7, జూన్ 2017, బుధవారం

శ్రీ కంది శంకరయ్య వారు అందుకున్న బహు అరుదైన పురస్కారం!

జైశ్రీరామ్.
ఆర్యులారాశంకరాభరణం బ్లాగును అవిరళముగా నిర్వహించుచు ఎందరో పద్యాభిమానులను కవులుగా చేయుచు ఆదర్శ జీవితం గడుపుచున్న మన సాహితీ బంధువు శ్రీమాన్ కంది శంకరయ్య. అట్టి మహనీయుని కృషిని గుర్తించిన జగద్విఖ్యాత విద్వద్వేత్త శ్రీమాన్ ఏల్చూరి మురళీధర రావు గారు తమ హృదయాకాశమున మెఱుపు వలె మెఱిసి అమృతపు జల్లువలె వెల్వడిన పద్యములలో వ్యక్తము చేసినారు. “విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమమ్అన్న మాట ఎంతటి యథార్థము! అపురూప పద్యసత్కారమునకు నోచుకొన్న శ్రీమాన్ కంది సంకరయ్య మహనీయుని మనసారా అభినందిస్తున్నాను.
ఇక చూడండి.
ప్రాచార్య శ్రీ ఏల్చూరి మురళీధరరావు వారినుండి 
శంకరాభరణ నిర్వాహకులు, శ్రీ కంది శంకరయ్య వారు అందుకున్న 
బహు అరుదైన పురస్కారం.

శ్రీ కంది శంకరయ్య.
Recalling all those who had inspired me ... 

సీ.
భారతీసేవకప్రథుఁ డన్న మా కంది
శంకరయ్య బుధేంద్రు వంకఁ జూతు!
పద్యవిద్యాకృతవ్రతుఁ డన్న మా కంది
శంకరయ్య బుధేంద్రు వంకఁ జూతు!
గురుకవీంద్రాచార్యవరుఁ డన్న మా కంది
శంకరయ్య బుధేంద్రు వంకఁ జూతు!
దయమీఱు ప్రియసహృదయుఁ డన్న మా కంది
శంకరయ్య బుధేంద్రు వంకఁ జూతు!
తే.గీ.
శంకరయ్య బుధేంద్రుని వంకఁ జూచి 
సర్వసుఖములు గూర్పు మా స్వామి! యనుచుఁ
గళలు తళుకొత్త, మోము వెన్నెలలు విరియ 
శంకరయ్య నడుగ - నెలవంకఁ జూతు!

కం.
మీ ప్రేమాతిశయముఁ
ద్యప్రణయనదీక్ష నన్నుఁ దావకవాత్స
ల్యప్రశ్రితుఁ గావించె సు 
ధాప్రేక్షణ శంకరార్య! ధన్యతఁ జెందన్.
ఇట్లు 


శ్రీ ఏల్చూరి మురళీధరరావు
('ఆంధ్రామృతం' బ్లాగు నిర్వాహకులు శ్రీ చింతా రామకృష్ణారావు గారికి ధన్యవాదాలతో...)

38 కామెంట్‌లు:

  1. అద్భుతం!!!

    నమస్సులు!

    అభిమాని:

    ప్రభాకర శాస్త్రి

    రిప్లయితొలగించండి
  2. నమస్కారములు
    పూజ్యులు శ్రీమాన్ ఏల్చూరి మురళీధర రావుగారి అపూర్వమైన పురస్కారము నందుకొన్న గురువులు శ్రీ శంకరయ్య గారు ధన్యులు + అభినందనీయులు

    రిప్లయితొలగించండి
  3. డాక్టర్ పిట్టా సత్యనారాయణ
    శ్రీ కంది శంఠరయ్య,పద్య పారిజాత గ్రహీతకు
    శ్రీ ఏల్చూరి వారరర్పించిన సమ్మాన శుభ సందర్భమున హర్షాతిరేక పూర్వకమైన అభీనందనలు."విద్వాన్ సర్వత్ర పూజ్యతే".

    రిప్లయితొలగించండి
  4. కంది శంకరయ్యగారికి నిజమైన గౌరవం

    రిప్లయితొలగించండి
  5. కంది శంకరయ్యగారికి నిజమైన గౌరవం

    రిప్లయితొలగించండి
  6. శంకరాభరణం కవులందరం కలసి గురువర్యులు కంది శంకరయ్య గారిని సత్కరించుకొనే రోజుకోసం ఎదురుచూస్తున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. రెడ్డి గారు నమస్సులు. చక్కటి యాలోచన. ఆచరణలో పెట్టుటకు నుత్సహించ గలరని యాశిస్తున్నాను. ఈ నెలాఖరులో నేను హైదరాబాద్ రానున్నాను.

      తొలగించండి
  7. గురువర్యులకు అభినందనలతో....

    శంకర గురువర్యులు గన
    వంకలులేనట్టి వారు పద్య సుమమ్ముల్
    శంకలు దీర్చి చిరుకవుల
    వంకను తానుండి బెంచు పద్ధతి నేర్పున్.

    రిప్లయితొలగించండి
  8. విద్వతకవివరేణ్యు లుభయులకు నమ్రతా పూర్వక నమశ్శతములు.

    రిప్లయితొలగించండి
  9. నిష్కామ క్రియా సఛ్ఛీలురైన శ్రీ కందిశంకరార్యులు అర్హమైన అరుదైన సత్కారమునందుకొనిరి. మిస్సన్నగారు చెప్పినాట్లు వారిలోని వాణీసత్కారమే. గురువులిరువురకు నమశ్శతాంజలి.

    రిప్లయితొలగించండి
  10. కంద్యన్వ యార్ణ వాబ్ధిజ
    నంద్యాయత వాహనాఖ్య నలినజ వంశా
    మాంద్యైక నగ పుర వసన
    వంద్య సుగుణ శంకరవర పండిత మాన్యా!


    కంది వారి యింటను గనువిందు సేసి
    యంద చందములగు విద్దె లందు నెల్ల
    నంది తీ వెందును గనని మంది మెప్పు
    నందు కొనవె మా మ్రొక్కులు విందు లనగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్షరసత్యము తో గురువు గారిని ప్రశంసించిన శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారికి నమఃపూర్వకాభినందనలతో
      పోచిరాజు కామేశ్వర రావు.

      తొలగించండి
  11. విద్వత్కవిమిత్రులు, ప్రాచార్యులు శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు
    మాన్యులు, సుకవి మిత్రులు, శంకరాభరణ బ్లాగు నిర్వాహకులు, మన్మిత్రులు శ్రీ కంది శంకరయ్య గారిని
    తమ పద్య రత్నములతో నరుదైన పురస్కారమందించి సత్కరించిన శుభసందర్భమున
    శ్రీ కంది శంకరయ్య గారికి
    అభినందనలు మఱియు శుభాకాంక్షలతో
    మదీయ పద్య సన్మానము

    చం.
    సకల గుణాన్వితోన్నతుఁడు, చారు సుకీర్తిత ధన్య జీవుఁడున్,
    వికసిత బుద్ధివైభవుఁడు, విజ్ఞుఁడు, శాంతుఁడు, జ్ఞానమూర్తి, స
    త్ప్రకటిత పండితోత్తముఁడు, ప్రజ్ఞ విరాజిలు కావ్యకర్తలం
    దొకరుఁడు కంది శంకర బుధోత్తమ, కొమ్ము పురస్కృతాంజలుల్!

    కం.
    హృద్యములగు పద్యమ్ముల
    నాద్యంత సువేద్యముగ నిరాటంకముగన్
    శ్రీద్యుతి చెన్నలరారన్
    సద్యః ప్రభలొలుక రచన సాగించితయా!

    ఆ.వె.
    ఎంత కాంతిమంత! మెంత వింతగు పుంత!
    సుంతయేని విసువు వంత నిడదు!
    ఇంత భావదీప్తి నెంతు నుతింతును
    సాంతముగనుఁ జదివి సంతసింతు!

    సీ.(మాలిక)
    బాల్యమ్మునుండియు బాగుగా విద్యలో
    రాణించి యెదిగిన రత్న మీవు;
    శ్రమియించియును విద్య సక్రమమ్ముగ నేర్చి,
    విజ్ఞాన ఖనియైన విజ్ఞుఁ డీవు;
    బోధకవృత్తి సుభూషణమ్మని యెంచి,
    తలఁదాల్చి వెలిఁగిన ధన్యుఁ డీవు;
    విద్యార్థులందఱన్ బిడ్డలుగా నెంచి,
    దయను బ్రేమను జూపు తండ్రి వీవు;
    వృత్తిధర్మముఁ దక్క వేఱొక్క ధర్మమ్ము
    ముందుగాఁ దలఁపని మునివి నీవు;
    వారు వీరను భేదభావ మెఱుంగక
    హితమునందించు స్నేహితుఁడ వీవు;
    కోప మింతయు లేక కోమలమ్మగు వాక్కు
    చిఱునవ్వు తళుకొత్తు శ్రేష్ఠుఁ డీవు;
    శంకరాభరణాఖ్య సాహితీ శీర్షికన్
    రస రమ్యముగఁ దీర్చు రసికుఁ డీవు;
    గీ.
    మంచి వీవు! సుగుణ గణ మణివి నీవు!
    బంధుఁ డీవు! సుధీజన బంధ మీవు!
    స్నేహ మీవు! సంపూర్ణ సౌశీల్య మీవు!
    కవుల కందఱ కాదర్శ కవివి నీవు!!

    తే.గీ.(మాలిక)
    పర ధనమును మృత్పిండమ్ము పగిది నెంచి,
    పర సతీ మణులనుఁ దల్లి వలెఁ దలంచి,
    యెపుడు శాంత్యహింసాక్షమాకృపలు, దాన
    ధర్మసద్గుణశౌచసత్యములు గలిగి,
    యొజ్జబంతివై మెలఁగిన యొజ్జవైన
    నీకుఁ బరమాత్ముఁ డెంతయు నీవి తోడ
    నాయురారోగ్యభోగభాగ్యైహికమ్ము
    లీప్సితార్థమ్ము లనిశమ్ము నిచ్చుఁ గాక!

    శుభం భూయాత్

    భవదీయుఁడు
    మధురకవి గుండు మధుసూదన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధురకవి వారి సుమధుర పద్య తోరణం!!!
      ...కంది వారు కర్మ యోగి...

      🙏🙏🙏

      తొలగించండి
    2. గురువుగారి పై పద్యములు మనోజ్ఞంగా రచించారు సర్..

      తొలగించండి
    3. విద్వత్కవిమిత్రులు శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారికి శుభాభినందనలు!

      తొలగించండి
    4. విద్వత్కరి మిత్రులు శ్రీ చింతా రామకృష్ణారావు గారి అభినందన పద్యము [ఆంధ్రామృతం బ్లాగునుండి]:

      సుకవి విధేయ! గుండు మధుసూదన! ఏల్చురి వారి సత్ ప్రభన్
      ప్రకటితమౌనటుల్ కవిత వ్రాసి కృతజ్ఞత తెల్పి, వారికిన్
      సకల శుభంబులున్ గలుగ చక్కని మీ యభిలాష తెల్పినన్,
      సుకవులు మిమ్ము మెత్తురని సూచన నాది పరిగ్రహింపుడీ!

      తొలగించండి
    5. పై పద్యమునకు ముందఱ వచనంలో...

      విద్వత్కవి మిత్రులు...అని పఠింపఁబ్రార్థన.

      తొలగించండి
  12. పూజ్య గురుదేవులకు,..శ్రీ ఏల్చూరిమురళీధరరావుగారికి శతసహస్రవందనములు.....

    రిప్లయితొలగించండి
  13. సహృదయులు, కవివర్యులు, గురుదేవులు కంది శంకరయ్యగారికి, విద్వర్వరేణ్యులు ఏల్చూరు మురళీథరరావు గారికి నమశ్శతములు!

    రిప్లయితొలగించండి
  14. 💐💐💐💐💐💐💐💐💐శ్రీ కంది శంకరయ్య గారికి
    అభినందనలతో.....

    మా కంది శంకరుండిల
    మాకందిన శంకరుండు ! మధురాంధ్రలస
    న్మాకందము ! పద్దెమ్ములు
    మాకందము మీరు జూచి మార్పులు జేయన్!!

    ఏల్చూరి వారి మాటలు
    నిల్చు శిలాక్షరములట్లు నిస్తుల యశమున్
    దాల్చగజేయును ! మది జే
    జేల్చెప్పెదమయ్య మీకు ! జేయుచు ప్రణతుల్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    రిప్లయితొలగించండి
  15. 💐💐💐💐💐💐💐💐💐శ్రీ కంది శంకరయ్య గారికి
    అభినందనలతో.....

    మా కంది శంకరుండిల
    మాకందిన శంకరుండు ! మధురాంధ్రలస
    న్మాకందము ! పద్దెమ్ములు
    మాకందము మీరు జూచి మార్పులు జేయన్!!

    ఏల్చూరి వారి మాటలు
    నిల్చు శిలాక్షరములట్లు నిస్తుల యశమున్
    దాల్చగజేయును ! మది జే
    జేల్చెప్పెదమయ్య మీకు ! జేయుచు ప్రణతుల్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    రిప్లయితొలగించండి
  16. శ్రీ కంది శంకరయ్య గారు పురస్కారము అందుకొన్న సందర్భములో వారు శంకరభరణము బ్లాగు నిర్వహిస్తూ నందుకు ధన్యవాదములు తెలుపుతూ ప్రతి పాదములో మొదటి అక్షరములు కలిపి చదువుకో ప్రార్ధన (నెయ్యము, అన్య , పాదములో రెండవ అక్షరము )
    శ్రీనివాసుని కరుణతో సిరులు పొంది,
    కంస వైరుని శరణుతో ఘనత నొంది,
    దినకరుండు నిత్యమూ దీప్తి నిడగ,
    శంకరసుతుడు సతతము సంతు నిడగ,
    కమల నయనుండు ఘనముగా కాంక్ష దీర్చ,
    రక్ష నిడుచుకాపాడంగ రాముడెపుడు,
    నెయ్యము కలిగి కీర్తించ నేటి కవులు,
    గాలి పుత్రుడు కావ్య సౌ గంధమీయ,
    రిక్క లనుతాక బ్లాగుకు రెక్క లొచ్చి ,
    కినుక చూపక చేరును కీర్తి యెపుడు,
    ధరణి లోన కవులు మిమ్ము తలచు చుండ.
    అన్య భాషా కవులు గూడ యాదరించ.
    వాక్కు తల్లి నర్తించ మీ వాక్కు పైన,
    దయకలిగి యువకవులకు దారి చూపి,
    మురిపెముగ మీరు శంకరాభరణ మును, య
    లుపును బడయక ఎపుడు నడుపగ వలయు

    రిప్లయితొలగించండి
  17. శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారినుండి నేనందుకున్న పద్యపురస్కారానికి సంతోషించి వివిధరూపాలలో అభినందనలు తెలిపిన కవిమిత్రులు...
    జి. ప్రభాకర శాస్త్రి గారికి,
    నేదునూరి రాజేశ్వరి అక్కయ్య గారికి,
    బి.వి.వి.హెచ్.బి. ప్రసాద రావు గారికి,
    డా. పిట్టా సత్యనారాయణ గారికి,
    చేపూరి శ్రీరామారావు గారికి,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    పోచిరాజు కామేశ్వర రావు గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    మిస్సన్న (దువ్వూరి వేంకట నరసింహ సుబ్బారావు) గారికి,
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    శైలజ గారికి,
    గుఱ్ఱం సీతాదేవి గారికి,
    మైలవరపు మురళీకృష్ణ గారికి,
    పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి,
    ....... అందరికీ మనఃపూర్వక ధన్యవాదాలు.
    (నిన్న ప్రయాణంలో ఉండి వెంటవెంటనే స్పందించలేక పోయినందుకు మన్నించండి).

    రిప్లయితొలగించండి
  18. పలుకుల పద్యముఁ జేయఁగ
    తలపెట్టిన శిష్యులకిలఁ దా గురువగుచున్
    పులకలు రేపెడు విద్యను
    వెలయించెడు కందివారి విజ్ఞతకు నుతుల్

    రిప్లయితొలగించండి
  19. పద్యకవి ,కవి పోషక. పండితుండు
    గర్వ రహితుడు ,సుజ్ఞాని,ఘనుడు,గురువు
    మధుర హృదయుడు మాన్యుడు,మంచి మనిషి
    కందివారికినొనరింతు వందనములు
    ---------------------------------------అరాశ

    రిప్లయితొలగించండి
  20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  21. ఆర్యులకు నమస్కారము
    మొదటి పాదములో మొదటి అక్షరము రెండవ పాదములో రెండవ అక్షరము మూడవ పాదములో మూడవ అక్షరము అలా వరుసగా కలిపి చదువుకో ప్రార్ధన (ఆఖరి పాదములో ఆఖరి అక్షరము) ఇది నా తొలి ప్రయత్నము మీ ఆశీస్సులు నిడుచూ దోషములున్న విడువ వలెను

    అభినందనల సుమమాల శంకరయ్య గార్కి





    అజితుడిడిన అకరణి నాదరించి
    నాభిజన్ముడు పంపె శ్రీనాధునిటకు ,
    ధాత్రి నందు జననమొంది ధన్యుడాయె
    కంది సుందరా కారుడు కలిమి కలిగి .
    ఆదికవి నన్నయ్య చూచి యాశ పడెను
    భూమికి మరల వచ్చి ఈ పోషణమ్ము
    చేయు తలపుతో సుకవుల చెంత చేరి,
    తిరిగి తెలుగు సీమన పుట్ట తిక్క నయ్య
    మనసు గోరంగ ఆ రమా మగని యెపుడు
    పూజలను చేసె, మన నేల పురుడు పోయ
    సంతసము పడుదు ననుచు శంకరుణ్ణి
    సుమములు నిడుచు కాళిదాసు కవి పదము
    పైన తలమోడ్చి విలపించె, మధుర మైన
    తెలుగు నేలలో కవులెల్ల దీప్తి నియ్య
    సతతము సమశ్యల నిడుచు సబబుగా క
    వులకు ముదము నీయ శుభము కలుగు వార్కి





    రిప్లయితొలగించండి
  22. శంకరుని ఆభరణము శంకరాభరణం అని పేరు పెట్టి ఎందరినో కవులుగా తయారుచేసిన ఈ బ్లాగు అధినేత పేరులో కూడా శంకరుడు ఉన్నారు.(కంది శంకరయ్య)గారు చేస్తున్న సాహితీకృషిని,విద్వత్తును గుర్తించి వారికి పురస్కారాన్ని అందించిన శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారికి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

    రిప్లయితొలగించండి

  23. గురజాడ ఫౌౌంండేషన్ USAవారి రాష్ట్రమరియు జాతీయ విశిష్టసాహితీసేవా పురస్కార గ్రహీత
    సహస్రకవిరత్న సహస్ర కవిభూషణ

    శ్రీమతి జి సంందిత బెంంగుళూరు

    ఏల్చూరిన్ గనలేదునేనెఱుుగసాహిత్యాంంబోధిఁఁతానొక్కడౌౌ
    నిల్చెన్ మ్రొక్కనెఱుుంంగసత్కవులుమన్నింంపన్ యశోదీప్తుడైై
    కొల్చెన్ గావుతకంందిదేవునభిషిక్తుంంజేసి స్తోత్రంంబుచేన్
    దాల్చెన్ శ్రీమురళీధరుంండుప్రముఖస్థానంంబునాంంధ్రావనిన్

    శ్రీమతి జి సంందిత బెంంగుళూరు

    రిప్లయితొలగించండి
  24. *గురజాడ ఫౌండేషన్ USAవారి రాష్ట్రమరియు జాతీయ విశిష్టసాహితీసేవా పురస్కార గ్రహీత సహస్ర కవిరత్న సహస్ర కవిభూషణ*

    *శ్రీమతి జి సంందిత బెంగుళూరు*

    *ఏల్చూరిన్ గనలేదునేనెఱుుగసాహిత్యా బ్దిఁతానొక్కడౌ*
    *నిల్చెన్ మ్రొక్కనెఱుుంగసత్కవులుమన్నింంపన్ యశోదీప్తుడైై*
    *కొల్చెన్ గావుతకందిదేవునభిషిక్తుంజేసి స్తోత్రంబుచేన్*
    *దాల్చెన్ శ్రీమురళీధరుండుప్రముఖస్థానంంబునాంంధ్రావనిన్*

    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    గురుదేవా సవరించాను దీవించండి🙏🌹🙏

    రిప్లయితొలగించండి