28, జనవరి 2017, శనివారం

సమస్య - 2266 (మూషికం బొండు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"మూషికం బొండు పిల్లిని ముద్దులాడె"
లేదా...
"మూషిక మొండు పిల్లిఁ గని ముద్దు లొసంగెను ప్రేమతోడుతన్"

72 కామెంట్‌లు:

  1. బుద్ధినాశాత్ ప్రణశ్యతి



    వైరి యొక్క వైరి తనదు బంధు వనుచు
    వెఱ్ఱి పాకివోడు కసాయి గొఱ్ఱె వోలె
    పోయి చీని కౌగలి జేరె బుధ్ది విడిచి -
    మూషికం బొండు పిల్లిని ముద్దులాడె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు గురువర్యులు శ్రీమాన్ కంది శంకరయ్య గారి స్పందన తారాబల పట్టిక (తారలు = స్టార్లు):

      ప్రయత్నము ప్రశంసనీయము = 1

      బాగున్నది = 2

      చక్కగ = 3

      వైవిధ్యముగ = 4

      ఉత్తమముగ = 5

      ప్రశస్తముగ = 6

      అద్భుతముగ = 7

      అత్యద్భుతముగ = 8

      మహాద్భుతముగ = 9

      మనోహరముగ = 10

      తొలగించండి


    2. అత్యద్భుత మగు పట్టిక
      నిత్య పఠన శాస్త్రి గారి నియతికొలతయౌ :)

      చీర్స్
      జిలేబి

      తొలగించండి
    3. సత్యము లగునివి తారలు
      ముత్యమ్ముల తోరణములు ముచ్చట దీరన్

      తొలగించండి
    4. తరతమములు వలదు మనకు
      కర మనురతి మన మలరెడు కవన సుమములన్
      సురుచిర గతుల ననవరత
      పరవశమున మెలగిన నురు వరముగు నధిపా!


      తొలగించండి
    5. "Beauty is a gift of God. We should thank Him if we have it. If not, we should thank Him that others have it for our pleasure"

      ...Somerset Maugham

      తొలగించండి
    6. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీరు చెప్పినట్లు తారలనిచ్చే ఆలోచన నాకు గత సంవత్సరం వచ్చింది. కాని అమలులో పెట్టడానికి మొహమాట పడ్డాను. దానివల్ల కొందురు మిత్రులు నొచ్చుకొనడమో, కోపం తెచ్చుకొనడమో జరిగే అవకాశాలున్నాయి. "ఫలానా వారికి నాకంటే ఎక్కువ స్టార్లిచ్చారు. నా పూరణకంటే వారిది ఏవిధంగా బాగుంది?" అని ఎదురుదాడి చేయవచ్చు.
      దాదాపుగా అందరికీ "మీ పూరణ బాగున్నది. అభినందనలు" అని పెడుతున్నాను. నిజానికి పూరణలను నిశితంగా పరిశీలిస్తున్నానా? భావం, అన్వయం, పదప్రయోగం మొదలైనవాటిని స్పృశిస్తున్నానా? ఎలాగూ అంతటి తీరిక, ఓపిక, పాండిత్యం నాకు లేవనుకోండి!
      కొందరి పూరణలలో భావం స్పష్టంగా ఉండదు. కొన్ని పద్యాలలో అన్వయలోపం ఉంటుంది. ఛందో వ్యాకరణ దోషాలుంటాయి. ప్రతి పద్యాన్నీ శల్యపరీక్ష చేశామనుకోండి... కొందరు "ఎందుకొచ్చిన పీడ!" అనుకొని పద్యరచన మానుకోవచ్చు. కొందరు అలుగవచ్చు. కొందరు వాదించి చర్చకు అవకాశమివ్వవచ్చు. అందుకని "నొప్పింపక తా నొవ్వక తప్పించుక తిరుగు" మార్గాన్ని ఎంచుకున్నాను. స్వస్తి!

      తొలగించండి
    7. పూజ్యులు గురువర్యులు శ్రీ శంకరయ్య గారు:

      ఈ ధర్మ సంకటం ఉపాధ్యాయ వృత్తి లో జీవితము గడిపిన మనలాంటి వారందరినీ వేధించేదే! కానీ తప్పదు కదా! సహృదయత ఉన్నచోట బాధలుండవు. నమస్సులు!

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. వేషము మారినంతనె వివేకము లేకను స్వార్ధ చిత్తమున్
      శోషిల జేయనెంచ గను సూచన భావము మోసమందునన్
      రోషము జూపుచున్ నెదుటి రూపము జూడగ చెక్కగా వుతన్
      మూషిక మొండు పిల్లిఁ గని ముద్దు లొసంగెను ప్రేమతో డుతన్
      --------------------------------------------------
      పిల్లి పైనను కసిమెండు వెల్లి విరియ
      పగను దీర్చగ యదనుకై పరిత పించ
      కొయ్య బొమ్మను మురియుచు కోరి నంత
      మూషికం బొండు పిల్లిని ముద్దులాడె

      తొలగించండి
    2. అక్కయ్యా,
      మీ రెండు పూరణలు బాగున్నవి.
      '...జూపుచు న్నెదుటి...' అనండి.

      తొలగించండి
  3. డా.పిట్టా
    ఈషణలు రేగ యూరపు నేకధాటి
    గలిసి విడిపోవ బ్రిటను సత్కాల మెరిగి
    దేశ ప్రేమను బ్రకటించ దిరిగి వచ్చె
    మూషికంబొండు పిల్లిని ముద్దులాడె!
    ఘోషణ జేసి యుద్ధముల ఘోర వినాశము గూర్చి స్వార్థ సం
    పోషణ ధ్యేయ మన్నటుల భూమిని సాంతము నేలె నాంగ్ల సం
    భాషణ భూషణంబనగ భాసిలె రోషము దక్క, హా విధీ!
    మూషిక మొండు పిల్లి గని ముద్దులొసంగెను ప్రేమ తోడుతన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'పోషణ ధ్యేయ' మన్నపుడు ణ గురువై గణదోషం. "పోషణ లక్ష్య మన్నటుల..." అనండి.

      తొలగించండి
    2. డా.పిట్టా
      ఆర్యా,పోషణ లక్ష్య మన్నటుల,గా మార్చినాను.ఉదయం త్వరగా పూరిస్తూ చూసుకోలేదు. కృతజ్ఞతలు

      తొలగించండి


  4. కలుగు లోన ముఖమునిడ కరకు గాను
    మూషికం బొండు పిల్లిని ముద్దులాడె,
    స్థాన బలిమి మహిమయది చక్క తెలుసు
    కొను జిలేబి జీవనమున కొనరు తెలివి !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. ఎన్నికలగుర్తులేయవి యెన్నగాను
    పెద్ద పార్టీని యోడింప ప్రేమ జూపి
    కలసికట్టుగ గెలి "చెడు " తలపుతోడ
    మూషికం బొండు పిల్లిని ముద్దులాడె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పార్టీని నోడింప..." అనండి.

      తొలగించండి
  6. భూషలుగా చెలంగెనొక బొమ్మల కొల్వున మూషకాదులున్
    తోషిత వస్తుజాలముల తొయ్యలి చూచుచురాగ కన్పడెన్
    మూషికమొండు--ప్లిల్లిఁగని ముద్దులొసంగెను ప్రేమతోడుతన్--
    పోషణఁజేసే హస్తకళ పొల్పుగ వారలు ధన్యులేగదా

    రిప్లయితొలగించండి
  7. రోషము లేని పాలకుల రోగ మదేమొ, విదేశ వర్తకుల్
    శేషము లేక దోచుకొన శీఘ్రమె వారికి లొంగిపోవుచున్
    రాశులకొద్ది సంపదలు రాజ్యము దాటుట లిట్టులున్నదా
    మూషికమొండు పిల్లిగని ముద్దులొసంగెను ప్రేమతోడుతన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేపూరి శ్రీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. డా.పి ట్టా
      ఆర్యా, "లొంగి పోవగన్ "అంటే పూర్తి అన్వయం సిద్ధిస్తుంది కదా!

      తొలగించండి
  8. జాతి వైరము లేకను జగము నందు
    ప్రాణు లన్నియు నెయ్యాన బ్రతుకు చుండె
    ననుట కునిది నిదర్శన మార్య !చూడ
    గణ్వునాశ్రమ మందున గాన నగును
    మూషికంబొండు పిల్లిని ముద్దు లాడె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. చిత్రకారుండు గీచెను జీవకళయె
    యుట్టిపడ నొక్క పిల్లిఁ, దా నొక్క కొంత
    తడవు భీతిల్లి యదియె చిత్రముగ నెఱిఁగి
    మూషికం బొండు పిల్లిని ముద్దులాడె.

    రిప్లయితొలగించండి
  10. శ్రీగురుభ్యోనమః
    రోషము తోడ వెంటబడ రొప్పుచు పారి బిళంబు జేరెనే
    మూషిక మొండు పిల్లిఁ గని, ముద్దు లొసంగెను ప్రేమతోడుతన్
    చూషణ జేసి దీర్ఘముగ చుంబన మాధురి బిడ్డ కిచ్చుచున్
    దోషములెల్ల తొల్గెనని దుఃఖము తీరగ నెల్క తల్లియే

    రిప్లయితొలగించండి
  11. క్రొవ్విడి వెంకట రాజారావు:

    భూతదయ తోడ వర్తిల్లు పుణ్య జనుడు
    సాధు జంతువులను దెచ్చి చనవు నేర్పి
    నాట లాడించు వేళలో నెనరున నొక
    మూషికం బొండు పిల్లిని ముద్దు లాడె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "నేర్పి యాటలాడించు..." అనండి

      తొలగించండి
  12. ఆటలాడఁగ బాలుడున్ మూట నుండు
    కొయ్య బొమ్మల నేలపై గ్రుమ్మరించ
    పాము ముంగిస పైఁబడె ప్రాకునటుల
    మూషికం బొండు పిల్లిని ముద్దులాడె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. ఏతరి వెతలు వచ్చునో యేరి కెరుక
    తలుప దైవోపహతులకుఁ గలదె బ్రతుకు
    తల్లి యని యెంచి తాఁ దల్లడిల్ల నంధ
    మూషికం బొండు పిల్లిని ముద్దులాడె


    ఘోష నికేతనమ్మున నఘోర నినాద వినోద మోది యా
    మూషిక రాజ మచ్చట విమోహము నందున నుండ ఖాదనా
    న్వేషమునం జరింప మగపిల్లియ, భక్షణ మయ్యె దానికిన్
    మూషిక, మొండు పిల్లిఁ గని ముద్దు లొసంగెను ప్రేమతోడుతన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా ఉండి అలరింపజేశాయి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  14. గ్రుడ్డితనముతో నిత్యముఁ గుములుచుండ
    మూషికం బొండు పిల్లిని ముద్దులాడె
    ప్రభుత కనులు మూసుకొని తా వ్యవహరించ
    ప్రజలసొమ్ముతో నేతలు ప్రబలుచుండ్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. *సహస్రకవిరత్న, కవిభూషణశ్రీమతి జి సందిత బెంగుళూరు*

    *"మూషిక మొండు పిల్లిఁ గని ముద్దు లొసంగెను ప్రేమతోడుతన్"*

    వేషముపిల్లిగానటులవేసెనుచెల్లెలునాటకంబునన్
    మూషికవేషధారణముముందుగ చేసెనటక్కయచ్చటన్
    భేషనఁజేయగానటన పెళ్ళుబుకన్ నటవేదినెక్కెబల్
    *"మూషిక మొండు పిల్లిఁ గని ముద్దు లొసంగెను ప్రేమతోడుతన్"*

    *సహస్రకవిరత్న,సహస్రకవి*
    *భూషణశ్రీమతి జి సందిత బెంగుళూరు*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గాదిరాజు మధుసూదన్ రాజు గారూ,
      నాటక వ్యాజంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మిమ్మల్ని సందిత, మధుసూదన్ రాజు ఏ పేరుతో సంబోధించాలి?
      ఇక్కడ కేవలం పూరణను మాత్రమే ప్రకటించండి. మిగతా వివరాలు వద్దు.

      తొలగించండి
  16. క్రొవ్విడి వెంకట రాజారావు:

    భేషజమేమియుంబడక పిల్లులు కుక్కలు మూషికమ్ములన్
    దోషములేని చందమున దొడ్డగ బెంచుచు వాట్ల నాతఁడున్
    పోషణ జేయుచున్ననుగు బూంచుచు నాటల నుంచ నొక్క దా
    మూషిక మొండు పిల్లిఁ గని ముద్దు లొసంగెను ప్రేమతోడుతన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వాట్ల, బూంచుచు'...?

      తొలగించండి
  17. గుంండా వెంంకట సుబ్బ సహదేవుడు వారూ మీ పూరణ చాలా బావుంంది

    రిప్లయితొలగించండి
  18. వెఱచిగూబకు వలనున్న పిల్లి జేరి
    మూషికం బొండు పిల్లిని ముద్దులాడె
    శబరు డేతెంచ వేకువ శ్వానములతొ
    యురుల కొరికెను కలుగులో నురికె నెలుక
    ఆత్రమందున శత్రులుమిత్రులు గద

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      బాగున్నది మీ పూరణ. అభినందనలు.
      'శ్వానములతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు.

      తొలగించండి
    2. గురుదేవులస్పందనకు సవరించిన పద్యము
      వెఱచిగూబకు వలనున్న పిల్లి జేరి
      మూషికం బొండు పిల్లిని ముద్దులాడె
      శబరు డేతెంచ వేకువ శ్వానముగొని
      యురుల కొరికెను కలుగులో నురికె నెలుక
      ఆత్రమందున శత్రులుమిత్రులు గద

      తొలగించండి
    3. గురుదేవులస్పందనకు సవరించిన పద్యము
      వెఱచిగూబకు వలనున్న పిల్లి జేరి
      మూషికం బొండు పిల్లిని ముద్దులాడె
      శబరు డేతెంచ వేకువ శ్వానముగొని
      యురుల కొరికెను కలుగులో నురికె నెలుక
      ఆత్రమందున శత్రులుమిత్రులు గద

      తొలగించండి
  19. రోషము తోడరాదరికి రోయుచు దూరెను బిల్వ మందునన్
    మూషిక మొండు పిల్లిగని ,ముద్దు లొసంగెను ప్రేమతోడుతన్
    వేషము లెన్నివేసినను భేషజ మన్నది లేక యుండగన్
    భాషణ పధ్ధతిన్వి నుచు భారతి సీతను మెచ్చుచున్మ దిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మెచ్చుచున్నదిన్'...? "సీతను మెచ్చి నెమ్మదిన్" అనండి.

      తొలగించండి
  20. అరయ వనముల తపసుల యాశ్రమమున
    జాతివైరము మరచిన జంతు జాతి
    శాంతి బ్రేమల తోడుత సఖులవంగ
    మూషికంబొండు పిల్లిని ముద్దులాడె!

    రిప్లయితొలగించండి
  21. ఋషుల యాశ్రమమందున మృగములెల్ల
    వైరములు వీడి ప్రేమతో భయములేక
    కలిసి మెలిసి జివించుట గాంచినాము
    మూషికం బొండు పిల్లిని ముద్దులాడె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గండూరి లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  22. పరుగు దీయు బిడాలపు పద మెలుకల
    బోను తాకి నంతనె, పారి పోయె నచటి
    మూషికం బొండు! బిల్లిని ముద్దులాడె
    మదిని! మరి మరి తలచి నమస్సులనియె!

    రిప్లయితొలగించండి
  23. దోషపు కంటిచూపునను దుఃఖితయై చరియించుచుండగన్
    మూషిక మొండు పిల్లిఁ గని ముద్దు లొసంగెను ప్రేమతోడుతన్
    రోషములేని సాధువని రూఢిఁ దలంచుచు మానసమ్ములో
    భేషగు ఖాదనమ్మనుచుఁ బ్రీతి భుజించె పయస్యమిచ్చతో

    రిప్లయితొలగించండి
  24. రోగమున జిక్కి భుక్తికి రోదన లిడి
    సృక్కి మార్జాల మొక్కటి చెంత జేర
    ముసలి మూషికమను భ్రమ మోసపోయి
    మూషికం బొండు పిల్లిని ముద్దులాడె

    నిన్నటి సమస్య కు నా పూరణ

    పంట నూడ్చి పిదప పదిల పరచ బోవ
    పిడుగులు గురి పించు పెను తుఫాను
    వలన నీటగలిసి వాగుగా ప్రవహించు
    వర్ష మిచ్చుఁ జింత కర్షకునకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  25. స్పందనమీయదిజూడగ
    గందివరునిమించిపోయెగవికులతిలకా!
    వందనములనర్పించుచు
    జిందాబాద్ తెలుపుచుంటిజీపీశాస్త్రీ!

    రిప్లయితొలగించండి
  26. సాని వాడలో జేరిన సరసు డొకడు
    వారకాంతను గోరి సంపదల నెల్ల
    ముగ్దకిచ్చుచు రతికేళి మునగ గాంచ
    *మూషికం బొండు పిల్లిని ముద్దులాడె*


    భూషణభూషితగియగు భూరిగ సోయగ మొల్కు వేశ్యయౌ
    యోషిత బ్రేమ జేరుచును యుక్తమయుక్తమెఱుంగ లేక తా
    బోషణ జేసె, సంపదల బోసెపడంతికి దాసుడై గనన్
    మూషిక మొండు పిల్లిఁ గని ముద్దు లొసంగెను ప్రేమతోడుతన్
    ------......... ......... ....విరించి

    రిప్లయితొలగించండి
  27. అర్థం లేని పదాలతో అర్థవంత మైన పద్యం.
    "నునునూ" ; నెనెనే ; నినినీ ; "నననా" అనే పదాలతో శ్రీకృష్ణుని పై రాధ భక్తిని వర్ణిస్తూ ఓ పద్యం చెప్పమన్నారు ఒక అవధానం లో శ్రీ సీవీ సుబ్బన గారిని.
    పద్యం చూడకుండా ఓ రెండు నిముషాలు ఆలోచించండి.ఈ పదాలతో పద్యం మాట అటుంచి నాలుగు వాక్యాలు వ్రాయగలమా? అని.ఆ పదాలకు ముందు వెనుకల మీకిష్టమొచ్చిన అక్షరాలను చేర్చ వచ్చు. అయితే ఆ పదాలను మాత్రం మార్చరాదు.
    ఇక చూడండి. అవధాని విరచిత మత్తేభ విక్రీడిత పద్యం :
    ******%%%%%******
    మ. నునునూల్చుట్టిన పూలదండ లిడలేనో !మోవి గోర్వెచ్చ తే
    నెనెనే నీయగ లేనొ !పొంది పొసగన్ నిన్ జేరగా లేనొ! మా
    నిని నీదానను గానొ! జాగు సలుపన్ నీకేలరా! సస్మితా
    నన ! నాభక్తి గణింపరా ! వినర ! కృష్ణా ! రక్తి నన్నేలరా !
    (Dr.C.V.సుబ్బన్న శతావధాని రచించిన " శతావధాన ప్రబంధం" - ప్రథమ ఖండం నుండి)
    *******&&&&&&&********

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్ధనరావు గారూ నమస్సులు...చక్కని పూరణ నందించారు....!

      తొలగించండి
    2. జనార్దన రావు గారూ,
      ధన్యవాదాలు.
      ఈ దత్తపదిని మన బ్లాగులో ఇవ్వమంటారా?

      తొలగించండి
  28. .పిల్లిమొగ్గలు వేసెడి పెద్దినొకడు
    నక్కియున్నట్టి ఎలుకలానంగనాచి
    ఎన్నికల సమయానమమ్మెంచుకొనుము
    పార్టి మారుట తప్పేమి పట్టువదలి?
    మూషికంబొండు పిల్లిని ముద్దులాడె|
    ౨పోషణ రక్షణార్థముగ పోకిరి యందున మూలనుండగా
    మూషికమొండు|”పిల్లిగని ముద్దు లొసంగెనుప్రేమ తోడుతన్
    భాషణ జేయుదాని వలె భావనబంచగపిల్లిపిల్ల సం
    తోషము నందుజూపెనట తొంగియు జూసెడి ఓగిరంబునే| {ఓగిరము=ఆహారపుఎలుక}

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి

  29. పిన్నక నాగేశ్వరరావు.

    వివిధ బొమ్మల నద్దాల బీరువాన

    పెట్ట కన్నులకెంతయో విందు గలిగె

    మూషికంబొండు పిల్లిని ముద్దులాడె

    నటుల నుంచిరి వింతగ నందులోన.

    **********************************

    రిప్లయితొలగించండి
  30. రోషము హెచ్చగా మిగుల రోయుచు భారత దేశ సంపదన్
    భాషలు ప్రీతిగా నొసగు బంగరు వన్నెల చీనివాసులన్
    భేషజ మొల్లుచున్ వలచి భేషుగ పాకులు కౌగిలించిరే...
    మూషిక మొండు పిల్లిఁ గని ముద్దు లొసంగెను ప్రేమతోడుతన్!

    రిప్లయితొలగించండి