(తప్పో ఓప్పో వెంటనే సమాధానం చెప్పాలి అనే సందర్భంగా పెద్దలు అనేమాట. దీనికి మాపెద్దలు చెప్పిన కథ ‘ఒక రోజు విద్యాధికారి పాఠశాల తణిఖీకి వచ్చి తెలుగు మాష్టారి తరగతిలో ఇలా ప్రశ్నించారుట “ నాయనా కుంతీ కుమారుని పేరు చెప్పండి” అని. ఎవరూ చెప్పక పోయేసరికి ఒకడు ధైర్యంగా లేచి గబగబా “ కుంతీ పుత్రుడు వినాయకుడు” అని చెప్పి కూర్చున్నాడుట. తెలుగు మాష్టారి గుండె గుభేల్ మన్నది. కాని విద్యాధి కారి ఇంకో దృష్టితో చూసి ఎవరూ సమాధానం చెప్పక పోయినా తప్పో ఒప్పో ముందు ధైర్యంగా చెప్పాడీ పిల్లవాడు అని మెచ్చుకుంటూ “ అబద్ధం వా సు బద్ధంవా కుంతీ పుత్రో వినాయకా” అని వెళ్ళి పోయారుట. తెలుగు మాష్టారి మనసు చల్లబడిందిట.)
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. విశేషార్థోపసర్గతో మీపూరణ మనోహరము. నేను గూడ ముందు వ్యతిరేకార్థోపసర్గ గా కర్ణుని పరముగా పూరిద్దామనుకొని యనుమానముతో విరమించాను. ఇప్పుడు మీ పూరణతో ధైర్యము వచ్చింది.
సూర్యకుమార్ గారూ, చాలా వరకు సాఫల్యం చెందారు. బాగుంది. మీరు వృత్తాలు చక్కగా వ్రాయగలరు. కొనసాగించండి. కొన్ని సంధి దోషాలు..."సంతసం బిడుచు నంగన... వరంబు నొక్కటిన్..లోన నెప్పుడును నిద్దరి..." అనండి. 'చెప్పితిన్ ఇమ్మహి' అని విసంధిగా వ్రాయరాదు. "చెప్పితి। న్నిమ్మహి..." అనవచ్చు.
అంతకుని తనయుడు ప్రధమ
రిప్లయితొలగించండికుంతీ పుత్రుడు , వినాయకుడు సత్యమిదే
ఇంతి శివ నలుగు పిండికి
సంతసపడి ప్రాణమిడగ జననము నొందెన్
పూసపాటి వారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఎంతో చిక్కగు ప్రాసను
రిప్లయితొలగించండివింతగ పూరించి నవ్వి వివశము తోడన్
పంతులు తోపెల్ల నుడివె:
"కుంతీపుత్రుఁడు వినాయకుఁడు సత్య మిదే"
మాన్య ప్రభాకర శాస్త్రిగారికి నమశ్శతాంజలి.
తొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండితోపెల్ల వారి మాటగా మీ పూరణ చమత్కారంతో ఎంతో బాగున్నది. అభినందనలు.
శంకరయ్య గురువుగారికి నమస్సులతో
రిప్లయితొలగించండిఅంతట తణిఖీ యంచును
వంతుగ విద్యాధికారి పాఠితు నడుగన్
చింతన జేయక జెప్పెను
కుంతీపుత్రుఁడు వినాయకుఁడు సత్య మిదే
(తప్పో ఓప్పో వెంటనే సమాధానం చెప్పాలి అనే సందర్భంగా పెద్దలు అనేమాట. దీనికి మాపెద్దలు చెప్పిన కథ
‘ఒక రోజు విద్యాధికారి పాఠశాల తణిఖీకి వచ్చి తెలుగు మాష్టారి తరగతిలో ఇలా ప్రశ్నించారుట “ నాయనా కుంతీ కుమారుని పేరు చెప్పండి” అని. ఎవరూ చెప్పక పోయేసరికి ఒకడు ధైర్యంగా లేచి గబగబా “ కుంతీ పుత్రుడు వినాయకుడు” అని చెప్పి కూర్చున్నాడుట. తెలుగు మాష్టారి గుండె గుభేల్ మన్నది. కాని విద్యాధి కారి ఇంకో దృష్టితో చూసి ఎవరూ సమాధానం చెప్పక పోయినా తప్పో ఒప్పో ముందు ధైర్యంగా చెప్పాడీ పిల్లవాడు అని మెచ్చుకుంటూ “ అబద్ధం వా సు బద్ధంవా కుంతీ పుత్రో వినాయకా” అని వెళ్ళి పోయారుట. తెలుగు మాష్టారి మనసు చల్లబడిందిట.)
తోపెల్ల వారూ,
తొలగించండిచొరవ గల విద్యార్థి సమాధానంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు. (ఈ 'అబద్ధం వా సుబద్ధంవా...' గతంలో విన్న నానుడియే!)
క్రమ్మర లేడికూన తమకంబున సింహముఁజేరినట్లుగా;
రిప్లయితొలగించండితెమ్మెరలెండమావి కడ తీరగ చల్లగ వీచనట్లుగా;
సమ్ముదమందు చిత్రములు చాలగనున్నవదెట్టులప్నచో
"నమ్ముడు కుంతిపుత్రుడు వినాయకుడే జనులార చెప్పితిన్"
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ 'చిత్రముల' పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలు
తొలగించండిఇంతికి తెలియని వింతది
రిప్లయితొలగించండికుంతీ పుత్రుఁడు, వినాయకుఁడు సత్య మిదే
పొంతన కుదురుట కొఱకని
పంతముగా నిలిపె నంట పార్వతి ముదమున్
అక్కయ్యా,
తొలగించండిపద్యం బాగున్నది. కాని పూరణ భావం అర్థం కాలేదు.
సంతోషి సఖియతో ననె
రిప్లయితొలగించండిపంతులుగారికిని పత్ని భారతి విను మా
కాంతారాయుడు కా దో
కుంతీ! పుత్రుడు వినాయకుడు సత్య మిదే.
హ.వేం.స.నా.మూర్తి.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండికుంతీ శబ్దాన్ని సంబోధనగా చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శాంతినిఁ గోరుచును బ్రజల
రిప్లయితొలగించండివంతలఁ బోగొట్టి రాజ్యపాలనఁ జేసెన్
వింత గలదె? ధర్మజుఁడను
కుంతీపుత్రుఁడు వినాయకుఁడు సత్యమిదే
(విశేషార్థాన్ని ఇచ్చే 'వి' అనే ఉపసర్గతో నాయకుడు; వినాయకుడు = విశిష్ట నాయకుడు)
(వనవాసం చేస్తున్న పాండవుల గురించి బాధ పడుతున్న కుంతితో విదురుని మాటలు....)
తొలగించండి*ఇంతుల మేల్బంతి యుమకు
కుంతీ! పుత్రుఁడు వినాయకుఁడు; సత్య మిదే
వంతలు దొలఁగఁగ నీవు ని
రంతర మాతనిఁ గొలిచిన నగు శుభము లికన్
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. విశేషార్థోపసర్గతో మీపూరణ మనోహరము.
తొలగించండినేను గూడ ముందు వ్యతిరేకార్థోపసర్గ గా కర్ణుని పరముగా పూరిద్దామనుకొని యనుమానముతో విరమించాను. ఇప్పుడు మీ పూరణతో ధైర్యము వచ్చింది.
డా.పిట్టా
రిప్లయితొలగించండివింతగ బుట్టిరి వీరలు
సొంతము కర్ణుడును గణప చూడరు తండ్రిన్
దొంతర(పరంపర)వెలుగుకు నలుగుకు
కుంతీ పుత్రుడు(తండ్రిని గుర్తించని పుత్రుడు) వినాయకుడు సత్యమిదే!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండిPlato యొక్కRepublic ను ఆధారంగా పూరణ
అమ్ముడుబోరె చిత్రముగ నందరు నాయకు లాలు పిల్లలన్
సొమ్ములవారి జేయ గొని సొత్తును:ప్లాటొ రిపబ్లికున్ గనన్
అమ్మల నయ్యవారలను హాయిని గూర్చిన సంతు పాలకుల్
ఇమ్మహి స్వార్థ చింతనల కీగక రాజ్యము చేతురంచనెన్
అమ్మల నయ్యలన్ యెరుగరాయెను కర్ణుడు నేకదంతుడున్
నమ్ముడు కుంతి పుత్రుడు(తల్లిని,దండ్రిని తెలియని కొడుకు) వినాయకుడే జనులార చెప్పితిన్!
ఆర్యా, ఇది Political Science తెలివి.
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'గనన్+అమ్మల... పాలకుల్+ఇమ్మహి...' ఇక్కడ విసంధిగా వ్రాయరాదు కదా! నయ్యలన్+ఎరుగ' అన్నపుడు యడాగమం రాదు. గమనించండి.
వంతనుచు బండి తిండిని
రిప్లయితొలగించండిసుంతయుఁ జేర్చక బకునకు సుష్టుగ భీముం
డంతయు తిని పరిమార్చెను
కుంతీ పుత్రుడు వినాయకుఁడు సత్యమిదే!
( భీమునకు వినాయకుడు తినేంత ఆహారం అవసరమని భావం )
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పంతులు గారి యింట ఋణపు
రిప్లయితొలగించండికంతులు లెక్కించు మనిషగు కరణమునకున్
కుంతియనెడి భార్య కలదుగ
కుంతీ పుత్రుడు వినాయకుడు సత్యమిదే
మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. కాని మూడు పాదాల్లోను గణదోషం. మీ పద్యానికి నా సవరణ....
పంతులు గృహమ్మున ఋణపు
కంతులు లెక్కించువాడు కరణమ్మునకున్
కుంతియనెడి భార్య కలదు
కుంతీ పుత్రుడు వినాయకుడు సత్యమిదే
ధన్యవాదాలు. సహనంతో మీరందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది.
తొలగించండి*ఎంతని వగచెదవిటులను
రిప్లయితొలగించండికుంతీ! పుత్రుడు వినాయకుడు, సత్యమిదే
నంతముచేయునుబాధలు
సంతసముగపూజసేయ శాంకరి పలికెన్
శ్రీరామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"..యంతము సేయును" అనండి.
చింతింప కర్ణుడెవ్వడు?
రిప్లయితొలగించండిచింతలు తొలగించు నెవడు శివ పుత్రుండై?
తంతు పటమేమి తెలుపును?
కుంతీ పుత్రుడు - వినాయకుడు - సత్యమిదే
(సవరణతో)
విజయకుమార్ గారూ,
తొలగించండిక్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వంతనుచు బండి తిండిని
రిప్లయితొలగించండిసుంతయుఁ జేర్చక బకునకు సుష్టుగ భీముం
డంతయు తిని పరిమార్చెను
కుంతీ పుత్రుడు వినాయకుఁడు సత్యమిదే!
( భీమునకు వినాయకుడు తినేంత ఆహారం అవసరమని భావం )
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పొమ్మని భీమసేనునకుఁ బూన్చ బకాసుర భక్షణార్థమై
రిప్లయితొలగించండికమ్మని బండెడన్నమును, గల్పుచుఁ దా తిని మొత్తమంత రే
ద్రిమ్మరిఁ గూల్చివచ్చె పురి దీవెనలందగ, భోజనంబునన్
నమ్ముఁడు కుంతి పుత్రుఁడు వినాయకుఁడే జనులార చెప్పితిన్!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిధర్మ మెంచెడి వారికీ ధరణి నందు
యచ్చగు యుధిష్ఠరు డెవరనంగ వచ్చు?
తనరు విఘ్నముల నణచు దైవ మెవరు?
కుంతీపుత్రుడు; వినాయకుడు సత్యమిదె
చివరి పాదం ఛందస్సు పరిశీలించ గలరు.
తొలగించండిరాజారావు గారూ,
తొలగించండిసమస్య కందపాదమైతే మీరు తేటగీతి వ్రాశారు. సవరించండి.
రిప్లయితొలగించండిపంతము నెరవేర్చుటకును
సంతుష్టిగ నారగింప సమ్మోదమునన్
సంతత మభయంబీయగ
కుంతీపుత్రుడు వినాయకుడు సత్యమిదే!
సీతాదేవి గారూ,
తొలగించండిఇంతకీ మీ పద్యంలోని కుంతీపుత్రుడు భీముడే కదా! చక్కని పూరణ. అభినందనలు.
అవును గురువుగారూ! ధన్యవాదములు!🙏🙏🙏🙏🙏
తొలగించండిఅమ్ముని సంతసంబిడుచు యంగనకిచ్చె వరంబు యొక్కటిన్,
రిప్లయితొలగించండినమ్మికతోడ వేడ జమునయ్య యొసంగెను, కర్ణుడే గదా
నమ్ముడు కుంతి పుత్రుడు, వినాయకుడే జనులార చెప్పితిన్
ఇమ్మహిలోన యెప్పుడును యిద్దరి తల్లుల ముద్దుబిడ్డడే.
గురువు గారికి వ్రత్త రచన నా రెండో ప్రయత్నము. పరిశీలించి సలహా లీయగలరు.
రిప్లయితొలగించండిసూర్యకుమార్ గారూ,
తొలగించండిచాలా వరకు సాఫల్యం చెందారు. బాగుంది. మీరు వృత్తాలు చక్కగా వ్రాయగలరు. కొనసాగించండి.
కొన్ని సంధి దోషాలు..."సంతసం బిడుచు నంగన... వరంబు నొక్కటిన్..లోన నెప్పుడును నిద్దరి..." అనండి. 'చెప్పితిన్ ఇమ్మహి' అని విసంధిగా వ్రాయరాదు. "చెప్పితి। న్నిమ్మహి..." అనవచ్చు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిసవరించిన పద్యం:
శాంతుడు ధర్మేంద్రు డెవరు?
పంతుగ విఘ్నములనెల్ల పరిమార్చెడి యా
శాంతికి యౌరసు డెవ్వరు?
కుంతీ పుత్రుడు వినాయకుడు సత్యమిదే!
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండినిన్నటి పూరణ:
వక్తృజుడౌ రావణునకు
వక్తృంబుల్ పది; కరములు పదివేలు గదా
దృక్తృఆతుండౌ సూరికి;
వక్తృత్వము వారిదెంచి పల్కెడి నపుడున్
ఇది కాస్త ప్రశాంతంగా, ఓపికతో పరిశీలించాల్సిన పద్యం...
తొలగించండికమ్మని పప్పుయన్నమును కాచిననెయ్యియు పిండివంటలున్
రిప్లయితొలగించండినెమ్మది పొట్టనిండుగను నెయ్యముతో భుజియించు వేళలన్
తమ్ములునన్నయున్నొకటి తానొక పంక్తిగ తల్లి పెట్టదే
నమ్ముడు కుంతి పుత్రుడు వినాయకుడే జనులార చెప్పితిన్
వీటూరి భాస్కరమ్మ
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వింతగ బుట్టిన కొమరుడె
రిప్లయితొలగించండికుంతీ పుత్రుడు ,వినాయకుడు సత్యమిదియే
కంతుని శత్రువు కొడుకే
వింతేమీ లేదురమ్య! వివరణగోరన్
సుబ్బారావు గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిశాంతముగా విను కవ్వడి
కుంతీ పుత్రుడు,వినాయకుడు సత్యమిదే
పంతముతో శశి కచ్చట
వంతను కూర్చుచు శపించె జగతిన గనుమా!
అంతయు వింటివిగా కథ
కౌంతేయుడనంగనేమి? గట్టిగ చెపుమా
నంతకహరు పుత్రు డెవరు?
కుంతీ పుత్రుడు,వినాయకుడు సత్యమిదే.
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
క్రమాలంకారంలో
రిప్లయితొలగించండిఎంతయు గోప్యతనినునికి
వింతగ పుట్టిన కర్ణుడు, వేడ్కతొనుమ కే
రింతగ చేసిన ప్రతిమయె
కుంతీ పుత్రుడు వినాయకుడు సత్యమిదే
వీటూరి భాస్కరమ్మ
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
'వేడ్కతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "వేడ్కను" అనండి.
నమ్ముడు కుంతిపుత్రుడు వినాయకుడే జనులార చెప్పితిన్
రిప్లయితొలగించండినమ్ముదుమార్య! మీపలుకు నగ్నపు సత్యము జెప్పిరేగదా
యిమ్ముగ నారయంగనిల నీశుని పుత్రుడు తొండధారియే
యమ్మరొ కర్ణుడున్గలిగె నాయమ సూర్యుని వేడగా దమిన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తొండధారి'...?
సంతత విచార కర వి
రిప్లయితొలగించండిఘ్నాంతవ్యాపార భార కార్ద్ర హృదయుఁడే
యింతీ! యంబకు, వినుమా
కుంతీ! పుత్రుఁడు వినాయకుఁడు సత్య మిదే
ఇమ్ముగఁ బాండునందనుఁ డహీన పరాక్రమ సత్యవంతుఁడున్
వమ్ముగ జూద మాడి తన వారినిఁ గూడి చరించెఁ గానలన్
సమ్మతినిన్ విరాటునకు సచ్ఛరితుండు యుధిష్ఠిరుండు దా,
నమ్ముఁడు, కుంతి పుత్రుఁడు వినాయకుఁడే జనులార చెప్పితిన్
[వినాయకుఁడు = గురువు]
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు మనోహరంగా, ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
"యుధిష్ఠిరుం డగున్। నమ్ముఁడు..." అంటే బాగుంటుందేమో?
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. మీ సవరణ బాగున్నది. ధన్యవాదములు.
తొలగించండిడా.పిట్టా
రిప్లయితొలగించండివింతగ బుట్టిరి వీరలు
సొంతము కర్ణుడును గణప చూడరు తండ్రిన్
దొంతర(పరంపర)వెలుగుకు నలుగుకు
కుంతీ పుత్రుడు(తండ్రిని గుర్తించని పుత్రుడు) వినాయకుడు సత్యమిదే!
__/\__
తొలగించండిఅంతముజేసె సుయోధను
రిప్లయితొలగించండికుంతీ పుత్రుడు, వినాయకుడు, సత్య మిదే,
సంతుష్టిగ భుజియించుచు
సంతసముగనెలుకపైన సతము చరించున్
కమ్మని భోజనమ్ముగొని కాంచు ముదమ్మును, ఖాదనమ్ములో
రిప్లయితొలగించండినమ్ముడు కుంతిపుత్రుడు, వినాయకుడే జనులార చెప్పితిన్
తమ్ములుతెచ్చు భోజనము తానెభుజించు సగమ్ముతృప్తిగా
గుమ్ముగనిద్రబోవునిక కోల్పడి స్పందన నిద్రమత్తులో
(బోజనము తినుటలో భీముడు వినయకుడితో సముడు)
సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
నమ్మిన వారి కష్టముల నార్తిగఁ దీర్చెడి సాకతంబునన్,
రిప్లయితొలగించండివెమ్మున పెద్దలందరిని పెంపున గొల్చు విధేయతన్, సకా
లమ్మున కార్యదీక్ష నచలంబుగ నుండెడి బుద్ధి కౌశతన్
నమ్ముఁడు కుంతి పుత్రుఁడు వినాయకుఁడే జనులార చెప్పితిన్
ఫణికుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కౌశతన్'...?
ధర్మజుడు శౌనకాది మునులనడిగిన సందర్భం....
రిప్లయితొలగించండిచింతాహేతువునడిగెను కుంతీపుత్రుఁడు , *వినాయకుఁడు సత్య మిదే* !
*స్వాంతమున భక్తిఁగొలిచిన*
*చింతలు తొలగించుననుచు* జెప్పిరి మునులున్ !!
త్రాగుబోతు.... ( క్రింద పేరు రాసుకున్నాడనుకోకండి.. 😀)
అమ్మ పయిన్ ప్రమాణమిదె! అబ్బ పయిన్ మఱి యొట్టు ! నేను మ..
ద్యమ్మును త్రాగలేదు ! మరియాదను వీడగలేదు ! నేలపై
సొమ్మసిలన్ బరుండినది జూచితిరా ! అది యేమి లేదు! నన్
నమ్ముడు ! కుంతిపుత్రుఁడు వినాయకుడే ! జనులార ! చెప్పితిన్!!
అమ్ముని మాట నమ్ముటకు నర్కుని బిల్చెను గుంతి , గౌరియున్
బొమ్మకు బ్రాణమిచ్చి తనముద్దులపట్టిగ నెంచె , వారలే
నమ్ముడు! కుంతిపుత్రుఁడు వినాయకుడే! జనులార! చెప్పితిన్!
నెమ్మి యనంగ ధాత్రి నవనీతసమానము మాతృభావమే!!
నెమ్మి... ప్రేమ / సంతోషము...
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారూ,
తొలగించండిమీ మూడు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
ఎంతాలోచించిన నది
రిప్లయితొలగించండిఅంతే! లంబోదరుడన ననిలజుడగునే?
వింతగ పలుకకు! కాడే
కుంతీ పుత్రుడు! వినాయకుడు సత్యమిదే
రాజశేఖర శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"ఎంతగ నాలోచించిన। నంతయె" అనండి.
అంతము లేని సమస్యల
రిప్లయితొలగించండినెంతని సృష్టించ గలడు యే కవి యైనన్
వింతగు సమస్య గాదిది
కుంతీపుత్రుఁడు వినాయకుఁడు సత్య మిదే !
చింతన విడి బలికితివన
నంతయు నిజమనుచు బలికె నర్భకుడు సభన్
వింతగ జన్మించిరి గద
కుంతీపుత్రుఁడు, వినాయకుఁడు, సత్య మిదే !
నిన్నటి సమస్యకు నా పూరణ
1 వక్త్రము లసురున కెన్నన
2 వక్త్రము గాకన్ కరములు పాపాత్మునికిన్ ,
3 వక్త్రము లా హరికెన్నన
వక్త్రంబుల్ పది/ కరములు పది / వేలు గదా!
1 వక్త్రము = నోరు
2 వక్త్రము = ముఖము
3 వక్త్రము = వస్త్రము
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఇమ్మహిలోన ధర్మగుణ
రిప్లయితొలగించండిమెవ్వని సొత్తయి తూగె నుర్విలో,
నమ్ముడు కుంతి పుత్రుడు; వి
నాయకుడే జనులార, చెప్పితి,
న్నిమ్ముగ లోక రక్షణ వ
హించెడి వాడయి దివ్యరూపుడై
నెమ్మిని సర్వజీవులను
నిక్కము బ్రోచు గదా దయాళువై!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"తొమ్మిది మాసముల్ లలన తోరపు బొజ్జను మోయకుండనే
రిప్లయితొలగించండిగమ్మున పుట్టినోరెవరు? కమ్మగ చెప్పు ప్రభాకరా!" యనన్,...
నమ్ముఁడు! "కుంతి పుత్రుఁడు, వినాయకుఁడే", జనులార! చెప్పితిన్,...
కుమ్మురు నిద్దరున్ వడిగ కొండల నిట్టులె కార్పొరేట్ర వోల్ :)
కుంతి పుత్రుడు = భీముడు