10, ఏప్రిల్ 2017, సోమవారం

సమస్య - 2334 (శకునికిఁ దమ్ముండు...)

కవిమిత్రులారా! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"శకునికిఁ దమ్ముండు కృపుఁడు సాత్యకి సుతుఁడున్"
(లేదా...)
"శకునికిఁ దమ్ముఁడౌఁ గృపుఁడు సాత్యకి పుత్రుఁడు ద్రోణుఁ డన్నయున్"

41 కామెంట్‌లు:

  1. వికసిత వారిజాస్య యలివేణికి ద్రౌపది కేల కల్గెనో
    సకలవిపత్తులంచు కృపిసాధ్వి తలంచెను "బుద్ధిచెప్పరే
    ప్రకటిత దుష్టబుద్ధి నయవంచకనేత దురాత్మకుండునౌ
    శకునికి, తమ్ముడౌఁ గృపుడు సాత్యకి పుత్రుడు ద్రోణుడన్నయున్"

    రిప్లయితొలగించండి
  2. నకులుడు సీతకు సుతుదని
    ప్రకటించెను వెంగళప్ప, బాగు యనుచు ఇం
    కొకవెర్రి వాడు తెలిపెను
    శకునికి దమ్ముండు కృపుడు సాత్యకి సుతుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 'బాగు+అనుచు' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. "బాగనుచును నిం..." అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు సరిదిద్దుకుంటాను.

      తొలగించండి
  3. డా.పిట్టా
    ఒకపరి నొరిగిన దిశనే
    వికలంబులు వెలుగులైన విధి నిర్ణయమే
    సకలము దుర్యోధనుడన
    శకునికి తమ్మండు కృపుడు సాత్యకి సుతుడున్

    రిప్లయితొలగించండి
  4. డా.పిట్టా
    ఒకమతి నుగ్రవాదమున నుండరె సన్మతి నెన్నకుండ నా
    రకమున నైన సంఘటన రాజిలు ప్రేమలు లక్ష్య సిద్ధికై
    నికరము ప్రొద్దు బుచ్చుటకు నీయనుబంధము లెల్ల సాగు నా
    శకునికి దమ్ముడౌ గృపుడు సాత్యకి పుత్రుడు ద్రోణుడన్నయున్

    రిప్లయితొలగించండి
  5. సుకరంబగు భారతమది
    యొకయింతయు నేర్వకుండ నొప్పని యన్యం
    బకటా యందిన వానికి
    శకునికి దమ్ముండు కృపుడు సాత్యకి సుతుడున్.

    సకలజగంబులందునను సత్యపథంబును జూపునట్టి యా
    ప్రకటిత వేదసారమగు భారత మించుక జూడకుండ తా
    నకట విదేశ విద్యలతి హర్షమునందుచు నేర్చువాని కా
    శకునికి తమ్ముడౌ గృపుడు సాత్యకి పుత్రుడు ద్రోణు డన్నయున్.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి


  6. వృకుడెవనికి కొమరుండౌ ?
    నికటము గన కృపికి యనుజుని వరుస ? యెవర
    మ్మ కనకన కర్ణుని యెదిరి ?
    శకునికి; దమ్ముండు కృపుఁడు; సాత్యకి సుతుఁడున్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. టకటక పూరణల నొసగి
      ప్రకటించు పురాణ ప్రతిభ ప్రౌఢత్వముతో
      నకటా! "జిలేబి" లేనిది
      నొకటిన్ కందమును గాంచి నొచ్చితి నేడే

      * "పురాణ ప్రతిభ" ?

      తొలగించండి

    2. ఏమండోయ్ జీపీయెస్ వారు

      పై పదాల్ని కిట్టించడానికే శీర్షాసనం వెయ్యాల్సి వచ్చ్గె :) యిక జిలేబి ని యెక్కడ జొప్పించడం :) అయినా మీరన్నారు కాబట్టి :)

      వృకుడెవని సుతు జిలేబీ !
      నికటము గన కృపికి యనుజుని వరుస ? యెవర
      మ్మ కనకన కర్ణుని యెదిరి ?
      శకునికి; దమ్ముండు కృపుఁడు; సాత్యకి సుతుఁడున్!

      (ఒక "డు" స్వాహా :)

      జిలేబి

      తొలగించండి

  7. యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్ క్వచిత్ !!


    సకలజగద్విశేషముల సారము భారతమిందు లేనిదే
    యొకటియి లేదు బాహ్యమున , నొప్పుగ భారతమందునున్నదే
    ప్రకటితమౌసమస్తమను వ్యాసుని పల్కును ద్రోసి వ్రాసితో !
    శకునికిఁ దమ్ముఁడౌఁ గృపుఁడు సాత్యకి పుత్రుఁడు ద్రోణుఁ డన్నయున్"

    మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  8. మకిలి గలదు భారతమున
    వికృతములై తోచు పాండు వీరుల జన్మల్
    సుకృతము రాదు నిటులనన్
    "శకునికిఁ దమ్ముండు కృపుడు సాత్యకి సుతుడున్"

    రిప్లయితొలగించండి
  9. అకటా యేమంటిరి దొర
    శకునికి దమ్ముండు కృపుడు సాత్యకి సుతుడున్
    శకునియు కృపుడును సాత్యకు
    లొకరికి నొక రేమికారె యూహించంగన్

    రిప్లయితొలగించండి
  10. భృకుటిని వుండ్రముల్ నిలిపి బిందెలె కుండల మట్లునూపుచున్
    బెక బెక మంచు బల్కుచు విభిన్న కధల్ విన బల్కె నొక్కడా
    నకులునికన్న శుక్రుడగు నాతికి మామగు భీమసేనుడున్
    శకునికిఁ దమ్ముఁడౌఁ గృపుఁడు సాత్యకి పుత్రుఁడు ద్రోణుఁ డన్నయున్

    రిప్లయితొలగించండి
  11. వికటపు టాలోచనలను,
    సకలాస్రతతుల, భుజబల శాలుల, సేవా
    ది కలాపములం దాతడు
    శకునికిఁ దమ్ముండు, కృపుఁడు, సాత్యకి, సుతుఁడున్


    సకలము లొక్కనిం బరఁగి సంధిల నచ్చెరువే తలంపగన్
    మకుటము లేని రాజతఁడు మా నగరమ్మున నిశ్చయంబుగం
    బ్రకటిత మాతఁడే వివిధ భావ గుణమ్ముల నెంచ సత్యమే
    శకునికిఁ దమ్ముఁడౌఁ గృపుఁడు సాత్యకి పుత్రుఁడు ద్రోణుఁ డన్నయున్

    రిప్లయితొలగించండి
  12. పూజ్యులు కవివర్యులు కామేశ్వరరావు గారికి నమోవాకములు! అద్భుతమైన ,అత్యుత్తమమైన పూరణలు!🙏🙏🙏🙏

    రిప్లయితొలగించండి
  13. శకునికి దమ్ముడౌ గృపుడు సాత్యకి పుత్రుడు ద్రోణుడన్నయున్
    శకునికిదమ్ముడుండుట యు సాత్యకి పుత్రుడు గల్గుటొప్పునే
    తికమకగాను దోచును జితేంద్రుని కైనను సత్యమేకదా
    యకటకటా యిదేమిది? యరాచక పల్కులు వింటివే శివా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చివరి పాదంలో యతి తప్పింది. "..యకటకటా యిదేమిటి నయచ్యుత వాక్కులు..." అందామా?

      తొలగించండి
  14. శ్రీ కంది శంకరయ్య గురుతుల్యుకు నమస్కరాములు
    నేను నిన్న ప్రయుత కవితా యజ్ఞ సమాపన సభకు హైదారాబాద్ వెళ్ళియుంటిని.
    అక్కడికి మీరు కూడా వచ్చారని శ్రీమతి శైలజగారు చెప్పినారు. ఆమె మీతో మాట్లాడినాని చెప్పిన తరవాతనే మీతో ఫోనులో మాట్లాడం జరిగింది. కాని వారికి కాని నాకు కాని మిమ్ము దర్శించు
    భాగ్యము దక్కనందు చాలా నిరాశ కలిగింది. ఎన్నో రోజులనుండి మిమ్ముల కలవాలని అనుకున్నవాన్ని కలవలేకపోయాను. నాకు ఈ ప్రయుతా కవితా యజ్ఞమున సహస్ర కవి భుషణ బిరుదము పొందడం మీరు నిర్వహించే శంకరా భరణ బ్లాగే కారణమని చెప్పుటకు సంతసిస్తున్నాను. కొందరు సాహితీ మిత్రులు కూడ నన్ను కలసి వారి పేరు చెప్పి పరచయము చేసుకొనడం జరిగింది. నేను కొందరి గుర్తించాను కొందరిని గుర్తించ లేకాపాయాను. దగ్గరకు వచ్చిన మిమ్ము కలిసే భాగ్యము పోగొట్టుకున్నందుకు నాకు చాలా బాధగా ఉంది.
    ధన్యవాదములు గండూరి లక్ష్మినారాయణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు సన్మానం పొంది వేదిక దిగి మీ చోటికి రాగానే మిమ్మల్ని మొట్టమొదట పలుకరించిన వ్యక్తిని గుర్తుకు తెచ్చుకోండి. అది నేనే! వెళ్ళిపోయే తొందరలో ఎక్కువగా మాట్లాడలేకపోయాను.

      తొలగించండి
    2. మిమ్ములను కలవనందులకు చింతసుండగా మా చి. గండూరి శ్రీనివాసు అన్నాడు మొదట మీతో కలసినవారు
      అతడే అయివుండవచ్చును అని . అప్పుడు కొంచం ఆలోచించగా మీరే అనిపించింది . మిమ్ముల గుర్తించనందులకు నాకు నేనే నిందించుకొంటున్నాను. మిమ్ముల కలుసుకొనే అవకాశము తప్పక వస్తందని ఆశిస్తున్నాను. దన్యవాదములు

      తొలగించండి
  15. ఒకయింటి వారలందరు
    నొక బృందముగా వెడలిరి యుదరము కొరకై
    యొక నాటక పాత్రలలో
    శకునికిఁ దమ్ముండు కృపుఁడు, సాత్యకి సుతుఁడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఒకసినిమాన జూడ,మన కొక్కొక పాత్రయు వేరు పాత్రకున్
      బ్రకటన సేయనట్టి కుల,ప్రాంత సమత్వము వెల్లడించు లే!
      యొకడొక యింటివారలకె యుక్కొక వేషము నిచ్చె నందులో
      శకునికి దమ్ముడౌ గృపుడు సాత్యకి పుత్రుడు ద్రోణుడన్నయున్!!

      తొలగించండి
    2. మూడోపాదంలో->యొక్కొక(టంకణపు దోషం)

      తొలగించండి
    3. రెండవ పాదంలో "కుల ప్రాంత" అన్నప్పుడు "ల" గురువు. అందుకు "కుల రాష్ట్ర" అంటే సరిపోతుంది.

      తొలగించండి
    4. ధన్యవాదాలు Som Nemaniగారు. "కుల ప్రాంత"
      బదులుగా..మీ సూచన బాగుంది. "స్థల,వర్ణ" కూడ బాగుంటుంది కదా..

      తొలగించండి
  16. సకలము వెన్నుని మయమే
    సకల్పుడును నలినజుండు చక్రాయుథుడున్
    బకమర్దనునికి నుపదే
    శకునికిఁ దమ్ముండు, కృపుఁడు, సాత్యకి సుతుఁడున్

    రిప్లయితొలగించండి
  17. వికచాబ్జానన సుందర
    సుకుమారీ! వినవె నాదు సోదర సుతుడే
    వకుళకు పతి యాతండే
    శకునకు దమ్ముండు కృపుడు, సాత్యకి సుతుడున్.

    వికసిత మందహాసిని పవిత్ర సహోదరి యైన కాంతయౌ
    వకుళను పెండ్లియాడిన దివాకరు డెవ్వడనంగ చెప్పెదన్
    శకునికి దమ్ముడౌ గృపుడు సాత్యకి పుత్రుడు, ద్రోణుడన్నయున్
    నకులుడు,మేటి పండితుడు నా జనకుండనెఱంగుమో సఖీ!

    రిప్లయితొలగించండి
  18. అకటా బుద్ధికి దోచును
    వికటమ్మౌనీ సమస్య వివరింపంగా
    ప్రకటింపగ ప్రాభవమును
    సఖియరొ కూర్చగ గణముల చాతుర్యమునన్!


    పెద్దలకు నమస్కారాలు, క్షమార్పణలతో! సరదాగా!

    రిప్లయితొలగించండి
  19. ప్రకటిత పాత్రల పోషణ
    అకళంకము లేనివయ్యు యన్యోన్యతలో
    సకలురు నాటకమందున
    శకునికి దమ్ముండు కృపుడుసాత్యకిసుతుడున్.
    2.వికసిత పూలు వేరయిన?విజ్ఞతచేతనుదార మైఖ్యతన్
    ముకుళితరూపు రేఖలసమూహపులందపు చంద మట్లుగా
    “సకలురు కంపనీ నటన సంతతి బంధువులందరున్ గనన్
    శకునికి దమ్ముడౌ గృపుడు సాత్యకిపుత్రుడు ద్రోణు డన్నయున్|

    రిప్లయితొలగించండి
  20. కవిమిత్రులకు నమస్సులు.
    ఈనాటి సమస్యకు పూరణ లందించిన అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
    ఈరోజు మా బావమరది తొమ్మిదవ రోజు. పెద్దకర్మకు సంబంధించిన కార్డులను పంచడానికి ఎండలో తిరిగాను. విపరీతంగా తలనొప్పి.
    అందరి పూరణలను చదివాను. ఒక్కొక్కరి పూరణలపై విడివిడిగా స్పందించలేకపోతున్నాను. మన్నించండి. మరొక రెండు రోజులు ఇదే పరిస్థితి...

    రిప్లయితొలగించండి
  21. వికటపుటట్టహాసములు వేగమె వీడుచు కాంగ్రెసాధముల్!
    టికటొకటివ్వరే వడిగ టెక్కులు మానుచు గ్రక్కు గ్రక్కునన్
    కుకటపుపల్లి వాడితడు కూర్మిని పుట్టియు వాసికెక్కెనే:👇
    శకునికిఁ దమ్ముఁడౌఁ గృపుఁడు సాత్యకి పుత్రుఁడు ద్రోణుఁ డన్నయున్!

    రిప్లయితొలగించండి