24, ఫిబ్రవరి 2024, శనివారం

సమస్య - 4686

25-2-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శిల్పము కేరెనని గ్రుడ్డి చిందులు వేసెన్”
(లేదా...)
“శిల్పము వెక్కిరించెనని చిందులు వేసెను చూచి యంధుఁడే”
(అక్కెర కరుణాసాగర్ గారికి ధన్యవాదాలతో...)

35 కామెంట్‌లు:

BMahalakshmi చెప్పారు...

అల్పపుబుద్ధిని నరుడును
కల్పననమ్ముచు తడబడి కానకయుండన్
తల్పముతలక్రిందౌనుగ
శిల్పముకేరెననిగ్రుడ్డి చిందులువేసెన్

gsnatp చెప్పారు...

శిల్పము కేరెనని గ్రుడ్డి చిందులు వేసెన్”

కం:
శిల్పమది పలుకు స్వరముల
నల్పముగ తడిమిన జాలునది గన్గొని తా
స్వల్పముగ మీటె నంధుడు,
శిల్పము కేరెనని గ్రుడ్డి చిందులు వేసెన్.

విరించి చెప్పారు...


కల్పిత ప్రేమ నటించుచు
శిల్పమె భీముడని యెంచి శ్లేషము గొనగా
నల్పుడు పటపట విరుగగ
శిల్పము, కేరెనని గ్రుడ్డి చిందులు వేసెన్


కల్పితమైన ప్రేమనల కాపరెఱంగుచు ముందుకేగగా
నిల్పుచు వాయునందనుని, నిక్కపు లోహపు బొమ్మ జేర్చెనా
యల్పుని ముందటన్ వడిని యంకిలి గైకొన వ్రక్కలయ్యెనా
శిల్పము , వెక్కిరించెనని చిందులు వేసెను చూచి యంధుఁడే.

Sitharamayya Solasa చెప్పారు...

అల్పుడు దన మిత్రునిగని
తల్పము పైనున్న బొమ్మ తచ్చన లాడెన్
కల్పితముగ నటుల దెలుప
శిల్పము కేరెనని గ్రుడ్డి చిందులు వేసెన్

M.B.G.TILAK చెప్పారు...

అల్పుండని తలపనిదౌ
కల్పన మనువాడె గ్రుడ్డి కన్నుల వానిన్
తల్పము నెక్కిన తదుపరి
శిల్పము కేరెనని గ్రుడ్డి చిందులు వేసెన్

శిల్పముఁబోలుకన్నె యిక చిక్కును కౌగిటనన్న భావనన్
దల్పముపైన వేచెనట తత్తరపాటున గ్రుడ్డివాడటన్
గల్పము మారిపోయి తన కాంతయె చెంతకు చేరకుండగా
శిల్పము వెక్కిరించెనని చిందులు వేసెను చూచి యంధుఁడే

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

కల్పితముల దెల్పునొకఁ డ
నల్పముగా నిరుగుపొరుగు లౌరాయనగా
జల్పములనుబల్కు నిటుల
"శిల్పము కేరెనని గ్రుడ్డి చిందులు వేసెన్"

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

కల్పనలందు సర్వమును గాంచును లోకమునందు వింతలన్
దెల్పును చూచినట్టులనె దృష్టిని మానసమందునిల్పి, తా
సల్పుచు వింతభాషణము సంగతమందున నుండ నేస్తముల్
శిల్పము వెక్కిరించెనని చిందులు వేసెను చూచి యంధుఁడే

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:కల్పించె కులట కృష్ణుని
శిల్పము తన వంక జూచి చిలిపిగ నగెనం
చల్పమతి భర్త నమ్ముచు
శిల్పము కేరె నని, గ్రుడ్డి చిందులు వేసెన్
(ఆ కులట అబద్ధం చెపితే ఆమె భర్త నమ్మి గుడ్డిగా చిందులు వేశాడు.అతను గ్రుడ్డికాదు.గ్రుడ్డి నమ్మకం తో చిందులేశాడు.)

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఉ:స్వల్పపు నిద్ర జెంది యొక స్వప్నము గాంచగ సుందరాంగిదౌ
శిల్పము కన్ను కుట్టి,కడు చిల్పి తనమ్మున వెక్కిరించ న
త్యల్పపు తోషమున్ బడసి,"యద్దిర పుణ్యఫల" మ్మటంచు నా
"శిల్పము వెక్కిరించె" నని చిందులు వేసెను చూచి యంథుడే.
(గ్రుడ్డి వాడు స్వప్నము లో చూడ గలడు.)

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
అల్పపు బుద్ధిని నంధుడు
సల్పుచు నహమున మయసభ సందర్శనమున్
పొల్పగు ద్రౌపది నవ్వగ
శిల్పము కేరెనని గ్రుడ్డి చిందులు వేసెన్

ఉత్పలమాల
అల్పమనస్కుడై యహమునందున జిక్కిన రాజరాజహో!
బల్పున జూచుచున్ మయసభన్ మడుగందున జారినంతటన్
బొల్పగు ద్రౌపదీ నగవుఁ బూని పరాభవమైనదన్ భ్రమన్
శిల్పము వెక్కిరించెనని చిందులు వేసెను చూచి! యంధుఁడే! !

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

శిల్ప మనియు దెలియక దా
గల్పిత బలమున ను నెంచె కౌగిలి యందున్
సల్పగ నుజ్జు గ కానీ
శిల్పము కే రె నని గ్రుడ్డి చిందులు వేసెన్

Subbarao Pochiraju చెప్పారు...

శిల్పముఁ జెక్కిన నాతఁడు
శిల్పకళనుదనకు గలుఁగు చేవను దోడన్
శిల్పముఁజెక్కగఁదడుముచు
శిల్పము కేరెనని గ్రుడ్డి చిందులు వేసెన్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

అల్ప మనస్కుఁ డొకం డటఁ
దల్పము పైనం బరుండి తన మనమున సం
కల్పించి విచిత్రమ్ముగ
శిల్పము కేరెనని గ్రుడ్డి చిందులు వేసెన్


బల్పున విఱ్ఱవీగుచు నపార మదాన్వితుఁ డొక్కఁ డాత్మలోఁ
దల్పఁగ నిట్లు మిత్రు లెగతాళి యొనర్చిరి చూచి బొమ్మనుం
గోల్పడి యోర్మి వింతగను గోరి స్వయమ్ముగఁ జెక్కి నట్టి యా
శిల్పము వెక్కిరించె నని చిందులు వేసెను చూచి యంధుఁడే

Subbarao Pochiraju చెప్పారు...

శిల్పముఁజూడగాఁదెలిసె శిల్పుని భావపు చాక శక్యమున్
శిల్పము నందుగానగను శిల్పుని హావము,వెక్కిరింతలున్
శిల్పము వెక్కిరించెనని చిందులు వేసెను చూచి యంధుఁడే
కల్పిత మైననున్ గలిగెఁగాతర భావము గ్రుడ్డి వానికిన్

వివియన్ వరలక్ష్మి చెప్పారు...

పొల్పగు వధువగపడె నొక
శిల్పము వలెనథిధులకు విచిత్రము కనులన్
పొల్పుడుగిన వరుడంతట
శిల్పము కేరెనని గ్రుడ్డి చిందులు వేసెన్

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

వివియన్ వరలక్ష్మి చెప్పారు...

శిల్పము వలెనతిథులకు

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

🙏ధన్యోస్మి గురుదేవా!🙏

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...


అల్పలమాటలనువినుచు
కల్పనమయ్యదనుచెరుగకకుపితుడగుచున్
అల్పపుబుద్ధిని చూపుచు
శిల్పముకేరెనని గ్రుడ్డి చిందులు వేసెన్

Dhanikonda Ravi Prasad చెప్పారు...

అయ్యా! ధన్యవాదం!

Dhanikonda Ravi Prasad చెప్పారు...

అయ్యా! ధన్యవాదం!