22, జూన్ 2017, గురువారం

సమస్య – 2391 (శవము మోద మిడు...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"శవము మోద మిడుఁ బ్రశస్తముగను"
(లేదా...)
"శవము ముదావహంబగు ప్రశస్తముగా జనులెల్ల మెచ్చఁగన్"
ఈ సమస్యను సూచించిన బొగ్గరం ప్రసాద రావు గారికి ధన్యవాదాలు.

81 వ్యాఖ్యలు:

 1. ప్రత్యుత్తరాలు
  1. కనుల కాంచ లేక అన్ననూ కళ్ళ కాంచ లేక అన్ననూ ఒకటే గదా! ప్రభాకర శాస్త్రి గారూ! కాబట్టి మీరు వ్రాసిందే సరియైనదని నాభావన. పెద్దలు మీరే చెప్పాలి.

   తొలగించు
  2. సార్! నేను వయసు లోనే పెద్ద! మీరు చక్కగా చెప్పినారు.

   నమస్సులు!

   తొలగించు
  3. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

   తొలగించు
  4. పండ్లు రాలి పోయి పలుచ బడగ జుట్టు
   కనులు కాంచ లేక కాళ్ళు నొచ్చ;
   ముసలి వయసు లోన ముద్దు మనుమల శై
   శవము మోద మిడుఁ బ్రశస్తముగను

   తొలగించు
  5. అవనిని గల్గు మానవులకందరికిన్ ప్రమదమ్ము గూర్చుచున్
   కవులు స్తుతించు బాల్యమది కమ్మని ప్రాయము జీవనమ్మునన్ భువనము నందు సర్వజనపూజితమై విలసిల్లునట్టి శై
   శవము ముదావహంబగు ప్రశస్తముగా జనులెల్ల మెచ్చగన్
   వీటూరి భాస్కరమ్మ

   తొలగించు
  6. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
  7. భాస్కరమ్మ గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

   తొలగించు
  8. * "కాళ్ళు నొవ్వ"

   "నోరు *నొవ్వంగ* హరి కీర్తి నుడువడేని........."

   ఈ సవరణ సూచించిన మైలవరపు మురళీకృష్ణ గారికి ధన్యవాదములు...

   తొలగించు
 2. ప్రాణి కోటి యందు రాగంబు చిందాడు
  కాల మేది యనగ కందు మిదియె
  భోగ తుల్య మదియె బుధులు జెప్పంగ శై
  శవము మోదమిడు ప్రశస్తముగను.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. కల్ల కపట మనక యుల్లము రంజిల్ల
  లేత నవ్వు చిలికి ప్రీతి గాను
  గుండె నిండ మధువు మెండుగా నింపుశై
  శవము మోద మిడుఁ బ్రశస్త ముగను

  ప్రత్యుత్తరంతొలగించు
 4. 2. ఎండ మండు చుండు ఎల్లెడ వేసవిన్
  మనము దేహ మంత మండు చుండు
  క్షితిజ పక్షి పశుల జీవరాశికి నప్డు
  "శవము మోద మిడుఁ బ్రశస్తముగను"

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శర్మ గారూ,

   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 5. కనుల మూత తోడ కళతప్పి కనపడు
  శవము, మోదమిడు ప్రశస్త ముగను
  వసుధ లోన ముఖము మిసిమిని పొందగ
  జీవమున్న వరకు జీవు లెల్ల

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పూసపాటి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 6. అవధులులేని జన్మ,మరణాదులు తప్పవటంచు శంకరుల్
  చెవులను గూడు కట్టుకొని చెప్పిరి-కృష్ణుఁడు గీతబోధలో.
  "చివికిన వస్త్రముల్ విడుము"-చిన్మయ మార్గము బోధ చేయరే!
  శవము ముదావహంబగు ప్రశస్తముగా జనులెల్లమెచ్చగన్

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ముద్దులొల్కుమోము ముచ్చటైనపలుకు
  స్వచ్ఛమైన మనసు శంకలేక
  నాటపాటతోడ హాయినొసగుచు శై
  శవము మోదమిడు బ్రశస్తముగను!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 8. భీతిగొల్పునాజి భీభత్సముంజేసి
  ఖ్యాతిగొల్పురీతి కాలుదువ్వి
  మట్టుబెట్టినంత పట్టుబడినవైరి
  శవము మోదమిడు బ్రశస్తముగను!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సీతాదేవి గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 9. డా.పిట్టా
  స్తవమునెన్ని హరిని సాగిలబడి మ్రొక్క
  భవము గల్గునన్న భయము సున్న
  భజన జేయుచుండ భవ్య నామంబు'కే
  శవము' మోదమిడు బ్రశస్తముగను!

  ప్రత్యుత్తరంతొలగించు
 10. డా.పిట్టా
  Terrorist నుద్దేశించి
  జవమును జూప యందరు నిజాశ్రయులౌట మతంబటన్న పా
  శవికత కన్న మిన్నయగు సత్కృతి యొక్కటి చాలు,వీడు,"వే
  ధవ!"యెవడాయె నీ గురువు తల్లికి తండ్రికి పుట్టలేదొకో
  భవమొక టెర్రరిస్టుగను బట్టను గట్టగలేక ఛావు!నీ
  శవము ముదావహంబగు ప్రశస్తముగా జనులెల్ల మెచ్చగన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. డా. పిట్టా వారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
  2. డా.పిట్టా
   ఆర్యా ,ధన్యవాదాలు.

   తొలగించు
 11. ..............................................

  గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


  కోట్ల కొలది యాస్తి కొడు కేమొ , యొకడె

  పాము కాటు వలన వాడు c జచ్చె !

  దాయ లెల్ల గ్రద్ద లో యన వ్రాలిరి

  శవము మోద మిడు బ్రశస్తముగను !

  ( దాయలు = దాయాదులు )

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ".. యొక్కడె" అనండి. లేకుంటే గణదోషం.

   తొలగించు
 12. చిలుకలాడినటుల శ్రీహరి గానంపు
  రాగసుధలఁ దేలి రంజితముగ
  పరవశమ్మునందు ప్రహ్లాద భక్త శై
  శవము మోద మిడుఁ బ్రశస్తముగను

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 13. ధారణ పటిమ నవధానియే జూపించ
  పేచి ప్రశ్న లేయు పృచ్ఛకులకు
  వినెడువారలకును విద్వాంసురాలి యా
  శవము మోద మిడుఁ బ్రశస్తముగను

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. రఘురామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "ఆశవము"?

   తొలగించు
 14. ఎన్నికలను వైరిసన్నుతి గెలుపొంద
  సైపలేక క్రోధమాపలేక
  నోడి ఫలికె ఖలుడు కీడెంచి శత్రువు
  శవము మోదమిడు బ్రశస్తముగను
  వీటూరి భాస్కరమ్మ

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. భాస్కరమ్మ గారూ,
   మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 15. రాధరాసలీలరసరమ్య నూహలు
  నీదు నీడలోనె నిత్యమయ్యె
  కృష్ణ వేణుగాన తృష్ణ లాహిరులకే
  శవము, మోదమిడు ప్రశస్తముగను

  కేశవము=పొన్నచెట్టు

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శ్రీరామ్ గారూ,
   మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
   'రమ్య + ఊహలు' అన్నప్పుడు నుగాగమం రాదు. అక్కడ "రస రమ్య భావముల్" అనండి.

   తొలగించు
 16. రాధరాసలీలరసరమ్య నూహలు
  నీదు నీడలోనె నిత్యమయ్యె
  కృష్ణ వేణుగాన తృష్ణ లాహిరులకే
  శవము, మోదమిడు ప్రశస్తముగను

  కేశవము=పొన్నచెట్టు

  ప్రత్యుత్తరంతొలగించు
 17. పాల బుగ్గలందు పసిడి ఛాయలు మించి
  బోసి నోటి తీరు బుంగమూతి
  ముద్దు గొలుపు రీతి ముసిముసి నగవు శై
  శవము మోద మిడుఁ బ్రశస్తముగను

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. కృష్ణారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 18. మరలి రాని మధురమౌ కాలమే యది
  కలల యలల పైన కదలి పోవు
  కపట మెరుగ లేని గమనంబు గాదె శై
  శవము మోదమిడు ప్రశస్తముగను!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శిష్ట్లా వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 19. కొలను లోన డిగ్గి గోపకాంతలు స్నాన
  మాచరింప, వలువ లపహరించి
  కృష్ణుడెక్కినట్టి వృక్షరాజంబు "కే
  శవము" మోదమిడుఁ బ్రశస్తముగను

  కేశవము =పొన్న చెట్టు

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సందీప్ శర్మ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 20. ఎండు పుల్ల వోలె నుండుచు వంగదు
  శవము, మోద మిడు బ్రశస్తముగను
  జీవముండు ముఖము నవనవ లాడుచు
  చూచు వారల కది సొగసు నింపి


  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 21. రాధమాధవుండు రమ్యంబుగానాడు
  పొన్న చెట్టు నీడ మిన్న గాదె
  హరికి శంకరునకు పరమప్రీతియగు కే
  శవము మోదమిడుబ్రసస్తముగను!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 22. క్రొవ్విడి వెంకట రాజారావు:

  ఇంపు సొంపు లమరి పెంపు నొందిన నాటి
  విభవ మంత తోచి ప్రీతి గలిగె;
  బాధ్యతలవి లేక ప్రభ వెల్గు నట్టి శై
  శవము మోదమిడు బ్రసస్తముగను
  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 23. మేఘమాల లందు రాగాలు పలికించి
  చినుకు లల్లె జారి చిత్తమలర
  నదుల నొదిలి కడలి నొదుగంగ జేరు నా
  శవము మోదమిడు ప్రశస్తముగను!

  శవము=జలము(శబ్ద రత్నాకరం)

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శిష్ట్లా శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఒదిలి' సాధువు కాదు. "నదుల వదలి" అనండి.

   తొలగించు
 24. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  *22, జూన్ 2017, గురువారం*

  *సమస్య – 2391*

  ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

  *"శవము మోద మిడుఁ బ్రశస్తముగను"*

  (లేదా...)

  *"శవము ముదావహంబగు ప్రశస్తముగా జనులెల్ల మెచ్చఁగన్"*


  *మెత్తనైన తల్లిపొత్తిలో ఊయలో*
  *అవ్వతాత కేలుపువ్వులెేవొ*
  *కొలిచె కొలువుదీరఁ వేలుపనఁ ననుఁ శై*

  *"శవము మోద మిడుఁ బ్రశస్తముగను*

  *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  గురుదేవా సవరించాను ఆశీర్వదించండి🙏🙏🌹🙏🙏

  ప్రత్యుత్తరంతొలగించు
 25. చిన్న పెద్ద యన్న విన్నఁదనము లేక
  యాట పాటల ముద మంద భృశము
  చదువు సంధ్య లలర సదమల వృత్త శై
  శవము మోద మిడుఁ బ్రశస్తముగను


  దివిజుల కెల్ల సంతతము దీవన లిచ్చెడి లోకమాతనున్
  ధవళ పయోధి సంభవ సుధా నిభ కాయ విరాజమాన ను
  న్నవిరళ భక్తి సంయుతము నర్చన సేయగ లక్ష్మినిన్ సకే
  శవము ముదావహంబగు ప్రశస్తముగా జనులెల్ల మెచ్చఁగన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. కామేశ్వరరావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించు
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

   తొలగించు
 26. శివుని జటమ్ము లోన నివశించి భగీరధ మౌని వేడగా
  దివమును ముద్దులాడి, జగతిన్ బహు వేగముగాను దూకి ఆ
  భవుని పదమ్ము తాకిన శుభాంగి విష్ణునది, ధాత్రిలోన యా
  శవము ముదావహంబగు ప్రశస్తముగా జనులెల్ల మెచ్చగన్

  శవము = జలము విష్ణునది = గంగ

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సూర్యకుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'విష్ణునది' అన్నచొట గణభంగం. "సురాపగ" అనండి.

   తొలగించు

 27. పిన్నక నాగేశ్వరరావు.

  ముద్దు మోము తోడ మురిపించు
  మాటల
  పరవశింప జేయు ప్రతి యొకరిని

  యాట పాటలనుచు నటునిటు
  తిరుగు శై
  శవము మోదమిడు బ్రశస్తముగను.

  ******************************

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. నాగేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 28. మాన్యులు శ్రీ J K Mohana Rao గారికి నమస్కారములతో,

  బాలవ్యాకరణం భూతకాలిక ప్రథమైకపురుషవచనం అయినప్పుడు "అగునకు వక్రంబు గూడుచో దీర్ఘం బగు (క్రియా.100)" అని వక్రమైన ఎ వర్ణానికి పూర్వం 'అగు' ధాతువులో ఉన్న అ వర్ణానికి దీర్ఘం వస్తుందని స్పష్టంగా "ఆయెను", "ఆయె" రూపాలను వ్యవస్థీకరించింది.

  "అయెను", "అయె" రూపాలకు లక్షణవ్యవస్థ లేదు. వాటి ఉచ్చారణలో సౌలభ్యమూ లేదు. ప్రామాణికుల కావ్యప్రయోగాలలో అవి కనబడవు.

  వ్యావహారికంలోనూ "వాడు రాలేదాయె, నాకు చెప్పలేదాయె" మొదలైనచోట్ల దీర్ఘమే ఉన్నది కాని, "వాడు రాలేదయె, నాకు చెప్పలేదయె" అన్న రూపాలు లేవు. ఉచ్ఛారణసౌలభ్యం లేకపోవటమే అందుకు కారణం. "వ్యాసం పూర్తయెను" అని ఎవరూ అనరు.

  చిన్నయసూరి గారు వక్రంబు అంటే హ్రస్వమైన ఎ కారమని ప్రత్యేకంగా చెప్పకపోయినా, దాని భావం అదే. అందువల్లనే "ఆయేను", "ఆయే" వంటి రూపాలు సైతం ఉండవు.

  సలక్షణమైన గ్రాంథికభాషలో వ్రాయదలచినప్పుడు 1) గ్రంథాలలోనూ, 2) లక్షణంలోనూ, 3) వ్యవహారంలోనూ ఏ చోటా లేని కృతకరూపాలను పరిహరించటమే మంచిది.

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

  ప్రత్యుత్తరంతొలగించు
 29. తీర్చి నేత రూపు దిష్టిబొమ్మను జేసి
  గాల్చరాదు , దాని కంటె నుగ్ర....
  వాదమనెడి బొమ్మ వధియింప నట్టిదౌ
  శవము మోదమిడు ప్రశస్తమగును !!


  జవము నశించి , దేహమున సత్తువ తగ్గియు , భీకరమ్ముగా
  రవమును జేయలేని మృగరాజునకొక్కటి దక్క జింకదౌ
  శవము , ముదావహంబగు ప్రశస్తముగా ! జనులెల్ల మెచ్చఁగన్
  యువకులు ముందుచూపు గొని యుండవలెన్ ముదిమిన్ దలంచుచున్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మైలవరపు వారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
 30. బతుకు బతక నీక బడుగుల చంపుచు
  బతికి నంత సేపు బతుకుల బాధించె
  వాడు దుర్మరణము బడయగ కన వాని
  శవము మోద మిడు బ్రశస్తముగను

  ప్రత్యుత్తరంతొలగించు
 31. ధర్మ పథము దప్పి ధర సజ్జనుల జంపి
  దైవ నిందజేయు తామసుండు
  మరణమొంద ధరణి భరమిటు దీరగా
  శవము మోదమిడు ప్రశస్తముగను

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. రాజశేఖర శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 32. దిగులు చింతలు మది పొగులకుండ కరము
  సంతసముగ దినము సాగుచుండు
  జీవనగమనమున భావించిచూడ శై
  శవము మోదమిడు బ్రశస్తముగను

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 33. సవనము రక్షకై కుశిక సంయమి, రాములతోడు చేకొనన్
  సవమున భీకరాకృతి,నిశాటి యెదుర్కొన, మౌని యానతిన్
  తివురుచు రాముడేయ శిఖి త్రెళ్ళెను రక్కసి హా ! యటంచు నా
  శవము ముదావహంబగు ప్రశస్తముగా జనులెల్ల మెచ్చగన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 34. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  *భవహరమౌశుభప్రదముభక్తజనాశ్రితపారిజాతమౌ*
  *భువనతమోహరంబుపరిపూర్ణఫలోద్ధృతమేఘభాండమౌ*
  *ప్రవరధరాంధ్రదేశపరిపాలకవైష్ణవనామమిద్ది కే*
  *"శవము ముదావహంబగు ప్రశస్తముగా జనులెల్ల మెచ్చఁగన్"*

  *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  ప్రత్యుత్తరంతొలగించు

 35. ఆటలాడుచెపుడు నందరి మమతాను

  రాగములను పొంది రయము తోడ

  పెరుగు పిల్లల గన ప్రీతియు గల్గు శై

  శవము మోదమిడు ప్రశస్తముగను.


  వయసు మీద పడియె పనులాచరింపంగ

  శక్తి లేదు గనుడు జగతి యందు

  మనమలాట లాడ మనసార గనుచు శై

  శవము మోదమిడు ప్రశస్తముగను.


  బ్రతుకు బండి లాగి పనులచే నలసి శై

  శవము మోదమిడు ప్రశస్తముగను

  ననుకొనుచు సతతము నాదు పౌత్రుల యాట

  పాటలు గనగ మది పరవశించె.


  అలసిన తనువునకు నాపగలోనున్న

  శవము మోదమిడు ప్రశస్తముగను

  కరములు మరియు నిక చరణములు కడిగి

  పిదప త్రాగ మదికి ముదము కలిగె.


  శవము=నీరు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఉమాదేవి గారూ,
   మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
 36. పాయు మోయి చిలుక! భవబంధనమ్ముల,
  మోహ మకట వీడి దేహ మందు.
  జనన మరణ చక్ర జాలమ్ము వీడుటే
  శవము! మోదమిడుఁ బ్రశస్త ముగను


  2.శవమెదురగు నేని శకునమ్ము గానెంతు
  శవము జూచి నంత శివము గల్గు
  జీవ సార మెరుగ జేయురా గనినంత
  శవము!మోద మిడుఁబ్రశస్తముగను


  3.భువనము లెల్ల నోట, భళి!పుక్కిట బట్టిన బాలకృష్ణునిన్
  కవనము గంటి నాహ!యల!కన్నయ లీలలవెంత మాధురుల్
  భవము తొలంగు! కృష్ణ కథ వంద్యము గాదె,తలంప కృష్ణ శై
  శవముముదా వహంబగు ప్రశస్తముగా జనులెల్ల మెచ్చగన్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. హర్షశ్రీ గారూ,
   మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు