కవిమిత్రులకు నమస్కృతులు. నేను, మా ఆవిడ ఇద్దరం పంచారామాలు, అన్నవరం, సింహాచలం తదితర క్షేత్రాలను దర్శించడానికి వెళ్ళాలనుకుంటున్నాము. మా యాత్రకు ఏ విధమైన ప్రణాళిక చేసుకుంటే బాగుంటుందో తెలిసినవారు సూచన లివ్వవలసిందిగా మనవి.
Guruvu gariki meeru adigina prakaram schedule Starting from Warangal day1 Goutami express secbad 21-15 hrs Goutami expres (12738) 11-30 pm in warangal Take ticket Upto tadepalli gudem TAdepalligudem reaches at 4-45 am aprx Take lodge near by rly sation freshup Day 2
Tadepalli gdem to bhimvaram (33 kms )catch bus 8 am Temple reaching time 9 am aprx ( journey a hour) Bhimvaram temple darshan 9-30 hrs Bhimvaram to palkollu after tiffen (distance 22 kms) catch bus at 10-30 Journey 1 hour You have to be at temple by 11-30 (temple closes at 12 and will be opend At 4 pm) If you have darshan before 1 have meal in palakollu and rest for one hour Catch bus to drakshramam from palkollu 1 hr 50 min journey ( distance 73 kms) If you catch at 3 o clock your can reach Drakshramam apr 5 o clock (temple closes between 12 to 3) Have darshan and come to r samalkota around 8 or 9pm Take lodge and rest
Day 3 Samalkota get up at 5 am in lodge fresh up have coffe Bheemeswar temple Darshan early morning before 7 am very near to railway station or bus stand auto only 10 rupees) Comeback to railway station before 9 am Catch Ratnachal express aprx 9 o clock towards vijag By 9-30 you will be Annavaram Only 30 minuttes journey stay in lodge down hills go to up hills and hae darshan and vratam finish by 1 o clock back to down hills have meal Annvaram to phitapuram catch tirumala at 3-30 pm 20 minutts to pithapuram go to temple have darshan And back to annavaram by bus no train available till 8 pm Again have darshan if you wish in annavaram take rest in night
Day 4 Catch train in annavram (Kakinada vizag passenger at 5-50 ) in annavaram Reaching vijag at 9-50 am Go to Simhachalam just 45 minutts Have darshan and back to vijag at 1 pm Take meal & rest Evening to RK Beach etc and shopping Catach Konark express at 10-15 pm Back to Warangal next day 8-30 am day 5
As you are aged couple . No Hurry journey Break journey always prefer. All your luggage to be kept either In lodge or in clock rooms. Take small hand bag and Cash with you.
“అయ్యవారికి చాలు అయిదు వరహాలు;
రిప్లయితొలగించండిపిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు”
వింతేమున్నది మిత్రమ!
పంతుళ్ళకు చాలు నూలు పంచల జతలున్
గంతులు వేయు పొగడ్తల
నెంతటి పండితుఁడు గాని యిట్టె కరంగున్!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
వింతయు గాదయ చూడగ
రిప్లయితొలగించండిచెంతను కాంతయె సరసము చేయుచు కోరన్
చింతల దీర్పగ జేరగ
ఎంతటి పండితుఁడు గాని యిట్టె కరంగున్
చెంతకు చేరిన మాటా
రిప్లయితొలగించండిమంతీ ఘాటుగ పలికెడు మాన్యుల తోడన్
చింతా కంతబొ గడ కవి
ఎంతటి పండితుఁడు గాని యిట్టె కరంగున్
(కవి తెంతటి)
తోపెల్ల వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
సుంత మరల్చక దృష్టిన్.
రిప్లయితొలగించండిసంతతమునుఁగొల్చి దైవసాక్షాత్కారం
బెంతయు పొందిన ధన్యుం
డెంతటి పండితుడు కాని యిట్టె కరంగున్
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అంతయు తెలిసిన జ్ఞానియె
రిప్లయితొలగించండిసంతత హరినామచింత సత్సంగత్యమ్
మంత్రుల సమ్మానములకు
యెంతటి పండితుడుగాని యిట్టెకరంగున్
సత్సాంగత్యమ్!
తొలగించండిసీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సత్సాంగత్యమ్' అని హలంతంగా ప్రయోగించారు. "సత్సంగతియున్। మంత్రుల సమ్మానములకు। నెంతటి..." అనండి.
వంతల బెట్టెడి యాడుది
రిప్లయితొలగించండిసంతానము బహుళ సంఖ్య సంకట బెట్టన్
చెంతను జేరగ బ్రియసతి
యెంతటి పండితుడుగాని యిట్టెకరంగున్!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పంతము బోవగ నేరము
రిప్లయితొలగించండిసంతసముగ కన్ను గీటి సరసము లాడన్
చెంతకు జేరెను రంభని
ఎంతటి పండితుఁడు గాని యిట్టె కరంగున్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'రంభను' అనండి.
విప్రనారాయణ వృత్తాంతము
రిప్లయితొలగించండిపంతముతో విప్రుని సీ
మంతిని హరి జపమునుంచి మరలించె గదా,
వింతలు కాదు, అసతితో
ఎంతటి పండితుడు గాని యిట్టె కరుగున్
సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కాదు+అసతి' అన్నపుడు సంధి నిత్యం. "వింత లెటు లగు నసతితో" అందామా?
సంతోషంబును భక్తియు
రిప్లయితొలగించండిసంతత సత్యానురక్తి సద్వినయంబుల్
చెంతం గొని మ్రొక్కినచో
నెంతటి పండితుడు గాని యిట్టె కరంగున్.
హ.వేం.స.నా.మూర్తి.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాంతా కనకము లట్టివి
రిప్లయితొలగించండిగంతలు గట్టును కనులకు కామము తోడన్
చింతకు నెట్టును చివరకు
ఎంతటి పండితుడు గాని యిట్టె కరంగున్
శంకర ప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండిసుంతగు ప్రతిభకుబిరుదులు
వింతగ సరి రాజకీయ వీకన గనగన్
సొంతము తనకొకటనగనె
ఎంతటి పండితుడుగాని యిట్టె కరుంగున్
డా.పిట్టా
రిప్లయితొలగించండివింత! ధనమ్ము, స్త్రీ సుఖము,వేల పొగడ్తలు అర్హులైననే
చెంతకు జేరు;సత్యమివి శీలముతో ముడి వడ్డవే యిలన్
సుంతయు నీతి లేక నవి సొంతమటన్న ప్రలోభ ప్రక్రియన్
ఎంతటి పండితుండయిన నిట్టె కరుంగును వెన్న పోలికన్!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
డా.పిట్టా
తొలగించండిఆర్యా,ధన్యవాదములు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉ .కాంతల యోర చూపులకు కైవస మవ్వుట ప్రాకృ తమ్మిలన్
తొలగించండిఎంతటి పండితుండయిన నిట్టె కరంగును వెన్న పోలికన్
చెంతకు బిల్వ బ్రహ్మ ఋషి శీలము దప్పెను , చేరి మేనకన్
భ్రాంతికి లోనుగాని ముని వంకర పోనటి వాలముండునా?
శంకర ప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కైవస మందుట' అనండి. 'ఇలన్+ఎంతటి' అని విసంధిగా వ్రాయరాదు. "ప్రాకృతమ్ము తా। నెంతటి..." అనండి. 'వంకర పోనటి వాలము'...?
ధన్యవాదములు
తొలగించండిఇంతులు దాపగువరకే
రిప్లయితొలగించండికాంతుడుచూపించు బిగువు ఖగవతిలోనన్
సుంతకలికిచూపు తగుల
నెంతటి పండితుడుగాని యిట్టె కరుంగున్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*వింతయెకాదుసుమ్మి, మది ప్రేమను జూపుచు నోరచూపులన్*
రిప్లయితొలగించండి*కాంతలు మానసాంతర వికాసత నొందగ చిల్పిచేష్టలన్*
*గంతులు వేయగా ఘనులు,జ్ఞానులు,పామరులెవ్వరేనిల*
*న్నెంతటి పండితుంజైననిట్టెకరంగును వెన్న పోలికన్*
శ్రీరామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"ఎవ్వరే యిలన్" అనండి.
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండినేను, మా ఆవిడ ఇద్దరం పంచారామాలు, అన్నవరం, సింహాచలం తదితర క్షేత్రాలను దర్శించడానికి వెళ్ళాలనుకుంటున్నాము. మా యాత్రకు ఏ విధమైన ప్రణాళిక చేసుకుంటే బాగుంటుందో తెలిసినవారు సూచన లివ్వవలసిందిగా మనవి.
విజయవాడ, మంగళగిరి, అమరావతి గతంలో చూశాము. ఇవి లేకుండా సూచించవలసిందిగా మనవి.
తొలగించండిమీరు ఎక్కడినుంచి బయలుదేరుతారు గురువు గారు
తొలగించండిపంతపు చండామార్కులు
రిప్లయితొలగించండిచెంతన ప్రహ్లాదుఁడుండ చిరునగవొలుకన్!
వింతేమి? శిష్యు నణకువ
కెంతటి పండితుఁడు గాని యిట్టె కరంగున్!
అంతఃకరణము శుధ్ధిగ
రిప్లయితొలగించండిమంతనములనాడుచుండు మాన్యుడవనుచున్
సంతతము బొగడునెడలను
నెంతటి పండితుడుగానియిట్టెకరంగున్
వింతపదాల పేర్పులతొ విందొనరించు గణాల కూర్పుతో
రిప్లయితొలగించండినెంతయు మోదమిచ్చు కవనేందిర డెందము దోచుకోవగన్
సంతసమొంది యాపెకును సాగిలి మ్రొక్కడె స్వాగతింపడే
ఎంతటి పండితుండైన నిట్టెకరంగును వెన్నపోలికన్
వీటూరి భాస్కరమ్మ
ఇంతికి దాసోహమ్మను
రిప్లయితొలగించండిటెంతయు సహజమ్ము కనగనీలోకమునన్
వింతగ సాహితి చూపుల
కెంతటి పండితుడె అయిన నిట్టెకరంగున్
వీటూరి భాస్కరమ్మ
సంతత హరి భక్తు నొకని
రిప్లయితొలగించండికాంతయె దాసునిగ జేసె కామ క్రీడన్
వింతలు కావా గాధలు
యెంతటి పండితుఁడు గాని యిట్టె కరంగున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅంతటి యచ్చర లేమ, త
రిప్లయితొలగించండినంతనె తా కౌగిలింప హా!పొమ్మను,నా
దాంతు నెరిగి యన పాడియె
నెంతటి పండితుడు గాని యిట్టె కరుంగున్?
ఎంతటి పండితుండయిన నిట్టె కరంగును వెన్న పోలిక
రిప్లయితొలగించండిన్నంతటి సున్నితంబె మఱి యాతని డెందపు పోకడల్ భువి
న్నంతయు మిధ్యగా ధరను నారసి మానవు డెల్లవే ళ లన్
వింతగ జొ ల్లు మాటలకు బేలయి లొంగుట పాడియే గనన్
స్వంతము తాపసునకుఁ బ్రళ
రిప్లయితొలగించండియాంతక శస్త్రాస్త్రములు మహాత్ముడయిన న
య్యింతికిఁ జిక్కె నతివలకు
నెంతటి పండితుఁడు గాని యిట్టె కరంగున్
కుంతికి సూను లిద్దరును ఘోరపు శత్రువు లాది నుండియున్
బంతము బూని తల్చెదరు పన్నుగ నిట్లు మహా చలమ్మునన్
బంతుల నేయ నస్త్రములు జ్వాలలలో, విలువిద్య నం దతం
డెంతటి పండితుం డయిన, నిట్టె కరంగును వెన్నపోలికన్
[బంతి = పంక్తి]
ఆఖరి పాదం సవరణ
రిప్లయితొలగించండికెంతటి పండితుడు గాని యిట్టె కరుంగున్
కాంతలభించి నవ్వుచును కంతుని బాణమువేయవేగ తా
రిప్లయితొలగించండినెంతటి పండితుండయిన నిట్టె కరంగును వెన్న పోలికన్
సుంతయులేదు సంశయము సోద్యముకాదది, కంబుపాణి శ్రీ
కాంతుని పుత్రుడైన మసి కంధరుడైనను చిక్కునింతికిన్
Guruvu gariki meeru adigina prakaram schedule
రిప్లయితొలగించండిStarting from Warangal
day1
Goutami express secbad 21-15 hrs
Goutami expres (12738) 11-30 pm in warangal
Take ticket Upto tadepalli gudem
TAdepalligudem reaches at 4-45 am aprx
Take lodge near by rly sation freshup
Day 2
Tadepalli gdem to bhimvaram (33 kms )catch bus 8 am
Temple reaching time 9 am aprx ( journey a hour)
Bhimvaram temple darshan 9-30 hrs
Bhimvaram to palkollu after tiffen (distance 22 kms)
catch bus at 10-30
Journey 1 hour
You have to be at temple by 11-30 (temple closes at 12 and will be opend
At 4 pm)
If you have darshan before 1 have meal in palakollu and rest for one hour
Catch bus to drakshramam from palkollu 1 hr 50 min journey ( distance 73 kms)
If you catch at 3 o clock your can reach Drakshramam apr 5 o clock
(temple closes between 12 to 3)
Have darshan and come to r samalkota around 8 or 9pm
Take lodge and rest
Day 3
Samalkota
get up at 5 am in lodge fresh up have coffe
Bheemeswar temple Darshan early morning before 7 am very near to railway station or
bus stand auto only 10 rupees)
Comeback to railway station before 9 am
Catch Ratnachal express aprx 9 o clock towards vijag
By 9-30 you will be Annavaram
Only 30 minuttes journey
stay in lodge down hills
go to up hills and hae darshan and vratam
finish by 1 o clock
back to down hills have meal
Annvaram to phitapuram catch tirumala at 3-30 pm
20 minutts to pithapuram go to temple have darshan
And back to annavaram by bus no train available till 8 pm
Again have darshan if you wish in annavaram take rest in night
Day 4
Catch train in annavram (Kakinada vizag passenger at 5-50 ) in annavaram
Reaching vijag at 9-50 am
Go to Simhachalam just 45 minutts
Have darshan and back to vijag at 1 pm
Take meal & rest
Evening to RK Beach etc and shopping
Catach Konark express at 10-15 pm
Back to Warangal next day 8-30 am day 5
As you are aged couple . No Hurry journey Break journey always prefer.
All your luggage to be kept either In lodge or in clock rooms. Take small hand bag and
Cash with you.
ధన్యవాదాలండీ...
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండికాంతయె కవ్వించి పిలువ
రిప్లయితొలగించండినెంతటి పండితుడు గాని యిట్టె కరంగున్
కంతునకు దాసుడగుచును
పంతులు, వర్తకుడును జనపాలుండయినన్ !!
హంత ! మదీయ పద్మ నయనాంతర బాష్ప విలోకనాత్ భవత్..
స్వాంత పయోనిధావనల చంచలతా న జనిష్యతే ? రతీ...
కాంత నితాంత తాపనమకార్య "మటంచును కాంత యేడ్వగా
నెంతటి పండితుండయిననిట్టె కరంగును వెన్నపోలికన్ !!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువు గారికి వందనములు. నిన్నటి, మొన్నటి నా పూరణలను పరిశీలించ గోరుతాను. ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమాధవ పద సేవలె నిల మద్యములన
గ్రోల హృద్యముగ ననేక రీతుల పలు
పద్యముల నిడి నడుమన గద్యములను
జేర్చ పోతన కవితకు సిరులు గూడె!
బాల్యమందె ముసలి వాని కూడు పడతి
పరిణయము నెదురగ పాటు పడియె
మహిళ బ్రతుకు కాచ రహిని మధురవాణి
వంక లేనిదమ్మ రంకు లాడి!
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
పంతము నెగ్గించు కొనగ
చింతించుచు నేడ్చుచున్న చిన్నారికి తా
వంతను బాపెను ప్రేమగ
యెంతటి పండితుడు గాని యిట్టె
కరంగున్.
***************************
రిప్లయితొలగించండిపంతులు గారని పొగుడుచు
బంతుల మాలను గళమున పరవశమున తా
చెంతకు చేరుచు వేయగ
నెంతటి పండితుడు గాని యిట్టే కరుగున్.
గొంతును సవరించుకొనుచు
పంతులు మంత్రము చదువుచు వ్రతమొనరింపన్
సాంతము గని ధనము నొసగ
నెంతటి పండితుడు గాని యిట్టే కరుగున్.
కాంతామణి తా వలచిన
కాంతుని నేకాంతమందు కాంక్షతొ బిలువన్
సుంతయు నాలోచింపక
నెంతటి పండితుడు గాని నిట్టే కరుగున్.
రిప్లయితొలగించండిపంతంబాడిన యట్లుగ
సంతతమును శారదమ్మ సాయపడంగన్
సుంతయు భీతిన్ బొందక
నెంతటి పండితుడు గాని యిట్టే కరుగున్.
ఇంతలు కన్నులుండినను నెంతటి హీనుడొ భార్య దృష్టిలో!
రిప్లయితొలగించండికొంతయు స్వర్ణమివ్వడని క్రొత్తవి తిట్టులు సృష్టిజేయుచున్
వింతగ ముద్దులాడగనె ప్రీతిగ పద్యపు స్తోత్రమివ్వగా
నెంతటి పండితుండయిన నిట్టె కరంగును వెన్నపోలికన్