27, ఏప్రిల్ 2017, గురువారం

నిషిద్ధాక్షరి - 35

కవిమిత్రులారా,
అంశం - కర్ణుఁడు
నిషిద్ధాక్షరములు - క వర్ణము, దాని గుణింతములు, క వర్ణముతో కూడిన సంయుక్తాక్షరములు.
ఛందస్సు - మీ ఇష్టము.

63 కామెంట్‌లు:

  1. తల్లి విడువగ గంగలో తల్లడిల్లి
    సూత పుత్రుడై పెరిగిన శూరుడితడు
    తల్లి ప్రార్ధన మన్నించి తల్లడిల్లి
    వీర దివమును జేరిన ధీరుడితడు

    రిప్లయితొలగించండి
  2. దానమందున నీసాటి ధరణి లేరు
    శూర వీరుడవనిచెప్ప చోద్యమేమి?
    రాధ పుత్ర!సుయోధను ప్రాణ హితుడ!
    పంచ పాండవ సోదరా!భళిర ధీర!!

    బొగ్గరం ప్రసాద రావు

    రిప్లయితొలగించండి
  3. సూర్య వరముచే పుట్టిన సౌర్యవరుడు,
    జన్మ మొందిన వెంటనే జనని చేత
    విడువ బడిన వాడు,మునిచే అడవి లోన
    శాపమును బడసిన వాడు , జగరము హృది
    పైన జన్మతో పొందిన ఘనుడు, తనువు
    విడుచు సమయము నందైన వెన్న దొంగ
    వేడి నంతనే దానమ్ము నిడిన ఘనుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగమణి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పుట్టిన శూరవరుడు' అనండి. మృత్యుముఖంలో ఉండి కృష్ణునకు దాన మిచ్చిన ఘట్టం భారతంలో లేదు, కల్పితం.

      తొలగించండి
    2. ధన్యవాదములు మొదటి పదము సవరించుకుంటాను. దాన వీర శూర కర్ణ సిన్మాలో
      చూసిన సన్నివేశము గుర్తుకు వచ్చి పద్యము వ్రాశాను.

      తొలగించండి


  4. కందగర్భ శార్దూలవిక్రీడితము

    ధీరుండాతడు జన్మమున్ నది దరిన్,ధీమంతుడౌ,జీవనం
    బో రారాపిడి,సూర్యజుండు రవమై ప్రోదిన్నిడెన్ సూతుడౌ
    రారాజుండు సుయోధనుండు వరమై రాజ్యంబు పట్టంబు
    రా
    జౌ రారమ్మనిజేర్చి యేలె రమణీ జాతౌ జిలేబీ భళా‌ !


    ---

    ధీరుండాతడు జన్మము
    రారాపిడి,సూర్యజుండు రవమై ప్రోదిన్
    రారాజుండు సుయోధను
    రారమ్మనిజేర్చి యేలె రమణీ జాతౌ

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      సాహసమే చేశారు. గర్భకవిత్వాన్ని కూడా స్పృశించారు. సాధారణంగా వృత్తగర్భ కందానికి ఎవరైనా ఉత్పలమాల, చంపకమాలలను ఎన్నుకుంటారు. శార్దూలన్ని ఎన్నుకున్న వాళ్ళను ఇప్పటి వరకు చూడలేదు. భళీ! మొదటి ప్రయత్నం కనుక అన్వయలోపాలను, భాషాదోషాలను ఇప్పుడు పేర్కొని మిమ్మల్ని నిరుత్సహపరచడం ఇష్టం లేదు.స్వస్తి!

      తొలగించండి


    2. ధన్యవాదాలండి కంది వారు

      మీరు ఆ లోప దోషాలను కూడా వివరిస్తే బాగు ! నిరుత్సాహపడను ; ముందు ప్రయ త్నించే వాటికి ఉపయోగకరం గా ఉంటుంది

      చీర్స్
      జిలేబి

      తొలగించండి
    3. దైర్యే సాహసే జిలేబీ! జిలేబి గారూ! మీ ప్రయత్నం అభినందనీయం.

      తొలగించండి
    4. భళిభళి పద్యము కూర్చగ
      కళవళ మెందుకు జిలేబి గర్భకవిత్వమ్
      తళతళ లాడెడి కందము
      ఫెళఫెళ శార్దూలమందు పేర్చిన నేర్పున్!

      👏👏👏👏👏👏

      తొలగించండి

    5. సీతాదేవి గారి చలువ :( మరో కంద గర్భిత శార్దూలం

      సీతాదేవి సెబాసు కుందనముగన్ సిద్ధించె శార్దూలమై
      ఖాతా! తెమ్మరజేర్చి జూడ తరమై కందంబు గూడన్ సదా
      తాతందానయనెన్ సుదర్శనపు వృత్తంబుల్! జిలేబీ భళీ
      భాతీ!తీరుగ వచ్చెనమ్మ తిరమై ప్రాసల్లిటన్నుజ్వలా !

      ---


      సీతాదేవి సెబాసుకు
      తాతెమ్మర జేర్చి జూడ తరమై కందం
      తాతందానయనెన్ సుద
      తీ తీరుగవచ్చెనమ్మ తిరమై ప్రాసల్ !

      జిలేబి

      తొలగించండి


    6. గోలీవారికి నావందనములు

      జిలేబి

      తొలగించండి


    7. గోలీవారి జిలేబి కిన్ పదములన్ గోళమ్ము జేసెన్నిటన్
      భో! లాలిత్యము గూర్చి బేర్చ లసితంబొప్పెన్ సుధాధారయై
      మాలావృత్తపు కందమున్నిట సుమా మాన్యంబుగన్ బేర్చ యో
      షా, లాలాటము తీరుగాంచె లయమై శాస్త్రీ ! భళీ భారతీ !

      ---

      గోలీవారి జిలేబికి
      లాలిత్యము గూర్చి బేర్చ లసితంబొప్పెన్
      మాలావృత్తపు కందము
      లాలాటము తీరుగాంచె లయమై శాస్త్రీ !

      జిలేబి

      తొలగించండి
  5. డా.పిట్టా
    సూర్య సుతున్ యశోవిభవ శోభితుడైన సుబాసు(నేతాజీ) నీయెడన్
    ధైర్యము నందునన్ రణ విధానపు సిద్ధిని జోడు జేతు నా
    యార్యు "మహాత్ము"యోజనను యౌననడయ్యెను, శాంతి మంత్రమున్
    ధుర్యుడు బాడ బోడు తన తోరపు వర్తన ప్రాణ దానమౌ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా వారూ,
      కర్ణ, సుభాష చంద్రబోసులకు పోలిక చెప్తూ మీరు చేసిన పూరణ బాగుంది. అభినందనలు.
      'యోజన'...?

      తొలగించండి
    2. ఆర్యా, ధన్యవాదములు
      యోజన..కూర్పు(శ.ర),ప్రణాళిక.సత్యాహింసల వల్లనే స్వాతంత్ర్యము సాధ్యమనెగదా గాంధీ.కాని సుబాస్ "మీరు నాకు రక్తాన్నిస్తే నేను మీకు స్వాతంత్ర్యం యిస్తాను"అన్నాడు.గాంధీ యోజనను ఒప్పుకోక ఆజాద్ హిందూ ఫౌజ్ ను స్థాపించాడు.యోజన అనే పత్రిక(సంచిక) చాన్నాళ్ళు నడిచింది.

      తొలగించండి
  6. దినమణి సుతుఁడై జన్మిం
    చిన శూరుఁడు, నరునితోడఁ జిరవైరముఁ గ
    ల్గిన శాపదగ్ధుఁడు, సుయో
    ధను హితుఁడై యశము నందె దాతృత్వమునన్.

    రిప్లయితొలగించండి
  7. కర్ణుడు

    ఉ. భానుని యంశచే బహుళ వైభవమంద పృథాతనూజుడై
    మేనున వర్మమంది యిట మేదినిపై జనియించి మాతృస
    మ్మాన విహీనుడై యచటి మందస మందున జేరిగంగలో
    దీనుని భంగినున్న బహుదీపిత దేహుడు శూరు డీతడున్. ౧.

    కం. అతిరథు డనియెడి సూతుడు
    జతగా తనపత్నితోడ జలమున చూచెన్
    సుతుడని యెంచుచు వీనిని
    నతిహర్షముతోడ బెంచె నాత్మీయతతోన్. ౨.

    ఆ.వె. రాధ తల్లియయ్యె రాధేయు డితడయ్యె
    సూత పుత్రుడయ్యె చోద్యముగను
    భానుజుండు నయ్యె భానుని వరజాతు
    డగుట చేత నీత డవని లోన. ౩.

    కం. వసుసేనుం డనబడినా
    డసదృశమై యొప్పునట్టి యావసు వర్మం
    బెసగగ దేహం బందున
    వసువర్మధరుండు నాగ వసుధన్ వెలిగెన్. ౪.

    ఆ.వె. పరశురాము జేరి బహుళాస్త్రవిద్యలన్
    ద్విజుని వేషమంది తివిరి నేర్చి
    గురుని యాగ్రహాన నురుతర శాపాగ్ని
    భాగ్య హీనుడౌచు బడియె నితడు. ౫.

    కం. దేవేంద్రుడు యాచించగ
    భావంబున శుద్ధినూని వర్మాదులనున్
    శ్రీవైభవయుతు డౌచును
    దా వితరణశీలియౌట దానము చేసెన్. ౬.

    ఆ.వె. రాజ రాజు బిలిచి రాజ్యంబు నందించ
    నతని మిత్రుడౌచు ననిశ మౌర!
    వెంట నంటి యుండె ప్రేమాతిశయమూని
    మిత్రవరు డనంగ మిత్రజుండు. ౭.

    కం. గురువర్యుని శాపంబున
    నరసిన సద్విద్యలేమి యందగలేమిన్
    ధరణిని విజయంబుల సత్
    సరణిని దూరంబు నందె సరియని దలచెన్. ౮.


    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  8. భారత మందు చూడ మరి పామర భావ పరంపరల్ తనన్
    చేరిన వర్తనంబు నట చేతల జూపుచు పల్కులందు సం
    హారము జేతు పాండవుల హాయి సుయోధునుడొందగా యనిన్
    వారణ లేని హానినట భారతమందున కల్గజేసెగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొరపాటున ఆఖరి పాదం లో క వచ్చింది.కాబట్టి సవరణ చేసి మరల పంపాను.పొరపాటుకి అన్యదా భావించ వలదని మనవి.

      తొలగించండి
  9. భారత మందు చూడ మరి పామర భావ పరంపరల్ తనన్
    చేరిన వర్తనంబు నట చేతల జూపుచు పల్కులందు సం
    హారము జేతు పాండవుల హాయి సుయోధునుడొందగా యనిన్
    వారణ లేని హానినట భారతమందున వీడుజేసెగా

    రిప్లయితొలగించండి
  10. బాధలు తలవంపులు పడె
    రాధేయుడు సూర్యతేజ రాజితుడైనన్
    సాధన తోడనె విజయము
    స్వాధీనమ్మయ్యె; చేయు సాధన్ నెపుడున్

    రిప్లయితొలగించండి
  11. భారత మందు చూడ మరి పామర భావ పరంపరల్ తనన్
    చేరిన వర్తనంబు నట చేతల జూపుచు మాటలందు సం
    హారము జేతు పాండవుల హాయి సుయోధునుడొందగా యనిన్
    వారణ లేని హానినట భారతమందున వీడు జేసెగా

    రిప్లయితొలగించండి
  12. అనేక మార్లు మార్పులు చేయడానికి కారణం నిషిద్ధాక్షరిలో ఇదే నా తొలి ప్రయత్నం.అనుభవలేమి వల్ల జరిగిన అసౌకర్యాన్ని గుణగ్రాహులైన విజ్ఞులు హంసక్షీర న్యాయముగా గ్రహించి మన్నింతురు గాక.

    రిప్లయితొలగించండి
  13. భానుని వరమున బుట్టియు
    దానగుణంబున ప్రశస్తి ధైర్యము మీరన్
    మేనున వర్మము దాల్చియు
    హీనత బొందెను గదతుది హేయపు మైత్రిన్!

    రిప్లయితొలగించండి
  14. సూతసుతుడు, శూరుడు విధి,
    మాతా వంచితుడు దాత, మానధనుండౌ
    నేతగ మిత్రుని తంత్రపు
    నీతిన బాసటగనిలిచె నిత్యము ధరణిన్

    రిప్లయితొలగించండి
  15. సూతసుతుడు, శూరుడు విధి,
    మాతా వంచితుడు దాత, మానధనుండౌ
    నేతగ మిత్రుని తంత్రపు
    నీతిన బాసటగనిలిచె నిత్యము ధరణిన్

    రిప్లయితొలగించండి
  16. భూతల సూర్యుండాతడు
    సూతుని పుత్రుడును భోజసుతసూతుండే
    ఖ్యాతిగనె దాన గుణమున
    రీతిగ రారాజ హితుడు ప్రియమిత్రుండే.

    రిప్లయితొలగించండి
  17. రవి సుతుండు నైన రాధేయుడై నిల్చె
    దాన వీర శూర ప్రాణ మిత్రుఁ
    డన సుయోధను ఋణ మన్నది దీర్చని
    దైవమండ లేని కావలుండు

    రిప్లయితొలగించండి
  18. సూర్యసుతుడైన నీతడు సూతసుతుడు
    సవ్యసాచిని మించిన సమరయోధ
    దానధర్మములందున తనను మించు
    వార లెవ్వరు లేరిల వాస్తవమ్ము...!!!

    రిప్లయితొలగించండి
  19. రారాజుహితుడు రవిజుడు
    వీరుడు, బీభత్సు మించి విలుదాలుపుడై
    పోరున శాపవశమ్మున
    సారము నసియించి మడిసె సత్రియె ధరణిన్!!!

    సత్రి = దానకరుడు

    రిప్లయితొలగించండి
  20. స్నేహ మనగను నిరతిని చెలగి మించి
    దాన గుణమున ధర్మవితాన మమర
    శౌర్య ధైర్య ప్రతాప విశారదుడగు
    సూర్య నందను డాతండు నార్యుడయ్యె!

    రిప్లయితొలగించండి
  21. పృథ పుత్రాగ్రజ విలసిత
    పృథు దాన గుణాభిరామ వివిధాస్త్ర విశా
    ల ధన విరాజిత రవిజుఁడ
    పథానువర్తి విలయమ్ము వడసెను సుమ్మీ

    రిప్లయితొలగించండి
  22. సూత సుతుడైన ద్వాపరదాత యెవడు!
    మేటి విలువిద్య పార్థుని సాటి యెవడు!
    పోరునన్ రాజరాజు సముండు నెవడు!
    అతడె రవ్యంశజుడు పాండవాగ్రజుండు!!

    రిప్లయితొలగించండి
  23. యాద వాంగన ఘన పృధ యవ్వనమున
    మౌని దుర్వాసుని వరము మహిమ చూడ
    దలచి తపనుని మనమున తలచి నంత
    ద్వాదశాత్ముని వరముచే తలిరు బోడి
    గర్భ మున పుట్టి తల్లిచే గంగ లోన
    త్యజనమున్జేయ బడినట్టి త్యాగి యతడు ,
    సూత రమణిఔ రాధమ్మ సుతుడు అతడు,
    పరశు రాముని చేత శాపంబునొంది
    అస్త్ర శాస్త్రమ్ము మరచిన అల్పుడతడు
    విజయుడినెదిరించి నమేటి వీరు డతడు,
    రాజ రాజు అడుగ అంగ రాజ్య మేలి
    చెలిమి హస్తము నిడినట్టి స్నేహ శీలి,
    అల్పరధుడని భీష్ముడు అడ్డు బెట్ట
    గంగ సుతుడు రణమునందు భంగ పడగ
    యుద్ధభూమినిచేరిన యోధుడతడు
    ధరణి నుంచి తైలము తీసి ధాత్రి చేత
    శాప గ్రస్తుడై ఓడిన శౌర్య ధనుడు



    రిప్లయితొలగించండి
  24. మిత్రునివరమున చిత్రముగా బుట్టి
    .........నదిలోన తల్లిచే వదల బడితి
    సూతునింటను జేరి ప్రీతిని పెంపయి
    ........రాధేయు డనియెడి రహి వహించి
    శస్త్రాస్త్ర విద్యల జాల నేర్పు గడించి
    ........గురువు శాపమునను శిరము వంచి
    రారాజు ప్రాపున రాజపదవి బొంది
    ........పాండవారుల జేరి పరువు మాసి

    దానశీలమునందున తరము లేని
    యశము నందిన భానుని శిశువ నీవు
    పొంది హీనజనాశ్రయ మందినావు
    మాసిపోలేని మచ్చను మహిని నయ్యొ.

    రిప్లయితొలగించండి
  25. *నిషిద్దాక్షరి*
    అంశం:- కర్ణుడు,
    నిషిద్దాక్షరములు :- *క* వర్ణము,దాని గుణింతములు, *క*తో కూడిన సంయక్తాక్షరములు
    🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

    🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
    🌺🌺 *శ్రీమతి జి సందిత బెంగుళూరు* 🌺🌺
    నా పద్యం:-

    *కం॥*
    *మించెన్ దానగుణంబున*
    *నెంచన్ వేరెవరులేరు నిమ్మహినితరుల్*
    *పంచ సుయోధనుదగుటన*
    *శించెన్ రాధాసుతుండు స్థిరయశుడగుచున్*

    🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
    🌺🌺 *శ్రీమతి జి సందిత బెంగుళూరు* 🌺🌺

    రిప్లయితొలగించండి
  26. ధర్మజా గ్రజుడను మర్మ మదృశ్యమై
    మసలినా వవమాన మనము తోడ
    ధర్మమ ధర్మాల తారత మ్యమెరిగి
    స్నేహధ ర్మమనుచు చెడితి వీవు
    పార్థుడొం దగనెన్నొ వరముల రయనీవు
    పొంది శాపములెన్న పుడమినందు
    సర్వశ స్త్రాస్త్రముల్ సమగూడు విద్యల
    న్నేర్చియు రణమున నీల్గినావు

    ధీర వీర శూరుండవు ధీయుతుడవు
    దాన ధర్మము నందున దాట గలరె?
    నీదు యశమునె వ్వారలు నిజము గాదె
    అమర యశమును బొందిన యంగ రాజ.

    రిప్లయితొలగించండి
  27. క్రొవ్విడి వెంకట రాజారావు:
    సఖ్యమునయందు నృగవుడై సందడించి
    దానమందున మేటియై తనరు చెంది
    అతిరధ మహారధుల సాటి చతురుడైన
    భానుజుని ప్రఖ్య నెంచుము బాగుగాను

    రిప్లయితొలగించండి
  28. దాన వీరశూరుడంట|దాత్రియందుమూర్తియే|
    జ్ఞానమున్న ఘనుడునాటి జాతిరత్నమెంచగా|
    ప్రాణ మిత్రుడైన రాజు పాపభీతి మాన్పినా?
    పూని అర్జునుండుజంపె పొంచియున్నముప్పులో.
    2.దానము జేయుచుండె పరితాపముజెందెడిరాజరాజునా
    స్థానపు మిత్రుడై నిలిచి |ధర్మ పథంబున యుద్ధ విద్యలో
    జ్ఞానుడు| మాటతప్పని నిజాయితి గల్గిన దానవీరుడై
    మానెగ యమ్మమాట పరమార్థ ప్రయోజనమెంచుబాటలో.

    రిప్లయితొలగించండి
  29. రవిసుతుండు తాను రారాజు మిత్రుండు
    దానగుణముతోడ ధరణి వెలిగె
    శతమఖుండడుగగ సజ్జను పొగులన్
    విగ్రహమ్మునుండి పెల్లగించె

    రిప్లయితొలగించండి
  30. వరము వలన బుట్టె వసుధను వసుసేన
    సూత పుత్రు డనగ జూచె జనులు ,
    వేద మూర్తి వలన విలువిద్య నేర్వంగ
    భాను తేజ మలరె పార్ధు సముడు
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  31. ఆ సుయోధను విడిపోని యాప్తు డితడు!
    సూర్యుడే తండ్రి యైనను సూత పుత్రు
    డనెడి పేర చెలగినట్టి యంగ రాజు
    దాన శీలిగనె స్ఫురణ లోన మెలగు

    రిప్లయితొలగించండి

  32. రాధేయు డను బరగెడి సు
    యోధనుసఖు డరుణు పృథల యోగో ద్భవుడే
    యోధాగ్రణి పార్థుని చే
    నీధర గూలెను రణమున ఈశుని శరమున్

    రిప్లయితొలగించండి
  33. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఈరోజంతా ఎండలో తిరగడం వల్ల అస్వస్థతకు గురి అయ్యాను. అందువల్ల మీ పూరణలను విడివిడిగా సమీక్షించలేను. మన్నించండి.
    ఈ నాటి నిషిద్ధాక్షరికి చక్కని పద్యాలు వ్రాసిన
    ప్రభాకర శాస్త్రి గారికి,
    ప్రసాద రావు గారికి,
    నాగమణి గారికి,
    జిలేబీ గారికి,
    డా. పిట్టా సత్యనారాయణ గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    నేమాని సోమయాజులు గారికి,
    తోపెల్ల మూర్తి గారికి,
    గుఱ్ఱం సీతాదేవి గారికి,
    చేపూరి శ్రీరామారావు గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
    శైలజ గారికి,
    శిష్ట్లా శర్మ గారికి,
    పోచిరాజు కామేశ్వర రావు గారికి,
    రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారికి,
    పూసపాటి నాగమణి గారికి,
    మిస్సన్న గారికి,
    సందిత గారికి,
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
    క్రొవ్విడి వేంకట రాజారావు గారికి,
    కె. ఈశ్వరప్ప గారికి,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    కొరుప్రోలు రాధాకృష్ణారావు గారికి,
    శ్రీధర రావు గారికి,
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి
    అభినందనలు, ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  34. మాస్టరుగారూ! ధన్యవాదములు. తగిన విశ్రాంతి తీసుకోండి.

    రిప్లయితొలగించండి
  35. వీరుడు ధీరుడు శూరుడె
    యా రాధేయుడు దినపతి యాత్మజుడే తా
    రారాజు నేస్తమాతం
    డే రమణిపృథ తొలిపుత్రుడేగద వినరా!

    మునియొసగిన మంత్రముతో
    వినయము గారవిని వేడి పిలిచిన వేళన్
    దినమణి చేరగ పృథనే
    చినవాడేబుట్టె బాల్య చేష్టల తోడన్

    పాటవమ్మునందు పార్థుని సరిజోడు
    సూర్యపుత్రుడైన సూతుడనిరి
    ధరణిలోన గొప్ప దాతయై వెలసిన
    వీరుడతడు మేటి ధీరుడతడు.

    రిప్లయితొలగించండి