7, జూన్ 2017, బుధవారం

దత్తపది - 115 (కారు-వాచి-టీవి-సెల్లు)

కారు - వాచి - టీవి - సెల్లు
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
మహాభారతార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(దీనిని పంపిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి ధన్యవాదాలు)

32 కామెంట్‌లు:

 1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 2. శల్య సారధ్యము
  కారుకొన్న ఘన మేఘమ్ముల రీతిగ కౌరవ సైన్యము కదలు చుండె,
  నీవా చిరుతవైతి, నీవేల నన్ను నీ తేరు సారధ్యము కోర వలెను,
  అర్ధ వధూటీ విహారము సల్పగ వెడలుము, యుద్ధము న్వీడి పొమ్ము,
  వీర విహారమ్ము శూరుల కేజెల్లు, నీకేల శరములు, నీవు విజయు
  నెటుల మార్కొను వాడవు, నేల పైన
  జీవితంబు ముగిసె నీకు. సిగ్గు పడుము
  యంచు సెల్లుడు కర్ణుని యదర గొట్టె
  సమర రంగము నందు విశ్రమము లేక

  రిప్లయితొలగించండి
 3. ఉత్తర కుమారుడు బృహన్నలతో:


  "కారు మబ్బుల సైన్యము క్రమ్ము చుండె
  వాచి పోయెను కన్నులు వాని జూసి
  గుండె దివిటీ! విడువుమన్న! మండు చుండె
  నీవు సెల్లుని వా! కాదు! నిజము గాను!"


  సెల్లుడు = శల్యుడు (శబ్ద రత్నాకరము)

  రిప్లయితొలగించండి
 4. కారు మబ్బులు గ్రమ్మెను గగన మంత
  చుట్టు ముట్టెను సైన్యము కట్టు కట్టు
  వాచి కములేకనె శత్రువు లొచ్చి పడిరి
  కల్లు దివిటీ విడువక సెల్లు డకట

  రిప్లయితొలగించండి
 5. *కారు *కూతలు పల్కకు కసిగ శల్య!
  నేర*వా చి*రకాలపు నెయ్యమకట!
  తగదు మాటలధా*టీవి*ధానపటిమ!
  అనుచు కర్ణుడు *సెల్లు*నినాపఁజూచె.

  రిప్లయితొలగించండి
 6. రాయబార ఘట్టంలో కృష్ణుడు దుర్యోధనునితో.....

  అల్పులా 'కారు' పాండవు లలఘువీరు,
  లట్టివారల గెలుతు'వా చి'వ్వలోన
  ద్రౌపదీ వధూ'టీ వి'షాదమ్ము తొలఁగఁ
  జేయు భీముడు; 'సెల్లు'ను చివర కదియె.

  రిప్లయితొలగించండి
 7. డా.పిట్టా
  రాయబారిగా శ్రీకృష్ణ ఉవాచ
  కారు యన్యుల్ మొగమువాచి కాదు యడుగ
  వేరుపాటీ విచారమ్ము విమల రాజ
  వంశమున నీతి సెల్లును వలదు తగవు
  అర్ధ రాజ్యము పాండవు లంద శుభము!

  రిప్లయితొలగించండి
 8. డా.పిట్టా
  నేటి భారతంలో....
  బారులో త్రాగి వెంట షికారు గనగ
  వాచినవి ఖర్చులనుచింత వాసి తిరుగ
  నౌను పోటీ విభవ రాశి నలిగి రచట
  సెల్లు రోడ్డు ప్రమాదాల సిగలుతరగ!

  రిప్లయితొలగించండి
 9. కవిమిత్రులకు నమస్కృతులు.
  ఒక సాహిత్య కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ వెళ్తున్నాను. ఈరోజు మీ పూరణలను సమీక్షించే అవకాశం దొరకక పోవచ్చు. దయచేసి పరస్పర గుణ దోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
 10. మహిని శుభకారుడుకృష్ణుని మాట వినక
  మూర్ఖుడతనినడ్డగించి మూతి వాచి
  యేమిటీవిధియని నిజమెరుగలేక
  చీదరింపులు ధుర్యోధన సెల్లునయ్య?

  రిప్లయితొలగించండి
 11. మహిని శుభకారుడుకృష్ణుని మాట వినక
  మూర్ఖుడతనినడ్డగించి మూతి వాచి
  యేమిటీవిధియని నిజమెరుగలేక
  చీదరింపులు ధుర్యోధన సెల్లునయ్య?

  రిప్లయితొలగించండి
 12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 14. అలసులును కారు వీరులు నందరునిక
  కనెదవా చిరపు బతుకు? కల్ల యదియె,
  సెల్లు భీముడాహవమున చితిని తోయ
  కని కిరీటీ విహారము కన్ను మూయ.

  యుద్ధమే జరిగితే జరిగే పరిణామాన్ని కృష్ణుడు దుర్యోధనునికి చెప్పిన మాటలుగా నా పూరణ.

  రిప్లయితొలగించండి
 15. కురుక్షేత్రం లో శ్రీకృష్ణపరమాత్మ అర్జునునితో:

  పోకారు బంధువర్గపు
  సాకేటికి? వాచికమ్ము చక్కగ వినుమా!
  నీకున్ పోటీ విడుచుట
  చేకూర్చదు సంతసమ్ము! సెల్లునె విజయా?

  రిప్లయితొలగించండి
 16. విరించి గారి పూరణ....

  కోపము తో కర్ణుడు శల్యుని మందలించి నట్లుగా నూహించి

  సారధి వని మరచి కారుకూతలు నాడ
  యేమిటీ విచిత్ర మేల యిట్టి
  పనులు యింక మానవా చిలిపి ను డు ల
  నంచు సెల్లుని పాయి నాగ్రహించె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురువు గారు నమస్కారములు నాల్గవ పాదం గణ భంగ మయినదేమో ??

   తొలగించండి
  2. అది టైపాటు. "సెల్లుని పయి" అని ఉండాలి. ధన్యవాదాలు.

   తొలగించండి
 17. అమ్మ! గిరి తటీ విలసిత
  సమ్మద వర కార కాంబ శంసావాచీ
  నమ్మగునే ద్రోవది ని
  క్కమ్ముగ దుఃఖమ్ము సెల్లు కారుణ్యవతీ!

  [శంస = స్తోత్రము; అవాచీనము = తాఱుమాఱైనది]

  రిప్లయితొలగించండి
 18. కారు గూతలు గూతువే కావరమున
  పొల్లుమాటలనికచాలు సెల్లు రాజ!
  చిత్తశుద్ధిని మరతువా చివ్విలోన
  నాదు ధాటీ విజయునితో నరయుమిపుడె
  యనుచు బల్కెను కర్ణుడునాగ్రహమున!!!

  రిప్లయితొలగించండి
 19. కదన మను కారు మబ్బులు క్రమ్ముకొనియె
  మారె సెల్లుఁడు కర్ణుని సారథిగను
  మాధవా చివ్వలోదయ మనుచుమమ్ము
  మఱఁగు బోటీ విచారము మాపవలయు

  రిప్లయితొలగించండి
 20. కారు మబ్బు వన్నె కన్ పట్టు మాఱేడ
  వాచికంబు జేసి ప్రాపు నిలుపు
  చాపమీవు వీడి జట్టీవిచారముల్
  చేయ కీర్తి మాకు సెల్లు నయ్య

  రిప్లయితొలగించండి
 21. మిత్రులందఱకు నమస్సులు!

  "కారు చీcకట్లు క్రమ్మె నాకాశమందు
  ననుచుc గంటి వా చివరకు ననినిc జావు;
  సైంధవా యేమి టీ విట్లు చచ్చితివిర?"
  యనుచు సెల్లుcడు దురపిల్లె నపుడు మిగుల!

  _స్వస్తి_

  రిప్లయితొలగించండి
 22. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  *దత్తపది*
  *కారు - వాచి - టీవి - సెల్లు*
  *పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ*
  *మహాభారతార్థంలో*


  ఆసెల్లుప్తమయెన్ జయంబనగనార్యాభీకరాకారుడై
  భాసిల్లంగ ఘటోత్కచుండువిడుమాస్వర్గేశ్వరాస్త్రంబనన్
  దూసెన్ కర్ణుడుమీటివిల్లు నటులన్ ధూమాగ్నులుప్పొంగగన్
  బాసెన్ చింతఁసుయోధనుండువినుబా వా?చిత్రవైచిత్ర్యముల్

  *శ్రీమతి జి సందిత
  బెంగుళూరు*

  మహాభారతయుద్ధసమయంలో ఘటోత్కచుడు మరణంతో ఇంద్రప్రసాదితకర్ణాస్త్రం వ్యర్థమైందంటూ ధర్మజునితో కృష్ణుడు మాట్లాడిన సందర్భం

  రిప్లయితొలగించండి
 23. కారు పాండవుల్ భీరువుల్ కారు ! గాన
  నడుగు వేయుము ముందు నీవాచి తూచి!
  సంధి పొసగదంటీవిది చాల చేటు!
  రణపు మాటలు సెల్లునే ? రాజరాజ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి

 24. అర్జునుడు శ్రీకృష్ణునితో

  గగనమందు నిండె కారుమబ్బు లవిగో
  యేమిటీవిచిత్ర మెట్లు చేతు
  సైంధవునిల విడిచి చనుటె వాచికమౌను
  ప్రాణమింకఁసెల్లు బవరమందు

  రిప్లయితొలగించండి
 25. కవిమిత్రులకు నమస్కృతులు.
  నిన్న ప్రయాణంలో ఉండి మీ పద్యాలపై వెంటవెంటనే స్పందించ లేకపోయినందుకు మన్నించండి.
  చక్కని పూరణలు చెప్పిన....
  పూసపాటి కృష్ణ సూర్య కుమార్ గారికి,
  జి. ప్రభాకర శాస్త్రి గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు,
  ప్రసాద రావు గారికి,
  డా. పిట్టా సత్యనారాయణ గారికి,
  చేపూరి శ్రీరామారావు గారికి,
  తోపెల్ల మూర్తి గారికి,
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
  విరించి గారికి,
  పోచిరాజు కామేశ్వర రావు గారికి,
  శైలజ గారికి,
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
  రవికిరణ్ తాతా గారికి,
  గుండు మధుసూదన్ గారికి,
  సందిత గారికి,
  మైలవరపు మురళీకృష్ణ గారికి,
  డా. బల్లూరి ఉమాదేవి గారికి,
  ................................... అభినందనలు, ధన్యవాదాలు!

  రిప్లయితొలగించండి
 26. కారు కూతలు కూసెనే కౌరవ పతి
  మాధవా చిత్రమై మది మరవకుండె
  నేమిటీ వింత సంధియన్ కామితంబు
  ఉల్లసిల్లిన మా పగ సెల్లునెట్లు

  రిప్లయితొలగించండి
 27. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  *దత్తపది*
  *కారు - వాచి - టీవి - సెల్లు*
  *పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ*
  *మహాభారతార్థంలో*


  ఆ *సెల్లు*ప్తమయెన్ జయంబనగనార్యా!భీకరా *కారు*డై
  భాసిల్లంగ ఘటోత్కచుండు విడుమాస్వర్గేశ్వరాస్త్రంబనన్
  దూసెన్ కర్ణుడు మీ *టి వి*ల్లు నటులన్ ధూమాగ్నులుప్పొంగగన్
  బాసెన్ చింతఁసుయోధనుండు విను బా *వాచి*త్రవైచిత్ర్యముల్

  *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  మహాభారతయుద్ధసమయంలో ఘటోత్కచుడు మరణంతో ఇంద్రప్రసాదితకర్ణాస్త్రం వ్యర్థమైందంటూ ధర్మజునితో కృష్ణుడు మాట్లాడిన సందర్భం


  *కందపద్యంలో*

  వారుప *కారు*లు *సెల్లు*నె
  వారిన్ వధియింపఁ కేశ *వా చి* వ్వనటుల్ ?
  క్రూరుడవీవు కిరీ *టీ*
  *వీ*రుడవెటులనదె చరిత వ్రేలెత్తి ననున్ ?

  *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  కురుక్షేత్రసంగ్రామరంగంలో శిఖండిని చూచి అస్త్రసన్యాసంచేసిన భీష్మునిపై శరవర్షంకురిపించి వధింపుమని కృష్ణుడు అర్జునుణ్ణి కోరిన సందర్భంలో అర్జునిని సమాధానం

  *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  రిప్లయితొలగించండి
 28. ధృతరాష్ట్రునితో శ్రీకృష్ణుడు.

  కారు పాండవులెప్పుడు కానివారు
  వారు రాజ్యమ్ముకోసమై వాచిలేరు
  ఏమిటీవింత వాదనలెరుకలేక
  చెప్పునామాట వినకుంట సెల్లునయ్య.

  రిప్లయితొలగించండి