7, నవంబర్ 2016, సోమవారం

సమస్య - 2191 (హారము గొలిచిన....)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"హారము గొలిచిన నది పది యామడలుండెన్."
లేదా...
"హారము గొల్చి చూడఁ బది యామడ లున్నది కంటివే సఖీ"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

102 కామెంట్‌లు:



  1. రాణి వాసానికి మొదటి సారి వెళ్లి వాళ్ల కంఠాభరణాల గాంచి నోరువెళ్ల బెట్టేసుకున్న ఓ జిలేబి అతశయోక్తి‌:)

    ఓరయ్యో మగడా! నయ
    గారము లొలికించు చుండెగా రమణీయం
    బై రాణి కంఠ మందున
    హారము! గొలిచిన నది పది యామడలుండెన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. వీరాంజనేయుని లంకాదహన దృశ్యం:



    తోరణమగు వాలముతో
    ధీరులు పదియారువేలు తికమకపడి కం
    గారుగ సడలించగ నా
    హారము గొలిచిన నది పది యామడలుండెన్!

    రిప్లయితొలగించండి
  3. దారులు వేరైన ప్రజలు
    భారతమున నుగ్రవాద వ్యతిరేకులమన్
    దీరును దెల్పెడు మానవ
    హారము గొలిచిన నది పది యామడలుండెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారు మీ పూరణ బాగుంది. నుగ్రవాదవ్యతిరేకు: ఇందు ద గురువవుతుంది. రెండు తత్ససమములు కాబట్టి.

      తొలగించండి
    2. కామేశ్వరరావు గారికి వందనములు మరియు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించ మనవి.

      దారులు వేరైన ప్రజలు
      భారతమున నుగ్రవాద వైరులమనెడున్
      దీరును దెల్పెడు మానవ
      హారము గొలిచిన నది పది యామడలుండెన్

      తొలగించండి
  4. గోగ్రహణము నందు ఉత్తర కుమారుని ప్రగల్పములు
    --------------------------------
    వీరా వేశము నొందుచు
    ధీరునివలె బలికె నంట త్రిధాము డనగన్
    సారధి లేకను సైనిక
    హారము గొలిచిన నదిపది యామడ లుండెన్
    ---------------------------------
    త్రిధాముడు= ఉత్తరకుమారుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్య గారు మీ పూరణ బాగుంది. త్రిధాము జగణము. బేసిగణము జగణ ముండరాదు.
      ఉత్తరుడని విష్ణువు శివులను కూడా అంటారు. వీరికి త్రిధాములని పేరు కూడా కలదు. కానీ ఉత్తరునికా పేరు వర్తించదు.
      "సారధి లేకను" అన్వయము లేదు.

      తొలగించండి
    2. పోరునకు సిద్ధపడె నట
      వీరా వేసము నొంది విరటుని సుతుడౌ
      తీరా మరుభూమి సైనిక
      హారము గొలిచిన నదిపది యామడ లుండెన్

      తొలగించండి
  5. డా.పిట్టా
    కోరిన కోర్కులు పెక్కులు
    చేరినవే కొన్ని బడుగు జీవిక ఫలమై
    తీరగ వశమే బంగరు
    హరము గొలిచిన నది పది యామడ లుండెన్
    తీరము దాక తాకగను దిద్దిరి జిల్లల నెల్ల జూడగా
    చేరువ లోనె నుండు విధి జేసిరి పాలన భూషణాలవే7
    దూరము భారమయ్యెనను ధోరణి సాగె న కార రీతినిన్
    హారము గొల్చి చూడ బది యామడ లున్నది కంటివే సఖీ!

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టా
    కోరిన కోరికతీరదు..అంటాను కోర్కులు స్థానం లో సరి జూడ గలరు ఆర్యా!

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టా
    కోరిన కోరికతీరదు..అంటాను కోర్కులు స్థానం లో సరి జూడ గలరు ఆర్యా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్ట వారు మీ మొదటి పూరణ బాగున్నది. హారము ముద్రణలోపము.
      రెండవ పూరణ లో సమస్యకు పరిష్కారము కష్టముగా నున్నది.

      తొలగించండి
    2. ఆర్యా డా.పిట్టా నుండి
      జిల్లాల విభజన TS లో సమయం.భూషణాలిచ్చినామని ప్రభుత్వమూహిస్తే దూరమైనదనే నెపం తో అవేమిబాగున్నాయి?గొలుసు అంత క్రిందికా? అనే నకారధోరణిని పలికించానోలేదో?సందర్భం చెప్పపకనే పూరణ రావాలనుకోవడం శ్రోతకు exercise ఇచ్చినట్లలయింందండీ

      తొలగించండి
    3. ఆర్యా "దిద్దిరి జిల్లల నెల్ల" అన్నారు కదా సందర్భము స్పష్టముగా తెలియుచున్నది. మీ భావమును మరింత సుందరముగ నావిష్కరిస్తే బాగుంటుంది.

      తొలగించండి
  8. గౌరికి నీశుడాతడిని కౌముద మాసపు సోమవారమున్
    తీరుగ గొల్వగా దలచి దేవళ మందున జొచ్చి చూడగా
    బారులు దీరినట్టి శరభాంకుని భక్తుల మేటియౌ సమా
    హారము గొల్చి చూడఁ బది యామడ లున్నది కంటివే సఖీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణికుమార్ గారు మీ పూరణ మతిశయోక్తితో నుత్తమముగా నున్నది. "నీశుడాతనినిఁ గౌముద"; "దీరుగ" అనండి.

      తొలగించండి
    2. పూజ్యులు కామేశ్వరరావు గారికి అభివాదములు. మీ సవరణకి ధన్యవాదములు.

      గౌరికి నీశుడాతనిని కౌముద మాసపు సోమవారమున్
      దీరుగ గొల్వగా దలచి దేవళ మందున జొచ్చి చూడగా
      బారులు దీరినట్టి శరభాంకుని భక్తుల మేటియౌ సమా
      హారము గొల్చి చూడఁ బది యామడ లున్నది కంటివే సఖీ

      తొలగించండి
    3. పూజ్యులు కామేశ్వరరావు గారికి నమస్సులు. నిన్నటి నా పూరణ పరిశీలించ ప్రార్థన.

      నీ సరి సాటి లేరు మహి నిక్కము జూడగ మర్త్యసింహమా
      బాసను సేయుచుంటి నిక భక్తిగ మ్రొక్కుచు నీ పదంబులన్
      వేసట లేకనేనిచట వేడుక నుండెద నీదురాకకై
      వాసిగ నంది గ్రామమున బానిస రీతిగ వేచియుండెదన్

      తొలగించండి
    4. పూజ్యులు కామేశ్వరరావు గారికి నమస్సులు. ధన్యవాదములు.

      తొలగించండి
  9. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    భారతదేశము న౦దున

    చారిత్రాత్మక మగుచు నెస౦గు హిమగిరి

    న్నారయుము దట్టమౌ నీ

    హారము గొలిచిన నది పది యామడ లు౦డెన్ ! !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారు హారమును నీహారము చేసిన మీ పూరణ ప్రశస్తముగానున్నది.

      తొలగించండి
  10. రిప్లయిలు
    1. చేరెను భక్త గణమ్మదె,
      తీరున బారుల నిలచెను తిరుమల సామిన్
      గోరుచు, గనుడదె మానవ
      హారము, గొలిచిన నదిపది యామడ
      లుండెన్!

      తొలగించండి
    2. శర్మగారు మీ పూరణ చాలా బాగుంది. దిరుమల అనండి. ద్రుతసంధి నిత్యముగా చేయ వలసియున్నది కద.

      తొలగించండి
  11. రిప్లయిలు
    1. సవరణ : మూడవ పాదము
      "మారుపు దేదలంచియును మానవ హారము గట్ట నెంచ;నా"

      తొలగించండి

  12. కం. ఘోరమ్ముల కెదురు నిలిచి
    పోరాటము జేయ దలచి పురము వెలుపలన్
    బారుగ నిలిచిన మానవ
    "హారము గొలిచిన నది పది యామడలుండెన్."
    %%%%%$$$$%%%%%
    ఉ. ఘోరము లెన్నియో జరిగె గూరిమి జూడ నదెందుబోయెనో
    పోరక శాంతి సౌఖ్యముల బొందగ నెట్లని పౌరులందరున్
    మారుపు దేదలంచియు మానవ హారము గట్ట నెంచ;నా
    "హారము గొల్చి చూడఁ బది యామడ లున్నది కంటివే సఖీ"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారు మీ రెండు పూరణలు చాలా బాగున్నవి. మారుపుఁ దే అరసున్న నుంచితే సుస్పష్టము.

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ ! ధన్యవాదాలు!

      తొలగించండి
  13. తీరగు ' నెక్లెస్ ' రోడ్డది
    యారహదారియె పురమున కావలనుండెన్
    మీరిన పట్టణ కంఠపు
    హారము,గొలిచిన నది పది యామడలుండెన్.

    రిప్లయితొలగించండి
  14. భారత సైనిక శిబిరము
    కారడవులలోన యుండు కాలము నందున్
    వారికి పంపెద రట యా
    హారము గొలిచిన నది పది యామడలుండెన్.

    రిప్లయితొలగించండి
  15. భారత సేనావళి యను
    హారము గొలిచిన నది పది యా మడ లుండెన్
    రారా చూతము దానిని
    నౌరా యది యింత పొడుగ ! నబ్బుర మున్గా న్

    రిప్లయితొలగించండి
  16. ఆ రసపుత్రుడు కుంభుడు
    తీరుగ కట్టించెను తొలి తీర్తంకరుడౌ
    పేరొందు నాదినాథు వి
    హారము,గొలిచిన నది పది యామడ లుండెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారు మీ పూరణ చాలా బాగుంది. పులస్త్యబ్రహ్మ కుమారుడు విశ్రవసుని పుత్రుడు కుంభకర్ణుని కుమారుడు కుంభుడు కదా! రసపుత్రుడెలా యయ్యాడు?

      తొలగించండి
    2. శ్రీ కామేశ్వరరావు గారికి,రాజస్థానములో కుమ్భరాణారానక్ పూర్ లో ఆదినాథుడనెడి తొలి జైన తీర్తంకరుని విహారము కట్టించినాడు.ఈ విహారము ఆరావళీ పర్వతములలో నున్నది సుమారు
      30 చదరపు మైళ్ల విస్తీర్ణములో నున్న ఈ విహారములో చతుర్ముఖ నాధునివిగ్రహముకూడా వున్నది నేను వ్రాసినపద్యము తత్సంబంధమైనది.
      రానక్ పూర్ లో

      తొలగించండి
    3. ధన్యవాదములండి. క్రొత్త విషయమును తెలియజేశారు.

      తొలగించండి
  17. కారణ మేమిటో పలురకంబుల వాహనసంఘ మిచ్చటన్
    బారులు దీరి నిల్చుటకు బాట నటంచును క్రింది కేగి తా
    నారయ బూనినంతట మహాఘనమై దిశ లంటియుండె నీ
    హారము గొల్చి చూడ బది యామడ లున్నది కంటివే సఖీ!

    కోరిన యట్టుల గమ్యము
    చేరంగను నడ్డగించి శీతమయంబై
    ధారుణి నలమిన యా నీ
    హారము గొలిచిన నది పది యామడ లుండెన్.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారు మీ రెండు పూరణలు చాలా బాగున్నవి. గ్రింది అనండి. ద్రుత సంధి నిత్యము.

      తొలగించండి
  18. నేరమయ మీ కలి యుగము
    ఘోరమ్ముగఁ జేసిరి యతి గోప్యముగ నదీ
    తీరము సారపు భూమ్యప
    హారము గొలిచిన నది పది యామడ లుండెన్.


    దారుణ మర్థ నాశము నధర్మము ప్రాణ వినాశ కారమున్
    ఘోరపు టాజి భూజనులకుం దగ దెన్నడు నిక్కమే సుమీ
    పారిన దచ్చటన్ రుధిర వాహిని వే జరుగం బగన్ మహా
    హారము గొల్చి చూడఁ బది యామడ లున్నది కంటివే సఖీ

    [హారము=యుద్ధము]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆర్యా!
      భూమ్యపహార పరముగాను, యుద్ధ పరముగాను మీ పూరణలు ఉత్తమముగా నున్నవి.

      తొలగించండి
    2. కవివరేణ్యులు కామేశ్వర రావు‌గారూ....మీ రెండు పూరణలు అద్భుతంగా వున్నాయి.

      తొలగించండి
  19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  20. పారములేనిసైన్యమదిబాగుగజూడుమయమ్మ!మానవా
    హారముగొల్చిచూడబదియామడలున్నదికంటివేసఖీ!
    బాారులుదీరుచున్గదనరంగమునందుననొక్కరొక్కరు
    న్వీరముజూపుచున్మదినిభీతినిలేకనుబోరుసల్పిరే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నయ్య నీ పూరణ బాగుంది. మూడవ పాదములో యతి భంగము.
      మానవ హారము (మానవ-ఆహారము కాదు కద) సాధువు. భీతియు లేకను

      తొలగించండి
  21. కూరిమితో భక్తజనము
    తీరుగ మాపైడిమాంబ దేవళమెదుటన్
    బారుగ నిలుచున్న సమా
    హారము గొలువగ నదిపది యామడలుండెన్!!!


    తీరుగ మేలిమి పసిడిన్
    భారతి జేయించుకొనెను పదిపేటలతో
    కోరిక దీరగ రవ్వల
    హారము గొలువగ నది పది యామడలుండెన్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారు మీ రెండు పూరణలు చాలా బాగున్నవి. 80 మైళ్ళ రవ్వల హారము బాగుందండి మీ స్నేహితురాలి యాశ! పైగా పది పేటలు!!!

      తొలగించండి
  22. కుంభకర్ణుడిని నిదుర లేపే సన్నాహమున:


    గారెలు బూరెలు లడ్డులు
    బర్రెలు గొర్రెలు వరుసగ బారులు బారుల్
    కోరిక తీరునటుల పల
    హారము గొలిచిన నది పది యామడలుండెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రి గారు మీ పూరణ చాలా బాగుంది. ఫలహారము.
      మేరుసంకాశ మాంస రాశులు,మృగ మహిష వరాహ సంచయములు, అన్న రాశులు, మద్య శోణిత కుంభాలు, కుంభకర్ణునికి లేవగానే తినడానికి పెట్టినవి!

      తొలగించండి
    2. మీ పద్యం ఫలహారాలతో కమ్మగా యుందండి.రెండవ పాదంలో ప్రాస సవరించిన యింకా రుచిగా యుండగలదు.

      తొలగించండి
    3. సహదేవుడు గారు అది సంయుతాసంయుత ప్రాస -
      రేఫంతో కాని లకారంతో కాని సంయుతమై ఉన్న హల్లుతో, రేఫ లకారాలు లేని అదే హల్లుతో ప్రాస కూర్చుట. (అనగా ప్రాసాక్షరాలుగా క్ర-క, క్లే-క మొదలైనవి ప్రయోగించుట).

      యిదియొక రకపు పిండివంట!!

      తొలగించండి
  23. దారుణ మైన హింస కడు దారుణ మౌ యవి నేతి హెచ్చె నీ
    ధారుణి యందు నేడనుచు ధాత్రి జనావళి గూడి యందరున్
    బారులు తీరి తీవ్రముగ వైరము చేసిరి యట్టి మానవా
    హారము గొల్చి చూడఁ బది యామడ లున్నది కంటివే సఖీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మీనారాయణ గారు మీ పూరణ బాగుంది. మానవ హారము సాధువు. "మానవాహారమ" నిన మానవ - ఆహారము.

      తొలగించండి
  24. వేరము బోవగ నింటికి
    దారియె కనబడుటలేదె దామన్ జోడీ
    యూరున దట్టంబౌ నీ
    హారము గొలువగనది పది యామడలుండెన్!!!

    రిప్లయితొలగించండి
  25. బూరెలు గారెలతో నో
    రూరెడు బొబ్బట్లు లడ్లు రుచ్యముల సమా
    హారము ఘటోత్కచుని యా
    హారము గొలిచిన నది పది యామడలుండెన్.

    రిప్లయితొలగించండి
  26. కోరుచు ప్రత్యేకపు హో
    దా, రూఢిగ యువకులంత దారులఁ జేరన్
    వీరత్వముతో, మానవ
    హారము గొలిచిన నది పది యామడలుండెన్

    రిప్లయితొలగించండి
  27. సారముగల పొలమది చే
    జారగనీయకుముతల్లి, జనపాలురతో
    గోరుము మనకది తగుపరి
    హారము, గొలిచిననది పదియామడలుండెన్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పీతాంబర్ గారు మీ పూరణ బాగుంది. 10 ఆమడలంటే 80-100 మైళ్ళండి.

      తొలగించండి
    2. కవివర్యులు శ్రీ కామేశ్వరరావు గారికి ధన్యవాదములు.కరువునస్టాన్ని వేలకోట్లలో అంచనా రాస్ట్ర ప్రభుత్వం వేసిపంపిస్తే కేంద్రం పదులకోట్లలో నిధులు ఇచ్చినట్లు అడగడంలోతప్పులేదు కదా.

      తొలగించండి
  28. శ్రీరఘు రాముతో కలికి సీత వివాహపు వేడ్కలన్ గనన్
    బారులు తీరి దేవతలు వత్తురనంచు నెఱంగియే యటన్
    భూరిగ తోరణమ్ములుగ పుష్పపు మాలల గట్టిరంట యా
    హారము గొల్చి చూడఁ బది యామడ లున్నది కంటివే సఖీ

    రిప్లయితొలగించండి
  29. ఈ రాష్ట్ర మంత్రి వరునికి
    వీరా స్వాగత మిడునది? వేసవి లోనన్
    ఘోరము,బడి పిల్లలతో
    హారము! గొలిచిన నది బది యామడ లుండున్!

    తీరుగ మనుజుని మేనున
    వేఱుల వలె నల్లుకొనుచు విరియగ, నచటన్
    చేరిన నరమ్ముల సమా
    హారము గొలిచిన నది బది యామడ లుండున్!
    (పది ఆమడలంటే సరిగ్గా వంద మైళ్ళనే అర్ధంలో కాక చాలా దూరమనే భావనతో ప్రయోగించాను. మానవ శరీరంలోని నరాలనన్నింటిని ఒకదాని వెనుక మరొకటి వుంచితే ఆ పొడవు చాలా ఎక్కువే వుంటుందని మాత్రమే తెలుసు. సరిగ్గా ఇంతని తెలియదు. తప్పయితే మన్నించండి).

    రిప్లయితొలగించండి
  30. నాల్గవ పాదంలో 'నుండెన్ ' బదులు నుండన్ అని పడింది, టైపాటు, మన్నించండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారు మీ రెండు పూరణలు నుత్తమముగానున్నవి.
      "పదియామడలుండెన్" ఇక్కడ యతిశయోక్తిగా ప్రయోగించారు. తప్పు లేదు. అది అర్థాలంకారము.

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    3. కవివర్యులు కామేశ్వర రావు గారికి ధన్యవాదములు.

      తొలగించండి
  31. ధారుణి తాపము తగ్గగ

    భారీగా చెట్లు పెంచ వలెనని చెప్పన్

    జేరగ యువకులు మానవ

    హారము; గొలిచిన నది పది యామడలుండెన్.

    రిప్లయితొలగించండి
  32. సవరించి వ్రాసిన పూరణ
    దారుణ మైన హింస కడు దారుణ మౌ యవి నేతి హెచ్చె నీ
    ధారుణి యందు నేడనుచు ధాత్రి జనావళి గూడి యందరున్
    బారులు తీరి ధిక్క్రుతము బల్కిరి చేతులు పట్టుకొంచు నా
    హారము గొల్చి చూడఁ బది యామడ లున్నది కంటివే సఖీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ సవరణ బాగుందండి. "అవినీతి." ముద్రణ లోపము సవరించెద రనుకున్నాను.

      తొలగించండి
  33. కారడ విన్ నిరంతరము కల్గును ముష్కర చక్రవాళ సం
    హారము, గొల్చి చూడ బది యామడ లున్నది కంటివే సఖీ!
    పోరితమౌ తలమ్మిటకు పూర్తి సుదూరము భీతియేలనే?
    నేరపు మూకలన్ సతము నేర్పుగ త్రుంచుచు నుండ్రి సైనికుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ రెడ్డి గారు మీపూరణ బాగుంది. పూర్తి సుదూరము కుదిరినట్లు లేదు. "తలమ్మునకుఁ బోవగ దూరము" అన నెట్లుండును?

      తొలగించండి
    2. తమరి సూచనకు ధన్యవాదములు. పోరితమౌ తలమ్మిటకు, పొల్తి! సుదూరము భీతియేలనే? - అంటే ఎలాఉంటుంది.

      తొలగించండి
  34. మిత్రులందఱకు నమస్సులు!

    కోరఁగ సభ నొక విబుధుని
    మీఱిన పాండిత్యగరిమ మెప్పులు వొందన్
    ధారుణిపుఁ డిడిన భూమ్యుప

    హారముఁ గొలిచిన నది పది యామడ లుండెన్!

    రిప్లయితొలగించండి
  35. (2)
    [ఒకఁడు తన భార్యతో ఢిల్లీలో నేర్పడిన సంఘటనఁ గూర్చి ముచ్చటించు సందర్భము]

    తీరని కష్ట మిద్ది, కన దిల్లిని నిన్నటి వార్త విన్నచో!
    నేర మదేమొ గాని, ధరణిన్ మిహికోపరి విస్తరమ్ముచే
    భారముఁ గూర్చె! రాదు పరివారము తోడ బహిర్గమింప! నీ

    హారముఁ గొల్చి చూడఁ, బది యామడ లున్నది కంటివే, సఖీ!!

    రిప్లయితొలగించండి
  36. బారులు తీరి వృక్షములు పచ్చదనమ్మును నింగి నింపగా
    తారల వోలె పుష్పములు తళ్కుల నీనెడి, పండ్లు కాయలున్
    చేరిన గాములే, చెలగు శ్రీ లిట, వీడగ లేదు డెంద మూ
    హారముఁ గొల్చి చూడఁ, బది యామడ లున్నది కంటివే, సఖీ!

    (ఊహు+ఆరము; ఆరము=ఉద్యానవనము.)

    రిప్లయితొలగించండి
  37. దారులు వేరైనను రహ
    దారుల యందున జనములు తోషము తోడన్
    చేరుచు చేసిన మానవ
    హారము గొలిచిన నది పదియామడలుండెన్.

    దారిన హారము వలె కపి
    వీరుని వాలము గనగనె వేగిరపాటున్
    తీరుగ ప్రక్కకు జరిపిన
    హారము గొలిచిన నది పదియామడలుండెన్.

    రిప్లయితొలగించండి
  38. చీరలు సారెలన్ గొనుచు చేరిరి పెండ్లికి డింపులయ్యెదౌ
    గౌరవనీయు లెల్లరును గంపల దెచ్చిరి కాన్క వాన్కలన్
    నీరవ మోడి తెచ్చినది నేనెటు చెప్పెద నోరురాదయో!
    హారము గొల్చి చూడఁ బది యామడ లున్నది కంటివే సఖీ!

    రిప్లయితొలగించండి