27, ఫిబ్రవరి 2024, మంగళవారం

సమస్య - 4689

28-2-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాపులకు సుఖములు దక్కు స్వర్గమందు”
(లేదా...)
“స్వర్గమునందు పాపులకు సర్వసుఖంబులు దక్కు నిత్యమున్”
(అక్కెర కరుణాసాగర్ గారికి ధన్యవాదాలతో...)

37 కామెంట్‌లు:

gsnatp చెప్పారు...

ఎంత పుణ్యాత్ము డైనను కొంత మిగులు
పాప శేషమ్ము, మొదట జూప బడుచుండు
నరక మటులె తొల్దొలుతగ నరులలోని
పాపులకు సుఖములు దక్కు స్వర్గమందు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కురుక్షేత్ర సంగ్రామములో శ్రీకృష్ణ పరమాత్మ:

తేటగీతి
బంధువులు గురువులనుచు వైరులనని
వీడనెంతువె మోహాన వెర్రి పార్థ!
పోర రాజ్యమొదవు! లేక పుణ్యులుకును
పాపులకు సుఖములు దక్కు స్వర్గమందు!!

ఉత్పలమాల
భర్గుని ప్రీతిఁ గొల్చి మును పాశుపతాస్త్రము నంది వైరి నీ
వర్గము వారలంచు ననిఁ బాసెదనందువె పార్థ! పోరితే
దుర్గతి వీడి రాజ్యమగుఁ! ద్రుంగ రణాన వివక్షలేదయా
స్వర్గమునందు! పాపులకు సర్వసుఖంబులు దక్కు నిత్యమున్!!


Sitharamayya Solasa చెప్పారు...

వాసమునకరుదెంచిన బంధువునకు
రాత్రి యంతయు నిద్దుర లసుకు జేయు
మశకములు కుట్ట కుండగ మందు జల్లు
పాపులకు సుఖములు దక్కు స్వర్గమందు

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

తప్పవు నరక బాధలు తలచిచూడ
పాపులకు;సుఖములు దక్కు స్వర్గ మందు
నాచరించిన పుణ్యము ననుసరించి
యనెడి మాటలు నిక్కమటండ్రు బుధులు

రామోక్తం చెప్పారు...

ధనమదమ్మున ధర్మము తప్పు వారు
మిడిసిపాటున నియతిని మీరు వారు
విజ్ఞతను దుష్ట చేష్టల విడక నెటుల
పాపులకు సుఖములు దక్కు స్వర్గమందు?

M.B.G.TILAK చెప్పారు...

దుష్ట కార్యాలు చేబూన దోషమగును
భజన సల్పినఁ స్వర్గము ప్రాప్తమగున
పాపులకు? సుఖములు దక్కు స్వర్గమందు
పుణ్యవంతుల కెన్నడు పుష్కలముగ

నిర్గుణుడైన దేవునికి నిత్యము పూజలుచేసినంతటన్
దుర్గతి తప్పునా కలుగు దోషము కోల్పడి చోటు దక్కునా
స్వర్గమునందు పాపులకు? సర్వసుఖంబులు దక్కు నిత్యమున్
స్వర్గము చేరుకొన్నయెడ పావన జీవులకున్ యథావిధిన్

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

నరక లోకము గల దండ్రు నరుల యందు
పాపులకు :: సుఖములు దక్కు స్వర్గ మందు
మంచి పనులను జేసెడు మాన వుల క
నుచు ను భావింత్రు కొందరీ యవని యందు

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

దుర్గ భవాని భక్తులకు తోడుగ తానగునెల్ల వేళలన్
దుర్గమువోలె నిల్చు పెను త్రొక్కటపాటులనుండి గావగన్
భార్గవి దేవళమ్ము భువిఁ స్వర్గము నిక్కపు భక్తిఁ గొల్వనా
స్వర్గమునందు పాపులకు సర్వసుఖంబులు దక్కు నిత్యమున్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

పతిత పావని శాంకరి భక్తతతికి
కొంగుబంగారు తీర్చును కోరికలను
మదిని నమ్మి సేవింపఁగ మాతనెపుఁడు
పాపులకు సుఖములు దక్కు స్వర్గమందు

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగ ఉన్నది. అభినందనలు.
భువి తర్వాత సరళాదేశం లేదు కనుక అరసున్న అవసరం లేదు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
M.B.G.TILAK చెప్పారు...

ధన్యవాదాలు గురూజీ 🙏

Dhanikonda Ravi Prasad చెప్పారు...

తే.గీ:చచ్చి నంత సుఖము లిచ్చు స్వర్గమేల?
క్లబ్బు కేగిన స్త్రీస్నేహ మబ్బు చుండు,
మందు దొరకును, క్లబ్బు నే మందు వనిన
"పాపులకు సుఖములు దక్కు స్వర్గ" మందు

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఉ:భర్గుని గూర్చి గాని,యల బ్రహ్మను గూర్చెయె కాని యెట్టి దు
మార్గుడు చేసినన్ తపము,మంగళ మౌచు వరమ్ము దక్కు,త
ద్వర్గపు దుష్ట పాలనల బాపగ వెన్నుడు తల్చు దాక నా
స్వర్గము నందు పాపులకు స్వర్గసుఖమ్ములు దక్కు నిత్యమున్

Dhanikonda Ravi Prasad చెప్పారు...

(3)ఉ:దుర్గము లందు రాజులకు దుర్గసుఖమ్ములు దక్కకుండునే!
మార్గము లందు సాధువులు మార్గసుఖమ్ముల బొందకుందురే!
నిర్గుణ మైన బ్రహ్మమును నిర్గుణ శాంతిని బొందు నట్టులే
స్వర్గము నందు పాపులకు స్వర్గసుఖమ్ములు దక్కు నిత్యమున్
(ఇది కేవలం తమాషాకి.ఎక్కడ ఉన్న వాడికి అక్కడి సుఖము ఉంటుందని.)


గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

🙏ధన్యోస్మి గురుదేవా!🙏

BMahalakshmi చెప్పారు...

శాస్త్ర విహితమునైనట్టి సంగరమున

పరముగోరినమౌనియై పరిఢవిల్లి
శత్రులారునుజుట్టగచంపునట్టి
పాపులకు సుఖములుదక్కు స్వర్గమందు

subbarao చెప్పారు...

నరక బాధలు దప్పవు మరణ మందు
పాపులకు, సుఖములు దక్కు స్వర్గమందు
పుణ్య కార్యాలు సేసిన గణ్యముగను
బాప పుణ్యాల రెంటిని బ్రతియొ కరును
ననుభ వించక దప్పదు పనిని బట్టి

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

🙏

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

తే॥ కాల మహిమను ధరణిలోఁ గలచి వెదుక
నీతి బాహ్యులై చనెడవి నీతిపరులు
పాపులకు సుఖములు దక్కు, స్వర్గమందు
పుణ్య చరితులకే చోటు పొడము నయ్య

ఉ॥ నిర్గుణ శీలియై పరఁగి నిత్యము భక్తిని మ్రొక్క నీశునిన్
భర్గుఁడు పాపపుణ్యములఁ బట్టుగ నెంచిన పిమ్మటే కనన్
స్వర్గము దక్కు ధర్మమును జక్కగ పాలనఁ జేయ నెట్టులన్
స్వర్గమునందు పాపులకు సర్వసుఖంబులు దక్కు నిత్యమున్

తేటగీతి చివరి పాదములో గణభంగమైనదండి. అందుకని మార్చాను

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

మాధవుని భక్తిఁ బూజించు మానవులకుఁ,
బుణ్య కర్మము లొనరింప గణ్యముగను
సాయ మించుక యైనను జేయ కున్నఁ
బాపులకు, సుఖములు దక్కు స్వర్గ మందు


దుర్గమ మైన వైతరణిఁ దూలక దండధ రోగ్ర వాహినీ
వర్గపు బారినిం బడక భద్రత సేకుర స్వీయ మృత్యు సం
సర్గము వొందు నట్టి తఱిఁ జక్రి వరాఖ్యను బల్కి నంతటన్
స్వర్గము నందుఁ బాపులకు సర్వ సుఖంబులు దక్కు నిత్యమున్

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

నరక మబ్బును దుర్నీతి నరులకెల్ద
ప్రజల పీడించు దుర్నయ బ్రష్ట దుష్ట
బాపులకు, సుఖములు దక్కుస్వర్గ మందు
సత్యమును నీతి బాటించు సజ్జనులకు

వివియన్ వరలక్ష్మి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వివియన్ వరలక్ష్మి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వివియన్ వరలక్ష్మి చెప్పారు...

ఐహిక వాంఛలుసిగొలుపు నైపు దెసకు
పాపముల జేయు సులువుగ బడయు సొమ్ము
ఇలనెవరికైన స్వర్గము ఇల్లు కనుక
పాపులకు సుఖములు దక్కు స్వర్గమందు

తపము జేసి వరములందు తామసులును
దోర్బలమున జేయు నధిక దుష్ట పనులు
అజుని చేతనడగి జేరునమరపురి
పాపులకు సుఖములు దక్కు స్వర్గమందు

subbarao చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
subbarao చెప్పారు...

స్వర్గమునందు పాపులకు సర్వసుఖంబులు దక్కు నిత్యమున్
దుర్గతి రీతినిన్ బలుక తోచెనె నెట్లుగ మీకుసా
మి? యా
స్వర్గము నందుసంతులకు సర్వసుఖంబులు గల్గునేగదా
దుర్గమ తల్లియే మనల దుఃఖవి హీనుల జేయుగాతిలన్

రిప్లయితొలగించండి

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.

పాపముల నెన్నియో చేసి పరితపించి
చేరగా నంత్య దశకును జీవితమ్ము
మంచిగ శివనామమును స్మరించినట్టి
పాపులకు సుఖములు దక్కు స్వర్గమందు.

విరించి చెప్పారు...

శఠులగు గుణనిధి నిగమ శర్మలకిట
దక్కె దివ్య పథమ్మదె నిక్కమయిన
వ్రాలినను మహాశివరాత్రి పర్వమునను
పాపులకు సుఖములు దక్కు స్వర్గమందు.


నిర్గుణుడైన శాశ్వతుని నిత్యము గొల్చిన శ్రేయసమ్ముకై
మార్గమదే లభించునని మాన్యులు చెప్పెడు రీతి గానె దు
ర్మార్గ పథాభిలాషి పొలుమారిన చో శివరాత్రి పర్వణిన్
స్వర్గమునందు పాపులకు సర్వసు