అన్ని పద్యాలు బాగున్నాయండి.....మీ అందరికీ నా ధన్యవాదములు మంచి పద్యాలు అందచేస్తున్నందుకు "" ఒక వ్యక్తి కేవలం మాటలు చెప్తూ ,గాలి లో మేడలు కడుతూ బ్రతికే రొజుల్లో ఇవన్నీ వ్యర్ధం అని తెలుసుకున్నాడు...ఆతని గాలి మేడలు అన్నీ కూలి పొయాయి...నిజం తెలుసుకుని అతనికి మేలు జరిగింది "" ఇలాంటి భావన నాది పద్యం రాయాలనే ఆసక్తి నే గానీ రాయగల శక్తి లేదు నాకు నా భావన తగినది అయితే పద్య రూపం లో అందచేయగలరు
ప్రణీత స్వాతి గారూ, సమస్యాపూరణ లందిస్తున్న కవులు మీరడిగినట్లుగా తమ పద్యాలకు వివరణలు కాని, కఠిన పదాలకు అర్థాలను కాని ఇవ్వకున్నా మీరు ఆ పద్యాల భావాన్ని అవగతం చేసుకొని పద్య కవితా మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నందుకు ఆనందంగా ఉంది.
శంకరయ్యగారు, ఈ పూరణ మరీ సులువుగా ఉందనిపించిందండి. అందుకే కొంచెం ఛమక్కు కనిపించడానికి మళ్ళీ కాస్త శృంగారరసాన్ని ఆశ్రయించక తప్పట్లేదు.
రిప్లయితొలగించండిఏడు నెలలుగ మెచ్చిన ఇంతి ఎదుట
పడితి, ననుఁజూసి జాలిగ పాపమంచు
మాట కలుపుచు లేపెను, మాడు పగులఁ
మేడపైనుండి పడినను మేలు కలిగె
గణ,యతి,ప్రాసలు కిట్టించాననే అనుకుంటున్నాను, తప్పులుంటే చెప్పండి
రిప్లయితొలగించండిపైన యుండునుమోహను- పడుచు పిల్ల
వనజ క్రిందిభాగమునందు; కనులు గలిపి
దిగుచు కాలుజారిపడగ మగువ నిలిపె
మేడపై నుండి పడినను మేలు కలిగె
@ సందీప్ -
రిప్లయితొలగించండి@ వూకదంపుడు -
సందీపు, వూకదంపుడు
అందించిరి పూరణముల నందముగా నే
మందును వీరల భావము
లం దేకత తోచె; చిత్ర మనిపించెఁ గదా!
తే.గీ.
రిప్లయితొలగించండిపూచె మేడపై నొక జాజి పూల తీగ
మెట్ల నెక్కఁజాలక వృద్ధ మిన్నకుండే
గాలి వానకు రాలెను పూలు కొన్ని
మేడపైనుండి పడినను మేలు కలిగె!!
(అక్షర దోష సవరణతో)
రిప్లయితొలగించండితే.గీ.
పూచె మేడపై నొక జాజి పూల తీగ
మెట్ల నెక్కఁజాలక వృద్ధ మిన్నకుండె
గాలి వానకు రాలెను పూలు కొన్ని
మేడపైనుండి పడినను మేలు కలిగె!!
కదప లేనట్టి కాలికి కట్టుగట్టి
రిప్లయితొలగించండికదల వద్దని చెప్పి నా కాంక్ష పెట్టె
కాలు విరిగితేనేమి నా కాంక్ష దీరె
మేడపైనుండి పడినను మేలు కలిగె
@ జిగురు సత్యనారాయణ -
రిప్లయితొలగించండి@ చదువరి -
జాజిపూలను పడగొట్టి సరసముగను
"జిగురు సత్యనారాయణ" చెప్పె కవిత!
కాలు విఱుగఁగాఁ దన కోరికలను దీర్చు
కొను నదృష్టమునుఁ దగఁ జెప్పెను "చదువరి".
అన్ని పద్యాలు బాగున్నాయండి.....మీ అందరికీ నా ధన్యవాదములు మంచి పద్యాలు అందచేస్తున్నందుకు "" ఒక వ్యక్తి కేవలం మాటలు చెప్తూ ,గాలి లో మేడలు కడుతూ బ్రతికే రొజుల్లో ఇవన్నీ వ్యర్ధం అని తెలుసుకున్నాడు...ఆతని గాలి మేడలు అన్నీ కూలి పొయాయి...నిజం తెలుసుకుని అతనికి మేలు జరిగింది "" ఇలాంటి భావన నాది పద్యం రాయాలనే ఆసక్తి నే గానీ రాయగల శక్తి లేదు నాకు నా భావన తగినది అయితే పద్య రూపం లో అందచేయగలరు
రిప్లయితొలగించండిపరుచూరి వంశీ కృష్ణ గారూ,
రిప్లయితొలగించండిమీ భావనకి పద్య రూపాన్నిచ్చే ఓ ప్రయత్నం.
ఏడ నున్నాను నేనను ఎరుక లేక
అంబరమునంట నేనెగుర సంబరమున
కలిగె కనువిప్పు కూలితి కడకు కలల
మేడపై నుండి పడినను మేలు కలిగె
ఫణి
@ పరుచూరి వంశీకృష్ణ గారూ,
రిప్లయితొలగించండినా బ్లాగు నచ్చినందుకు ధన్యవాదాలు. మీ భావాన్ని శ్రీ ఫణిప్రసన్న కుమార్ గారు అందమైన పద్యంగా తీర్చి దిద్దారు. గమనించారు కదా.
@ ఫణిప్రసన్న కుమార్ గారూ,
వంశీకృష్ణ గారి భావానికి అందమైన పద్యరూపం ఇచ్చి నాకు శ్రమ తప్పించారు. అభినందనలు, ధన్యవాదాలు.
గతముమరచెను శిరమునగాయమయ్యి
రిప్లయితొలగించండిబండి గుద్దుకొనగ నాడు బస్సుతోడ
స్మృతియు కలిగెనేడు మరల సుగతి వలన
మేడపైనుండి పడినను మేలు కలిగె
బాబు సైకిలు నేర్వగ బాగుఁ గంటి
రిప్లయితొలగించండిమేడపైనుండి; పడినను మేలు కలిగె
తనకు. మరల మరల ప్రయత్నమును జేసి
కడకు నేర్చుకునెఁ యతఁడు కష్ట పడుచు
వెరైటీ గా ఉన్నాయండీ అన్నీ(అందరి) పద్యాలు. చాలా బాగున్నాయ్.
రిప్లయితొలగించండి@ సుమిత్ర -
రిప్లయితొలగించండి@ రవి -
గతము గుర్తు చేయు హితమును కల్పించు
మేటి పూరణము "సుమిత్ర" దయ్యె,
మేడపైన నిలిచి చూడఁగా బాలుఁడు
పడిన విధము నిట్లు పలికెను "రవి"
ప్రణీత స్వాతి గారూ,
రిప్లయితొలగించండిసమస్యాపూరణ లందిస్తున్న కవులు మీరడిగినట్లుగా తమ పద్యాలకు వివరణలు కాని, కఠిన పదాలకు అర్థాలను కాని ఇవ్వకున్నా మీరు ఆ పద్యాల భావాన్ని అవగతం చేసుకొని పద్య కవితా మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నందుకు ఆనందంగా ఉంది.
నర్సు భామను ప్రేమించి నాను నేను,
రిప్లయితొలగించండిమేడ పైనుండి పడ చిట్లె మెడలు, జేర,
ఆసుపత్రిని ఐలవ్యు అనెను భామ
మేడపైనుండి; పడినను మేలు కలిగె.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
01)
________________________________
వాణినే , జూచి ప్రేమలో - పడితి నేను
మేడ పైనుండి ! పడినను - మేలు కలిగె !
పొరుగు వారది జూచిమా - పొందు నెరిగి
వాణికిని నాకు జేసిరి - పరిణయమ్ము !
________________________________
పొందుప్రేమ
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
వసంత కిశోర్ గారూ,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.