27, జూన్ 2017, మంగళవారం

దత్తపది - 117 (డైనోర-బుష్-యల్‍జి-డెల్)

"డైనోర - బుష్ - యల్‍జి - డెల్"
పై పదాలను ఉపయోగిస్తూ
భారతార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
ఈ దత్తపదిని పంపిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి ధన్యవాదాలు.

42 కామెంట్‌లు:

  1. మానినీ, నాపైన మదనుడు బుష్కలముగ వేసె తన శరములను, ధాత్రి
    కి మగడై నోరార కీర్తనమును చేతు నీదు సౌ౦దర్యము, నిన్ను గనిన
    యమరుల కైననూ యదురుచు గుండెలు జారును, నమ్ముము, జాగు వలదు
    నునుపు మేని హొయల్ జినుని కైన తాపమ్ము కల్గించి నిను కోరు, కరుణ చూపి
    దాసుని కరము పట్టుము, దాసి వైన
    నిన్ను చేతును రాణిగా, నీవు సిగ్గు
    పడక రమ్ము, యనుచు కీచకుడు విడువక
    ద్రౌపదిని వేడు చుండెను దారి గాచి

    రిప్లయితొలగించండి
  2. ఉత్తర కుమారుని ప్రగల్భములు:


    "పదర హరిహరుడై నోరబట్టు కొనెద
    పోరు సర్పము వోలె 'బుష్ బుష్షు' మనుచు
    చేసి తుత్తునియల్ జించి కోసి మేయు
    సిగ్గుతోడ గుండెల్ నేడు దిగ్గు రనగ!"


    నోరబట్టు = ఆస్వాదించు (క్రియా స్వరూప మణి దీపిక)

    రిప్లయితొలగించండి
  3. గుం*డెల్*దీసెడు బంటువంట మరి నాకున్ సాటి రారెవ్వరు
    న్నండల్ మెండుగనున్న నా కడను మా*యల్ జి*త్తులున్ సాగవే!
    మెం*డైనో ర*ణ కాంక్ష నీకు తులువా?మేలొప్పగా లొంగు,దే
    వుండై,మమ్ములఁగాచు కృష్ణుని వెసన్ బుష్పాల పూజించెదన్
    భీముడు జరొసంధునితో అన్న మాటలు

    రిప్లయితొలగించండి
  4. మృత్యువు జయుడై నోరది మిగుల తెఱచె
    ఆజి నంబు"ష్" రవంబులె యతిశయించు
    శకుని మాయల్ జిలుకలేడు సమరమందు
    అదరవె యిక గుండెల్ మీకు నాహవమున!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారి సూచనను అనుసరించి మార్పుతో:-

      మృత్యువు జయుడై నోరది మిగుల తెఱచె
      ఆజి నంబు"ష్" రవంబులె యతిశయించు
      శకుని మాయల్ జితములగు సమరమందు
      అదరవె యిక గుండెల్ మీకు నాహవమున!!

      తొలగించండి
  5. డా.పిట్టా
    డాయంజాలదు లక్ష్మి,యా వెతలుమెం*డై నోర*కొర్గెన్ మతిన్
    జాయాయేగద బంప గృష్ణుడిడె నిచ్ఛన్ *బుష్క(ష్,క)*లార్థంబులన్
    మా*యల్ జి*క్క సుదాముడేగె నటుకుల్ మాన్యుండు జేకొంచు యే
    పేయా సంతు 'కుమా'యె తోడనుచు వే పే*డెల్* భ్రమల్ జెందగన్!
    (పేడె॥గడ్డము, మీసములు లేనివాడు-"సంతానంతోనే లక్ష్మి",అనే సందేశం తీసుకున్నాడు, "పేడిమూతి వాడను,నాకు పిల్లనెవరిస్తార"న్న నిరాశను అధిగమిస్తూ!)ఆర్యా, మీరెన్నుకున్న కంపెనీలకు అంత మహాత్మ్యమున్నది!యేపు॥ పెంపగు )

    రిప్లయితొలగించండి
  6. నీతిరహితు*డైనోరా*రనిపసి పాప
    లనువధించి పాపం*బుసు*లభము మూట
    గట్టి గుండి*యల్జి*మ్మిన కటిక చీక
    ట్ల కృపి సుతుడుపాడెల్ గట్టె ఢంక తనము

    రిప్లయితొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  8. పా(డై నోర)ది పుచ్చి పోయెనె కటా పాపాత్మ యిట్లాడినా
    వేడ(న్బుష్టి)ని గాంచబోవు ధరలో నీ వంశ వృక్షంబునన్
    జీడైయుంటివి జీల్చెదన్ దురమునన్ ఛీ గుండి(యల్ జి)ల్లనన్
    నా(డెల్ల)ర్ గనరే యనెన్ కురుపతిన్ నా డుగ్రుడై భీముడున్.


    భారతాహవ మందున భటగణంబు
    లకట నిప్పులు గ్రక్కుచు నొకరి నొకరు
    “సెల్లు డైనోర బుష్యల్జి డెల్లటంచు”
    తరుము చుండిరి చూపరు లరయుచుండ.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
  9. *సవరణ చివరిపాదం
    టి కృపి సుతుడు

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  11. వీరుడౌ భీష్ముడుగ్రు*డైనోర జూసి
    చేయ యుద్ధమ్ము గుండి*యల్ జివ్వుమనగ
    *బుష్ మనుచులేచు సర్పమ్ముబోలునట్లు
    శత్రుసేనగుం*డెల్ గూల్చ చక్రినురికె...

    రిప్లయితొలగించండి
  12. గారపు వాక్కులు తోడై
    నో రలరఁగఁ బుష్పమాలను గళమ్మందుం
    దీరుగను గుండియల్ జిను
    గారఁగ నిండెల్ వలన బకారి వెలింగెన్

    [జినుఁగు = తళుకు; ఇండె = పూలమాల; బకారి = కృష్ణుఁడు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కందమున, యల్ జి, బుష్, డెల్,
      విందుగ, డైనోర, గూడ భీముని వోలెన్
      డెందమ్మలరగ కూర్చిన
      చందము కామేశు వారి చతురత కాదే!

      తొలగించండి
    2. శాస్త్రి గారు నాకు పూరించడానికి నాలుగు పాదము లవసరమైతే మీరా కార్యమును నేకోత్తరార్ధ (1 ½) పాదములలో పూర్తి చేసా రాశ్చర్యముగా. సాభినందన ధన్యవాదములు.

      తొలగించండి


  13. వనవాసానంతరమున పాండవుల అంతరంగము:

    చెలికాడై నోరారన్
    బలుక శుభముఁ బుష్కరంపు వనవాస వెతల్
    దొలఁగె దయల్ జిందగ హరి
    మలి యజ్ఞాతంపు చిక్కు మఱచున్ గుండెల్

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. మారుతి ఘనభుజ గుండై
    నోరంతయు తెఱచి బుష్ష నుచుఘోషించెన్
    పోరున గుండెల్ జీల్చుచు
    నారుధిరము గ్రోలె గుండియల్ జివ్వాడన్.
    naa

    రిప్లయితొలగించండి
  16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  17. మాయల్ జిత్తులు నేర్చినారు కపటమ్మాచారమౌ కౌరవుల్
    డాయన్నోరనుబిల్వ బల్కరు లలాటమ్ముల్ కమ్మలో దిమ్మెలో
    గాయాబుష్ కరవాలమే నిడదు తా ఖండించు వాగ్బాణముల్
    ఢీయంచున్ చనుదెంచె త్రాడుగొని గుండెల్ వారికిన్ బండలో
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  18. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    *"డైనోర - బుష్ - యల్‍జి - డెల్"*

    పై పదాలను ఉపయోగిస్తూ

    *భారతార్థంలో*

    మెం *డైనోరా*రెన్రణ
    ముండంగన్ గుండి *యల్ జి* తోత్పాతగతిన్
    కం *డెల్*జుట్టఁఘటోత్కచ
    భండనధృతిఁ *బుష్* ్కళోగ్రభంజనకృతులన్

    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*


    ఘటోత్కచుడు జాస్తి బలంగలవాడై కురుసేనను చెల్లా చెదురు చేస్తుంటే
    నోరు ఆరిపోయింది ఓటమిభయంతో గుండెలు కండెల్లా చుట్టబడ్డాయి భయపెట్టేందుకు అతనుచేస్తున్న విన్యాసాలు దండిగా కనిపించాయి

    డెల్ డైనోరా బుష్ యల్జి టీవిల్లో ప్రత్యక్షప్రసారం అవుతుంటే ధృతరాష్ట్రులవారు చూశారు🙏🌹🙏

    రిప్లయితొలగించండి
  19. గర్వితుడై నోర ఖలుసైంధవుడు పాండు
    . సేనల నిలువరించె నపుడంత
    యభిమన్యుడొంటరై యనిన విజృంభించె
    . మధ్యందిన యినుని మాదిరిగను
    బాలు బుష్కలమైన పటిమనే గన్నట్టి
    . సేనల గుండియల్ జిల్లుమనగ
    చెదరిపోయెను సేన నదియె గాంచి
    . కపటులై గెలవగన్ కదన మందు

    అదిరె గుండెల్ వణక సాగె నవయవముల
    తప్పదోటమనుచువారు తలచి యంత
    నర్జునసుతుడె లక్ష్యమై యనినవారు
    చుట్టుముట్టిరి బాలుని మట్టువెట్ట.
    (నోరు = ముఖద్వారము )


    కీచకుడు ద్రౌపతిని కోరాడని తెలిసి తోటి చెలికత్తె ఆమెతో పలికిన పలుకులుగ నూహించి


    విను, పరవశుడై నోరార పిలిచెనిన్ను
    కురులబుష్పముల్ తురుమవే కోమలాంగి
    సరసుడెల్లకాంతలవిడి సరసమాడ
    దలచె నీతోడ నీజన్మ ధన్యమేను
    గుండియల్ జిల్లనె గద నన్ గోరి యున్న.

    రిప్లయితొలగించండి
  20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  21. కౌరవులసేన నుగ్రుడై నోరబట్టు
    కొనెద, కస్సున నేనుబుష్ గొట్టుచునట
    చిత్తుగకురుమాయల్ జిత్తు జేయగ గని
    గచ్చుమనును గుండెల్ గద కంటకులకు
    ననియెయుత్తరుండిట్టులనంతిపురిన!!!

    రిప్లయితొలగించండి
  22. రిప్లయిలు
    1. కవి వరుల కొక గమనిక:

      తుత్తునియల్ సించి; మాయల్ సిలుకలేడు; దయల్ సిందఁగ; గుండెల్ సీల్చుచు; మాయల్ సిత్తుఁ జేయగ యిత్యాదులు వ్యాకరణ బద్ధములు. సాదేశమే గాని సరళాదేశము కాదు. దీని వలన నొక దత్త పద భంగము.

      తొలగించండి
  23. వైరిగుండియల్ జిల్లన వాయుసుతుడు
    కుపితుడై నోరబట్టగ కుటిల దుస్స
    సేను రుధిరముఁ బుష్పించె నాననమ్ము
    ద్రోవదికి గుండెలు పగిలె దుష్టతతికి
    నోరబట్టుః త్రాగు

    రిప్లయితొలగించండి
  24. అవతారంబున మానవుండయిన వాడై నోరనూహ్యంబవ
    న్నెవడారుచ్యములన్ని మ్రింగుచునె గుండెల్ బ్రద్దలౌ రీతిగా
    శివ నాట్యంబొనరించి, నాతిగ హొయల్ జిల్కంగ గాజేసెనో
    యవలోకింప ఘటోత్కచుండె గద ! యుద్ధంబందు బుష్ బుష్షనెన్

    రిప్లయితొలగించండి
  25. కవిమిత్రులారా!
    నమస్కృతులు.
    ప్రయాణంలో ఉన్నాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  26. తగవు సేయుమనగ తమ్ముడై నోరాడ
    కుండె;గుండెలెట్లు చెండివేతు
    తేనియల్జిలికెడి తీరుగన్ బుష్కల
    మాటలాడి కలిసి మనగ లేమె

    రిప్లయితొలగించండి
  27. క్రొవ్విడి వెంకట రాజారావు:

    రుద్రుడై నోరనున్న విల్లును కిఱుకుచు
    కఱ్ఱి బుష్పవృష్టి కరణి కంటకముల
    పెరల గుండియల్ జిల్లులు వెట్టుజుండ
    జూచు వారు గుండె లొలయుచు పరువెట్టె

    రిప్లయితొలగించండి
  28. రారాజు.. భీష్మాదులతో....

    గౌరవ్యుండగు యాదవేంద్రుడిట వాక్చాతుర్యసంపన్నుడై
    నోరారన్ హితముల్ వచించెనని , నిండున్ బుష్కలశ్రీలికన్
    నీ రాజ్యంబుననంచు బల్కితిరి, గుండెల్ జీల్చు బంటీతడౌ !
    ఔరా! యొప్పను! లేవు సంధి యను ఛాయల్! జీవితాంతమ్మికన్ !!

    బాలవీరుడు..... అభిమన్యుడు.....

    చనియెన్ బుష్ప సమాన పేశలవపుస్సౌందర్యమొప్పార సా...
    ధనతో మేనిహొయల్ జిగేలుమన పద్మవ్యూహమధ్యమ్మునన్
    నినదించెన్ నరసింహుడై రిపుల గుండెల్ దద్దరిల్లంగ , దా
    నును లేబ్రాయమునందు బోరెనొకడై నోరార గీర్తింపరే !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  29. కవిమిత్రులారా, నమస్కృతులు. ఇంకా ప్రయాణంలోనే ఉన్నాను. హైదరాబాద్ నుండి వరంగల్లుకు బస్సులో...

    రిప్లయితొలగించండి
  30. గుండెల్జీల్చి రుధిరమును

    గుండెలనిండుగ నునేను గ్రోలిన వాడై

    చెండాడెదబుష్షను నహి

    దండైనోరా ఫడెలని దండింతు నిలన్.

    రిప్లయితొలగించండి
  31. భీముడపుడు చాల ప్రీతుడై నోరార
    బుష్కలముగ స్తోత్రములను జదువ
    ఆంజనేయుడట దయల్ జిలుకగజూడ
    పవనుడెల్ల జూచి పరవశించె.

    రిప్లయితొలగించండి