6, జూన్ 2010, ఆదివారం

దత్తపది - 1

కవి మిత్రులారా,
ఈ రోజు దత్తపది ఇస్తున్నాను.
అల, కల, వల, నెల
ఈ పదాలను ఉపయోగించి రామాయణార్థంలో మీకు నచ్చిన ఛందస్సులో పద్యం రాయండి.

9 కామెంట్‌లు:

  1. శంకరయ్యగారూ..నా బ్లాగ్ చూసి, చదివి, అభినందించినందుకు ముందుగా ధన్యవాదాలండీ. ..ఏదో అలా చిన్న చిన్న మాటల్లో నా జ్ఞాపకాలు, సరదా కబుర్లు రాయగలిగాను కానీ..పద్యాలు రాసే స్థాయి నాకు లేదండీ. మాతృభాష మీద అభిమానం వున్నా..పట్టు లేదండీ. ఓ న మః లు కూడా సరిగ్గా రావండీ. చదువుకుని, అర్ధాలు వెతుక్కుని మళ్ళీ చదువుకుని ఆనందిస్తూ వుంటాను..అంతే. మీలాంటి పెద్దల ఆశీస్సులు వుంటే కనీసం తడుముకోకుండా చదువుకుని అర్ధం చేసుకోగలిగే స్థాయికి చేరుకోగలను.

    రిప్లయితొలగించండి
  2. సందీప్ గారూ చాలా చాలా థాంక్సండీ..మీ ప్రోత్సాహానికి.

    రిప్లయితొలగించండి
  3. స్వాతి గారూ, అది "నెలమి" కాదు, "ఎలమి" ప్రత్యక్షమగుచున్ + ఎలమిన్ అని పదవిభాగం. ఎలమిన్ అంటే సంతోషంతో, దయతో, ప్రేమతో, ఉత్సాహంతో అనే అర్థాలున్నాయి.

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి !
    01)
    ___________________________________

    సర్వ వానర మూకలు - సాయ పడగ
    అబ్ది కావల నెలకొన్న - నసురు తోడ
    సకల రాక్షస వీరుల - సంహరించి
    అలరు బోడిని యలరించె - నచ్యుతుండు !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  5. వసంత కిశోర్ గారూ,
    ఒకవిధంగా ఇది నా దత్తపదికి నెట్ ద్వారా వచ్చిన మొదటి పూరణ. నా మిత్రుడు తన పూరణను ఫోన్ ద్వారా పంపాడు. నేరుగా వచ్చిన మొదటి పూరణ మీది. పద్యం చాలా బాగుంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. అశోక వనంలో సీతతో త్రిజట పలికిన ఊరడింపు మాటలు..

    కలతను జెందకు మమ్మా!
    అల రాఘవు డిటకు వచ్చి యసురుల జంపున్ !
    వలపుల రాణివి నిన్నే
    నెలతా! నినుగొని జనునిక నిజమిది వినుమా !

    రిప్లయితొలగించండి
  7. అలతి పూజకె మెచ్చు దయాంబురాశి
    కలతఁ జెందిన భక్తులఁ గాచువాఁడు
    తలఁచినంతనె యెదుట ప్రత్యక్షమగుచు
    నెలమి నను బ్రోచు రాముని కెవఁడు సాటి?

    రిప్లయితొలగించండి