29, జూన్ 2017, గురువారం

సమస్య - 2397 (మాంసాహారమ్మె...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
"మాంసాహారమ్మె విప్రమాన్యం బయ్యెన్"
(లేదా...)
"మాంసాహారమె శ్రేష్ఠమైన దనియెన్ మాన్యుండు సద్విప్రుఁడే"

67 కామెంట్‌లు:

 1. (బ్రహ్మ మానసపుత్రుడు,మహాతపస్సంపన్నుడు,సప్తర్షులలో ఒకడైన వసిష్ఠమహర్షి మాంసాహారము స్వీకరించారని పెద్దల వలన విన్నాను)
  పుంసాంమోహన రూపు,రాము గురువై,పూజ్యప్రకాశుండునై
  భాసోదగ్ర వసిష్ట సన్నుతుడు ఠేవన్ మాంసమున్ గైకొనం
  గా,సాదృశ్యములేల?నాటికదియే కన్పట్టు నాచారమై
  మాంసాహారమె శ్రేష్ఠమైనదనియెన్ మాన్యుండు సద్విప్రుడే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రసాద రావు గారూ,
   మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని రెండవ, మూడవ పాదాల్లో ప్రాస తప్పింది. రెండవ పాదంలో యతిదోషం. సవరించండి.

   తొలగించండి
  2. "ప్రాసాక్షరము పూర్ణబిందువుతో కూడిన, అన్ని పాదములందునూ అదే అక్షరము పూర్ణబిందువుతో ఉండవలెను"

   ...మాంస, హింస, కంస, హంస, పుంస, ...

   తొలగించండి
  3. ప్రాసాక్షరాలుపొరపాటే క్షమించండీ యతి భా కు ఠేవన్ లో వ కు సరిపోయిందనుకున్న

   తొలగించండి
  4. ప్రసాద రావు గారూ,
   పొరబడ్డాను. మన్నించండి.

   తొలగించండి
  5. శాస్రిగారికి,శంకరయ్య మహోదయులకు సాదర ప్రణామాలు ధన్యవాదాలు
   ప్రమాదో ధీమతామపి గదా

   తొలగించండి
  6. మొదటిపాదం ప్రధమాక్షరం గురువైతే మిగతా మూడు పాదాలలో ప్రధమాక్షరం గురువే ఉండాలనే నియమం ఉందా?దయచేసి తెలుప ప్రార్ధన

   తొలగించండి
  7. సవరించిన పద్యం
   పుంసాంమోహన రూపు,రాము గురువై పూజ్యప్రకాశుండునై
   ధ్వంసంబుగ్రతమంబుజేయ నఘముల్ దైవత్వసంధానుడై
   హింసన్రోయు వశిష్టుడే సరిగ భావించెన్ స్వధర్మంబుగా
   మాంసాహారమె శ్రేష్ఠమైనదనియెన్ మాన్యండు సద్విప్రుడే

   తొలగించండి

  8. BVVHBPrasadaraoజూన్ 29, 2017 5:49 PM
   "మొదటిపాదం ప్రధమాక్షరం గురువైతే మిగతా మూడు పాదాలలో ప్రధమాక్షరం గురువే ఉండాలనే నియమం ఉందా?దయచేసి తెలుప ప్రార్ధన"

   కంద పద్యములో ఈ నియమం తప్పని సరి...
   అలాగే, ఒక పాదం లఘువుతో ఆరంభించినచో అన్ని పాదములూ లఘువుతో ఆరంభించ వలయును.

   తొలగించండి
 2. హింసను గూడినదంతయు
  మాంసాహారమ్మె; విప్రమాన్యం బయ్యెన్
  కంసారాతి కథనమిది:
  "హంసను మరపించు కర్మ హానికరమ్మౌ"

  హంస = పరమాత్మ

  ...స్వస్తి...

  రిప్లయితొలగించండి
 3. హింసిం చగ ప్రాణుల నకట
  సంసేవిత మనుచు జనులు సవనము నందున్
  సంసార మందు సరసము
  మాంసా హారమ్మె విప్రమాన్యం బయ్యెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటిపాదంలో "హింసించ ప్రాణుల నకట" అనండి. లేకుంటే గణదోషం.

   తొలగించండి
  2. హింసించ ప్రాణుల నకట
   సంసేవిత మనుచు జనులు సవనము నందున్
   సంసార మందు సరసము
   మాంసాహారమ్మె విప్రమాన్యం బయ్యెన్

   తొలగించండి
 4. హింసక పురమది వినుడు నృ
  శంసుడు రాజందు వాని నీతియె ద్విజులన్
  హింసించుట యద్దానను
  మాంసాహారమ్మె విప్రమాన్యం బయ్యెన్.

  “సంసారుల్ ద్విజులున్ సమస్తమనుజుల్ సన్న్యాసులైనన్ సదా
  హింసావాటిని మత్పురంబునను నాయీయాజ్ఞ నోమన్ వలెన్
  మాంసంబే ఘన”మంచు పల్కు నృపతిన్ మారాడగాలేక యా
  మాంసాహారమె శ్రేష్ఠమైన దనియెన్ మాన్యుండు సద్విప్రుఁడే.

  హ.వేం.స.నా.మూర్తి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 5. డా.పిట్టా
  ("మాంసం మాసేన వర్ధయేత్",ఆయుర్వేదమ్.మాంసం మాంసేన వర్ధయేత్ తప్పుడు సూత్రము.)
  మాంసమె మాంసపు వృద్ధిన్,
  పుం సత్వము గూర్చు ననెడు బుద్ధిభ్రమ నా
  శంసించి గనక సూత్రము
  మాంసాహారంబె విప్ర మాన్యంబాయెన్!

  రిప్లయితొలగించండి
 6. డా.పిట్టా
  మాంసంబేగద జీర్ణపుం గ్రియలకౌ మాంసంపు సద్వాహికల్
  ధ్వంసంబౌ తగునట్లునొత్తగ మహాధ్వానంబు;నాయుష్య మా
  శంసించన్ సరి కూరగాయలరుగున్ ;శాపంపు టారోగ్య మా
  "మాంసాహారమె శ్రేష్ఠమైన"దనియెన్ మాన్యుండు, సద్విప్రుడే?
  (సద్విప్రుడు కాదని ధ్వని)(అధ్వానము॥అమార్గము,శ.ర.)
  మాంసాహారాన్ని జీర్ణ అవయవములు బహు కష్టంగా రస రూపానికి మారుస్తాయి.ఈ భారం వల్ల ఆయుష్యము క్షీణిస్తుంది.

  రిప్లయితొలగించండి
 7. సంసారి వృష్ణి కొరకే
  హింసించుట పశువుల సత మిజ్య సమయమున్
  హింసించిన శుద్ధపు పశు
  మాంసా హారమ్మె విప్రమాన్యం బయ్యెన్

  రిప్లయితొలగించండి
 8. హింసావృత్తి వహించి జంతు హననంబే నిత్య కర్మంబుగా
  సంసారమ్ముఁ దరించు నాటవికుడే స్వాభావిక ప్రీతితో
  మాంసాహారమె శ్రేష్ఠమైన దనియెన్; మాన్యుండు సద్విప్రుఁడే
  కంసధ్వంసి పదాంబుజ స్మరణ సంస్కారంబె వాంఛించుటన్.

  రిప్లయితొలగించండి
 9. *ధ్వంసము జేయుచు కర్మల*
  *సంసారము,నిత్య యాగ సందేహములో*
  *హంసగ సతతము మదిమీ*
  *మాంసా హారమ్మె విప్రమాన్యంబయ్యెన్*

  రిప్లయితొలగించండి
 10. హంస నిలయమ్ము హృదయము
  హింసను విడనాడు టన్న హితమని గాంధీ
  సంసారమ్మున తగదన
  మాంసాహారమ్మె, విప్రమాన్యం బయ్యెన్

  రిప్లయితొలగించండి
 11. హింసను గూడిన భోజ్యము
  మాంసా హారమ్మ,విప్ర మాన్యంబయ్యెన్
  హింసారహితపు పులగము
  కంసారియు నదియ గోరు కమలా ! వింటే

  రిప్లయితొలగించండి
 12. రిప్లయిలు
  1. హింసను బ్రేరేపించును
   మాంసాహారమ్మె; విప్రమాన్యంబయ్యెన్
   సంసేవింపగ విష్ణుని
   సంసారార్ణవము దరియ సాత్వికయశనమ్

   తొలగించండి
  2. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సాత్త్విక+అశనము = సాత్త్వికాశనము' అవుతుంది. అందులోనూ హలంతంగా వ్రాయరాదు.

   తొలగించండి
 13. సంసారమ్మది నీదలేను పరమేశా ముక్తి సాధింపగన్
  ధ్వంసమయ్యెను సాధనమ్ము జగమంతా ధ్యానరాహిత్యమే
  హింసాపూరితమే కదా నొసగుమానెంతేని తర్కమ్ము మీ
  మాంసాహారమె శ్రేష్ఠమైన దనియెన్ మాన్యుండు సద్విప్రుడె
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
 14. సంసారము జేయుచు వి
  ద్వాంసుండౌ విప్రుడొకడు వ్యసనమ్ములకున్
  ధ్వంసమ్మైనిటుబల్కెను
  మాంసాహారమ్మె విప్రమాన్యంబయ్యెన్
  వీటూరి భాస్కరమ్మ

  రిప్లయితొలగించండి
 15. రిప్లయిలు
  1. భాస్కరమ్మ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   "సంసారమ్మది యీదలేను... జగమెల్లన్ (అంతా అనడం వ్యావహారికం)... కదా యొసగుమా..." అనండి.

   తొలగించండి
 16. కంసారిని సద్భక్తిని
  హింసా రహితమనియెంచి యిట్లడు గంగన్
  సంసారమ్మునఁ” బాలయ
  మాం” సాహారమ్మె విప్రమాన్యం బయ్యెన్

  [స+ ఆహారమ్మె = సాహారమ్మె]


  సంసారంబులు సాగుఁ జక్కగను సత్సాంగత్య ముండంగ వి
  ధ్వంసమ్ముల్ భువి నేమి లాభము మనస్తాపమ్మునుం దక్కగన్
  హింసాహీనము రోగ సంక్షయము సుమ్మీ సంతతమ్మున్ వినా
  మాంసాహారమె శ్రేష్ఠమైన దనియెన్ మాన్యుండు సద్విప్రుఁడే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 17. మాంసమ్మున్ తగిలించు కొద్ది యనినన్ మ్రానైతి వేలా సతీ
  మాంసమ్మేడను పారు డేడ నను మీమాం సేలనో నేరవే
  మాంసమ్మన్నను నంజుడంచు వినుమా మంగల్యమున్ బోయుచో
  మాంసాహారమె శ్రేష్ఠమైన దనియెన్ మాన్యుండు సద్విప్రుఁడే.

  రిప్లయితొలగించండి
 18. హింసను ప్రేరేపించును
  మాంసా హారమ్మె, విప్ర మాన్యంబయ్యెన్
  హంసోపాసనమె పరమ
  హంసలుగా పుర హితమ్ము నాశించుటయే.

  హింసామార్గము బట్టి జీవులను తా హింసించి భక్షించినన్
  మాంసాహారమె, శ్రేష్ఠమైనదనియెన్ మాన్యుండు సద్విప్రుడే
  హింసన్ జేయని లోకపూజ్యుడు పురోహిత్యుండతండే గదా
  హంసోపాసన జేయువాడు భగవధ్యానమ్ముజేయున్ సదా

  రిప్లయితొలగించండి
 19. హంసా తూలిక గూర్చొని
  హంసికతో పులియుమేక యాటన యయువే
  ధ్వంసము జేయగమేకను
  మాంసాహారమ్మె విప్రమాన్యం బయ్యెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హర్షశ్రీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "హంసల తూలిక" అనండి. "...యాటన యయువే"?

   తొలగించండి
 20. మాంసమనిన కూరయె, మీ
  మాంస వలదు శాకములను, మానవు లంతా
  సంశయము నొందక తినగ
  మాంసాహారమ్మె విప్రమాన్యంబయ్యెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యకుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "మానవులెల్లన్" అనండి. 'అంతా' అనడం వ్యావహారికం.

   తొలగించండి
 21. హింసకు కారణమగునుగ
  మాంసాహారమ్మె, విప్రమాన్యంబయ్యెన్
  కంసారాతిని నిత్యము
  సంసేవించుచు తనరెడు సంకల్పంబే!!!

  రిప్లయితొలగించండి
 22. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*


  *కంసారాతికికట్టగాగుడినిసంకల్పించెరాజేంద్రుడే*
  *సంసారంబునునిల్పుబ్రాహ్మణులసంస్థానాగ్రహారంబనన్*
  *హంసారాజ్యపుపల్లెఁగోరుమననాహ్లాదంబునన్ మ్రొక్కి "మీ*
  *మాంసాహారమె" శ్రేష్ఠమైన దనియెన్; మాన్యుండు సద్విప్రుఁడే*


  *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  రిప్లయితొలగించండి
 23. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*


  *హంసాదేశమునన్ గుడి*
  *కంసారాతికినొసంగె కనగన్ ప్రభువే*
  *సంసారపోషణకుఁ"మీ*
  *మాంసాహారమ్మె"విప్రమాన్యంబయ్యెన్*


  *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

  విప్రమాన్యముగా *మీమాంసాహారము*
  అనే గ్రామాన్ని అగ్రహారంగా రాజుగారు దానం చేశారు

  రిప్లయితొలగించండి
 24. ధ్వంసమ్మున్ సలుపన్ మృగమ్ముల తతిన్ పాపంమటంచెంచు మీ
  మాంసన్ వీడుడు ఖాదనమ్మునకు పద్మాపుత్రుడే యిచ్చె తా
  మాంసంమిచ్చుమృగమ్ములన్నియును సామ్రాజ్యమ్మునందంచు నా
  మాంసాహారమె శ్రేష్ఠమైనదనియెన్ మాన్యుండు సద్విప్రుడే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "పాప మ్మటం చెంచు..." అనండి. (బహుశా టైపాటు కావచ్చు).

   తొలగించండి
 25. హంసను జేరగ విడవలె
  మాంసాహారమ్మె; విప్రమాన్యంబయ్యెన్
  సంసేవింపగ విష్ణుని
  ధ్వంసముజేయగ నఘమును ధ్యానము సతమున్!

  రిప్లయితొలగించండి
 26. హింసించ నొరుల భుక్తి కి
  మాంసాహారమ్మె; విప్రమాన్యం బయ్యెన్
  కంసారి తిన్న వెన్న య
  హింసాత్మక మగు ఫలముల హీనము గాగన్

  రిప్లయితొలగించండి
 27. డా.పిట్టా
  మాంసంబేగద జీర్ణపుం గ్రియలకౌ మాంసంపు సద్వాహికల్
  ధ్వంసంబౌ తగునట్లునొత్తగ మహాధ్వానంబు;నాయుష్య మా
  శంసించన్ సరి కూరగాయలరుగున్ ;శాపంపు టారోగ్య మా
  "మాంసాహారమె శ్రేష్ఠమైన"దనియెన్ మాన్యుండు, సద్విప్రుడే?
  (సద్విప్రుడు కాదని ధ్వని)(అధ్వానము॥అమార్గము,శ.ర.)
  మాంసాహారాన్ని జీర్ణ అవయవములు బహు కష్టంగా రస రూపానికి మారుస్తాయి.ఈ భారం వల్ల ఆయుష్యము క్షీణిస్తుంది.

  రిప్లయితొలగించండి 28. హింసను చేయుచు తిననది

  మాంసాహారమ్మే:విప్రమాన్యంబయ్యెన్

  సంసేవించుచు హరిలో

  సంసిక్తంబైన మనము సమ్మదమందున్.

  రిప్లయితొలగించండి
 29. ధ్వంసమ్మాయెర బ్రాహ్మణీకమిట హా! ధర్మమ్ము బజ్జుండగా
  సంసారమ్మునునీద లేక మదిలో సంస్కార మొప్పంగ నా
  కంసాలాయెను విశ్వ బ్రాహ్మణుడునే కంగారు లేకుండనే
  మాంసాహారమె శ్రేష్ఠమైన దనియెన్ మాన్యుండు సద్విప్రుఁడే!

  రిప్లయితొలగించండి