ఇన్ని రోజులుగా కందం, తేటగీతి, ఆటవెలదుల్లో సమస్యలిస్తూ వచ్చాను. ఔత్సాహిక కవులు ధైర్యం చెయ్యరేమో అనే అనుమానంతో వృత్తాలలో సమస్య ఇవ్వలేదు. రవి గారు వారాంతాలలో వృత్త సంబంధ సమస్యలు ఇవ్వవలసిందిగా సలహా ఇచ్చారు. వారి సలహా పాటించి ఈ రోజు వృత్తంలో సమస్య ఇస్తున్నాను.
సీతను పెండ్లియాడె శశిశేఖరుఁ డంబిక సంతసిల్లఁగన్.
నా తరమా నుతింప యని నారదు డచ్చెరు వొందు రీతిగా
రిప్లయితొలగించండిభూతలమంత పీటగ నభోతలమంతయు పెండ్లి పందిరై
శీతల వీక్షణుండు హరి శ్రీ రఘు రాముడు ధర్మ రక్షకై
సీతను పెండ్లియాడె శశిశేఖరుఁ డంబిక సంతసిల్లఁగన్.
ఫణిప్రసన్న కుమార్ గారూ,
రిప్లయితొలగించండివావ్ ... ఇంత స్పీడా? చక్కని ధారాశుద్దితో, మంచి పద విన్యాసంతో సమస్యను పూరించారు. "నా తరమా నుతింప"?
రాతిని నాతిఁ జేసి; రఘురాముడు సీత ప్రశస్తి నెంచి;సం
రిప్లయితొలగించండిప్రీత మనంబుతోడఁ జని శ్రీకరమైన స్వయంవరంబునన్
ఖ్యాతిని గన్న చాపమును గౌరవ మొప్పగ పట్టి చీల్చి యా
సీతను పెండ్లియాడె. శశిశేఖరుడంబిక సంతసిల్లగన్.
ఆర్యా! సహృదయుల పూరణ కోసం నేటి నా సమస్యతిలకించండి.
మృతుఁడు సుఖించు; సౌఖ్యములు మేలుగ కూర్చును సజ్జనాళికిన్.
చెప్పదల్చుకున్నది ఇదివరకే అందంగా చెప్పబడి ఉన్నది కాబట్టి, భావం నాకే బావోలేకపోయినా విభిన్నంగా ఉండాలని ఈ పూరణ ఇలా ప్రయత్నించాను.
రిప్లయితొలగించండికోతల రాయులై తిరుగు గుంపొక నాటకమేయ, యందునన్
సీతను ఇంతి పార్వతిగఁ జేసెను. అంబిక గంగగానటన్
ఆతుర మొప్పగా నటన యాడిరి. పల్లెజనంబులంతటన్
కూతలు వెట్టుచుండగను, కుమార సంభవ నాటకమ్ములో
సీతను పెండ్లియాడె శశిశేఖరుఁ డంబిక సంతసిల్లఁగన్.
చింతా రామకృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ అద్భుతం, ఆనందదాయకం. ధన్యవాదాలు.
ఇక మీరిచ్చిన సమస్యకు నా పూరణ .....
ఇతరుల కెద్దియేని హిత మెన్నఁడుఁ జేయక స్వార్థబుద్ధితో
పతితుఁడు కాగ జీవనము వ్యర్థము చేసి చలచ్చవంబగున్;
సతతము సర్వ జీవ హిత సాధనకై శ్రమియించు నా దయా
మృతుఁడు సుఖించు, సౌఖ్యమును మేలుగఁ గూర్చుచు సజ్జనాళికై.
నేనిచ్చిన సమస్యకు నా పూరణ .....................
రిప్లయితొలగించండిఖ్యాతిగ రాఘవుండు శివకార్ముక మెక్కిడి యేమి చేసె? న
శ్శీతనగంబుపై నెవఁడు చేయును తాండవనృత్య? మెవ్విధిన్
జేతురు హిందువుల్ ముదముచే నవరాత్రుల నుత్సవంబుగా?
సీతను పెండ్లియాడె; శశిశేఖరుఁ; డంబిక సంతసిల్లఁగన్.
రవి గారూ,
రిప్లయితొలగించండిభావం మంచిదే. కాని పద్యంలో గణ వ్యాకరణ దోషాలున్నాయి. పద్యాన్ని సవరించి వీలైతే ఈ రాత్రి వ్యాఖ్యానిస్తాను.
తా తప మాచరించునెడ దారగ చేకొనుమన్న అంబికా
రిప్లయితొలగించండిమాత ననుగ్రహింపుమని మారుడు గోరగ రాయబారియై,
ఆతని హత్య జేసి, మరి ఆపయి ఏమి ఎరుంగనట్టు లి
స్సీ! తను పెండ్లియాడె శశిశేఖరు డంబిక సంతసిల్లగాన్!
నామదినున్న భావనను నామదిఁదూరి గ్రహించి యుంటిరో!
రిప్లయితొలగించండిఏమని ప్రస్తుతింతుమిము యిందరి కంది న శంకరయ్య!మీ
మోమును చిత్తరంబునను ముచ్చటతో గన వేడు చుంటి.నో
ధీమతి పెట్టుచుంటిరిగ? దీప్యముగా భవదీయ బ్లాగునన్.
ఆచార్య ఫణీంద్ర గారూ,
రిప్లయితొలగించండిమీ చక్కని పూరణ భా
షా చాతుర్యమ్ము గలిగి సంతస మొసఁగెన్
దోచితిరి మా మనమ్ముల
ఆచార్య ఫణీంద్ర! మేటి వని నుతియింతున్.
చింతా రామకృష్ణారావు గారూ,
రిప్లయితొలగించండిశ్రీ చింతాన్వయ తిలకా!
నా చిత్రము బ్లాగులోన నయముగఁ బెట్టన్
సూచించితి రటులే మీ
కై చేర్చెదనండి కొంత కాలము పిదపన్.
(ప్రస్తుతానికి ఫోటొ అందుబాటులో లేకపోవడం, ఫోటోను బ్లాగులో పెట్టగల సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం తదితర కారణాల వల్ల ఇంతకాలం పెట్టలేక పోయాను. సాధ్యమైనంత త్వరలో చిత్రాన్ని పెడతాను. మీ సూచనకు ధన్యవాదాలు.
ప్రీతిని విల్లునున్ విరిచి రీతిగ రాముడు గారవమ్ముతో
రిప్లయితొలగించండిసీతను పెండ్లియాడె;...శశిశేఖరుఁ డంబిక సంతసిల్లఁగన్
ఖ్యాతిని మన్మథున్ దునిమి కన్నును విప్పుచు ఫాలమందునన్
శీతల శైలమున్ తపపు చింతను మానుచు పెండ్లియాడగా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి