23, జూన్ 2017, శుక్రవారం

సమస్య – 2392 (వనితల ఖండించువాఁడె...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వనితల ఖండించువాఁడె బల్లిదుఁ డగురా"
(లేదా...)
"వనితల ద్రుంచువాఁడె కద బల్లిదుఁడై యశమందు నెల్లెడన్"

90 కామెంట్‌లు:

 1. గనులను శోధన జేయుచు
  ఖనిజము లనువెలికి దీసి కాల్చగ కొలిమిన్
  కనికరము లేక కపటపు
  వనితల ఖండించు వాఁడె బల్లిదుఁ డగురా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   పద్యం బాగున్నది. కాని ఖనిజాలకు వనితలకు ఉన్న 'లింకు' ఏమిటి?

   తొలగించండి
  2. నమస్కారములు
   " వనితలు అంత కఠిన మైన వారు " అని నా ఉద్దేశ్యం
   అద...న్నమాట.... అసల్.... సంగతి

   తొలగించండి
  3. అక్కయ్య గారు మేరు అలా అంటే ఎలా ????

   తొలగించండి
 2. అనయము దుష్టచేష్టల ననంతముగా పురికొల్పుచున్ మహిన్
  వినయము సుంతలేక,తలపెట్టుచు హింస,నధర్మమార్గముల్
  మనసున నింపు దుర్జనుల మాటునుఁబెట్టుచు నించుకేని,నొ
  ఇవ్వని,తలద్రుంచువాడెకద బల్లిదుడై యశమందునెల్లెడన్

  రిప్లయితొలగించండి
 3. నొవ్వని తలద్రుంచువాడెకద...అని ఉండాలి

  రిప్లయితొలగించండి
 4. ఒనరగ జ్ఞానార్జనమున
  కనుగొని మాయావి యైన కాళీ మాతన్
  వినయమున కొలిచి ప్రకృతి
  వనితల ఖండించువాఁడె బల్లిదుఁ డగురా

  ...అష్టప్రకృతులు - అవ్యక్తము, బుద్ధి, అహంకారము, పంచతన్మాత్రలు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   రూపకాలంకారంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 5. ముని, తాటకీ సుబాహులు
  తనయాగము సాగనీని దానవులనగ
  న్ననయమె వెంటాడుచు నా
  వని, తల ఖండించువాఁడె బల్లిదుఁ డగురా

  రిప్లయితొలగించండి
 6. డా.పిట్టా
  "ఆమెడలోపల బంగారం",అనే చక్కడపు వ్రాత.అదియునూ ఒక స్త్రీ శిలా విగ్రహం క్రింద గలదు.అందరు ఆమెడ(8మైళ్ళదూరం) దశదిశల త్రవ్వ నారంభించారు.ఒక బల్లిదుడు ఆ విగ్రహం మెడను ఖండించి బంగారం కైవసం చేసుకొంటాడు.
  "గనుడట నామెడ బచ్చను"
  అను వ్రాతయు స్త్రీది ప్రతిమ నాశ్చర్యముగన్
  గొన భూమిని ద్రవ్వక జ
  వ్వనితల ఖండించు వాడె బల్లిదుడగురా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిట్టా వారూ,
   వైవిధ్యమూ, చమత్కారమూ ఉన్న చక్కని పూరణ మీది. అభినందనలు.
   పద్యాన్ని సరళాదేశంతో ప్రారంభించారు. "కనుడట' అని కదా ఉండవలసింది!

   తొలగించండి
  2. డా.పిట్టా
   ఆర్యా,సరళముతో సవరణ చేసికొంటిని.ధన్యవాదాలు.

   తొలగించండి
  3. డా.పిట్టా
   ఆర్యా,పరుషము అవసరము కదా.కృతజ్ఞతలు.

   తొలగించండి
 7. డా.పిట్టా
  కనికరమింతలేక పలు కన్యలు వేశ్యలుగాగ మార్చుచున్
  పనిగొని యన్య దేశముల బంపెడి గాడిదలన్న నారులన్
  గని యొక చట్ట మూపిరిగ గాంచగ శిక్షల కోర్టు యాజ్ఞలన్
  వనితల ద్రుంచు
  వాడె కద బల్లిదుడై యశమందు నెల్లెడన్

  రిప్లయితొలగించండి
 8. డా.పిట్టా
  ఆర్యా, మొదటి పూరణలోని గద్య సమాచారంలో"దశదశల"కుబదులు"నలు దశలు"గా చేకొనగలరు.

  రిప్లయితొలగించండి
 9. ఎన్.వి.ఎన్.చారి 9866610429
  ఘనమగు భారత దేశపు
  జనులకు కీడొనర జేయు జాతి విరోధిన్
  కనుచును నీవొక దుష్టుడ
  వని తల ఖండించు వాడె బల్లిదుడగురా

  రిప్లయితొలగించండి
 10. అనవసర ధనవ్యయమును
  మనముపరస్త్రీయు, వేట,మద్యము హింసల్
  కనజూదము,పరుషతలన
  వని తల ఖండించువాడె బల్లిదుడగురా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీరామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మనము'నకు అన్వయం? "ధనవ్యయమున। మనుట, పర..." అందామా?

   తొలగించండి
 11. డాపిట్టా
  శ్రీరాం గారూ ఇంకా connection యివ్వండి.మనసును కూడా.....

  రిప్లయితొలగించండి
 12. వినయము భూషణ మింతికి,
  ధనమదమున మెట్టినింట తగవుల తోడన్
  మనుజలకు నరకము నిడెడు
  వనితల ఖoడిoచు వాడె బల్లిదుడగురా

  రిప్లయితొలగించండి
 13. అనయము వందన మెవరికి?
  జినుడన నెవ్వరు మనమున జేకొని కోర్కెల
  జనులను బ్రోవగ నాతడు
  వనితల, ఖండించు వాడె ,బల్లిదుడగురా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   ప్రశ్నోత్తర రూపమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు. కొంత అన్వయలోపం ఉన్నది. కోర్కెల్.. కోర్కెల అని టైపు చేశారు.

   తొలగించండి


 14. వనితల చెరబట్టిన నరు
  గని నూరకనుండబోక కరవాలముతో
  కనికరము లేక దుష్టుడ
  వని, తల ఖండించు వాడె బల్లిదుడగురా.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "నరు గని యూరక..." అనండి.

   తొలగించండి
 15. ………………………………………
  గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  { ము౦దుగా ఆ౦జనేయుని చ౦పివేయు డని

  రావణుడు రాక్షసవీరులను ప్రోత్సహి౦చుట }

  :::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

  అనె రావణు డిటు :- " రణమున

  మనలను స౦క్షోభపరచు మర్కటము నికన్ ,

  వెనుకొని కూల్చవలయు ; పా

  వని తల ఖ౦డి౦చు వాడె బల్లిదు డగురా "

  ( వెనుకొని = వె౦బడి౦చి )

  రిప్లయితొలగించండి
 16. కనగలమెందునకళలను
  ఘనముగ? నార్గురు రిపులను ఖండన మొనరిం
  చినవాని నేమనగలము?
  వనితల, ఖండించు వాడె బల్లిదుడగురా!

  రిప్లయితొలగించండి
 17. (జై పాతాళ భైరవీ!)

  మును మాంత్రికు నాలోచన
  లను పసికట్టి పిదప తోటరాముఁడు సాష్టాం
  గ నమస్కృతిఁ జూపుము నీ
  వని తల ఖండించువాఁడె బల్లిదుఁ డగురా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సవరణతో...
   (జై పాతాళ భైరవీ!)

   మును మాంత్రికు నాలోచన
   ల నెఱింగిన పిదప తోటరాముఁడు సాష్టాం
   గ నమస్కృతిఁ జూపుము నీ
   వని తల ఖండించువాఁడె బల్లిదుఁ డగురా!

   తొలగించండి
  2. గురువు గారికి నమస్కారములు. రెండవ పాదములో యతి నాకు అర్ధము కావటము లేడు. ఒక్క సరి సలహో ఈయగలరు.

   తొలగించండి
  3. కృష్ణ కుమార్ గారు ల – ర లకు యతి మైత్రి కలదు. పూర్వ కవుల ప్రయోగాలు చాలా కలవు.

   అభేదయతి :- i) వ-బ; ii) ల-డ; iii) ల-ళ; iv) ళ-డ. పై నాలుగు వర్గాలలో ఆయా వర్గాలలోని అక్షరాలు పరస్పరం యతి చెల్లుతాయి. v) ర-ల; vi) ఱ-ల; vii) ద-డ లకు కూడా యతి చెల్లుతుందని కూచిమంచి వెంకటరాయడు చెప్పినాడు.
   ఉదా-
   *వసుమతీకళత్ర *బకజైత్ర గానక
   *లాలసత్కలాప *డంభగోప
   *లలితదేహ పింగ*ళపుర దక్షిణగేహ... [అప్పక. ౩.౮౮]
   *డే కదలక జలధిఁ బవ్వ*ళించె ననఁగ. [అనం.ఛంద. ౧.౯౫]

   *లీలాహాస్యకలాప్రసంగముల ను*ద్రేకించి వర్తింతు రే [కాశీ. ౬.౨౧౦.]

   *దంతునే కాలదం*డమున నభవ. [కాశీ. ౭.౮౦]

   తొలగించండి
  4. పూసపాటి వారూ,
   నిజమే. ర-ల యతిని పూర్వలాక్షిణికులలో పెక్కురు అంగీకరించలేదు. కాని ఈమధ్య కాలంలో ఆధునికులు ర-ల యతిని యథేచ్ఛగా ప్రయోగిస్తున్నాను. వ్యక్తిగతంగా నాకు ఇష్టం లేనిదే. కాని ఈరోజు తప్పని పరిస్థితిలో వేశాను.
   *****
   కామేశ్వర రావు గారూ,
   ధన్యవాదాలు.

   తొలగించండి
  5. గురువు గారికి , గురు తుల్యులు పోచిరాజు వారికీ ప్రణామములు . నేను ఇవాళ క్రొత్త విషయములు నేర్చుకున్నాను. ధన్యవాదములు

   తొలగించండి
 18. నెనరును కరుణయు లేకను
  వనితలకును కీడు సేయు వానిని గనుచున్
  మనమున దయవిడి సమరా
  వని తల ఖండించువాడు బల్లిదుడగురా

  రిప్లయితొలగించండి
 19. మన సంస్కృతి తక్కువ యని
  యనిశము పర సంస్కృతియె మహత్తరమనుచున్
  ఘన వాదనలొనరించెడు
  వనితల ఖండంచు వాడె బల్లిదుఁడగురా

  రిప్లయితొలగించండి
 20. వినయము తోడ నిత్యము వివేకముతోడ సుభాషణమ్ములు
  న్ఘనముగ పల్కుచూ కలువకంటి మనోజ్ఞము నొప్పు దేహము
  యనువుగ చూపి దేశపు రహశ్యము లెల్లయు పొంది మెల్లగా
  తనదగు రాజు చెంతకు ముదమ్ముగ పంపెడు వార్ల గాంచుచూ
  వనితల ద్రుంచువాడె కద బల్లిదుడై యశమందు నెల్లడన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూసపాటి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పల్కుచూ, గాంచుచూ' అన్నవి "పల్కుచున్, గాంచుచున్" అని ఉండాలి. రెండవ పాదం చివర 'దేహము। న్ననువుగ...' అనండి. 'వార్ల'ను 'వారి' అనండి.

   తొలగించండి
 21. ………………………………………
  గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


  గురువు గారికి నమస్కారములు . వైశ్య

  ప్రముఖులు కొ౦దరు కోరగా నేను

  " వాసవీ కన్యకా పరమేశ్వరీ చరిత్ర " అను

  పద్యనాటకము వ్రాశాను . మీరు

  అనుమతిస్తే ముఖ్య ఘట్టములను కొన్ని

  స౦క్షిప్తముగా చేసి ప౦పిస్తాను .

  న మ స్తే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి గారూ,
   నా అభిప్రాయాన్ని కోరడానికైతే మొత్తం పుస్తకం పంపండి. బ్లాగులో కేవలం పద్యసాహిత్యమే తప్ప నాటకాలకు అవకాశం లేదు.

   తొలగించండి
 22. హనుమగొనె సురస ప్రాణము
  నినవంశజుడేను దాటకి హరియు దాపూ
  తన హరియించెగ రాక్షస
  వనితల ఖండించు వాడె బల్లిదుడగురా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో యతి తప్పింది.

   తొలగించండి
 23. అనిమొన వెన్నుజూపక మహా్ద్భుతమైన పరాక్రమమునన్
  అనితరసాధ్యమౌ పటిమనాహవభూమిని ప్రజ్వరిల్లుచున్
  వినుతిగ వైరి మస్తకమె వేడుక కందుకమైచనన్ రణా
  వని తలదృంచువాడె కద బల్లిదుడై యశమందు నెల్లడన్
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
 24. వినుడని తనసైనికులతొ
  ననియెను రావణుడు చూడుడాహవభూమిన్
  మనవారు సంతసిల పా
  వని తలఖండించువాడె బల్లిదుడగురా
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భాస్కరమ్మ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'సైనికులతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. 'సైనికులకు ననియెను' అనండి.

   తొలగించండి
 25. ఘన బాహు బల పరాక్రమ
  జనిత నినదముల సుఘోర సద్భట సమరా
  వని శత్రువు నెదురిచి, పా
  వని! తల ఖండించువాఁడె బల్లిదుఁ డగురా

  [పావని = భీముఁడు]


  అనిశము సాధు రక్షణము నంచిత బుద్దిని నెంచి భూతల
  మ్మున నిజ తేజ విక్రమ సముద్భవ భావము విస్తరిల్లగన్
  దనుజ వరేణ్యు యుద్ధమునఁ దా మది నెంచక వేగ వచ్చు చా
  వని, తల ద్రుంచువాఁడె కద బల్లిదుఁడై యశమందు నెల్లెడన్

  రిప్లయితొలగించండి
 26. క్రొవ్విడి వెంకట రాజారావు:

  అనిశము విటత్వ మందున
  గునియుచు సతిసంతు నుఱుము గుండా నడచన్
  కనుకని తోడ నతని నా
  వని తలఖండించు వాడె బల్లిదుడగురా!  రిప్లయితొలగించండి
 27. వనమునందు, యుద్ధభూమిలో మున్నగు నర్థముల పూరించునపుడు “వనిఁ దల...” సాధురూపము. అప్పుడు సమస్యా పాదమును మార్చి నట్లగు నని నా యభిప్రాయము.
  అందుచేత ద్రుతాంతము కాని విధముగా “వని”ని నుపయోగించుట యుత్తమము.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   నిజమే! అయితే ఆ అభ్యంతరాన్ని పరిగణిస్తే ఈనాటి పూరణలో ఎక్కువ పూరణలు అయోగ్యమౌతాయి. ఒక్కొక్కప్పుడు కొన్నిటిని చూసీ చూడనట్టు వదలి వేయాలి...

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
   తమ దృష్టిని పడని యీ లోపముతో నున్న పూరణలను సునాయాసముగా సవరించ గలరని మన కవి పుంగవులపై నా దృఢ నమ్మకము.

   తొలగించండి
 28. ఘనమగు శౌర్యం బుండియు
  మునితతులను దీనజనుల ముదితల నిలలో
  ననఘాత్ముల బాలల గా
  వని తల ఖండించు వాడె బల్లిదు డగురా.

  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి

 29. పిన్నక నాగేశ్వరరావు.

  అనయము రిపు సేనలపై

  కనికరమును జూపకుండ కరవాలముచే

  ఘనముగ జొరబడి సమరా

  వని తల ఖండించువాడె బల్లిదుడగురా!

  *****************************

  రిప్లయితొలగించండి
 30. తన మిడిమిడి జ్ఞానమ్మున
  మన సీతాద్రౌపదుల విమర్శించుచు చ...
  ర్చను నిందింపగ సాధ్వీ
  వనితల, ఖండించువాడె బల్లిదుడగురా !!


  అనిశమసత్యమున్ పలుకునట్టి ముఖమ్మును , నిత్యమాంసభో..
  జనము రుచించు జిహ్వయునసాధుపదశ్రవణైక కర్ణముల్
  కనఁదగనట్టి చిత్రముల గాంచెడి కన్నులు గల్గి, మంచి నే...
  ర్వని తల ద్రుంచువాడె కద బల్లిదుడై యశమందునెల్లెడన్ !!

  రిప్లయితొలగించండి
 31. డాపిట్టా
  శ్రీరాం గారూ ఇంకా connection యివ్వండి.మనసును కూడా.....

  రిప్లయితొలగించండి
 32. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 33. తనువున కవచము లేకను
  యనువుగ భుజబలము జూపి యడవిని తిరుగా
  డిన పులి నెదిరించుచు నా
  వని,తల,ఖండించు వాడె బల్లిదుడగురా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'లేకయు ననువుగ' అనండి.

   తొలగించండి
  2. గురుదేవులసూచనతో సవరించిన పద్యము

   తనువున కవచము లేకయు
   ననువుగ భుజబలము జూపి యడవిని తిరుగా
   డిన పులి నెదిరించుచు నా
   వని,తల,ఖండించు వాడె బల్లిదుడగురా

   తొలగించండి
 34. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  *జనపతిచక్రవర్తికి యసమ్మతులైతలలెత్తరాదెటన్*
  *తననెదిరించువారితలదప్పకద్రుంచబడన్ వలెన్*
  *కననదిరాజనీతియగుకానప్రభుత్వమునొప్పనోర్*
  *వని ,తలద్రుంచువాడెగద బల్లిదుడై యశమందు నెల్లడన్.*


  *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  రిప్లయితొలగించండి
 35. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  *జనపతిచక్రవర్తికి యసమ్మతులైతలలెత్తరాదెటన్*
  *తననెదిరించువారితలదప్పకద్రుంచబడన్ వలెన్*
  *కననదిరాజనీతియగుకానప్రభుత్వఘనత్వమొప్పనోర్*
  *వని ,తలద్రుంచువాడెగద బల్లిదుడై యశమందు నెల్లడన్.*


  *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సందిత గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "చక్రవర్తికి నసమ్మతులై..." అనండి.

   తొలగించండి
 36. వెనుకట విరాటు కొలువున
  దునిమెనుగద సింహబలుని,దుర్మతులిపుడున్
  గనబడుచుందురు చెరుపగ
  వనితల,ఖండించువాడె బల్లిదుడగురా !!!

  రిప్లయితొలగించండి
 37. సరదాగా😄..
  పనులను జేయగా వెనుక బాటను బట్టెడి మొండి చేతులన్
  వినమని జెప్పినా వినక భిన్నముగా చరియించు వీనులన్
  కనమని జెప్పినా గనక గర్వము జూపెడి రెండు కన్నులన్
  ఘనమగు కేశముల్ గలిగి కంపర మెత్తుచు నున్నవాని దు
  వ్వని,తల ద్రుంచు వాడెగద బల్లిదుడై యశమందు నెల్లడన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీహర్ష గారూ,
   మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
   "..జెప్పినన్..." అనండి.

   తొలగించండి
 38. రణభూమిలోన భీముని
  కనుచున్, తామెల్ల తలచె కౌరవసేనల్
  అనిలో చెలరేగెడు "పా
  వని" తల ఖండించువాడె బల్లిదుడగురా!!!

  రిప్లయితొలగించండి
 39. మిత్రులందఱకు నమస్సులు!

  ముని విశ్వామిత్రుండనెఁ
  "గనుమో రామా! వధింపఁగను, దాటకనున్
  వనిత యనక, రక్కసి జ
  వ్వని తల ఖండించువాఁడె, బల్లిదుఁడగురా!"

  మధురకవి గుండు మధుసూదన్

  రిప్లయితొలగించండి 40. వినయవిధేయతల మరచి

  తనవారినె తెగడుచుండి ధరలో నెపుడున్

  దనుజాంగనవలె తిరుగెడి

  వనితల ఖండించువాడె బల్లిదుడగురా.


  అనయము వనితల చెరనిడి

  కనికరమును జూపకుండ కష్టములిడు నా

  దనుజుని గాంచుచు దుష్టుడ

  వని తలఖండించువాడె బల్లిదుడగురా.

  రిప్లయితొలగించండి
 41. ఘనమగు స్టారు హోటలున కల్కట నగ్రపు పార్కు లేనులో
  జనవరి ఫస్టు పార్టికని జాహ్నవి మత్స్యపు కోతలందునన్
  తినుటకు తోక తోడనట తీక్ష్ణపు ముండ్లును దేన్కి పన్కి రా
  వని, తల ద్రుంచువాఁడె కద బల్లిదుఁడై యశమందు నెల్లెడన్ :)

  రిప్లయితొలగించండి