందేహంబు లీ దేహికిన్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

ఆహా యెన్నివిచిత్రముల్ జగతిలో నాశ్చర్యమున్ గొల్పవే
యూహాతీతము దైవచేష్టితములీ యుర్వీతలం బందునం
దాహారమ్ము నొసంగు దాటరికి తా నశ్మమ్ములో నుండగన్
దేహం బుండెడిదాక నుండు గద సందేహంబు లీ దేహికిన్

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

తే॥ మోక్షమార్గము వెదుకుట మోదమైన
ద్వైతమా లేక నరయ నద్వైతమగున
ఘనుఁడు రామానుజుల బోధఁ గనుట ముదమొ
దేహ మున్నంతవరకు సందేహముండు

శా॥ సోహంబే తగు మోక్ష మార్గమగునో శోభస్కరంబౌనొ దా
సోహంబే భువిలో మురారినిఁ గనన్ జొక్కంపు దారెద్దియో
మోహంబున్ విడనాడ సాధ్య మగునో మోక్షంబు సిద్ధించునో
దేహం బుండెడిదాక నుండు గద సందేహంబు లీ దేహికిన్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

అశ్మమున కప్పకెవ్వఁడాహారమిచ్చు
గర్భమందున్న శిశువును గాఁచునెవరు
దేహ మున్నంత వఱకు సందేహముండు
భవుని లీలలు తెలియగ నెవరి తరము

Dhanikonda Ravi Prasad చెప్పారు...

తే.గీ:దేహ మన దహ్యమే యని తెలియు గాని
దాని యుద్భవమునకును,దాని మృతికి
నేది కారణమో, గమ్య మేదొ యనుచు
దేహ మున్నంత వరకు సందేహ ముండు

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వారల గనిన...'

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

Dhanikonda Ravi Prasad చెప్పారు...

శా:"దేహం బెట్టుల బొందె నాత్మ? మరి ముక్తిన్ బొందు టెట్లో? అవి
ద్యాహంకారము లెట్లు గల్గె?తిరమౌ నానంద మెట్లంచు నీ
దేహం బుండెడి దాక నుండు గద సందేహమ్ము లీ దేహికిన్
సోహం సాధన తోనె సత్య మెరుగన్ శోధించుమా మౌని వై.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

🙏ధన్యోస్మి గురుదేవా!🙏

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ధన్యవాదం గురువు గారు!

M.B.G.TILAK చెప్పారు...

ధన్యవాదాలు గురూజీ 🙏

BMahalakshmi చెప్పారు...

ధన్యవాదములుగురువుగారు

వివియన్ వరలక్ష్మి చెప్పారు...

తెలియక చిఱుత ప్రాయముఁ దెలియ గోరు
నెదుగు వేళనన్నిట బుద్ధినెదుగ గోరు
ముదిమిని వెదకు ఙ్ఞానమపూర్వ రీతి
దేహమున్నంత వరకు సందేహముండు

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

జనన మాదిగా జనులకు జగతి యందు
చింతనమ్ములుహెచ్చుచుజీవతమున
కలుగుచుండునుతప్పకకడవరకును
దేహమున్నంత వరకు సందేహముండు.


మోహానందములోనమున్గుచుసతంబున్మూఢులౌచున్జనుల్
యాహాహాయనుచున్జనాళితిరుగన్ యాలోచనాశూన్యులై
సోహమ్మంచునుమాటిమాటికిలలో శోచించుసత్సాధుకున్
*“దేహం బుండెడిదాక నుండు గద సందేహంబు లీ దేహికిన్”*


కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

జగతి నడపించు నెవ్వండు సతము నంచు
నెట్లు జీవ రాసులు జనియించె నంచు
భూమి కున్నట్టి యాధార మేమి యనుచు
దేహ మున్నంత వఱకు సందేహ ముండు


ఆహా యాత్మకు స్వీయ కర్మ ఫల భోగానేక జన్మమ్ములే
శ్రీహర్యాజ్ఞఁ జెలంగు చుండ నకటా చిత్రాతి చిత్రమ్ములై
బాహాటమ్ముగ నగ్నిఁ గాల్చు దనుకన్ భద్రమ్ముగా ధాత్రినిన్
దేహం బుండెడి దాక నుండు గద సం దేహంబు లీ దేహికిన్

[దాక = తొట్టి (దాఁక = వఱకు): సం దేహములు = మంచి దేహములు]

Subbarao Pochiraju చెప్పారు...

ఎన్ని గ్రంధముల్ సదివిన నెన్ని వినినఁ
ప్రాణ వాయుపు టునికిని బదిల పఱచు
మార్గ మేదియో యెఱుఁగుట మానవునకు
దేహ మున్నంత వఱకు సందేహముండు

Subbarao Pochiraju చెప్పారు...


దేహంబందున నుండు జీవుఁడునునాదేవాల యంబందునన్
బాహాటంబుగ నుండు దేవునిగఁదాపారంబులీయంగనౌ
నాహా యేమిది సత్యమే యగునెపోనాశ్చర్యముంగల్గునా?
దేహం బుండెడిదాక నుండు గద సందేహంబు లీ దేహికిన్

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.

చదువు కొనెడు విద్యార్ధికి శంకలుండు
సందియములుండు నెంతగా చదువుకున్న
శాస్త్రముల్ జదివిన గాని శంకలుండు
దేహమున్నంత వరకు సందేహముండు.

Dhanikonda Ravi Prasad చెప్పారు...

సమస్యని ఇలా ఇస్తే ఇంకా బాగుండేది.
దేహమ్ముల్ పలు గల్గుచుండు గద యీ దేహమ్ము తో నుండగన్
అప్పుడు పైన సం చేర్చుకొని పూరించాలి.లేక యథాతథం గా కూడా పూరించ వచ్చు.