20, ఫిబ్రవరి 2024, మంగళవారం

సమస్య - 4682

21-2-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పదసంపద నాశనమగు వ్యాకరణముచే”
(లేదా...)
“పదసంపత్తి యడంగు వ్యాకరణమున్ భద్రమ్ముగా నేర్చినన్”
(ఫేసుబుక్కులో ఇచ్చిన సమస్య అని తిరువీథి శ్రీమన్నారాయణ గారు)

36 కామెంట్‌లు:

BMahalakshmi చెప్పారు...

కదలదుభావముతడబడి
అదిరినగుండెలరవములుహర్షమువీడున్
ముదిరిననియతిని నిర్మల
పదసంపద నాశనమగువ్యాకరణముచే

Sitharamayya Solasa చెప్పారు...

పదవ తరగతిన బలిమిగ
చదివించిన సంధులన్ని సాథన జేయన్
మదియంత తికమకమగుచు
పదసంపద నాశనమగు వ్యాకరణముచే

BMahalakshmi చెప్పారు...

ముదమున్జూడకమూసయందునిడిసమ్మోహాంధకారమ్ములో
కదనున్ద్రొక్కుచుపాదఘట్టనల నాకమ్మున్విడన్జూచుచో
అదనున్జూచిననవ్యభావుకులు బాహాటంబుగాజెప్పిరే
పదసంపత్తియడంగు వ్యాకరణము న్యాయము భద్రమ్ముగానేర్చినన్
వ్యాకరణాలసంకెళ్ళు శ్రీశ్రీ

Subbarao Ayyalasomayajula చెప్పారు...

మ.

సదయుండౌ గురువే లభించని బడుల్ సాహిత్య బృందమ్ములన్
రొద సంగీతము గూర్చు బుస్తకములై, రొప్పించు చిత్రాలతో
మృదువాక్యమ్ములు నేర్వగన్ మలక, సుమ్మీ! యాసమాటల్ పడన్
*పదసంపత్తి యడంగు వ్యాకరణమున్ భద్రమ్ముగా నేర్చినన్.*

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

కుదరని యమరిక కతమున
పదసంపద నాశనమగు, వ్యాకరణముచే
పదునగు పదగుంఫనమున
హృదయాహ్లాద మొనఁగూడు హేరాళముగా

విరించి చెప్పారు...


విదులెల్లరు మెచ్చు నటుల
పదపదములు పేర్చి వ్రాయు పద్యములకు నొ
ప్పిదమును గూర్చును వ్యర్థపు
పదసంపద నాశనమగు, వ్యాకరణముచే,


మదిలో రేగెడి భావజాలములు రమ్యంబైన కావ్యమ్ముగా
విదులాలించిన దోషమెంచని విధిన్ విన్మాణమున్ గూర్చుచున్
ముదమౌ పద్యములై విమర్శకులిలన్ బోనాడెడిన్ వ్యర్థమౌ
పదసంపత్తి యడంగు , వ్యాకరణమున్ భద్రమ్ముగా నేర్చినన్,

M.B.G.TILAK చెప్పారు...

ముదమారగ విద్యార్థులు
పదసంపదఁ బడయ వలయు పరిపూర్ణముగా
పదములు పటుతరమై కై
పదసంపద నాశనమగు వ్యాకరణముచే

ముదమారంగ వరించి నేర్వదగునే ముమ్మాటికిన్ భాషనే
విదితంబౌను విభాష నిశ్చయముగా విధ్యార్థి కభ్యాసమై
పదునౌ పల్కుల వాంఛ పొంపిరిగొనున్ బాండిత్యమే హెచ్చి కై
పదసంపత్తి యడంగు వ్యాకరణమున్ భద్రమ్ముగా నేర్చినన్

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

సదమల చిత్తము గల్గియు
ముదమారగ కవిత లల్లి మోదము తోడన్
పదునుగ వాడగ వ్యర్థపు
పద సంపద నాశన మగు వ్యాకర ణ ము చే

రామోక్తం చెప్పారు...

చదవగ భాషాశాస్త్రము
కుదురుగ గల్గును పదముల కూర్చెడు జ్ఞానం
వదులుగ వాడెడు తేరపు
పదసంపద నాశనమగు వ్యాకరణముచే

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
పద సాధుత్వమెఱింగియు
నదనుకు తగినట్టి సంధులమరంగన్, దు
ష్పదబంధ జాడ్యము, గలుఁగ
పదసంపద, నాశనమగు వ్యాకరణముచే

మత్తేభవిక్రీడితము
పదసాధుత్వమెఱింగియున్ నడకనొప్పారంగ ధారాళమై
యదనున్ జూచియు సంధులన్ మలచి విన్యాసమ్ము శోభిల్ల, దు
ష్పదబంధంబుల జాడ్యమే, కలుఁగగన్ భావానుకూలంబునౌ
పదసంపత్తి, యడంగు వ్యాకరణమున్ భద్రమ్ముగా నేర్చినన్

✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

ఎదలో దూకొను భావనల్ కవితలందింపార వర్ణింపగన్
పదముల్ గూరుచు నేర్పు నెక్కొనవలెన్ వాఙ్మాధురీ యుక్తమై
హృదయాహ్లాదకరంబునై దనరగా, హేరాళమౌ రీతి దు
ష్పద సంపత్తి యడంగు వ్యాకరణమున్ భద్రమ్ముగా నేర్చినన్

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*తరగతిని.. తికమక పడును* అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'జ్ఞానం' అనడం వ్యావహారికం.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కం॥ పద సంపద గ్రామ్యములను
ముదముగఁ గైకొన పెరుఁగును బొరపాటు కదా
వదులుచు గ్రామ్యములఁ జనఁగ
పద సంపద నాశనమగు వ్యాకరణముచే

మ॥ చదువున్ దూషణఁ జేసి సోమరిగ సంస్కారమ్మె లేకుండఁగన్
వదలన్ విద్యల నేర్వ మూర్ఖులుగ నెవ్వారైన నిక్కంబుగన్
బద సంపత్తి యడంగు, వ్యాకరణమున్ భద్రమ్ముగా నేర్చినన్
బదబంధంబుల గూర్చెడిన్ సొబగు సంప్రాప్తించు సౌభాగ్యమై

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కన్నడ తెలుగు వ్యాకరణ బేధము తెలుగులో ఉన్న సౌకర్యము వీలుంటే 4 వాక్యాలు తరువాత వ్రాయగలనండి

Sitharamayya Solasa చెప్పారు...

🙏

రామోక్తం చెప్పారు...

🙏

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

మదిలో సతతమువడిగా
కదలాడెడుభావనములుగబగబ
వ్రాయన్
సదయులు నొప్పక యందురు
పదసంపద నాశనమగు వ్యాకరణముచే

Subbarao Pochiraju చెప్పారు...

చదువుల సారముఁగైకొని
సదమల మౌగ్రంధరచన చాలమి యైనన్
మృదువుగ నుండక దురితపు
పదసంపద నాశనమగు వ్యాకరణముచే”

వివియన్ వరలక్ష్మి చెప్పారు...

పదముల కూర్పిడునందము
నది సూత్రమునలరులవలె నలరారటుపై
నొదగక పొంకముఁ జెడిపెడు
పదసంపద నాశనమగు వ్యాకరణముచే

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:ఇది విను! "కులకాంత" యనుచు
గుదురుగ నన గురువుమార్చె "గులకాంత"గ "నే
మిది ?"యన సరళం బగు నను
పదసంపద నాశన మగు వ్యాకరణము చే

(సరళాదేశం ఇలా పదాలకి వికృతార్థాలని తయారు చేస్తుంది.కానీ ఏం చేస్తాం.శాస్త్రం శాస్త్రమే.)

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పదుగురు మెచ్చ వలె నని యె
డఁదఁ దలఁచుచుఁపలుకు నా యొడయుల పదమ్ముల్
పదపడి వార్తా భాషా
పద సంపద నాశన మగు వ్యాకరణముచే


పద కోశమ్ముల నుండు గ్రామ్యములు దుర్వారమ్ములై దోషపుం
బద జాలమ్ములు పెక్కు పత్రికల దుర్భాగ్యంబు చింతింపఁగాఁ
జదువుల్ నేర్పవు నేఁడు తెన్గు నకటా సత్యమ్ము నెన్నంగ దు
ష్పద సంపత్తి యడంగు వ్యాకరణమున్ భద్రమ్ముగా నేర్చినన్

Subbarao Pochiraju చెప్పారు...

పదసంపత్తి యడంగు వ్యాకరణమున్ భద్రమ్ముగా నేర్చినన్
చదువన్ మందుని వోలెనుంటివిఁక యాశాస్త్రార్ధము ల్పోయెనా?
పదసంపత్తియ వృద్ధిచెందును గ బో భద్రమ్ము గానేర్చినన్
బదముల్ భద్రత యుండగోరునెడయావాక్యార్ధ మేముఖ్యమౌ

Dhanikonda Ravi Prasad చెప్పారు...

మ:పదునౌ సంధి సమాసకల్పనలు గీర్వాణమ్మునన్ నేర్వకే
మదికిన్ దోచిన యట్లు వ్రాయ,బలుకన్ మర్యాద యే పోవు స
త్పదసంపత్తి యడంగు, వ్యాకరణమున్ భద్రమ్ముగా నేర్చినన్
కుదురౌ భాష లభించు, కావ్యరచనాకూతమ్ము నీడేరెడిన్.

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

క్షమించాలి. సమయము దొరకలేదండి. తెలుగులో నిత్యమైన ఉత్వసంధి వలన చాలా వెసులు బాటు కలుగుతుందండి

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.

విదురులు మెచ్చెడు విధముగ
పదముల సంధులు కలుపుచు పద్యములల్లన్
పదబంధమలరె... వ్యర్ధపు
పద సంపద నాశనమగు... వ్యాకరణముచే.